కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ లోకాంతాన్ని మీరెలా తప్పించుకోగలరు?

ఈ లోకాంతాన్ని మీరెలా తప్పించుకోగలరు?

ఈ లోకాంతాన్ని మీరెలా తప్పించుకోగలరు?

బైబిలు ప్రస్తుత విధానాంతాన్ని గూర్చి ఇలా వర్ణిస్తోంది: “ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధకారమును కమ్ము దినము.” (జెఫన్యా 1:​15) మీరు సాధారణంగా ఎదురుచూసేది ఖచ్చితంగా ఇలాంటి దినము కోసం మాత్రం కాదు! అయినప్పటికీ, అపొస్తలుడైన పేతురు తోటి క్రైస్తవులను ఇలా హెచ్చరించాడు: “ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుడి. . . . అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”​—⁠2 పేతురు 3:​11-13.

ఇక్కడ పేతురు అక్షరార్థ భూమ్యాకాశముల నాశనం గురించి మాట్లాడడంలేదు. ఈ సందర్భంలో ఆయన చెప్పిన “ఆకాశములు,” “భూమి” ప్రస్తుత భ్రష్ట మానవ ప్రభుత్వాలకూ, భక్తిహీన మానవ సమాజానికీ సూచనలుగా ఉన్నాయి. “యెహోవా దినము” మొత్తంగా భూమినే నాశనం చేయదుగాని, ‘పాపులను బొత్తిగా దేశములోనుండకుండ నశింపజేస్తుంది.’ (యెషయా 13:⁠9) నేటి దుష్ట మానవ సమాజంలో జరుగుతున్న “హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి”కి యెహోవా దినము రక్షణ దినముగా ఉంటుంది.​—⁠యెహెజ్కేలు 9:⁠4.

మరి ఎవరైనా “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము” నుండి ఎలా రక్షింపబడగలరు? తన ప్రవక్తల్లో ఒకరికి బయలుపరచబడిన “యెహోవా వాక్కు” ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది: “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 1:⁠1; 2:​31, 32) యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయడమంటే ఏమిటో మీరు తెలుసుకునేలా యెహోవాసాక్షులు మీకు సహాయం చేయడానికి ఎంతో సంతోషిస్తారు.