కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ భద్రత దేనిపై ఆధారపడి ఉంది?

మీ భద్రత దేనిపై ఆధారపడి ఉంది?

మీ భద్రత దేనిపై ఆధారపడి ఉంది?

పశ్చిమాఫ్రికాలోని ఒక కుగ్రామంలో, యౌవనస్థుడైన జోజ్యే తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వీడ్కోలు చెప్పి, ఆర్థిక భద్రత కోసం పెద్ద నగరానికి చేరుకుంటాడు. * అయితే అక్కడికి చేరుకున్న తరువాత, అక్కడి చెట్లకు డబ్బులేమీ కాయడంలేదని త్వరలోనే గ్రహించి ఆయన నిస్పృహకు లోనవుతాడు.

నగర జీవనానికి అలవాటు పడడానికి పోరాడుతూ, జోజ్యే ఎంతో నిరాశ చెందుతాడు. ఎందుకంటే పెద్ద నగరం ఎలా ఉంటుందని ఆయన ఊహించుకున్నాడో దానికి పూర్తి భిన్నంగా ఉంది ఆ నగరం. తాను వదిలివచ్చిన ఆ కుగ్రామానికి తిరిగి వెళ్ళి తన కుటుంబ సభ్యులను స్నేహితులను మళ్ళీ కలుసుకోవాలని జోజ్యే హృదయం పరితపించిపోతోంది. కానీ గ్రామస్థులు కొందరు తనను హేళన చేస్తారేమోనని ఆయనకు భయంగా ఉంది. ‘నేను నగరంలో విజయవంతంగా కొనసాగలేకపోయాను గనుక వాళ్ళు నన్ను విఫలుడిగా పరిగణిస్తారేమో’ అని ఆయన మధనపడతాడు.

తన తల్లిదండ్రులకు కలిగే నిరాశ ఆయనను అన్నింటికన్నా ఎక్కువగా కృంగదీస్తోంది. ఆయన తమకు ఆర్థికంగా ఆసరాగా ఉంటాడని వాళ్ళు ఆశిస్తున్నారు. భావోద్వేగపరమైన ఈ భారాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన ప్రజల దృష్టిలో ఏమంత గౌరవప్రదమైనది కాని ఉద్యోగంలో ఎన్నో గంటలపాటు కష్టపడి పనిచేస్తూ, తాను కలలు కన్నదానికన్నా ఎంతో తక్కువ డబ్బు సంపాదించుకుంటాడు. విపరీతంగా పని చేయడం వల్ల ఆయన పూర్తిగా అలసిపోతున్నాడు. ఒక్కో వారం గడుస్తుండగా, ఆయన ఎంతో విలువైనవిగా ఎంచే క్రైస్తవ కార్యకలాపాలకు మిగిలే సమయం అంతకంతకూ తగ్గిపోతోంది. తన కుటుంబ సభ్యుల ప్రేమకు, పాత స్నేహితుల స్నేహానికి దూరమై దుఃఖాన్ని, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. తాను ఎంతో కోరుకున్న భద్రతను ఆ నగరం ఇవ్వలేకపోయిందని ఆయన గ్రహిస్తాడు.

పేర్లు, స్థలాలు మారినా జోజ్యేకు ఎదురైన బాధాకరమైన అనుభవం, పునరావృతమవుతూనే ఉంటుంది. జోజ్యే అలా తరలి వెళ్ళడానికి కారణం స్వార్థం కాదు, ఆయన భద్రత కావాలని కోరుకున్నాడంతే. తన చిన్న గ్రామంలో కంటే నగరంలో తనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన యథార్థంగా భావించాడు. నిజమే కొన్నిసార్లు ఒక వ్యక్తి వస్తుపరంగా తన పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు, కానీ అది నిజమైన భద్రత అని భావం కాదు. అది జోజ్యేకు నిజమైన భద్రతనివ్వలేదు, ఆయనలానే ప్రయత్నించే అనేకులకు కూడా నిజమైన భద్రతను ఇవ్వదు. ఈ పరిస్థితి, ‘భద్రత అంటే ఏమిటి?’ అని మనం ప్రశ్నించేలా చేస్తుంది.

భద్రతను ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిగణిస్తారు. భద్రత అంటే అపాయం లేకపోవడం, లేదా చింత లేక భయం లేకపోవడం అని ఒక నిఘంటువు చెబుతుంది. పూర్తిగా అపాయం లేకపోవడమన్నది నేడు దుస్సాధ్యమని చాలామంది ప్రజలు గ్రహిస్తారు. భయపెట్టే పరిస్థితులు తమకు ఎదురైనా, తాము భద్రతతో ఉన్నట్లు భావిస్తున్నంత వరకు వారు సంతృప్తిగానే ఉంటారు.

మీ విషయమేమిటి? మీరు భద్రత కోసం దేనిపై ఆధారపడతారు? జోజ్యే అనుకున్నట్లుగా, భద్రత గ్రామంలో కాదు గానీ నగరంలో ఉంటుందా? లేక, మీరు ఎక్కడ, ఎలా సంపాదించుకున్నప్పటికీ డబ్బు భద్రత నిస్తుందా? బహుశా మీరు ఉన్నతమైన హోదాను పొందితే లభిస్తుందా? మీకు ఏది భద్రతనిస్తుందని మీరు నమ్మినా, మీకు మీ కుటుంబానికి ఆ భద్రత ఎంతకాలం పాటు నిలువగలదు?

చాలామంది భద్రతను ఇస్తాయని భావించే అంశాలైన స్థలం, డబ్బు, స్థానం లేదా హోదా అనే మూడింటిని మనం పరిశీలిద్దాము. ఆ తర్వాత నిజమైన, శాశ్వతమైన భద్రత ఎక్కడ లభిస్తుందో మనం చూద్దాము.

[అధస్సూచి]

^ పేరా 2 పేరు మార్చబడింది.