కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టాజింట్‌లో హీబ్రూ నాలుగక్షరాలు

సెప్టాజింట్‌లో హీబ్రూ నాలుగక్షరాలు

సెప్టాజింట్‌లో హీబ్రూ నాలుగక్షరాలు

దేవుని పేరు యెహోవా అని టెట్రగ్రామటన్‌ చేత అంటే హీబ్రూలోని నాలుగక్షరాలైన יהוה (YHWH) చేత సూచించబడింది. సెప్టాజింట్‌ కాపీలలో టెట్రగ్రామటన్‌ లేదని చాలాకాలం వరకు విశ్వసించబడింది. అందుకే, క్రైస్తవ గ్రీకు లేఖనాల రచయితలు హీబ్రూ లేఖనాలను ఉల్లేఖించేటప్పుడు, దేవుని పేరు ఉపయోగించేవారు కాదన్న వాదన జరిగింది.

వరుసగా గత వంద లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలలో కనుగొనబడిన అంశాలు, దేవుని పేరు సెప్టాజింట్‌లో ఉందని తెలియజేశాయి. ఒక మూలం ఇలా చెబుతోంది: “గ్రీకుల కాలంలోని యూదులకు దేవుని పవిత్ర నామమును జాగ్రత్తగా భద్రపరచాలని గొప్ప కోరికగా ఉండేది, అందుకే వారు హీబ్రూ బైబిలును గ్రీకు భాషలోకి అనువదించేటప్పుడు గ్రీకు మూలపాఠం మధ్యలోకి టెట్రగ్రామటన్‌ను అంటే హీబ్రూ నాలుగక్షరాలను ఉన్నదున్నట్లు కాపీ చేశారు.”

ఎడమ వైపున చూపించబడిన ప్రాచీనకాలంలోని రెల్లు కాగితపు అవశేషం, ఉనికిలో ఉన్నటువంటి అనేక ఉదాహరణల్లో కేవలం ఒకటి మాత్రమే. ఈజిప్టులోని ఆక్సిరింఖస్‌లో కనుగొనబడిన ఈ అవశేషానికి గుర్తింపు నంబర్‌గా 3522 ఇవ్వబడింది, ఇది సా.శ. మొదటి శతాబ్దానికి చెందినది. * ఇది 2.5 × 4 అంగుళాలుంటుంది, యోబు 42:​11, 12 వచనాల్లోని భాగం దీంట్లో ఉంది. ప్రాచీన హీబ్రూ అక్షరాల్లో టెట్రగ్రామటన్‌ కనిపిస్తుంది, చిత్రంలో దాని చుట్టూ వలయం గీయబడింది. *

మరి అలాగైతే, క్రైస్తవ గ్రీకు లేఖనాల తొలి కాపీల్లో దేవుని పేరు కనిపించిందా? జార్జ్‌ హోవర్డ్‌ అనే విద్వాంసుడు ఇలా చెబుతున్నాడు: “తొలి చర్చి లేఖనాలైన గ్రీకు బైబిలు [సెప్టాజింట్‌] కాపీల్లో టెట్రగ్రామటన్‌ వ్రాయబడి ఉంది కాబట్టి, క్రొత్త నిబంధన రచయితలు లేఖనాల నుండి ఉల్లేఖించేటప్పుడు టెట్రగ్రామటన్‌ను బైబిలు మూలపాఠంలో అలాగే ఉంచారని విశ్వసించడం సహేతుకమైనదే.” దాని తర్వాత కొద్దికాలానికే నకలు వ్రాసేవారు దేవుని పేరు స్థానంలో కిరియోస్‌ (ప్రభువు), థియోస్‌ (దేవుడు) అనే ప్రత్యామ్నాయాలను పెట్టారనిపిస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఆక్సిరింఖస్‌లో కనుగొనబడిన అవశేషం గురించిన మరింత సమాచారం కోసం కావలికోట (ఆంగ్లం), ఫిబ్రవరి 15, 1992, 26-8 పేజీలు చూడండి.

^ పేరా 4 ప్రాచీన గ్రీకు వర్షన్‌లలో దేవుని పేరున్న ఇతర ఉదాహరణలకు, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌​—⁠విత్‌ రిఫరెన్సెస్‌లోని అపెండిక్స్‌ 1 సి చూడండి.

[30వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of the Egypt Exploration Society