కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

కన్య మరియ యొక్క అపరిపూర్ణత, యేసు ఆమె గర్భంలోపడ్డప్పుడు ఆయనపై ఏదైనా దుష్ప్రభావం చూపించిందా?

‘యేసు జననం’ గురించి ప్రేరేపిత వృత్తాంతం ఇలా చెబుతోంది: “ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.” (మత్తయి 1:​18) వాస్తవానికి, మరియ గర్భం ధరించడంలో దేవుని పరిశుద్ధాత్మ ప్రధాన పాత్ర నిర్వహించింది.

అయితే మరియ మాటేమిటి? ఆమె అండము ఆమె గర్భం ధరించడానికి ఏమైనా దోహదపడిందా? మరియ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యూదా, రాజైన దావీదులతో దేవుడు చేసిన వాగ్దానాల దృష్ట్యా, పుట్టిన బిడ్డ నిజంగా వారి వంశీకుడై ఉండాలి. (ఆదికాండము 22:​18; 26:​24; 28:​10-14; 49:​10; 2 సమూయేలు 7:​16) అలాకానప్పుడు మరియకు జన్మించిన బిడ్డ ఆ దైవిక వాగ్దానాలకు హక్కుదారుడైన వారసుడెలా అవుతాడు? ఆయన ఆమె అసలు కుమారుడై ఉండాలి.​—⁠లూకా 3:​23-34.

యెహోవా దూత కన్య మరియకు కనిపించి, ఇలా చెప్పాడు: “మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి; ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.” (లూకా 1:​30, 31) గర్భం ధరించాలంటే అండము ఫలదీకరణ చెందాలి. యెహోవా దేవుడు మరియ గర్భంలోని ఒక అండము ఫలదీకరణ చెందేలా చేశాడని స్పష్టమవుతోంది, ఆయన తన అద్వితీయ కుమారుని జీవాన్ని ఆత్మ సామ్రాజ్యం నుండి భూమిపైకి బదిలీ చేయడం ద్వారా దాన్ని సాధించాడు.​—⁠గలతీయులు 4:⁠4.

ఈ విధంగా ఒక అపరిపూర్ణ స్త్రీ గర్భంలో పడిన బిడ్డ పరిపూర్ణుడై, శారీరకంగా పాపరహితుడై ఉండగలడా? పరిపూర్ణత అపరిపూర్ణతతో కలిసినప్పుడు ఆనువంశిక సూత్రాలు ఎలా పనిచేస్తాయి? దేవుని కుమారుని పరిపూర్ణ జీవశక్తిని బదిలీ చేసి గర్భధారణ జరిగేలా చేయడంలో పరిశుద్ధాత్మ ఉపయోగించబడిందని గుర్తుంచుకోండి. ఇది, మరియ అండములో ఉన్న ఏ అపరిపూర్ణతనైనా కొట్టివేసి, ప్రారంభం నుండి పరిపూర్ణమైనదై ఉండే జన్యు నమూనాను ఉత్పన్నం చేసింది.

ఏదేమైనప్పటికీ, ఆ సమయంలో పనిచేసిన దేవుని పరిశుద్ధాత్మ ఆయన సంకల్పం ఖచ్చితంగా విజయవంతమయ్యేలా చూసిందని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. గబ్రియేలు దేవదూత మరియకు ఇలా వివరించాడు: “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.” (లూకా 1:​35) అవును, ఒక విధంగా చెప్పాలంటే, గర్భధారణ జరిగినప్పటి నుండి, పెరుగుతున్న పిండానికి అపరిపూర్ణత గానీ హానికరమైన ప్రభావం గానీ ఏ విధమైన లోపం కలిగించకుండా ఉండేలా దేవుని పరిశుద్ధాత్మ భద్రతా గోడను ఏర్పరచింది.

యేసు తన పరిపూర్ణ మానవ జీవం విషయంలో ఏ మానవునికీ కాదు గానీ తన పరలోక తండ్రికే రుణపడి ఉన్నాడని స్పష్టమవుతోంది. యెహోవా ఆయనకు ‘ఒక శరీరమును అమర్చాడు,’ గర్భంలో పడినప్పటి నుండి యేసు నిజంగానే ‘నిష్కల్మషుడిగా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిగా’ ఉన్నాడు.​—⁠హెబ్రీయులు 7:​26; 10:⁠5.

[19వ పేజీలోని చిత్రం]

‘నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు’