కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దేవుని ప్రేమను గ్రహించారా?

మీరు దేవుని ప్రేమను గ్రహించారా?

మీరు దేవుని ప్రేమను గ్రహించారా?

యోబు అనే వ్యక్తి అపరిపూర్ణుడైన మానవుని పరిస్థితి గురించి ఒకసారి ఇలా వర్ణించాడు: “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.” (యోబు 14:​1, 2) యోబు అప్పుడు అనుభవిస్తున్నట్లుగా జీవితం తీవ్రమైన బాధ, దుఃఖాలతో నిండివుంది. అలా మీకెప్పుడైనా అనిపించిందా?

ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనప్పటికీ దేవుని ప్రేమాసానుభూతులపై ఆధారపడిన ఒక బలమైన నిరీక్షణ మనకుంది. మొట్టమొదట, పడిపోయిన పాపపు స్థితినుండి మానవాళిని విడిపించేందుకు మన దయగల పరలోకపు తండ్రి విమోచన క్రయధన బలిని ఏర్పాటు చేశాడు. యోహాను 3:​16, 17 ప్రకారం యేసుక్రీస్తు ఇలా పేర్కొన్నాడు: ‘దేవుడు లోకమును [మానవాళిని] ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని [యేసు] ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.’

అపరిపూర్ణ మానవులమైన మనపై దేవుని దయాపూర్వక వైఖరి గురించి కూడా ఆలోచించండి. అపొస్తలుడైన పౌలు ఇలా ప్రకటించాడు: “యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:​26, 27) దీని గురించి ఆలోచించండి! మనం అపరిపూర్ణ మానవులమే అయినా, మనం మన ప్రేమపూర్వక సృష్టికర్తయైన యెహోవా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగివుండవచ్చు.

దేవునికి మనపై శ్రద్ధ ఉందని, మన శాశ్వత ప్రయోజనార్థం ప్రేమపూర్వక ఏర్పాటు చేశాడని తెలిసికొని మనం భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవచ్చు. (1 పేతురు 5:7; 2 పేతురు 3:​13) అయితే, మన ప్రేమగల దేవుని గురించి ఆయన వాక్యమైన బైబిలును అధ్యయనం చేయడం ద్వారా మరింత ఎక్కువగా నేర్చుకోవడానికి బలమైన కారణం ఉందనడంలో సందేహం లేదు.