నేర్చుకోవడానికి వయస్సుతో పనిలేదు
నేర్చుకోవడానికి వయస్సుతో పనిలేదు
క్సెన్యా 1897 లో జన్మించింది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు, 15 మంది మనుమలు మనుమరాళ్ళు, 25 మంది మునిమనుమలు మునిమనుమరాళ్ళు ఉన్నారు. ఆమె తన జీవితమంతా తన తల్లిదండ్రులు తనకు నేర్పించినదాన్నే పాటించింది. ఆమె, నల్ల సముద్రానికి కాకాసస్‌కు నడుమ ఉన్న యుద్ధ పీడిత అబ్‌ఖాజ్ రిపబ్లిక్ నుండి మాస్కోకు శరణార్థిగా వచ్చినప్పటికీ, ఆమె జీవితం పూర్తి సంతృప్తితో ఉంది, ప్రాముఖ్యంగా తనకు వారసత్వంగా వచ్చిందని ఆమె చెబుతున్న విశ్వాసంతో ఆమె పూర్తి సంతృప్తితో ఉంది.
క్సెన్యా కుమార్తె మెరీ 1993 లో యెహోవాసాక్షి అయ్యింది. మెరీ యెహోవా దేవుని గురించి, బైబిలు గురించి క్సెన్యాతో మాట్లాడడం మొదలుపెట్టింది, కాని ఆమె వినడానికి ఇష్టపడేది కాదు. “నాది క్రొత్త విషయాలు నేర్చుకునే వయస్సు కాదు” అని క్సెన్యా తన కుమార్తెకు చెబుతుండేది.
అయినప్పటికీ, యెహోవాసాక్షులుగా మారిన ఆమె కుమార్తె మెరీ, ఆమె మనుమడి భార్య లొండా, ఆమె మునిమనుమరాళ్ళు నానా, జాజా అందరూ కూడా ఆమెతో బైబిలు గురించి మాట్లాడుతుండేవారు. వారు 1999 లో ఒక సాయంకాలం క్సెన్యాకు ఒక లేఖనాన్ని చదివి వినిపించారు, అది ఆమె హృదయాన్ని తాకింది. అందులో, ప్రభు రాత్రి భోజనాన్ని ప్రారంభిస్తూ యేసు తన నమ్మకమైన అపొస్తలులతో పలికిన పురికొల్పుతో కూడిన మాటలు ఉన్నాయి. (లూకా 22:19, 20) 102 ఏళ్ళ వయస్సులో, క్సెన్యా ఆ సాయంకాలమే బైబిలు అధ్యయనం చేయాలని నిశ్చయించుకుంది.
క్సెన్యా ఇలా చెబుతోంది, “102 సంవత్సరాలపాటు జీవించిన తర్వాత, చివరికి జీవితార్థం ఏమిటో నాకు తెలిసింది. అద్భుతమైన, ప్రేమగల మన దేవుడైన యెహోవా సేవ చేయడం కన్నా శ్రేష్టమైనదేదీ లేదని నేనిప్పుడు గ్రహించాను. నేనింకా చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నాను. నేను కళ్ళద్దాలు లేకుండానే చదవగలను, నా కుటుంబ సభ్యులందరితో కలిసి ఉల్లాసంగా ఉంటాను.”
2000, నవంబరు 5న క్సెన్యా బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇలా అంటోంది: “ప్రేమతో సేవ చేయడానికి నేనిప్పుడు నా జీవితాన్ని యెహోవాకు అర్పిస్తున్నాను. మా ఇంటి దగ్గరున్న బస్టాప్‌లో కూర్చుని నేను పత్రికలు, కరపత్రాలు అందిస్తాను. తరచూ బంధువులు చూడడానికి వస్తుంటారు, యెహోవాను గురించిన సత్యాన్ని నేను వారికి సంతోషంగా చెబుతుంటాను.”
‘తన మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా ఉండే, తన చిన్ననాటిస్థితి తిరిగి కలిగే’ దినం కోసం క్సెన్యా ఎదురుచూస్తోంది. (యోబు 33:25) బైబిలు నుండి జీవితార్థమేమిటో నేర్చుకోవడానికి మరీ ఆలస్యమైందని నూరేండ్లు నిండిన వ్యక్తే భావించనప్పుడు, మరి మీ సంగతేమిటి?