కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంకుబుడి కొంగ నుండి ఒక పాఠము

సంకుబుడి కొంగ నుండి ఒక పాఠము

సంకుబుడి కొంగ నుండి ఒక పాఠము

“ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, . . . అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.” (యిర్మీయా 8:⁠7) ఈ మాటలతో, తమ దేవుడైన యెహోవాను వదిలేసి అన్యదేవతల ఆరాధన వైపు తిరిగిన మతభ్రష్టులైన యూదా ప్రజలకు వ్యతిరేకంగా యెహోవా తీర్పును యిర్మీయా ప్రవక్త ప్రకటించాడు. (యిర్మీయా 7:​18, 31) విశ్వాసఘాతకులైన యూదులకు గుణపాఠం చెప్పడానికి యిర్మీయా ఒక సంకుబుడి కొంగను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు?

సంకుబుడి కొంగ, ప్రత్యేకించి తెల్ల కొంగ బైబిలు ప్రాంతాల గుండా వలసవెళ్ళే దృశ్యం ఇశ్రాయేలీయులకు సుపరిచితమే. పొడవైన కాళ్ళు కలిగి నీటిగుండా పోయే ఈ పెద్ద పక్షి పేరు హీబ్రూ భాషలోని స్త్రీలింగ సంబంధమైన ఒక పదం, దాని అర్థం “యథార్థత గలది; ప్రేమపూర్వక దయ గలది.” ఇది సరిగ్గా దానికి తగిన పేరు, ఎందుకంటే ఈ తెల్ల కొంగలు అనేక ఇతర పక్షుల్లా కాకుండా ఆడా మగా జీవితాంతం కలిసి జంటగా ఉంటాయి. చలికాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో గడిపిన తర్వాత ఈ కొంగల్లో అత్యధిక శాతం అంతకు ముందు ఉపయోగించిన గూటికే తరచుగా తిరిగివస్తాయి, అలా సంవత్సరాల తరబడి వస్తూనే ఉంటాయి.

ఈ కొంగ తన సహజ ప్రవృత్తి ద్వారా, యథార్థత అనే లక్షణాన్ని అసాధారణమైన మార్గాల్లో వ్యక్తం చేస్తుంది. ఆడా మగా పక్షులు రెండూ గుడ్లను పొదగడంలోను పిల్లలకు ఆహారాన్ని అందించడంలోను సమంగా భాగం వహిస్తాయి. అవర్‌ మాగ్నిఫిసెంట్‌ వైల్డ్‌లైఫ్‌ అనే పుస్తకం, “తల్లిదండ్రులుగా ఈ కొంగలు పరస్పరం అసాధారణమైన రీతిలో యథార్థతను చూపించుకుంటాయి. ఉదాహరణకు, జర్మనీలో ఒక మగ కొంగ అత్యధిక వోల్టేజి ఉన్న కరంటు తీగలపై వాలడంవల్ల చనిపోయింది. దాని భాగస్వామి ఒంటరిగానే గుడ్లను పొదగడానికి 3 రోజులపాటు వాటి మీదినుండి కదలకుండా ఉండిపోయింది, మధ్యలో ఒకే ఒక్కసారి ఆహారం కోసం వెళ్ళినా అది చాలా స్వల్పకాలం మాత్రమే . . . మరొక సందర్భంలో, తన తోటి ఆడ కొంగ కాల్చి చంపబడినప్పుడు తండ్రి పక్షే పిల్లలను పెంచింది.”

నిజంగానే, తన జీవిత భాగస్వామిపట్ల సహజసిద్ధమైన నమ్మకాన్ని కలిగి ఉండడం ద్వారా తన పిల్లలపట్ల ప్రేమపూర్వక శ్రద్ధను చూపించడం ద్వారా ఈ కొంగ “యథార్థత గలది” అని తన పేరుకున్న భావానికి తగినట్టుగా జీవిస్తుంది. అందుకే విశ్వాసఘాతకులూ చపలచిత్తులూ అయిన ఇశ్రాయేలీయులకు కొంగలు ఒక శక్తివంతమైన పాఠాన్నందించడంలో తోడ్పడ్డాయి.

నేడు అనేకమందికి యథార్థత విశ్వసనీయత అనేవి పాతకాలపు ఆలోచనలు​—⁠అవి మెచ్చుకోదగినవే కానీ ఆచరణాత్మకమైనవి కావు. రోజు రోజుకీ పెరిగిపోతున్న విడాకులు, వదిలిపెట్టిపోవడం, వంచించడంతోపాటు ఇతర రకాల మోసాలు యథార్థతకు ఏ మాత్రం విలువ లేదని నిరూపిస్తున్నాయి. దానికి భిన్నంగా బైబిలు, ప్రేమా దయల చేత ప్రేరేపించబడిన యథార్థతకు ఉన్నతమైన స్థానాన్నిస్తోంది. అది “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను” అని క్రైస్తవులకు ఉద్బోధిస్తుంది. (ఎఫెసీయులు 4:​24) అవును, మనం యథార్థంగా ఉండడానికి నవీనస్వభావము మనకు సహాయపడుతుంది, అయినా మనం యథార్థత గురించిన పాఠాన్ని కొంగ నుండి కూడా నేర్చుకోవచ్చు.