కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి జంతుబలి అవసరమని హేబెలుకు తెలుసా?

కయీనూ హేబెలూ అర్పణలను తీసుకురావడం గురించి బైబిలు చెప్పిన వృత్తాంతం చాలా క్లుప్తంగా ఉంది. ఆదికాండము 4:3-5లో “కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు” అని చదువుతాము.

ఈ సంఘటనకు ముందు, యెహోవా బలుల గురించి గానీ తాను ఏ రకమైన బలులను అంగీకరిస్తాడన్న దాని గురించి గానీ నిర్దిష్టమైన సమాచారమేమైనా ఇచ్చినట్లు బైబిలు చెప్పడం లేదు. కాబట్టి కయీనూ హేబెలూ అర్పణగా ఇవ్వడానికి తాము ఎంపిక చేసుకున్న వాటినే తీసుకువెళ్ళారని స్పష్టమవుతుంది. వాళ్ళు తమ తల్లిదండ్రుల మొదటి పరదైసు గృహం దగ్గరికి వెళ్ళకుండా నిరోధించబడ్డారు; వారు పాపపు ఫలితాలను గ్రహించడం మొదలుపెట్టారు; దేవుడి నుండి దూరం చేయబడివున్నారు. తామున్న పాపభరితమైన దయనీయమైన పరిస్థితిలో, దేవుని సహాయం కోసం ఆయనవైపుకు తిరగవలసిన అవసరముందన్న భావన వాళ్ళలో బలంగా ఉండివుండవచ్చు. వాళ్ళు అర్పణ తేవడం, దేవుని అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళే స్వచ్ఛందంగా చేసిన చర్య అయి ఉండవచ్చు.

అప్పుడు, దేవుడు హేబెలు అర్పణను అంగీకరించాడు కానీ కయీనుది అంగీకరించలేదు. ఎందుకని? దానికి కారణం హేబెలు సరైన వాటిని అర్పించడమూ కయీను సరైనవాటిని అర్పించకపోవడమూనా? ఏది అంగీకారయోగ్యమైనది, ఏది కాదన్నది వాళ్ళిద్దరికీ చెప్పబడలేదు కాబట్టి అర్పించబడిన అర్పణలు ఏ రకమైనవన్నది ఎలాంటి ప్రభావమూ చూపలేదని ఖచ్చితంగా చెప్పలేము. అయితే, ఆ రెండు రకాల బలులూ అంగీకారయోగ్యమైనవే అయ్యుండవచ్చు. చివరికి, ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రంలో అంగీకారయోగ్యమైన బలుల్లో జంతువులు, జంతువుల భాగాలు మాత్రమే కాక, వేయించిన ధాన్యాలు, యవల పనలు, మెత్తని గోధుమ పిండి, కాల్చిన పిండివంటకాలు, ద్రాక్షారసము ఉన్నాయి. (లేవీయకాండము 6:​19-23; 7:​11-13; 23:​10-13) కయీను హేబెలుల అర్పణలలో దేవుడు ఒకరిది అంగీకరించి మరొకరిది తృణీకరించడానికి కారణం, వారు తెచ్చిన అర్పణల రకం మాత్రమే కాదు.​—⁠యెషయా 1:⁠11 పోల్చండి; ఆమోసు 5:⁠22.

“విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను” అని అనేక శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పౌలు అన్నాడు. (హెబ్రీయులు 11:⁠4) కాబట్టి, హేబెలు విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆయనను నీతిమంతుడని గుర్తించాడు. దేని మీది విశ్వాసం? ‘సర్పము తలమీద కొట్టే’ సంతతిని ఇస్తాననీ మానవజాతి ఒకప్పుడు అనుభవించిన శాంతిని, పరిపూర్ణతను తిరిగి తీసుకువస్తాననీ యెహోవా చేసిన వాగ్దానం మీదున్న విశ్వాసం. ఆ సంతానం ‘మడిమె మీద కొట్టబడుతుంది’ అని చెప్పిన దాన్ని బట్టి, అర్పణలో భాగంగా రక్తం చిందించబడడం అవసరమని హేబెలు తనలో తాను తర్కించుకునివుండవచ్చు. (ఆదికాండము 3:​15) అయినప్పటికీ హేబెలు విశ్వాస వ్యక్తీకరణే ఆయన అర్పణను “కయీనుకంటె శ్రేష్ఠమైన” అర్పణగా చేసిందన్నది వాస్తవం.

అలాగే కయీను తృణీకరించబడ్డాడు, దానికి కారణం కయీను అర్పించకూడని బలిని అర్పించడం కాదు కానీ ఆయన క్రియలు సూచించినట్లు ఆయనకు విశ్వాసం లోపించడమే. “నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా?” అని అంటూ యెహోవా కయీనుకు విషయాన్ని స్పష్టంగా సూచించాడు. (ఆదికాండము 4:⁠7) దేవుడు కయీనును తిరస్కరించినది ఆయన అర్పణ మీద అయిష్టం ఉన్నందువల్ల కాదు. ‘ఆయన క్రియలు చెడ్డవి’ కాబట్టే దేవుడు ఆయనను తృణీకరించాడు. ఆయన క్రియలు చెడ్డవని ఆయనకున్న అసూయ, ద్వేషము, చివరికి ఆయన చేసిన హత్యలు సూచించాయి.​—⁠1 యోహాను 3:⁠12.