సత్క్రియలు చేసే ప్రజలుగా పవిత్రపరచబడ్డారు
సత్క్రియలు చేసే ప్రజలుగా పవిత్రపరచబడ్డారు
“దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.”—2 కొరింథీయులు 7:1.
1. తనను ఆరాధించే వారి నుండి యెహోవా ఏమి కోరుతాడు?
యెహోవా అంగీకరించే ఆరాధనకు సంబంధించి ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు ఆలోచింపజేసే ఈ ప్రశ్నను లేవదీశాడు: “యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?” ఆ తర్వాత ఆయనే ఇలా జవాబిచ్చాడు: “వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.” (కీర్తన 24:3, 4) పరిశుద్ధతకే ప్రతిరూపమైన యెహోవా దృష్టిలో అంగీకారంగా ఉండాలంటే పవిత్రంగానూ పరిశుద్ధంగానూ ఉండాలి. ముందొకసారి, ఇశ్రాయేలు సంఘానికి యెహోవా ఇలా గుర్తు చేశాడు: “నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను.”—లేవీయకాండము 11:44, 45; 19:2.
2. పౌలు, యాకోబులు సత్యారాధనలో పవిత్రత యొక్క ప్రాముఖ్యతను ఎలా నొక్కి చెప్పారు?
2 శతాబ్దాల తర్వాత, అపొస్తలుడైన పౌలు నైతికంగా దిగజారిపోయిన పట్టణమైన కొరింథులోని తన తోటి క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.” (2 కొరింథీయులు 7:1) దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి, ఆయన వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు పొందడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా పరిశుభ్రంగానూ, భౌతికమైన, ఆధ్యాత్మికమైన మాలిన్యానికి, భ్రష్టత్వానికి దూరంగానూ ఉండాలనే విషయాన్ని మరొకసారి నొక్కి చెబుతోంది. అదేవిధంగా, శిష్యుడైన యాకోబు కూడా దేవునికి అంగీకారమైన ఆరాధన గురించి వ్రాసేటప్పుడు ఇలా పేర్కొన్నాడు: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే.”—యాకోబు 1:27.
3. దేవునికి మన ఆరాధన అంగీకారయోగ్యంగా ఉండాలంటే, మనం దేని గురించి గంభీరంగా ఆలోచించాలి?
3 పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కళంకంగా ఉండడం సత్యారాధనలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు కాబట్టి, దేవుని అంగీకారం పొందాలని కోరుకునే వారెవరైనా సరే, వాటిని పాటించే విషయంలో చాలా గంభీరంగా ఆలోచించాలి. ఎందుకంటే పవిత్రత విషయంలో ప్రజలకు నేడు చాలా భిన్నమైన ప్రమాణాలు, తలంపులు ఉన్నాయి. అయితే, యెహోవా దేన్ని పవిత్రమైనదిగా అంగీకారయోగ్యమైనదిగా పరిగణిస్తాడో తెలుసుకొని దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం మనకుంది. ఈ విషయంలో దేవుడు తన ఆరాధకుల నుండి ఏమి కోరుతున్నాడో, వారు పవిత్రంగా తనకు అంగీకారయోగ్యంగా ఉండేందుకు వారికి సహాయం చేయడానికి ఏమి చేశాడో తెలుసుకోవలసిన అవసరం మనకుంది.—కీర్తన 119:9; దానియేలు 12:10.
సత్యారాధనకై పవిత్రపరచబడడం
4. పవిత్రత గురించి బైబిలు తెలిపే భావాన్ని తెలియజేయండి?
4 చాలామంది దృష్టిలో, పవిత్రంగా ఉండడం అంటే కేవలం శుచిగా శుభ్రంగా ఉండడమే. అయితే, బైబిలులో అనేకమైన హీబ్రూ మరియు గ్రీకు పదాలు పవిత్రంగా ఉండడం అనే భావాన్ని సూచించాయి. అవి భౌతిక భావంలోనే కాకుండా అతి తరచుగా నైతిక భావంలో, ఆధ్యాత్మిక భావంలో కూడా పవిత్రతను వర్ణించాయి. అందుకే ఒక బైబిలు ఎన్‌సైక్లోపీడియా ఇలా పేర్కొంటోంది: “‘పవిత్రత’ ‘అపవిత్రత’ అనే పదాలు చాలా అరుదుగా పారిశుద్ధ్యానికి సంబంధించిన విషయాలతో జతచేయబడతాయి, కానీ అవి ప్రధానంగా మతసంబంధమైన తలంపులే. ఈ నిర్వచనం ప్రకారం ‘పవిత్రత’ మన జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది.”
5. మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల జీవితాల్లో పవిత్రతను ఎంత మేరకు క్రమపరచింది?
5 వాస్తవానికి, మోషే ధర్మశాస్త్రంలో ఏది పవిత్రమైనది, ఏది అంగీకారయోగ్యమైనది ఏవి కావు అన్నదాన్ని నిర్దేశిస్తూ ఇశ్రాయేలీయుల జీవితంలోని ప్రతి అంశంపైన నియమ నిబంధనలున్నాయి. ఉదాహరణకు లేవీయకాండము 11 నుండి 15 అధ్యాయాల్లో పవిత్రతకు లేదా అపవిత్రతకు సంబంధించి వివరంగా తెలియజేయబడిన సూచనలు మనకు కనబడతాయి. కొన్ని జంతువులు అపవిత్రమైనవి, ఇశ్రాయేలీయులు వాటిని తినకూడదు. ప్రసవించిన స్త్రీ కొంతకాలం వరకు అపవిత్రురాలిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా కొన్ని చర్మవ్యాధులు ప్రత్యేకించి కుష్టు వ్యాధి, స్త్రీ పురుషుల మర్మాంగాల నుండి వెలువడే స్రావాలు ఒక వ్యక్తిని అపవిత్రం చేస్తాయి. అపవిత్రమైన పరిస్థితుల్లో ఏమి చేయాలో కూడా ధర్మశాస్త్రం నిర్దిష్టంగా తెలియజేసింది. ఉదాహరణకు, సంఖ్యాకాండము 5:2 లో మనమిలా చదువుతాం: “ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.”
6. పవిత్రత విషయంలో న్యాయసూత్రాలు ఏ ఉద్దేశంతో ఇవ్వబడ్డాయి?
6 వీటిలోనూ యెహోవా ఇచ్చిన ఇతర న్యాయసూత్రాల్లోనూ, ఎంతోకాలం తర్వాత వైద్యులు గుర్తించిన వైద్యపరమైన, శరీర శాస్త్రపరమైన భావాలున్నాయనడంలో సందేహం లేదు, ప్రజలు ఆ న్యాయసూత్రాలను పాటించినప్పుడు ప్రయోజనం పొందారు. అయితే ఈ న్యాయసూత్రాలు కేవలం ఆరోగ్య సూత్రాలుగానో వైద్యపరమైన సలహాలుగానో ఉపయోగపడడం కోసం మాత్రమే ఇవ్వబడలేదు. అవి సత్యారాధనలో ఒక భాగంగా ఇవ్వబడ్డాయి. వాస్తవమేమిటంటే ప్రజల దైనందిన జీవితంలోని తినడం, వైవాహిక సంబంధాలు, ప్రసవించడం, ఇంకా అలాంటివి ఎన్నో ఆ న్యాయసూత్రాల్లో ఉన్నాయి. వారు తమ జీవితాలను సంపూర్ణంగా యెహోవాకు సమర్పించుకున్నారు కాబట్టి, వారి జీవితంలోని అన్ని విషయాల్లోనూ ఏది సరైనదో ఏది సరైనది కాదో నిర్ణయించే హక్కు వారి దేవుడిగా యెహోవాకు మాత్రమే ఉందన్న విషయాన్ని అవి నొక్కి తెలియజేశాయి.—ద్వితీయోపదేశకాండము 7:6; కీర్తన 135:4.
7. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఇశ్రాయేలు జనాంగం ఏ ఆశీర్వాదాన్ని పొందుతుంది?
7 ధర్మశాస్త్ర నిబంధన ఇశ్రాయేలీయులను వారి చుట్టుప్రక్కలనున్న దేశాల అపవిత్రమైన ఆచారాల నుండి కూడా కాపాడింది. యెహోవా దృష్టిలో పవిత్రంగా ఉండడానికి అవసరమైన వాటన్నింటినీ చేయడంతోపాటు ధర్మశాస్త్రాన్ని కూడా నమ్మకంగా పాటించడం ద్వారా ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించడానికీ ఆయన ఆశీర్వాదాలు పొందడానికీ యోగ్యులవుతారు. దీనికి సంబంధించి యెహోవా ఆ ప్రజానీకానికి ఇలా చెప్పాడు: ‘మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.’—నిర్గమకాండము 19:5, 6; ద్వితీయోపదేశకాండము 26:19.
8. పవిత్రత గురించి ధర్మశాస్త్రంలో చెప్పబడిన దానికి నేడు క్రైస్తవులు ఎందుకు శ్రద్ధ నివ్వాలి?
కొలొస్సయులు 2:17; హెబ్రీయులు 10:1) “నేను మార్పులేనివాడను” అని చెబుతున్న యెహోవా దేవుడు, ఆ కాలంలో పవిత్రంగా నిష్కళంకంగా ఉండడాన్ని సత్యారాధనలో ఒక ముఖ్యాంశంగా దృష్టించాడు కాబట్టి, నేడు మనం ఆయన ఆమోదాన్నీ ఆశీర్వాదాన్నీ పొందాలనుకుంటే, మనం కూడా భౌతికంగా నైతికంగా ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండాలన్న విషయాన్ని చాలా గంభీరంగా తీసుకోవాలి.—మలాకీ 3:6; రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10:11, 31.
8 పవిత్రంగా, పరిశుద్ధంగా తనకు అంగీకారయోగ్యంగా ఎలా ఉండాలో ఇశ్రాయేలీయులకు ఉపదేశించడానికి యెహోవా ఆ వివరాలను ధర్మశాస్త్రంలో కూర్చాడు కాబట్టి, ఆయన కోరిన విధంగా ఉండడానికి ఆ వివరాలు ఎలా సహాయపడతాయో తెలిసికోవడానికి నేటి క్రైస్తవులు వాటిని జాగ్రత్తగా పరిశీలించడం సముచితం కాదా? క్రైస్తవులు ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికీ, పౌలు తెలియజేసినట్లుగా ధర్మశాస్త్రంలోని విషయాలన్నీ “రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది” అన్న విషయాన్ని వారు తప్పకుండా మనసులో ఉంచుకోవాలి. (భౌతిక పరిశుభ్రత మనకు మెప్పును తెస్తుంది
9, 10. (ఎ) ఒక క్రైస్తవునికి భౌతిక పరిశుభ్రత ఎందుకు ప్రాముఖ్యమైనది? (బి) యెహోవాసాక్షులు జరుపుకునే సమావేశాల గురించి తరచుగా ఏమని వ్యాఖ్యానించబడింది?
9 భౌతిక పరిశుభ్రత ఇప్పటికీ సత్యారాధనలో ఒక ప్రాముఖ్యమైన భాగమా? భౌతిక పరిశుభ్రత ఒక్కటే ఒక వ్యక్తిని దేవుని సత్యారాధకుడిగా చేయకపోయినా, ఒక సత్యారాధకుడు తన పరిస్థితులు అనుకూలించినంత మేరకు భౌతికంగా పరిశుభ్రంగా ఉండడం సముచితమైనదనడంలో సందేహం లేదు. ప్రత్యేకించి, అనేకమంది తమపై తమ వస్త్రధారణపై లేదా తమ పరిసరాల పరిశుభ్రతపై అతి తక్కువ శ్రద్ధ కనపరిచే ఈ రోజుల్లో, పరిశుభ్రంగా ఉండేవారిని లేదా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేవారిని తరచుగా తమ ఇరుగుపొరుగువారు గమనిస్తారు. అది, పౌలు కొరింథులోని క్రైస్తవులకు చెప్పినట్టుగానే మంచి ఫలితాలకు దారి తీస్తుంది: “మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక . . . అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.”—2 కొరింథీయులు 6:3, 8-10.
10 యెహోవాసాక్షులు ప్రత్యేకించి వారి పెద్ద పెద్ద సమావేశాల్లో కనిపించే పరిశుభ్రత, క్రమపద్ధతి, మర్యాదపూర్వక ప్రవర్తన, అలవాట్లనుబట్టి ప్రజాధికారులచేత తరచుగా ప్రశంసించబడ్డారు. ఉదాహరణకు, ఇటలీలోని సవోనా ప్రాంతంలో జరిగిన ఒక సమావేశం గురించి లా స్తాంపా అనబడే దినపత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “సమావేశం జరిగే ఆ ప్రాంతం గుండా నడిచి వెళ్ళేటప్పుడు, ఆ ప్రాంతాన్ని ఉపయోగించుకునే ప్రజల పరిశుభ్రత, క్రమబద్ధత స్పష్టంగా కనబడుతుంది.” బ్రెజిల్‌లోని సావొ పౌలోలోని ఒక స్టేడియంలో సాక్షుల సమావేశం జరిగిన తర్వాత, ఆ స్టేడియంను శుభ్రం చేసే విభాగపు సూపర్‌వైజర్‌తో ఆ స్టేడియం అధికారి ఒకాయన ఇలా అన్నారు: “ఇప్పటి నుండి ఈ స్టేడియంను యెహోవాసాక్షులు శుభ్రం చేసిన విధంగా శుభ్రం చేయాలి.” అదే స్టేడియంకు చెందిన మరొక అధికారి ఇలా అన్నారు: “స్టేడియం అద్దెకు కావాలని యెహోవాసాక్షులు అడిగినప్పుడు మేము కేవలం తేదీలు కుదురుతాయా లేదా అని మాత్రమే చూస్తాం తప్ప, వేరే దేని గురించీ ఆలోచించము.”
11, 12. (ఎ) వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో మనం ఏ బైబిలు సూత్రాన్ని మనసులో ఉంచుకోవాలి? (బి) మన అలవాట్ల గురించి, మన జీవనశైలి గురించి ఎలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు?
11 మన ఆరాధనా స్థలాన్ని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచినట్లైతే అది మనం ఆరాధించే దేవుడు స్తుతించబడడానికి ఒక మూలం కాగలదు, అలాగే ఈ లక్షణాలను మన వ్యక్తిగత జీవితంలో చూపించడం కూడా అంతే ప్రాముఖ్యమైనదనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే, మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనకిష్టమొచ్చినట్లు ప్రవర్తించే హక్కు మనకుంది కాబట్టి పరవాలేదులే అని మనం భావిస్తుండవచ్చు. వస్త్రధారణ, కేశాలంకరణ విషయానికి వస్తే మట్టుకు మనకు సౌకర్యంగా, ఆకర్షణీయంగా ఉండేవాటిని ఎంపిక చేసికొనే స్వాతంత్ర్యం మనకుందనడంలో సందేహం లేదు! అయితే చాలా మేరకు ఈ స్వాతంత్ర్యం అంతా కూడా కేవలం పరిమితమైనదే. నిర్దిష్టమైన ఆహారపదార్థాలను తినే విషయంలో ఒకరి ఎంపిక గురించి చర్చించేటప్పుడు పౌలు తన తోటి క్రైస్తవులను ఇలా హెచ్చరించడాన్ని గుర్తు చేసుకోండి: “మీకు కలిగియున్న యీ స్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.” తర్వాత ఆయన ఒక విలువైన సూత్రాన్ని పేర్కొన్నాడు: ‘అన్ని విషయములయందు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.’ (1 కొరింథీయులు 8:9; 10:23) పరిశుభ్రత విషయంలో పౌలు సలహా మనకు ఎలా వర్తిస్తుంది?
12 దేవుని సేవకుడు తన జీవితవిధానంలో పరిశుభ్రతను క్రమబద్ధతను కలిగి ఉండాలని ప్రజలు అనుకోవడం 2 పేతురు 3:13) అదేవిధంగా, మనం కనిపించేతీరు కూడా అది తీరిక సమయాల్లోనైనా సరే, పరిచర్య చేస్తున్నప్పుడైనా సరే మనం ప్రకటించే సందేశం యొక్క ప్రభావాన్ని పెంచగలదు లేదా తగ్గించగలదు. ఉదాహరణకు, మెక్సికోలోని ఒక పత్రికా విలేఖరి చేసిన ఈ వ్యాఖ్యానాన్ని గమనించండి: “యెహోవాసాక్షుల్లోని అధిక భాగం నిజానికి యువతీయువకులే, వారిలోని విశిష్టత ఏమిటంటే వారి కేశాలంకరణ, పరిశుభ్రత, చక్కని వస్త్రధారణే.” మన మధ్య అలాంటి యువతీయువకులు ఉండడం ఎంత ఆనందదాయకమో కదా!
సబబే. కాబట్టి మనం మన ఇల్లు, ఇంటి పరిసరాలు కనబడే తీరు దేవుని వాక్య సేవకులమని మనం చెప్పుకునే పేరును కించపరిచేటట్లు ఉండకుండా జాగ్రత్తపడాలి. మన ఇల్లు, మన గురించీ మన విశ్వాసాల గురించీ ఎలాంటి సాక్ష్యాన్ని లేదా రుజువును ఇస్తోంది? మనం ఇతరులకు దృఢంగా తెలియజేసే అంటే పరిశుభ్రతా, క్రమబద్ధతా ఉన్న నీతియుక్తమైన ఒక నూతన లోకంలో మనం జీవించాలని నిజంగా కోరుకుంటున్నామని అది చూపిస్తోందా? (13. మన దైనందిన జీవితంలోని అన్ని విషయాల్లోనూ పరిశుభ్రత క్రమబద్ధత ఉండేలా చూసుకోవడానికి మనం ఏమి చేయగలం?
13 మనము, మన ఇల్లు, మన వస్తువులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. అందుకు కావలసింది సంక్లిష్టమైన, ఖరీదైన పనిముట్లో పరికరాలో కాదుగానీ మంచి ప్రణాళిక, నిరంతర కృషి అవసరం. మన ఒంటిని, బట్టలను, ఇంటిని, కారును, తదితరమైనవాటిని శుభ్రం చేసుకోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. అంతేగానీ పరిచర్యలో పాల్గొనడం, కూటాలకు హాజరవ్వడం, వ్యక్తిగత అధ్యయనం చేయడం వంటి వాటితోపాటు దైనందిన జీవితంలో నెరవేర్చాల్సిన ఇతర బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటున్నాం కాబట్టి, దేవుని దృష్టిలోనూ మనుష్యుల దృష్టిలోనూ పరిశుభ్రంగా అంగీకారయోగ్యంగా ఉండాల్సిన అవసరం లేదని ఎంత మాత్రమూ అనుకోకూడదు. “ప్రతిదానికి సమయము కలదు” అన్న సుపరిచితమైన సూత్రం, మన జీవితంలోని ఈ భాగానికి కూడా వర్తిస్తుంది.—ప్రసంగి 3:1.
నిష్కళంకమైన హృదయం
14. నైతిక, ఆధ్యాత్మిక పవిత్రతలు భౌతిక పరిశుభ్రతకంటే కూడా చాలా ప్రాముఖ్యమైనవని ఎందుకు చెప్పవచ్చు?
14 భౌతిక పరిశుభ్రతకు శ్రద్ధనివ్వడం అత్యంత ప్రాముఖ్యమే. అయితే నైతిక, ఆధ్యాత్మిక పవిత్రతల గురించి శ్రద్ధ తీసుకోవడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. ఇశ్రాయేలు జనాంగం భౌతికంగా అపరిశుభ్రంగా ఉన్నందువల్ల యెహోవా చేత తిరస్కరించబడలేదు గానీ, వారు నైతికంగా, ఆధ్యాత్మికంగా అపవిత్రులవ్వడం వల్లనేనన్న విషయాన్ని గుర్తుతెచ్చుకోవడం ద్వారా మనం ఈ ముగింపుకు వస్తాం. వారు ‘పాపిష్ఠి జనము, దోషభరితమైన ప్రజలు’ యెషయా 1:4, 11-17.
అవడం వల్ల వారి బలులు, అమావాస్య విశ్రాంతి దినముల ఆచరణ, చివరికి వారి ప్రార్థనలు కూడా తనకు భారంగా మారాయని యెహోవా యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. దేవుని అనుగ్రహం మళ్ళీ పొందాలంటే వారేమి చేయాలి? యెహోవా ఇలా అన్నాడు: “మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి; కీడుచేయుట మానుడి.”—15, 16. ఒక మనిషిని ఏది మలినపరుస్తుందని యేసు చెప్పాడు, ఆయన మాటల నుండి మనం ఏ విధంగా ప్రయోజనం పొందగలం?
15 నైతిక, ఆధ్యాత్మిక పవిత్రతల ప్రాధాన్యత గురించి మరింత అర్థం చేసుకోవడానికి, యేసు శిష్యులు భోజనానికి ముందు తమ చేతులు కడుక్కోలేదు గనుక వారు అపవిత్రులని నొక్కిచెప్పిన పరిసయ్యులు శాస్త్రులతో యేసు ఏమన్నాడో గమనించండి. ‘నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచును’ అని అనడం ద్వారా ఆయన వారిని సరిదిద్దాడు. తర్వాత ఆయన ఇంకా ఇలా వివరించాడు: ‘నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధసాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదు.’—మత్తయి 15:11, 18-20.
16 యేసు చెప్పిన ఈ మాటల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? దుష్టమైన, అనైతికమైన, అపవిత్రమైన కార్యాలు నిజానికి మనసులో మెదిలే దుష్టమైన, అనైతికమైన, అపవిత్రమైన ఆలోచనలతోనే మొదలవుతాయని యేసు సూచించాడు. శిష్యుడైన యాకోబు పేర్కొన్న ప్రకారం, “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.” (యాకోబు 1:14, 15) కాబట్టి, యేసు పేర్కొన్న గంభీరమైన పాపాలను మనం చేయకుండా ఉండాలంటే, అలాంటి ఆలోచనలు ఏవైనా గనుక మన మనసులో మెదులుతూ ఉంటే వాటిని కూకటివేళ్ళతో సహా పెరికివేయాలి. అంటే మనం ఏమి చదువుతున్నాము, ఏమి చూస్తున్నాము, ఏమి వింటున్నామన్న వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్ స్వాతంత్ర్యం, కళా స్వేచ్ఛల పేరుతో నేడు వినోద, వ్యాపారప్రకటనా పరిశ్రమలు దిగజారిన శరీర కోరికలను తృప్తిపరచే శబ్దాలను చిత్రాలను కోకొల్లలుగా సృష్టిస్తున్నాయి. అలాంటి ఆలోచనలు మన హృదయంలో స్థానం ఏర్పరచుకోవడాన్ని అనుమతించకూడదని మనం దృఢంగా నిశ్చయించుకోవాలి. కీలకమైన విషయమేమిటంటే, దేవుణ్ణి సంతోషపరచేందుకు, ఆయనకు అంగీకారయోగ్యంగా ఉండేందుకు, పవిత్రమైన నిష్కళంకమైన హృదయాన్ని కాపాడుకోవడానికి మనం అన్నివేళలా జాగ్రత్తగా ఉండాలి.—సామెతలు 4:23.
సత్‌క్రియలు చేయడానికి పవిత్రపరచబడడం
17. యెహోవా తన ప్రజలను పవిత్రమైన స్థితికి ఎందుకు తీసుకువచ్చాడు?
17 యెహోవా సహాయంతో మనం ఆయన ఎదుట పవిత్రమైన స్థానాన్ని కలిగివుండగలగడం నిజంగా ఒక ఆశీర్వాదమేకాక అదొక రక్షణ కూడా. (2 కొరింథీయులు 6:14-18) అయినప్పటికీ, యెహోవా ప్రత్యేకమైన ఒక సంకల్పం కోసం తన ప్రజలను పవిత్రమైన స్థితిలోకి తీసుకువచ్చాడన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాము. క్రీస్తు యేసు “సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను” అని పౌలు తీతుకు చెప్పాడు. (తీతు 2:14) పవిత్రపరచబడిన ఒక జనాంగంగా, మనం ఏ క్రియలు చేయడానికి అత్యాసక్తితో ఉండాలి?
18. సత్క్రియలు చేయడానికి మనం అత్యాసక్తితో ఉన్నామని ఎలా చూపించగలం?
18 అన్నిటికంటే ముఖ్యంగా, దేవుని రాజ్య సువార్తను బహిరంగంగా ప్రకటించడానికి మనం బాగా కృషి చేయాలి. (మత్తయి 24:14) అలా చేయడం ద్వారా, ఎటువంటి కల్మషము లేని భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణను సర్వత్రా ఉన్న ప్రజలకు తెలియజేయగలుగుతాం. (2 పేతురు 3:13) మన సత్క్రియల్లో, దేవుని ఆత్మఫలాన్ని మన దైనందిన జీవితంలో వ్యక్తం చేయడం కూడా ఇమిడి ఉంది, ఆ విధంగా మనం మన పరలోకపు తండ్రిని మహిమపరుస్తాం. (గలతీయులు 5:22, 23; 1 పేతురు 2:12) ప్రకృతి వైపరీత్యాల వల్ల గానీ మానవ దుర్ఘటనల వల్ల గానీ నష్టపోయిన సత్యంలో లేని వారిని కూడా మనం మరచిపోము. పౌలు ఇచ్చిన ఈ సలహాను మనం మనసులో పెట్టుకుంటాం: “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:10) పవిత్రమైన హృదయంతో స్వచ్ఛమైన ఉద్దేశంతో చేయబడే అటువంటి సేవలన్నీ దేవుణ్ణి నిజంగా సంతోషపరుస్తాయి.—1 తిమోతి 1:5.
19. భౌతిక పరిశుభ్రతనూ, నైతిక, ఆధ్యాత్మిక పవిత్రతల ఉన్నత ప్రమాణాన్నీ కాపాడుకున్నట్లైతే మనం ఏ ఆశీర్వాదాల కోసం నిరీక్షించవచ్చు?
19 సర్వోన్నతుని సేవకులుగా మనం, పౌలు చెప్పిన ఈ మాటలను పాటిద్దాం: “సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.” (రోమీయులు 12:1) యెహోవా చేత పవిత్రపరచబడే ఆధిక్యతను విలువైనదిగా దృష్టించడంలోనూ, ఉన్నతమైన స్థాయిలో భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక పవిత్రతలతో కొనసాగడంలోనూ మన శాయశక్తులా కృషి చేద్దాం. అలా చేయడం, ఇప్పుడు మనకు ఆత్మ గౌరవాన్నీ సంతృప్తినీ ఇవ్వడం మాత్రమే కాక, దేవుడు “సమస్తమును నూతనమైనవిగా” చేసినప్పుడు, “మొదటి సంగతులు” అంటే ప్రస్తుత దుష్ట, మలిన విధానం గతించిపోవడాన్ని చూసే అవకాశాన్ని కూడా ఇస్తుంది.—ప్రకటన 21:4, 5.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
• ఇశ్రాయేలీయులకు పవిత్రత విషయమై ఎక్కువ న్యాయసూత్రాలు ఎందుకు ఇవ్వబడ్డాయి?
• మనం ప్రకటించే సందేశం యొక్క ప్రభావాన్ని భౌతిక పరిశుభ్రత ఎలా పెంచుతుంది?
• నైతిక, ఆధ్యాత్మిక పవిత్రతలు భౌతిక పరిశుభ్రతకంటే కూడా ఎందుకు అతి ప్రాముఖ్యమైనవి?
• మనం “సత్క్రియలయందాసక్తిగల” ప్రజలమని ఎలా చూపించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[21వ పేజీలోని చిత్రాలు]
భౌతిక పరిశుభ్రత మనం ప్రకటించే సందేశం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది
[22వ పేజీలోని చిత్రం]
దురాలోచనలు దుష్ట చర్యలకు దారి తీస్తాయని యేసు హెచ్చరించాడు
[23వ పేజీలోని చిత్రాలు]
పవిత్రపరచబడిన ఒక ప్రజానీకంగా యెహోవాసాక్షులు సత్క్రియలు చేయడానికి అత్యాసక్తితో ఉన్నారు