2003లో అంతర్జాతీయ సమావేశాలు
2003 లో అంతర్జాతీయ సమావేశాలు
అమెరికాలోని, న్యూ జెర్సీలోని జెర్సీ నగరంలో, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా సభ్యుల వార్షిక కూటం, 2001, అక్టోబరు 6, శనివారంనాడు జరిగింది. ఆ కూటం తర్వాత, ఆ సభ్యులూ వారి అతిథులూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆనందించారు. ఆ మరుసటి రోజు కెనడాలోను అలాగే అమెరికాలోను నాలుగు నగరాల్లో జరిగిన అనుబంధ కూటాల్లో యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యులు తమ చివరి ప్రసంగం తర్వాత ఈ క్రింది ప్రకటనను చేశారు:
“మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, దేవుని ప్రజలందరూ సమాజంగా కూడుకోవడాన్ని మానకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం దగ్గరపడడం మనం చూస్తుండగా, ఒకరి నొకరం ప్రోత్సహించుకోవడంతో పాటు, ఇలా కూడుకోవడం కూడా ఇంకా ఎక్కువగా చేయాలని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు. (హెబ్రీయులు 10:24, 25) లేఖనాల్లో ఉన్న ఈ ఆజ్ఞకు పొందికగా, తర్వాతి సంవత్సరం [2002] ప్రపంచంలోని అన్ని దేశాల్లోను జిల్లా సమావేశాలు జరపాలని మేము ఎదురు చూస్తున్నాము. తర్వాత, 2003వ సంవత్సరంలో, యెహోవా చిత్తమైతే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడం సాధ్యం కావచ్చు. ప్రపంచ సంఘటనలు ఎలా మలుపు తిరుగుతున్నాయో గ్రహిస్తూ జాగరూకతతో ఉంటూ మెలకువగా ఉండవలసిన సమయమిదే.”
ప్రస్తుత విధానం దాని అంతాన్ని సమీపిస్తుండగా, అనిశ్చయతా ఒత్తిళ్ళూ అంతకంతకు అధికమవుతున్నప్పటికీ దేవుని ప్రజల కార్యకలాపాలు ముందుకు సాగవలసిందే. ‘దేవుడు తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక, మీరు ఆయనకు భయపడి ఆయనను మహిమపరచుడి’ అని ప్రతి దేశానికీ ప్రతి జాతికీ ప్రతి భాషకూ ప్రతి జనాంగానికీ చెందినవారిని ఆహ్వానిస్తూ బైబిలులోని హెచ్చరికా సందేశంతో సహా రాజ్య సువార్తను వారికి తప్పక ప్రకటించాలి. (ప్రకటన 14:6, 7) కాబట్టి, మన పరలోక తండ్రి చిత్తానికీ ఇష్టానికీ అనుగుణంగా 2003వ సంవత్సరంలో, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడానికి ప్లాన్లు వేయబడ్డాయి.
ఉత్తర అమెరికాలోని కొన్ని నగరాల్లోను కొన్నాళ్ళ తర్వాత యూరప్లోను జరగనున్న అలాంటి సమావేశాల షెడ్యూల్ వేయబడడంతో వాటి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి, ఆ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. ప్రతినిధుల సంఘాలు ఆసియాలోని కొన్ని నగరాలకు వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు 2003 లో తర్వాత చేయడం జరుగుతుంది; సంవత్సరాంతంలో, మరి కొన్ని గ్రూపులు ఆఫ్రికాకూ దక్షిణ అమెరికాకూ పసిఫిక్ ప్రాంతానికీ వెళ్తాయి. నిర్దిష్ట సమావేశ స్థలాలకు పరిమిత సంఖ్యలో ప్రతినిధులను పంపమని కొన్ని బ్రాంచీలు కోరబడతాయి. కాబట్టి, ఈ సమావేశానికి హాజరవ్వమని అందరినీ ఆహ్వానించడం సాధ్యం కాదు. అయినప్పటికీ ఒక్కో సమావేశ స్థలంలో, వివిధ దేశాల ప్రతినిధులు పరిమిత సంఖ్యలో ఉంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఈ సమావేశాలకు సంబంధించిన సమాచారం, యెహోవాసాక్షుల సంఘాలకు త్వరలోనే అందుతుంది. ఖచ్చితమైన తేదీలు, ఆహ్వానితులైన ప్రతినిధులు హాజరు కాగల నిర్దిష్ట నగరాల గురించిన సమాచారం ఆయా బ్రాంచీల ద్వారా అందజేయబడుతుంది. కనుక, ఈ విషయాన్ని గురించి మీరు ఇప్పట్లో ఉత్తరం వ్రాయవద్దనీ వాకబు చేయవద్దనీ కోరుతున్నాము.
సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుని, మంచి మాదిరిగా ఉంటూ, స్థానిక సహోదరులకు సహోదర అనురాగాన్ని చూపించే సాక్షులు మాత్రమే చివరికి ప్రతినిధులుగా ఎంపిక చేయబడతారు. సందర్శకులను ప్రేమపూర్వకంగా ఆహ్వానించడానికీ వారికి హృదయపూర్వక ఆతిథ్యాన్నివ్వడానికీ చక్కని అవకాశాలు స్థానిక సహోదరులకు ఉంటాయి. (హెబ్రీయులు 13:1-3) తత్ఫలితంగా, ‘ఒకరి విశ్వాసముచేత ఒకరు ఆదరణ [“ప్రోత్సాహం,” NW]’ పొందుతారు. (రోమీయులు 1:11, 12) ఫలాని దేశానికి లేదా దేశాలకు ప్రతినిధులను పంపమని ఆహ్వానించబడిన బ్రాంచీల ద్వారా ఈ ఏర్పాట్లను గురించిన మరిన్ని వివరాలు అందజేయబడతాయి.
ఎప్పుడూ జరుగుతున్నట్లే 2003వ సంవత్సరంలో కూడా మూడు రోజుల జిల్లా సమావేశాలు దాదాపు అన్ని దేశాల్లోను ఏర్పాటు చేయబడతాయి. సమావేశమవ్వడం ద్వారా, ‘వినడానికీ నేర్చుకోవడానికీ హెచ్చరిక పొందడానికీ [“ప్రోత్సాహం పొందడానికీ,” NW]’ అందరికీ అవకాశం లభిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 31:12; 1 కొరింథీయులు 14:31) ఆ విధంగా, “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసి”కొనే అవకాశం దేవుని ప్రజలందరికీ లభిస్తుంది. (కీర్తన 34:8) అంతర్జాతీయ సమావేశాలన్నింటికీ అలాగే అనేక జిల్లా సమావేశాలకూ మిషనరీలు హాజరవుతారు, వాళ్ళలో కొందరికి కార్యక్రమంలో భాగముంటుంది.
ఈ సంవత్సరం, మనం “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” అనే జిల్లా సమావేశాల నుండి ప్రయోజనం పొందుతాము. అవి మనం ఇంకా బాగా సాక్ష్యమివ్వడానికి మనలను పురికొల్పుతాయి. మనం ఈ సమావేశాన్ని ఆనందిస్తుండగా, వచ్చే సంవత్సరం కోసం యెహోవా ఏర్పాటు చేసిన దాని గురించిన మన నిరీక్షణ తప్పకుండా పెరుగుతుంది. అది, క్లిష్టమైన ప్రాముఖ్యమైన ఈ కాలాల దృష్ట్యా, మనం ‘జాగరూకులమై ఉండడానికీ మేల్కొని ఉండడానికీ సిద్ధముగా ఉండడానికీ’ మనకు సహాయపడుతుంది.—మత్తయి 24:42-44, పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము.