సత్యం మీకెంత అమూల్యమైనది?
సత్యం మీకెంత అమూల్యమైనది?
‘మీరు సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’—యోహాను 8:31, 32.
1. యేసు “సత్యము” అనే పదాన్ని ఉపయోగించిన విధానానికి అదే పదాన్ని పిలాతు ఉపయోగించిన విధానానికి ఎలాంటి తేడా ఉన్నట్లు కనిపిస్తుంది?
“సత్యమనగా ఏమిటి?” అని పిలాతు అడిగినప్పుడు, సత్యమంటే ఏమైవుంటుందన్న మామూలు ఉత్సుకత మాత్రమే ఆయన మనస్సులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ యేసు అంతకు ముందే, “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని” అని అన్నాడు. (యోహాను 18:37, 38) యేసు, పిలాతు మనస్సులో ఉన్నదానికి విరుద్ధంగా ఖచ్చితమైన దైవిక సత్యాన్ని గురించి మాట్లాతున్నాడు.
సత్యం పట్ల లోకం వైఖరి
2. సత్యం ఎంత విలువైనదో యేసు చెప్పిన ఏ విషయం వివరిస్తుంది?
2 “విశ్వాసము అందరికి లేదు” అని పౌలు అన్నాడు. (2 థెస్సలొనీకయులు 3:2) సత్యం విషయంలో కూడా అలానే చెప్పవచ్చు. చాలామందికి బైబిలు ఆధారిత సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఇవ్వబడినప్పుడు కూడా, వారు కావాలని దాన్ని అలక్ష్యం చేస్తారు. కానీ సత్యం ఎంత అమూల్యమైనదో కదా! యేసు ఇలా అన్నాడు: ‘మీరు సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’—యోహాను 8:31, 32.
3. మోసపూరిత బోధల విషయమై చేయబడిన ఎలాంటి హెచ్చరికను మనం మనస్సులోకి తీసుకోవాలి?
3 సత్యం అనేది మానవుల తత్త్వజ్ఞానంలోను, పారంపర్యాచారాల్లోను కనబడేది కాదని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (కొలొస్సయులు 2:8) నిజానికి అలాంటి బోధలు మోసపూరితమైనవి. ఎఫెసులోని క్రైస్తవులు వాటిని విశ్వసించినట్లైతే వారు “మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, . . . కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన” ఆధ్యాత్మిక పసిపిల్లలవలె ఉంటారని పౌలు వారిని హెచ్చరించాడు. (ఎఫెసీయులు 4:14) నేడు “మనుష్యుల మాయోపాయముల”నేవి దేవుని సత్యాన్ని వ్యతిరేకించేవారి దుష్టప్రచారం ద్వారా ప్రోద్బలపరచబడుతున్నాయి. అలాంటి దుష్టప్రచారం కుయుక్తితో సత్యాన్ని అసత్యంగా వక్రీకరించి అబద్ధాల్ని సత్యాలుగా ప్రోద్బలపరుస్తుంది. మనం ఇలాంటి మోసకరమైన ఒత్తిళ్ళ మధ్య సత్యాన్ని కనుగొనాలంటే, లేఖనాలను శ్రద్ధగా పరిశీలించాల్సివుంటుంది.
క్రైస్తవులు, లోకము
4. సత్యము ఎవరికి అందుబాటులో ఉంచబడుతోంది, దాన్ని పొందేవారి బాధ్యత ఏమిటి?
4 తన శిష్యులైన వారిని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:17) ఆ శిష్యులు, యెహోవాను సేవించేందుకు ఆయన నామాన్ని రాజ్యాన్ని తెలియజేసేందుకు ప్రతిష్ఠ చేయబడతారు లేదా వేరుగా ఉంచబడతారు. (మత్తయి 6:9, 10; 24:14) అందరి దగ్గరా సత్యము లేకపోయినప్పటికీ జాతి, జాతీయత, లేదా సాంస్కృతిక నేపథ్యాలు ఏవైనప్పటికీ యెహోవా సత్యము కోసం వెదికే వాళ్ళందరికీ అది ఉచిత కానుకగా అందుబాటులో ఉంది. అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.
5. క్రైస్తవులు తరచు ఎందుకు హింసించబడతారు?
5 క్రైస్తవులు ఇతరులతో బైబిలు సత్యాన్ని పంచుకుంటారు, కానీ వారిని ప్రజలందరూ ఆనందంగా ఆహ్వానించరు. యేసు ఇలా హెచ్చరించాడు: “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 24:9) ఈ వచనం గురించి వ్యాఖ్యానిస్తూ 1817 లో ఐర్లాండ్‌కు చెందిన పాదిరి జాన్ ఆర్. కాటర్ ఇలా వ్రాశాడు: “తమ ప్రకటనా పనిద్వారా మానవుల జీవితాలను సంస్కరించాలన్న వారి [క్రైస్తవుల] ప్రయత్నాలకు ప్రజలు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయడం మాట ప్రక్కన పెడితే, అలాంటి ప్రయత్నాలు, తమ దుర్గుణాల్ని బయట పెట్టినందుకు నిజానికి వారిని ద్వేషించేలా, వారిని హింసించేలా చేస్తున్నాయి.” అలాంటి హింసకులు ‘రక్షింపబడేందుకు సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకవుంటారు.’ అందుకనే “సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.”—2 థెస్సలొనీకయులు 2:9-12.
6. క్రైస్తవుడు ఎలాంటి కోరికలను పెంచుకోకూడదు?
6 ఈ విద్వేషపూరిత లోకంలో జీవిస్తున్న క్రైస్తవులను అపొస్తలుడైన యోహాను ఇలా ఉద్బోధిస్తున్నాడు: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. . . . లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” (1 యోహాను 2:15, 16) ‘అంతయు’ అని యోహాను అంటున్నాడంటే ఆయన ఇక దేన్నీ మినహాయించడంలేదన్న మాట. అందుకనే, మనల్ని సత్యం నుండి వైదొలిగేలా చేసేటువంటి, ఈ లోకం ఇవ్వచూపేటువంటి దేనినీ మనం కోరుకోకుండా ఉండాలి. యోహాను ఇచ్చిన సలహాను పాటించడం మన జీవితాలపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎలా?
7. సత్యాన్ని గురించిన పరిజ్ఞానము యథార్థ హృదయులను ఎలా పురికొల్పుతుంది?
7 యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా 2001వ సంవత్సరంలో ప్రతి నెల 45 లక్షలకుపైగా గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహించారు. మన జీవితంలో దేవుడు కోరుతున్న విషయాలను గురించి ఉపదేశిస్తూ ఒక్కొక్క వ్యక్తికి వేర్వేరుగాను కొద్ది మందికి కలిపి ఒక గుంపుగాను ఆ అధ్యయనాలు నిర్వహించారు. తత్ఫలితంగా 2,63,431 మంది బాప్తిస్మం పొందారు. ఈ క్రొత్త శిష్యులకు సత్య వెలుగు ఎంతో అమూల్యమైనదిగా అయ్యింది, వీరు చెడు సాంగత్యాన్ని, ఈ లోకంలో పెచ్చుపెరిగిపోతున్న అనైతికమైన, దేవుణ్ణి అగౌరవపరిచే విధానాలను విసర్జించారు. వారు ఎఫెసీయులు 5:5) సత్యము మీకు అంత అమూల్యమైనదేనా?
బాప్తిస్మం పొందినప్పటి నుండి, యెహోవా క్రైస్తవులందరికి ఏర్పరచిన ప్రమాణాలకు సరితూగేలా జీవించడంలో కొనసాగారు. (యెహోవా మనపట్ల చూపిస్తాడు
8. యెహోవా మన సమర్పణకు ఎలా ప్రతిస్పందిస్తాడు, ‘రాజ్యాన్ని మొదట వెదకడం’ ఎందుకు జ్ఞానయుక్తమైన పని?
8 మనం ఇంత అపరిపూర్ణులమైనప్పటికీ యెహోవా కనికరంతో మన సమర్పణను అంగీకరిస్తాడు, ఒక విధంగా చెప్పాలంటే మనల్ని తన దగ్గరకు తీసుకోవడానికి క్రిందికి వంగుతాడు. ఆ విధంగా ఆయన మన లక్ష్యాలను కోరికలను ఉన్నతస్థాయికి తెచ్చుకోవడానికి మనకు బోధిస్తాడు. (కీర్తన 113:6-8) అదే సమయంలో మనం తనతో వ్యక్తిగత సంబంధం కలిగివుండేందుకు యెహోవా అనుమతిస్తాడు, మనం ‘ఆయన రాజ్యమును నీతిని మొదట వెదికితే’ మనపట్ల శ్రద్ధ వహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనమలా చేస్తూ, మనల్ని మనం ఆధ్యాత్మికంగా కాపాడుకుంటే ‘అవన్నియు మీకు అనుగ్రహింపబడును’ అని వాగ్దానం చేస్తున్నాడు.—మత్తయి 6:33.
9. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఎవరు, ఆ ‘దాసుడ్ని’ ఉపయోగించుకుంటూ యెహోవా మనపట్ల ఎలా శ్రద్ధ వహిస్తున్నాడు?
9 యేసుక్రీస్తు తన 12 మంది అపొస్తలులను ఎన్నుకుని అభిషిక్త క్రైస్తవుల సంఘానికి పునాది వేశాడు, అది “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడింది. (గలతీయులు 6:16; ప్రకటన 21:9, 14) ఆ తర్వాత అది ‘జీవముగల దేవుని సంఘము, సత్యమునకు స్తంభము, ఆధారము’ అని వర్ణించబడింది. (1 తిమోతి 3:15) ఆ సంఘపు సభ్యులు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అనీ, ‘నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడు’ అనీ యేసు స్పష్టంచేశాడు. క్రైస్తవులకు ‘తగిన కాలమున ఆహారము’ పెట్టే బాధ్యత ఆ నమ్మకమైన సేవకుడిదేనని యేసు చెప్పాడు. (మత్తయి 24:3, 45-47; లూకా 12:42) ఆహారం లేనట్లైతే మనం ఆకలితో అలమటించి మరణిస్తాము. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆహారం భుజించకపోతే మనం బలహీనపడి ఆధ్యాత్మికంగా చనిపోతాము. అందుకని ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఉండడం యెహోవా మనపట్ల శ్రద్ధ వహిస్తున్నాడన్న దానికి మరో రుజువు. ఆ ‘దాసుని’ ద్వారా మనకోసం చేయబడిన అమూల్యమైన ఆధ్యాత్మిక ఏర్పాట్లను మనం ఎల్లప్పుడు ఉన్నతంగా ఎంచుదాము.—మత్తయి 5:3.
10. మనం కూటాలకు క్రమంగా హాజరు కావడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?
10 ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడంలో వ్యక్తిగత
అధ్యయనం చేరివుంది. ఇతర క్రైస్తవులతో సహవసించడం, సంఘ కూటాలకు హాజరుకావడం వంటివి కూడా చేరివున్నాయి. మీరు ఆరు నెలల క్రితం, లేక కనీసం ఆరు వారాల క్రితం ఏమి తిన్నారో ఖచ్చితంగా జ్ఞాపకం ఉందా? బహుశ మర్చిపోయివుంటారు. అయినా మీరు తిన్నది మిమ్మల్ని సజీవంగా ఉంచడానికి అవసరమైన పోషణను ఇచ్చింది. ఆ తర్వాత మీరు అలాంటి ఆహారాన్నే మళ్ళీ తినివుండవచ్చు. క్రైస్తవ కూటాల్లో అందించబడే ఆధ్యాత్మిక ఆహారం విషయంలో కూడా అది నిజం. బహుశ మనం కూటాల్లో విన్న ప్రతి విషయమూ జ్ఞాపకం ఉండకపోవచ్చు. అలాంటి సమాచారమే బహుశ మళ్ళీ మళ్ళీ అందించబడివుండవచ్చు. అయినా, అది ఆధ్యాత్మిక ఆహారం; మన సంక్షేమానికి ఎంతో ప్రాముఖ్యం. మన కూటాలు ఎల్లప్పుడు మంచి ఆధ్యాత్మిక పోషణను ఇస్తాయి, అదీ తగిన కాలంలో ఇస్తాయి.11. క్రైస్తవ కూటాలకు హాజరయ్యేటప్పుడు మనకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయి?
11 క్రైస్తవ కూటాలకు హాజరు కావడం మనపై మరో బాధ్యతను కూడా పెడుతుంది. క్రైస్తవులు తమ తోటి సంఘ సభ్యులను “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును” పురికొల్పుతూ, ‘ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని’ ప్రబోధించబడుతున్నారు. క్రైస్తవ కూటాలన్నింటికీ సిద్ధపడడం, హాజరుకావడం, పాల్గొనడం వ్యక్తిగతంగా మన విశ్వాసాన్ని బలపర్చేదిగాను, ఇతరులకు ప్రోత్సాహకరంగాను ఉంటుంది. (హెబ్రీయులు 10:23-25, NW) భోజనం విషయంలో ‘నాకిది వద్దు అది వద్దు, ఇది కావాలి అది కావాలి’ అనే పిల్లలవలెనే కొందరికి ఆధ్యాత్మిక పోషణను పొందేందుకు నిరంతర ప్రోత్సాహం అవసరం కావచ్చు. (ఎఫెసీయులు 4:11-12) అవసరమైనప్పుడు అలాంటి ప్రోత్సాహాన్ని అందించడం ప్రేమపూర్వకమైన పని, అలాగైతే వారు పరిణతిచెందిన క్రైస్తవులుగా అభివృద్ధిచెందుతారు, అలాంటివారిని గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘వయస్సు వచ్చిన వారు [“పరిణతిచెందినవారు,” NW] అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.’—హెబ్రీయులు 5:14.
మనల్ని మనం ఆధ్యాత్మికంగా పోషించుకోవడం
12. మనం సత్యంలో ఉండాలంటే నిజానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వివరించండి.
12 సత్య మార్గంలో నడవమని మన వివాహ భాగస్వామి లేదా మన తల్లిదండ్రులు మనల్ని ప్రోత్సహిస్తుండవచ్చు. సంఘ పెద్దలు కూడా అదేవిధంగా తమ సంరక్షణలో ఉన్న మందలోని వారిగా మనపట్ల శ్రద్ధ వహించగలరు. (అపొస్తలుల కార్యములు 20:28) కానీ మనం సత్యంపై ఆధారపడిన జీవ మార్గంలో పట్టుదలతో కొనసాగేందుకు నిజానికి ఎవరు బాధ్యత వహిస్తారు? చెప్పాలంటే, ఆ బాధ్యత మనపైనే ఉంటుంది. మామూలు పరిస్థితుల్లోనైనా, కష్టకాలాల్లోనైనా ఎవరి బాధ్యత వారిపైనే ఉంటుంది. ఈ క్రింది సంఘటనను పరిశీలించండి.
13, 14. గొఱ్ఱెపిల్ల విషయంలో చూసినట్లుగా మనకు అవసరమైన ఆధ్యాత్మిక సహాయాన్ని ఎలా పొందగలము?
13 స్కాట్లాండ్‌లోని ఒక ప్రాంతంలో కొన్ని గొఱ్ఱె పిల్లలు పచ్చిక మేస్తున్నాయి. వాటిలో ఒకటి నెమ్మదిగా మందకు దూరమైపోయి గుట్ట మీదికి వెళ్ళి, అక్కడి నుండి జారి అవతల ఉన్న అంచుమీదకు పడిపోయింది. దెబ్బలేమీ తగల్లేదు కానీ అది భయపడిపోయింది, పైకి ఎక్కలేకపోయింది. ఇక అది గట్టిగా ఏడవడం మొదలుబెట్టింది. దాని తల్లి దాని ఏడుపు విన్నది, అది గట్టిగా అరవడం మొదలుబెట్టింది, చివరికి కాపరి వచ్చి ఆ గొఱ్ఱెపిల్లని పైకి తీశాడు.
14 దేని తర్వాత ఏమి జరిగిందో ఒక్కసారి గమనించండి. గొఱ్ఱెపిల్ల సహాయం కోసం అరిచింది, తల్లిగొఱ్ఱె కూడా అరవడం మొదలుపెట్టడంతో చివరికి కాపరి రంగంలోకి దిగి దాన్ని కాపాడాడు. ఒక చిన్న ప్రాణీ దాని తల్లీ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయాన్ని అర్థించగలిగితే, మనం ఆధ్యాత్మికంగా జారిపడినప్పుడు లేక సాతాను లోకం నుండి అనూహ్యమైన ప్రమాదాలను ఎదుర్కొన్నప్పుడు మనం కూడా అలానే చేయవద్దా? (యాకోబు 5:14, 15; 1 పేతురు 5:8) తప్పకుండా సహాయాన్ని అర్థించాలి, ప్రత్యేకంగా మనం యౌవనులమైనందునో లేదా సత్యంలో కాస్త క్రొత్తవారిమైనందునో మనకు అనుభవం తక్కువగా ఉన్నట్లైతే అలా చేయాలి.
దైవిక నిర్దేశాన్ని అనుసరించడం సంతోషాన్నిస్తుంది
15. ఒక స్త్రీ, తాను క్రైస్తవ సంఘంతో సహవసించడం ప్రారంభించినప్పుడు ఎలా భావించింది?
15 బైబిలు అవగాహన యొక్క విలువను, సత్య దేవుణ్ణి సేవించేవారికి అదిచ్చే మనశ్శాంతిని ఒకసారి పరిశీలించండి. 70 ఏండ్ల ఒక స్త్రీ తన జీవితకాలమంతా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు హాజరైంది, ఆమె యెహోవాసాక్షులతో వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించింది. అనతికాలంలోనే ఆమె దేవుని పేరు యెహోవా అని తెలుసుకుని, స్థానిక రాజ్యమందిరంలో చేయబడే హృదయపూర్వక బహిరంగ ప్రార్థనల చివర్లో “ఆమేన్” అనడం ప్రారంభించింది. అద్భుతమైన అనుభూతికి లోనవుతూ ఆమె ఇలా అన్నది: “దేవుడు అల్పమానవులమైన మనకంటే ఎంతో ఎత్తులో
ఉన్నవాడని చిత్రించడానికి బదులుగా, మీరు ఆయన్ను ఒక ప్రియమైన స్నేహితుడుగా మన మధ్యకే తీసుకువస్తున్నట్లుగా అనిపిస్తుంది. నేనింతకు ముందెన్నడూ అనుభవించని విషయమిది.” సత్యం తన మనస్సుపై వేసిన తొలి ముద్రను ఆసక్తిగల ఆ మామ్మగారు బహుశ ఎన్నడూ మర్చిపోరేమో. మనం కూడా మొదట్లో సత్యాన్ని స్వీకరించినప్పుడు అదెంత అమూల్యంగా ఉండిందో ఎన్నటికీ మర్చిపోకూడదు.16. (ఎ) డబ్బు సంపాదనే మన జీవితంలో ప్రధాన లక్ష్యంగా చేసుకుంటే మనకు ఏమి జరిగే అవకాశం ఉంది? (బి) మనం నిజమైన సంతోషాన్ని ఎలా పొందగలము?
16 తమకు కాస్త ఎక్కువ డబ్బు ఉండివుంటే ఇంకా ఆనందంగా ఉండివుండేవారమని అనేకులు నమ్ముతారు. అయితే డబ్బు సంపాదించడమే మన జీవితంలో ప్రధమ లక్ష్యంగా ఉంచుకుంటే మనం “మానసికంగా అనేకమైన వేదనలను” అనుభవించే అవకాశం ఉంది. (1 తిమోతి 6:10, ఫిలిప్స్) అనేకమంది లక్కీఛాన్సు కొట్టేస్తామని కలలుకంటూ ఎలా లాటరీ టిక్కెట్లు కొంటారో, జూదగృహాల్లో ఎలా డబ్బు ఖర్చు చేస్తారో, లేక స్టాక్ మార్కెట్లో ఎలా నిర్లక్ష్యంగా డబ్బు పెడతారో ఒక్కసారి ఆలోచించండి. వీరిలో చాలా అరుదుగా, కొద్దిమంది మాత్రమే తాము ఆశించిన ఐశ్వర్యాన్ని కళ్ళారా చూస్తారు. అలా చూసినవారు సైతం అకస్మాత్తుగా లభించిన సిరిసంపదలు సంతోషాన్ని తీసుకురాలేవని తరచు గ్రహిస్తారు. బదులుగా క్రైస్తవ సంఘంతో పనిచేయడం ద్వారా కలకాలం నిలిచే ఆనందం దొరుకుతుంది, యెహోవా పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన దూతల సహాయంతో యెహోవా చిత్తాన్ని చేయడం ద్వారా కూడా లభిస్తుంది. (కీర్తన 1:1-3; 84:4, 5; 89:15) మనమలా చేసినప్పుడు ఎదురుచూడని ఆశీస్సులు మనకు లభించగలవు. అలాంటి ఆశీర్వాదాలను మీ జీవితంలో పొందగలిగేలా, సత్యం మీకు అంత అమూల్యమైనదిగా ఉందా?
17. అపొస్తలుడైన పేతురు చర్మకారుడైన సీమోను ఇంటివద్ద ఉండడం ఆయన వైఖరిని గురించి ఏమి వెల్లడిచేస్తుంది?
17 అపొస్తలుడైన పేతురు ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని పరిశీలించండి. ఆయన సా.శ. 36 లో షారోను మైదానానికి మిషనరీ యాత్రపై వెళ్ళాడు. ఆయన లుద్దలో ఆగి అక్కడ పక్షవాయువు కలిగిన ఐనెయను స్వస్థపరిచి, తర్వాత యొప్పే అనే రేవు పట్టణానికి వెళ్ళాడు. అక్కడాయన దొర్కాను పునరుత్థానం చేశాడు. అపొస్తలుల కార్యములు 9:43 ఇలా చెబుతోంది: “పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.” ఈ చిన్న వివరం, పేతురు ఆ పట్టణంలోని ప్రజల మధ్య పరిచర్య చేస్తుండగా ఆయన వ్యక్తంచేసిన నిష్పక్షపాత వైఖరిని వెల్లడిచేస్తుంది. ఎలా? బైబిలు పండితుడు ఫ్రెడ్రిక్ డబ్ల్యు. ఫర్రార్ ఇలా వ్రాస్తున్నాడు: “మౌఖిక [మోషే] ధర్మశాస్త్రాన్ని భక్తినిష్ఠలతో పాటిస్తున్న ఏ వ్యక్తీ ఒక చర్మకారుని ఇంట్లో నివసించేందుకు ఒప్పించబడడు. ఈ వృత్తిలో వేర్వేరు జంతువుల చర్మాలతోను కళేబరాలతోను అనుదినం పనిచేయాల్సివుండడం మూలంగా, ఇందులో ఉపయోగించబడే వస్తువుల మూలంగా, కఠినులైన చట్టవిధేయవాదుల దృష్టిలో అది అశుద్ధమైన, అసహ్యమైన వృత్తిగా మారింది.” “సముద్రపు దరినున్న” సీమోను ఇల్లు ఆయన కొట్టు ప్రక్కనే ఉండకపోయినా సీమోను చేసే వృత్తి ‘అసహ్యాన్ని కలిగించే వృత్తిగా దృష్టించబడేది గనుక, దాన్ని చేపట్టిన ఎవరి ఆత్మగౌరవాన్నైనా అది తగ్గించివేసేది’ అని ఫర్రార్ అంటున్నాడు.—అపొస్తలుల కార్యములు 10:6.
18, 19. (ఎ) తాను పొందిన దర్శనం మూలంగా పేతురు ఎటుతోచని పరిస్థితిలో ఉన్నట్లు ఎందుకు భావించాడు? (బి) పేతురుకు ఎలాంటి ఎదురుచూడని ఆశీర్వాదం లభించింది?
18 నిష్పక్షపాతి అయిన పేతురు సీమోను ఆతిథ్యాన్ని స్వీకరించాడు, అక్కడ పేతురుకు తానెదురుచూడని దైవిక నిర్దేశం లభించింది. ఆయన ఒక దర్శనాన్ని చూశాడు, అందులో యూదుల ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైనవైన ప్రాణులను తినమని ఆయన ఆజ్ఞాపించబడ్డాడు. అందుకు పేతురు “నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని” చెబుతూ నిరాకరించాడు. కానీ మూడుసార్లు ఆయనకు “దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైనవాటినిగా ఎంచవద్దని” చెప్పబడింది. “పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక” కలవరపడడం అర్థం చేసుకోదగినదే.—అపొస్తలుల కార్యములు 10:5-17; 11:7-10.
19 అంతకు ముందురోజే అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని కైసరయలో కొర్నేలీ అనే అన్యుడికి కూడా ఒక దర్శనం లభించిందని పేతురుకు తెలియదు. చర్మకారుడైన సీమోను అపొస్తలుల కార్యములు 10:1-48; 11:18) పేతురు ఎంత అద్భుతమైన ఆధిక్యతను అనుభవించాడు—దీనంతటికీ కారణం ఆయనకు సత్యము అమూల్యంగా ఉండడమే, యెహోవా నుండి వచ్చిన నిర్దేశాన్ని పాటించి విశ్వాసంతో చర్యగైకొనేలా ఆ సత్యము ఆయనను నడిపించడమే!
ఇంట్లో ఉన్న పేతురును కనుగొనడానికి పనివారిని పంపమని యెహోవా దూత కొర్నేలీని ఆదేశించాడు. కొర్నేలీ తన పనివారిని సీమోను ఇంటికి పంపించాడు, పేతురు వారితోపాటు కైసరయకు వచ్చాడు. అక్కడాయన కొర్నేలీకి ఆయన బంధువులకూ స్నేహితులకూ ప్రకటించాడు. దాంతో మొట్టమొదటిగా రాజ్యవారసులుగా పరిశుద్ధాత్మను పొందిన సున్నతిపొందని అన్యులైన విశ్వాసులు వారే. వారు సున్నతి పొందకపోయినా పేతురు చెప్పిన విషయాలు విన్నవారందరూ బాప్తిస్మం పొందారు. యూదుల దృక్కోణం నుంచి చూస్తే అపవిత్రులుగా ఉన్న అన్యజనాంగాల ప్రజలు క్రైస్తవ సంఘంలో సభ్యులయ్యేలా ఇది మార్గాన్ని తెరిచింది. (20. మన జీవితాల్లో సత్యానికి మొదటి స్థానం ఇస్తే మనకు ఎలాంటి దైవిక మద్దతు ఉంటుంది?
20 పౌలు ఇలా ఉద్బోధిస్తున్నాడు: “ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయియున్నాడు.” (ఇటాలిక్కులు మావి.) (ఎఫెసీయులు 4:15, 16) అవును, మనం సత్యాన్ని మన జీవితాల్లో మొదటి స్థానంలో ఉంచితే, యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా మన అడుగులను నిర్దేశించడానికి అనుమతిస్తే సత్యము మనకు అపారమైన సంతోషాన్ని తెస్తుంది. అలాగే మన సువార్త కార్యకలాపాల్లో పరిశుద్ధ దూతల మద్దతుని కూడా మనస్సులో ఉంచుకుందాము. (ప్రకటన 14:6, 7; 22:6) యెహోవా మనకు అప్పగించిన పనిలో అలాంటి మద్దతును కలిగివున్నందుకు మనమెంత ఘనతచెందినవారమో కదా! యథార్థతను కాపాడుకోవడం మనం సత్య దేవుడైన యెహోవాను నిరంతరం స్తుతించేందుకు నడిపిస్తుంది. అంతకన్నా అమూల్యమైనది ఇంకా ఏమైనా ఉండగలదా?—యోహాను 17:3.
మనం ఏమి నేర్చుకున్నాము?
• చాలామంది సత్యాన్ని ఎందుకు స్వీకరించరు?
• సాతాను లోకంలోని వస్తువులను క్రైస్తవులు ఎలా దృష్టించాలి?
• కూటాలపట్ల మన వైఖరి ఎలా ఉండాలి, ఎందుకని?
• ఆధ్యాత్మికంగా మనపట్ల మనం శ్రద్ధ వహించాల్సిన ఏ బాధ్యత మనకు ఉంది?
[అధ్యయన ప్రశ్నలు]
[18వ పేజీలోని మ్యాపు/చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
మహాసముద్రము
కైసరయ
షారోను మైదానం
యొప్పే
లుద్ద
యెరూషలేము
[చిత్రం]
పేతురు దైవిక నిర్దేశాన్ని పాటించి ఎదురుచూడని ఆశీస్సులను పొందాడు
[చిత్రసౌజన్యం]
పటం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[13వ పేజీలోని చిత్రం]
యేసు సత్యం గురించి సాక్ష్యమిచ్చాడు
[15వ పేజీలోని చిత్రం]
భౌతిక ఆహారంలానే ఆధ్యాత్మిక ఆహారం మన సంక్షేమానికి ఎంతో అవసరం