కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి నాయకత్వం మనకెక్కడ లభిస్తుంది?

మంచి నాయకత్వం మనకెక్కడ లభిస్తుంది?

మంచి నాయకత్వం మనకెక్కడ లభిస్తుంది?

“ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును” అని బైబిలు చెబుతోంది. కానీ “సమస్తమును కట్టినవాడు దేవుడే” అని కూడా అది చెబుతోంది. (హెబ్రీయులు 3:⁠3; ప్రకటన 4:​10) సత్య దేవుడైన యెహోవా మన సృష్టికర్త గనుక “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది.” (కీర్తన 103:​14) మన పరిమితుల గురించి, మన అవసరాల గురించి ఆయనకు సంపూర్ణంగా తెలుసు. ఆయన ప్రేమగల దేవుడు గనుక ఆ అవసరాలను తీర్చాలని కోరుకుంటున్నాడు. (కీర్తన 145:​16; 1 యోహాను 4:⁠8) అలాగే మనకు కావలసిన మంచి నాయకుడి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు.

ప్రవక్తయైన యెషయా ద్వారా యెహోవా ఇలా ప్రకటించాడు: ‘ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనములకు రాజుగాను [“నాయకునిగాను,” పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము] అధిపతిగాను [“సర్వసేనానిగాను,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌] అతని నియమించితిని.’ (యెషయా 55:⁠4) నేటి నాయకత్వ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఈ నాయకుడ్ని, అంటే సర్వశక్తుడు స్వయంగా నియమించిన నాయకుడ్ని గుర్తించడం ఆయన నాయకత్వాన్ని స్వీకరించడం ఇమిడివున్నాయి. కాబట్టి ప్రవచించబడిన ఈ నాయకుడు, సర్వసేనాని ఎవరు? నాయకుడిగా ఆయనపై విశ్వాసం ఉంచడానికి కావలసిన నిదర్శనాలేమిటి? ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? ఆయన నాయత్వం నుండి ప్రయోజనం పొందాలంటే మనం ఏమి చేయాలి?

వాగ్దత్త నాయకుడు వస్తాడు

దాదాపు 2,500 సంవత్సరాల క్రితం గబ్రియేలు దూత ప్రవక్తయైన దానియేలుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: ‘యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి [“నాయకుడు,” NW] వచ్చు వరకు ఏడు వారములు [“మరియు అరువది రెండు వారములు,” NW] పట్టునని స్పష్టముగా గ్రహించుము. . . . తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.’​—⁠దానియేలు 9:⁠25.

ఇక్కడ దేవదూత యెహోవా ఎంపిక చేసుకున్న నాయకుడు వచ్చే నిర్దిష్ట సమయం గురించి దానియేలుకు చెబుతున్నాడన్నది స్పష్టమవుతోంది. యెరూషలేమును మరల కట్టించవచ్చుననే ఆజ్ఞ సా.శ.పూ. 455 లో బయలుదేరింది గనుక, ఆ సంవత్సరం మొదలుకొని 69 వారాల చివర్లో, అంటే 483 సంవత్సరాల చివర్లో “అభిషిక్తుడగు అధిపతి,” లేదా నాయకుడు వస్తాడు. * (నెహెమ్యా 2:​1-8) ఆ సంవత్సరాలు ముగిసిన తర్వాత ఏమవుతుంది? సువార్త రచయిత లూకా ఇలా వ్రాస్తున్నాడు: ‘తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను . . . ఉన్నకాలమున [సా.శ. 29] అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహానునొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను.’ ఆ సమయంలో నాయకుడైన మెస్సీయ కోసం “ప్రజలు కనిపెట్టుచు” ఉన్నారు. (లూకా 3:​1-3, 15) జనసమూహాలు యోహాను దగ్గరికి వచ్చినప్పటికీ, వారి నాయకుడు ఆయన కాదు.

సా.శ. 29వ సంవత్సరం అక్టోబరు నెల దరిదాపుల్లో నజరేయుడైన యేసు బాప్తిస్మం కోసం యోహాను దగ్గరికి వచ్చాడు. “ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు​—⁠నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితి” అంటూ యోహాను సాక్ష్యమిచ్చాడు. (యోహాను 1:​32-34) యేసు తన బాప్తిస్మం సమయంలో అభిషిక్తుడైన నాయకుడు అయ్యాడు​—⁠మెస్సీయ, లేక క్రీస్తు అయ్యాడు.

అవును, ‘జనములకు నాయకునిగాను సర్వసేనానిగాను’ ఉంటాడని వాగ్దానం చేయబడిన వ్యక్తి యేసుక్రీస్తే. నాయకుడిగా ఆయన లక్షణాలను మనం పరిశీలిస్తే ఆదర్శ నాయకుడిగా ఉండడానికి నేడు కోరబడే ఆవశ్యకతలను మించి ఆయనలో ఉన్నాయని మనం వెంటనే గ్రహిస్తాము.

మెస్సీయ​—⁠ఆదర్శ నాయకుడు

ఒక మంచి నాయకుడు స్పష్టమైన నిర్దేశాలనిస్తాడు, తన క్రింద ఉన్న ప్రజలు సమస్యల్ని పరిష్కరించుకునేందుకు కావలసిన కృతనిశ్చయాన్ని కలిగివుండేందుకూ, తగిన సామర్థ్యాన్ని పొందేందుకూ వారికి సహాయం చేస్తాడు. ‘ఇది 21వ శతాబ్దంలో సమర్థుడైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం’ అని 21వ శతాబ్దపు నాయకత్వం: 100 మంది అగ్రశ్రేణి నాయకులతో భేటీ అనే పుస్తకం చెబుతోంది. అనుదిన పరిస్థితులతో వ్యవహరించడానికి యేసు తన శ్రోతలను ఎంత బాగా సిద్ధపరిచాడో కదా! ఆయనిచ్చిన ప్రఖ్యాతిగాంచిన కొండమీది ప్రసంగాన్ని పరిశీలించండి. మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో ఆచరణాత్మకమైన సలహాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఉదాహరణకు, వ్యక్తిగత విబేధాలను పరిష్కరించుకునే విషయంలో యేసు ఇచ్చిన సలహాను పరిశీలించండి. ఆయనిలా అన్నాడు: “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.” (మత్తయి 5:​23, 24) ఇతరులతో సమాధాన పడడానికి చొరవ తీసుకోవడం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది​—⁠చివరికి, అది యెరూషలేము దేవాలయంలోని బలిపీఠంపై మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించిన అర్పణలను అర్పించడం వంటి మతపరమైన విధుల నిర్వహణను కూడా మించిపోతుంది. ఇతరులతో సమాధానం లేనట్లైతే ఆరాధనా క్రియలు దేవునికి అంగీకారయోగ్యం కావు. యేసు సలహా శతాబ్దాల క్రితం ఎంత ఆచరణీయమో నేడు కూడా అంతే ఆచరణీయం.

యేసు అనైతికత అనే ఉరిని తప్పించుకోవడానికి కూడా తన శ్రోతలకు సహాయం చేశాడు. ఆయన వారికిలా ఉద్బోధించాడు: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా​—⁠ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:​27, 28) ఎంత యుక్తమైన హెచ్చరిక! వ్యభిచారం గురించిన తలంపులను మనస్సులోకి రానీయడం ద్వారా వ్యభిచారం చేసే మార్గంలోకి ఎందుకు ప్రవేశించాలి? హృదయములో నుండి వ్యభిచారములు, వేశ్యాగమనములు వస్తాయని యేసు చెప్పాడు. (మత్తయి 15:​18, 19) మన హృదయాలను కాపాడుకోవడం జ్ఞానయుక్తం.​—⁠సామెతలు 4:⁠23.

కొండమీది ప్రసంగంలో తన శత్రువులను ప్రేమించడం, ఔదార్యాన్ని కనపర్చడం, వస్తుపరమైన ఆధ్యాత్మికమైన విషయాలపై యుక్తమైన దృక్కోణాన్ని కలిగివుండడం వంటివాటి గురించి కూడా అతి శ్రేష్ఠమైన సలహాలు ఉన్నాయి. (మత్తయి 5:​43-47; 6:​1-4, 19-21, 24-34) యేసు ఎలా ప్రార్థించాలో నేర్పించడం ద్వారా కూడా తన శ్రోతలు దేవుని సహాయాన్ని ఎలా పొందాలో చూపించాడు. (మత్తయి 6:​9-13) నాయకుడైన మెస్సీయ మానవ సహజ సమస్యలతో ఎలా వ్యవహరించాలో తన అనుచరులకు నేర్పించడం ద్వారా వారిని బలపరచి, సిద్ధపరుస్తాడు.

యేసు, కొండమీది ప్రసంగంలో ఆరుసార్లు ‘అని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా’ లేక ‘అని చెప్పబడియున్నది’ అంటూ తన వ్యాఖ్యానాలను ప్రారంభించి, ఆ తర్వాత, “నేను మీతో చెప్పునదేమనగా” అంటూ వేరే తలంపులను చెప్పాడు. (మత్తయి 5:​21, 22, 27, 28, 31-34, 38, 39, 43, 44) తన శ్రోతలు, పరిసయ్యుల మౌఖిక సాంప్రదాయాల ప్రకారం ఫలాని విధంగా ప్రవర్తించేందుకు అలవాటుపడ్డారని అది సూచిస్తోంది. కానీ యేసు వారికిప్పుడు విభిన్నమైన మార్గాన్ని, మోషే ధర్మశాస్త్రం యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్న మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ విధంగా యేసు ఒక మార్పును, అదీ తన అనుచరులు స్వీకరించడానికి సులభంగా ఉండే విధంగా ప్రవేశపెడుతున్నాడు. అవును, ప్రజలు తమ జీవితాల్లో ఆధ్యాత్మికంగా నైతికంగా అనేక మార్పులు చేసుకునేందుకు యేసు వారిని కదిలించాడు. నిజమైన నాయకుడికి ఇదొక గుర్తింపు చిహ్నం.

అలాంటి మార్పును తీసుకురావడం ఎంత కష్టమో యాజమాన్య విధానానికి సంబంధించిన ఒక పాఠ్యగ్రంథం చూపిస్తోంది. అదిలా చెబుతోంది: “మార్పు తీసుకువచ్చే వ్యక్తికి [నాయకుడికి], సమాజ సేవకుడికి ఉండే సునిశితబుద్ధి, మనస్తత్త్వవేత్తకు ఉండే అంతర్దృష్టి, అనేక కిలోమీటర్లు పరుగెత్తాల్సిన పందెంలో పరుగెత్తే వ్యక్తికి ఉండే నిలకడశక్తి, వేటకుక్కకు ఉండే పట్టుదల, మునికి ఉండే ఆత్మవిశ్వాసము, ఋషికి ఉండే సహనము అవసరం. ఈ లక్షణాలన్నీ ఉన్నా, విజయం లభిస్తుందన్న నమ్మకం లేదు.”

“నాయకత్వం: వైఖరులు అంత ప్రాముఖ్యమైనవా?” అనే ఆర్టికల్‌, “నాయకులు తమ అనుచరులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో అలానే ప్రవర్తించాలి” అని చెబుతోంది. నిజానికి, మంచి నాయకుడు తాను బోధించేవాటిని ఆచరిస్తాడు. యేసుక్రీస్తు విషయంలో అదెంత వాస్తవం! అవును, నమ్రతగా ఉండమని ఆయన తన దగ్గరున్న వారికి బోధించాడు, అంతేకాదు వారి పాదాలను కడిగి, క్రియల ద్వారా ఒక పాఠాన్ని కూడా నేర్పించాడు. (యోహాను 13:​5-15) దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించమని ఆయన తన శిష్యుల్ని పంపి ఊరుకోలేదు, బదులుగా ఆ పనిలో తానూ అత్యుత్సాహంతో పాల్గొన్నాడు. (మత్తయి 4:​18-25; లూకా 8:​1-3; 9:​1-6; 10:​1-24; యోహాను 10:​40-42) నాయకత్వానికి ప్రతిస్పందించే విషయంలో కూడా యేసు మంచి మాదిరిని ఉంచాడు. “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు” అని యేసు తన గురించి చెప్పుకున్నాడు.​—⁠యోహాను 5:⁠19.

యేసు చెప్పిన చేసిన వాటి గురించిన వివరణ ఆయన ఆదర్శవంతుడైన నాయకుడని స్పష్టంగా చూపిస్తోంది. నిజానికి మంచి నాయకత్వం విషయంలో మానవ ప్రమాణాలన్నింటినీ ఆయన మించిపోతున్నాడు. యేసు పరిపూర్ణుడు. తన మరణ పునరుత్థానాల తర్వాత ఆయన అమర్త్యతను పొందాడు కాబట్టి ఆయన నిరంతరం జీవిస్తాడు. (1 పేతురు 3:​18; ప్రకటన 1:​13-18) ఈ అర్హతలకు ఏ మానవుడు సాటిరాగలడు?

మనం ఏమి చేయాలి?

దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలన చేస్తున్న అభిషిక్తుడగు నాయకుడు విధేయులైన మానవులపై ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. ఈ విషయంలో లేఖనాలిలా వాగ్దానం చేస్తున్నాయి: “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెషయా 11:⁠9) “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:​11) “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.” (మీకా 4:⁠4) ‘దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.’​—⁠ప్రకటన 21:​3, 4.

నేడు లోకం నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయితే యేసుక్రీస్తు సాత్వికులను శాంతియుతమైన నూతనలోకంలోకి నడిపిస్తున్నాడు, అక్కడ విధేయులైన మానవులు యెహోవా దేవుని ఆరాధనలో ఐక్యమైవుంటారు, పరిపూర్ణతవైపు పయనిస్తారు. సత్య దేవుని గురించిన, ఆయన నియుక్త నాయకుడి గురించిన పరిజ్ఞానాన్ని పొందుతూ ఆ పరిజ్ఞానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సమయం వెచ్చించడం ఎంత ప్రాముఖ్యం!​—⁠యోహాను 17:⁠3.

మనం ఒక వ్యక్తిని ప్రశంసించే మార్గాల్లో అత్యుత్తమమైన ఒక మార్గం ఆ వ్యక్తిని అనుకరించడమే. కాబట్టి మనం మానవ చరిత్రలో అత్యంత గొప్ప నాయకుడిని​—⁠యేసుక్రీస్తును అనుకరించడానికి ప్రయత్నించవద్దా? ఎలా అనుకరించవచ్చు? ఆయన నాయకత్వాన్ని అంగీకరించడం వలన అది మన జీవితాలపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తుంది? ఈ ప్రశ్నలూ మరితర ప్రశ్నలూ తర్వాతి రెండు ఆర్టికల్‌లలో చర్చించబడతాయి.

[అధస్సూచి]

[4వ పేజీలోని చిత్రం]

దేవుడు ఎంపిక చేసుకున్న నాయకుడి రాక గురించి దానియేలు ప్రవచించాడు

[7వ పేజీలోని చిత్రాలు]

ప్రజలు తమ జీవిత సమస్యలతో వ్యవహరించేందుకు యేసు బోధలు వారిని సంసిద్ధులను చేశాయి

[7వ పేజీలోని చిత్రం]

విధేయులైన మానవులను యేసు శాంతియుతమైన నూతనలోకంలోకి నడిపిస్తాడు