మీ సహనానికి భక్తిని అమర్చుకోండి
మీ సహనానికి భక్తిని అమర్చుకోండి
‘మీ విశ్వాసమునందు సహనమును, సహనమునందు భక్తిని అమర్చుకొనుడి.’—2 పేతురు 1:5-7.
1, 2. (ఎ) పిల్లల విషయంలో ఎలాంటి పెరుగుదల ఆశించబడుతుంది? (బి) ఆధ్యాత్మిక పెరుగుదల ఎంత ప్రాముఖ్యం?
పిల్లలు పెరిగి పెద్దవారవ్వడం ఎంతో ఆవశ్యకం, కానీ శారీరక పెరుగుదల మాత్రమే వాంఛనీయం కాదు. వారు మానసికంగా, భావోద్వేగపరంగా కూడా ఎదగాలని ఆశిస్తాము. కొంతకాలానికి పిల్లలు తమ బాల్య చేష్టలను మానుకుని పూర్తిగా ఎదిగిన పురుషునిగా లేదా స్త్రీగా తయారవుతారు. “నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని” అని వ్రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు ఆ విషయాన్నే సూచించాడు.—1 కొరింథీయులు 13:11.
2 ఆధ్యాత్మిక పెరుగుదల గురించి పౌలు మాటలు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తున్నాయి. క్రైస్తవులు ఆధ్యాత్మిక శైశవ దశ నుండి ‘బుద్ధి విషయమై’ ఎదగాల్సిన అవసరం ఉంది. (1 కొరింథీయులు 14:20) వారు తీవ్రంగా కృషి చేస్తూ ‘క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారయ్యేందుకు’ ప్రయత్నించాలి. అప్పుడు వారు ‘కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడుతూ పసిపిల్లల’ వలె ఉండరు.—ఎఫెసీయులు 4:11-14.
3, 4. (ఎ) ఆధ్యాత్మికంగా పూర్తిగా ఎదిగినవారమయ్యేందుకు మనం ఏమి చేయాలి? (బి) మనం దేవునికి ప్రీతికరమైన ఏ లక్షణాలను ప్రదర్శించాలి, అవి ఎంత ప్రాముఖ్యమైనవి?
3 మనం ఆధ్యాత్మికంగా పూర్తిగా ఎదిగినవారం ఎలా కావచ్చు? సాధారణ పరిస్థితుల్లో శారీరక పెరుగుదల దాదాపు దానంతటదే జరుగుతున్నప్పటికీ, ఆధ్యాత్మిక పెరుగుదల కోసం మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అది, దేవుని వాక్యపు అనుభవజ్ఞానమును సంపాదిస్తూ మనం నేర్చుకుంటున్న దానికి అనుగుణంగా చర్య తీసుకోవడంతో ప్రారంభమవుతుంది. (హెబ్రీయులు 5:14; 2 పేతురు 1:2, 3) అప్పుడది, దేవునికి ప్రీతికరమైన లక్షణాలను ప్రదర్శించడానికి మనకు సహాయం చేస్తుంది. శారీరక పెరుగుదల, తత్సంబంధిత అంశాల విషయంలోలాగే, దేవునికి ప్రీతికరమైన వివిధ లక్షణాలను సాధారణంగా ఒకే సమయంలో వృద్ధి చేసుకోవడం జరుగుతుంది. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5-7.
4 పేతురు పేర్కొన్న ప్రతీ లక్షణం ఆవశ్యకమైనదే, దేన్నీ ఉపేక్షించడానికి వీల్లేదు. ఆయనింకా ఇలా జతచేస్తున్నాడు: “ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును.” (2 పేతురు 1:8) మన సహనానికి భక్తిని అమర్చుకోవలసిన అవసరతపై మన అవధానాన్ని కేంద్రీకరిద్దాము.
సహనం కలిగివుండవలసిన అవసరత
5. మనకు సహనం ఎందుకవసరం?
5 పేతురు, పౌలు భక్తిని సహనంతో లేదా ఓర్పుతో జతచేస్తున్నారు. (1 తిమోతి 6:11) సహనం కలిగి ఉండడమంటే కష్ట సమయంలో బలంగా స్థిరంగా ఉండడం మాత్రమే కాదు. దానిలో ఓర్పు కలిగివుండడం, ధైర్యంగా ఉండడం, స్థిరత్వం కలిగివుండడం, శ్రమలు గానీ అడ్డంకులు గానీ శోధనలు లేదా హింసలు గానీ ఎదురైనప్పుడు ఆశ వదులుకోకుండా ఉండడం కూడా ఇమిడి ఉన్నాయి. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించు” వారముగా మనం హింసించబడతామన్నది ఒక వాస్తవం. (2 తిమోతి 3:12) యెహోవాపై మనకున్న ప్రేమను మనం నిరూపించుకుని, రక్షణకు అవసరమైన లక్షణాలను వృద్ధి చేసుకోవాలంటే మనం సహించవలసిందే. (రోమీయులు 5:3-5; 2 తిమోతి 4:7, 8; యాకోబు 1:2-4, 12) సహనం లేకుండా, మనం నిత్యజీవాన్ని పొందలేము.—రోమీయులు 2:6, 7; హెబ్రీయులు 10:36.
6. అంతం వరకు సహించడమంటే ఏమి చేయడమని అర్థం?
6 మనం ఎంతో చక్కగా ప్రారంభించినప్పటికీ, చివరికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం మనం సహనం కలిగి ఉండడమే. యేసు ఇలా చెప్పాడు: “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” (మత్తయి 24:13) అవును మనం అంతం వరకు సహించాలి, అది మన ప్రస్తుత జీవిత అంతమే కానివ్వండి లేదా ఈ దుష్ట విధాన అంతమే కానివ్వండి. ఈ రెండు సందర్భాల్లోనూ దేవుని పట్ల మనకున్న యథార్థతను మనం కాపాడుకోవాలి. అయితే మన సహనానికి భక్తిని అమర్చుకోకుండా, మనం యెహోవాకు ప్రీతికరమైన వారముగా ఉండలేము, నిత్యజీవాన్నీ పొందలేము. అయితే భక్తి అంటే ఏమిటి?
భక్తి అంటే ఏమిటి?
7. భక్తి అంటే ఏమిటి, ఏమి చేయడానికి అది మనల్ని కదిలిస్తుంది?
7 భక్తి అంటే వ్యక్తిగతమైన పూజ్య భావం, ఆరాధన, యెహోవా దేవుని విశ్వ సర్వాధిపత్యానికి యథార్థత చూపుతూ ఆయనకు చేసే సేవ. యెహోవా పట్ల భక్తిని కలిగి ఉండాలంటే మనకు ఆయన గురించీ ఆయన మార్గాల గురించీ ఖచ్చితమైన పరిజ్ఞానం ఉండాలి. మనకు దేవుణ్ణి వ్యక్తిగతంగా, సన్నిహితంగా తెలుసుకోవాలన్న కోరిక ఉండాలి. మనమలా కోరుకోవడం, మనం ఆయనతో హృదయపూర్వకమైన అనుబంధాన్ని వృద్ధి చేసుకొనేలా మనల్ని కదిలిస్తుంది, అది మన చర్యల ద్వారా మన జీవన విధానం ద్వారా ప్రదర్శితమవుతుంది. మనం మనకు సాధ్యమైనంత మేరకు యెహోవాను పోలి ఉండాలని, అంటే ఆయన మార్గాలను అనుకరించాలనీ ఆయన లక్షణాలను వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలనీ కోరుకోవాలి. (ఎఫెసీయులు 5:1) వాస్తవానికి, మనం చేసేదానంతటిలో దేవునికి ప్రీతికరమైన విధంగా ఉండడానికి భక్తి మనల్ని పురికొల్పుతుంది.—1 కొరింథీయులు 10:31.
8. సాధారణ భక్తీ యెహోవాకు మాత్రమే చెందవలసిన భక్తీ ఒకదానితో ఒకటి ఎలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి?
8 నిజమైన భక్తి కలిగి ఉండాలంటే, మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తూ మన హృదయాల్లో ఆయనకున్న స్థానాన్ని మరేదైనా ఆక్రమించుకొనేలా అనుమతించకూడదు. మన భక్తి తనకు మాత్రమే చెందాలని కోరే హక్కు, మన సృష్టికర్తగా యెహోవాకు ఉంది. (ద్వితీయోపదేశకాండము 4:24; యెషయా 42:8) అయినప్పటికీ యెహోవా, మనం తనను ఆరాధించాలని బలవంతం చేయడు. మనం ఇష్టపూర్వకంగా తనపట్ల భక్తి కలిగి ఉండాలన్నదే ఆయన కోరిక. దేవుని గురించి మనకున్న ఖచ్చితమైన పరిజ్ఞానం ఆధారంగా ఆయన పట్ల మనకున్న ప్రేమ, మనం మన జీవితాల్ని శుభ్రపరచుకొనేలా, ఏ షరతులూ పెట్టకుండా ఆయనకు సమర్పించుకొనేలా, దానికి అనుగుణంగా జీవించేలా మనల్ని కదిలిస్తుంది.
దేవునితో సంబంధం ఏర్పరచుకోండి
9, 10. దేవునితో మనం సన్నిహిత సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోగలము, దాన్నెలా కాపాడుకోగలము?
9 బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవునికి మన సమర్పణను సూచించిన తర్వాత, మనం ఆయనతో మరింత సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవలసిన అవసరం ఉంది. అలా ఏర్పరచుకోవాలనీ నమ్మకంగా యెహోవా సేవ చేయాలనీ మనకున్న కోరిక, ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయడంలో కొనసాగుతూ దాన్ని ధ్యానించడానికి మనల్ని కదిలిస్తుంది. దేవుని ఆత్మ మన మనస్సులపై హృదయాలపై పనిచేసేందుకు మనం అనుమతిస్తే, యెహోవా పట్ల మనకున్న ప్రేమ మరింత ప్రగాఢమవుతుంది. అప్పుడు ఆయనతో మనకున్న సంబంధం మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా కొనసాగుతుంది. యెహోవాను మనం మన అత్యంత ప్రియమైన మిత్రునిగా పరిగణిస్తూ అన్నివేళలా ఆయనకు ప్రీతికరమైనది చేయాలని కోరుకుంటాము. (1 యోహాను 5:3) దేవునితో మనకున్న ఆహ్లాదకరమైన సంబంధాన్ని బట్టి మనకు కలిగే ఆనందం అధికమవుతుంది, ఆయన మనకు ప్రేమపూర్వకంగా ఉపదేశిస్తున్నందుకు అవసరమైన విషయాల్లో మనల్ని సరిదిద్దుతున్నందుకు మనం కృతజ్ఞులం.—ద్వితీయోపదేశకాండము 8:5.
10 యెహోవాతో మనకున్న అమూల్యమైన సంబంధాన్ని బలపర్చుకోవడానికి మనం ఎప్పుడూ చర్యలు తీసుకుంటూనే ఉండాలి. లేదంటే ఆ సంబంధం బలహీనమై పోగలదు. అలా గనుక జరిగితే, అది దేవుని తప్పు కాదు, ఎందుకంటే “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:26, 27) యెహోవా మనం తనను సమీపించడాన్ని కష్టమయ్యేలా చేయడు గనుక మనం ఎంతగా సంతోషిస్తున్నామో కదా! (1 యోహాను 5:14, 15) యెహోవాతో సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాన్ని కాపాడుకోవడానికి మనం కృషి చేయాలన్నది నిజమే. అయితే భక్తిని కలిగివుండి, దాన్ని కాపాడుకోవడానికి మనకు అవసరమైన సహాయాన్నంతటినీ ఇవ్వడం ద్వారా ఆయన, మనం తనకు దగ్గరయ్యేందుకు సహాయం చేస్తాడు. (యాకోబు 4:8) ఈ ప్రేమపూర్వక ఏర్పాట్లన్నిటినీ మనం ఎలా పూర్తిగా ఉపయోగించుకోగలం?
ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి
11. మనం మనకున్న భక్తిని వ్యక్తం చేయగల కొన్ని మార్గాలు ఏవి?
11 దేవునిపట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమ, మనకు ఆయనపై ఎంత భక్తి ఉందో నిరూపించుకొనేలా మనల్ని పురికొల్పుతుంది, అది పౌలు ఇచ్చిన ఈ సలహాకు అనుగుణంగా ఉంటుంది: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు 2 తిమోతి 2:15) ఇలా చేయడానికి మనం క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం, కూటాలకు హాజరవ్వడం, క్షేత్రసేవలో పాల్గొనడం వంటి చక్కని కార్యక్రమాలను కలిగి ఉండడం అవసరం. ‘యెడతెగక ప్రార్థనచేయడం’ ద్వారా కూడా మనం యెహోవాకు సన్నిహితంగా ఉండవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:16-18) ఇవి, మనకున్న భక్తిని అర్థవంతంగా వ్యక్తం చేయగల కొన్ని మార్గాలు. వాటిలో దేనిని నిర్లక్ష్యం చేసినా, అది ఆధ్యాత్మిక అస్వస్థతను కలుగజేసి మనం సాతాను కుయుక్తులకు ఎర అయ్యేలా చేస్తుంది.—1 పేతురు 5:8.
జాగ్రత్తపడుము.” (12. మనం శ్రమలను విజయవంతంగా ఎలా ఎదుర్కోవచ్చు?
12 ఆధ్యాత్మికంగా బలంగా, చురుగ్గా ఉండడం మనకు ఎదురయ్యే అనేకానేక శ్రమలను ఎదుర్కోవడానికి కూడా మనకు సహాయం చేస్తుంది. మనల్ని పూర్తిగా పరీక్షించగల మూలాల నుండి కూడా శ్రమలు రావచ్చు. సన్నిహిత కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి లేదా పొరుగువారి నుండి ఎదురయ్యే ఉదాసీనత, వ్యతిరేకత, హింసలను సహించడం మరింత కష్టం కావచ్చు. మన పని స్థలంలో లేదా పాఠశాలలో మనం మన క్రైస్తవ సూత్రాలతో రాజీపడేలా చేసే మోసకరమైన ఒత్తిళ్ళు తలెత్తవచ్చు. నిరుత్సాహం, అనారోగ్యం, కృంగుదల మనల్ని శారీరకంగా బలహీనం చేసి, విశ్వాస పరీక్షలను ఎదుర్కోవడాన్ని మరింత కష్టతరం చేయగలవు. కానీ మనం “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, . . . పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త” గలవారమై కొనసాగితే శ్రమలన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగలుగుతాము. (2 పేతురు 3:11, 12) దేవుని ఆశీర్వాదం లభిస్తుందని నిశ్చయత కలిగివుండి, అలా చేయడంలో మనం మన ఆనందాన్ని కాపాడుకోవచ్చు.—సామెతలు 10:22.
13. మనకున్న భక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలంటే మనమేమి చేయాలి?
13 భక్తిగల వారిపై దాడి చేయడానికి సాతాను ప్రయత్నించినప్పటికీ మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే, “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . ప్రభువు సమర్థుడు.” (2 పేతురు 2:9, 10) శ్రమలను సహించి అలాంటి విడుదలను పొందడానికి, మనం ‘భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతకాలి.’ (తీతు 2:12, 13) క్రైస్తవులముగా మనం, శరీర కోరికలకూ కార్యకలాపాలకూ సంబంధించిన ఏ బలహీనత అయినా మన భక్తిపై దాడి చేసి దాన్ని నాశనం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రమాదాల్లో కొన్నింటిని మనం ఇప్పుడు పరిశీలిద్దాము.
భక్తికి ఎదురయ్యే ప్రమాదాల గురించి జాగ్రత్త
14. మనం ఐశ్వర్యాసక్తి అనే ఉరిలో చిక్కుకునేలా మరులుగొల్పబడితే మనమేమి గుర్తుంచుకోవాలి?
14ఐశ్వర్యాసక్తి అనేకులకు ఒక ఉరిగా ఉంది. ‘దైవభక్తి [వస్తుదాయకమైన] లాభసాధనమనుకుంటూ’ మనల్ని మనం కూడా మోసం చేసుకునే అవకాశం ఉంది. అలా, తోటివిశ్వాసులు మనపై ఉంచిన నమ్మకం నుండి తప్పుగా ప్రయోజనం పొందడానికి మనం ధైర్యం చేస్తుండవచ్చు. (1 తిమోతి 6:5) చివరికి, మనం అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించలేకపోవచ్చునని మనకు తెలిసినప్పటికీ ధనవంతుడైన ఒక క్రైస్తవుడ్ని అప్పు ఇవ్వమని ఒత్తిడి చేయడంలో తప్పేమీ లేదని మనం పొరపాటుగా అనుకోవచ్చు. (కీర్తన 37:21) కానీ ‘యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినది’ భక్తే గానీ వస్తుసంపదలను సమకూర్చుకోవడం కాదు. (1 తిమోతి 4:8) ‘మనమీ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలోనుండి ఏమీ తీసికొని పోలేము’ గనుక “సంతుష్టి సహితమైన దైవభక్తి” కలిగి ఉండడానికి తీవ్రంగా కృషి చేస్తూ “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.”—1 తిమోతి 6:6-11.
15. విలాసాలను వెంబడించడం మన జీవితంలో భక్తికి స్థానం లేకుండా చేస్తున్నట్లు కనిపిస్తే మనం ఏమి చేయవచ్చు?
15విలాసాలను వెంబడించడం మన జీవితంలో భక్తికి 1 యోహాను 2:25) నేడు, అనేకులు “దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారు” కాబట్టి, మనం అలాంటి వారి నుండి దూరంగా ఉండడం అవసరం. (2 తిమోతి 3:4, 5) భక్తికి ప్రాధాన్యతనిచ్చేవారు, ‘వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచున్నారు.’—1 తిమోతి 6:18, 19.
స్థానం లేకుండా చేయగలదు. ఈ విషయంలో మనం సత్వర మార్పులు చేసుకోవడం అవసరమై ఉండవచ్చా? శరీర సంబంధమైన సాధకము నుండి వినోదం నుండి కొన్ని ప్రయోజనాలను పొందవచ్చునని అంగీకరించవలసిందే. అయితే, నిత్యజీవంతో పోలిస్తే అలాంటి ప్రతిఫలాలు చాలా అల్పమైనవే. (16. ఏ పాపభరితమైన కోరికలు కొందరిని దేవుడు నీతియుక్తంగా కోరేవాటికి అనుగుణంగా జీవించకుండా చేస్తాయి, ఈ కోరికలను మనం ఎలా అదుపు చేసుకోవచ్చు?
16మద్యపానీయాల మాదకద్రవ్యాల దుర్వినియోగం, అనైతికత, పాపభరితమైన కోరికలు మనకున్న భక్తిని నాశనం చేయగలవు. వీటికి లొంగిపోవడం దేవుడు నీతియుక్తంగా కోరేవాటికి అనుగుణంగా జీవించకుండా మనల్ని ఆటంకపరచగలవు. (1 కొరింథీయులు 6:9, 10; 2 కొరింథీయులు 7:1) పౌలు సహితం పాపభరిత శరీరంతో ఎడతెగక సంఘర్షణను సహించవలసి వచ్చింది. (రోమీయులు 7:21-25) తప్పుడు కోరికలను తొలగించుకోవడానికి చాలా ఖచ్చితమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఒక విషయం ఏమిటంటే, నైతికంగా పరిశుభ్రంగా ఉండాలని మనం దృఢనిశ్చయం చేసుకోవాలి. పౌలు మనకిలా చెబుతున్నాడు: “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.” (కొలొస్సయులు 3:5) అలాంటి పాపభరితమైన వాటి విషయంలో మన అవయవములను చంపేసుకోవడానికి వాటిని పూర్తిగా నిర్మూలించుకోవడానికి దృఢనిశ్చయం అవసరం. దేవుని సహాయం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించడం, తప్పుడు కోరికలను వదిలించుకుని ఈ దుష్ట విధానంలో నీతిని, భక్తిని వెంబడించడానికి మనకు దోహదపడుతుంది.
17. క్రమశిక్షణను మనం ఎలా దృష్టించాలి?
17నిరుత్సాహం మన సహనాన్ని బలహీనం చేసి, మనకున్న భక్తిపై వినాశకరమైన ప్రభావాన్ని చూపించగలదు. యెహోవా సేవకులలో అనేకులు నిరుత్సాహాన్ని అనుభవించారు. (సంఖ్యాకాండము 11:11-15; ఎజ్రా 4:4; యోనా 4:3) నిరుత్సాహానికి తోడు, మనల్ని ఎవరైనా అభ్యంతరపరిచినందుకు లేదా మనకు ఖండితమైన దిద్దుబాటు లేక క్రమశిక్షణ ఇవ్వబడినందుకు మనం మనస్సులో ఉక్రోషం ఉంచుకుంటే అది మనపై నాశనకరమైన ప్రభావాన్ని చూపించగలదు. అయితే దిద్దుబాటు, క్రమశిక్షణ దేవునికి ఉన్న ఆసక్తికీ, ప్రేమపూర్వకమైన శ్రద్ధకూ నిదర్శనాలు. (హెబ్రీయులు 12:5-7, 10, 11) క్రమశిక్షణను కేవలం శిక్షగా పరిగణించకూడదు గానీ నీతియుక్తమైన మార్గంలో మనకు శిక్షణ ఇవ్వడానికి అది ఒక మార్గమని భావించాలి. మనం వినయ మనస్కులమైతే “శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు” అని గ్రహించి మనం ఉపదేశాన్ని ఉన్నతంగా ఎంచుతాము, దాన్ని స్వీకరిస్తాము. (సామెతలు 6:23) భక్తి కలిగి ఉండడంలో చక్కని ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి ఇది మనకు సహాయం చేయగలదు.
18. వ్యక్తిగత అపరాధాల విషయంలో మనకు ఏ బాధ్యత ఉంది?
18అపార్థాలు, వ్యక్తిగత అపరాధాలు మనకున్న భక్తికి ఒక సామెతలు 18:1) కానీ ఇతరుల పట్ల కోపం ఉంచుకోవడం లేదా పగపెట్టుకోవడం యెహోవాతో మనకున్న సంబంధంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపించగలవని గుర్తుంచుకోవడం మంచిది. (లేవీయకాండము 19:18) వాస్తవానికి, “తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.” (1 యోహాను 4:20) యేసు తాను కొండ మీద ఇచ్చిన ప్రసంగంలో, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి సత్వర చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. ఆయన తన శ్రోతలకిలా చెప్పాడు: “కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.” (మత్తయి 5:23, 24) క్షమాపణ కోరడం, నిర్దయతో పలికిన మాటలు లేదా చేసిన క్రియలు కలిగించిన గాయాన్ని మాన్పడానికి సహాయం చేయగలదు. మనం క్షమాపణ కోరి, మనం సరిగ్గా వ్యవహరించలేదని అంగీకరించడం, ఇద్దరి మధ్యవున్న సంబంధంలో ఏర్పడిన అగాధాన్ని పూడ్చి, సమాధానకరమైన సంబంధాలు తిరిగి ఏర్పడేలా చేయగలదు. సమస్యలను పరిష్కరించుకోవడంలో యేసు ఇతర ఉపదేశాలను కూడా ఇచ్చాడు. (మత్తయి 18:15-17) సమస్యలను పరిష్కరించుకోవడానికి చేయబడే ప్రయత్నాలు సఫలమైతే ఎంత సంతోషకరం!—రోమీయులు 12:18; ఎఫెసీయులు 4:26-28.
సవాలుగా ఉండగలవు. అవి వ్యాకులతను కలిగించగలవు లేదా తమ ఆధ్యాత్మిక సహోదర సహోదరీల నుండి తమను తాము దూరం చేసుకోవడమనే మూర్ఖపు చర్య తీసుకునేలా కొందరిని పురికొల్పగలవు. (యేసు మాదిరిని అనుసరించండి
19. యేసు మాదిరిని అనుకరించడం ఎందుకంత ప్రాముఖ్యం?
19 మనకు శ్రమలు తప్పక వస్తాయి, కానీ అవి నిత్యజీవానికి నడిపే మార్గం నుండి మనల్ని ప్రక్కకు తొలగేలా చేయనవసరం లేదు. యెహోవా మనల్ని శ్రమల నుండి తప్పించగలడని గుర్తుంచుకోండి. మనం ‘ప్రతిభారమును విడిచిపెట్టి, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుతూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు’ చూద్దాము. (హెబ్రీయులు 12:1-3) యేసు మాదిరిని నిశితంగా పరిశీలిస్తూ మాటల్లోనూ చర్యల్లోనూ ఆయనను అనుకరించడానికి కృషి చేయడం, భక్తిని వృద్ధి చేసుకుని దాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించడానికి సహాయం చేస్తుంది.
20. సహనాన్ని, భక్తిని ప్రదర్శించడం వల్ల ఏ ప్రతిఫలాలు లభిస్తాయి?
20 మన రక్షణను నిశ్చయపర్చుకోవడానికి సహాయం చేయడంలో సహనం, భక్తి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ అమూల్యమైన లక్షణాలను ప్రదర్శించడం ద్వారా మనం దేవునికి చేసే పరిశుద్ధ సేవలో నమ్మకంగా కొనసాగవచ్చు. శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా మనం సహనాన్నీ భక్తినీ కలిగి ఉంటున్నాము గనుక మనం యెహోవా చూపించే జాలీ కనికరాలనూ ఆయనిచ్చే ఆశీర్వాదాన్నీ అనుభవిస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. (యాకోబు 5:11) అంతేగాక, యేసు తానే స్వయంగా మనకిలా హామీ ఇస్తున్నాడు: “మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.”—లూకా 21:19.
మీరెలా సమాధానమిస్తారు?
• సహనం ఎందుకు ప్రాముఖ్యం?
• భక్తి అంటే ఏమిటి, అది ఎలా వ్యక్తం చేయబడుతుంది?
• దేవునితో మనం సన్నిహిత సంబంధాన్ని ఎలా ఏర్పరచుకుని దాన్నెలా కాపాడుకోగలము?
• మనకున్న భక్తికి ఎదురయ్యే కొన్ని ప్రమాదాలు ఏవి, వాటిని మనం ఎలా నివారించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[12,13వ పేజీలోని చిత్రాలు]
భక్తి అనేక విధాలుగా ప్రదర్శించబడుతుంది
[14వ పేజీలోని చిత్రాలు]
మీ భక్తికి ఎదురయ్యే ప్రమాదాల గురించి జాగ్రత్త