కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నేను మీ డబ్బును ఎందుకు తిరిగి ఇస్తున్నానో మీకు తెలుసా?”

“నేను మీ డబ్బును ఎందుకు తిరిగి ఇస్తున్నానో మీకు తెలుసా?”

“నేను మీ డబ్బును ఎందుకు తిరిగి ఇస్తున్నానో మీకు తెలుసా?”

‘ఓహ్‌, నాకు డబ్బు బాగా అవసరం ఉంది!’ అని ముగ్గురు కొడుకుల ఒంటరి తల్లి నానా అనే ఒకామె అనుకుంది, ఆమె రిపబ్లిక్‌ ఆఫ్‌ జార్జియాలోని కస్పిలో నివసిస్తోంది. ఒకరోజు ఉదయం డబ్బు అవసరం తీరాలన్న ఆమె కల నిజమైంది. పోలీసు స్టేషనుకు దగ్గర్లోనే ఆమెకు 300 లారీలు (దాదాపు 7,000 రూపాయలు) దొరికాయి. చుట్టుప్రక్కల ఎవరూ లేరు. అది చాలా పెద్ద మొత్తం. వాస్తవానికి, లారీలు జాతీయ కరెన్సీ అయిన గత 5 సంవత్సరాలలో నానా 100 లారీల నోటును చూడనైనా చూడలేదు. స్థానిక దుకాణదారులు కూడా కొన్ని సంవత్సరాలు పని చేస్తేనే గాని అంత మొత్తం సంపాదించలేరు.

‘నేను నా విశ్వాసాన్నీ దైవిక భయాన్నీ ఆధ్యాత్మికతనూ కోల్పోయేటట్లైతే ఈ డబ్బు నాకేమి చేయగలదు?’ అని నానా ఆలోచించింది. ఆమె తన విశ్వాసం కోసం భయంకరమైన హింసనూ దెబ్బలనూ సహించి అలాంటి క్రైస్తవ లక్షణాలను అలవరుచుకుంది.

ఆమె పోలీసు స్టేషనుకు వెళ్ళేసరికి అక్కడ అయిదుగురు ఆఫీసర్లు వెర్రెత్తినట్లు దేనికోసమో వెదుకుతుండడాన్ని నానా గమనించింది. వాళ్ళు ఆ డబ్బు కోసమే వెదుకుతున్నారని ఆమె గ్రహించింది, ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళి “మీరేమైనా పోగొట్టుకున్నారా?” అని అడిగింది.

“డబ్బు” అని వాళ్ళు జవాబిచ్చారు.

“ఎంత?”

“మూడు వందల లారీలు!”

“మీ డబ్బు నాకు దొరికింది” అని నానా చెప్పి “నేను మీ డబ్బును ఎందుకు తిరిగి ఇస్తున్నానో మీకు తెలుసా?” అని అడిగింది. అది వారికి తెలియదు.

“ఎందుకంటే నేను ఒక యెహోవాసాక్షిని, నేను యెహోవాసాక్షిని కాకపోయుంటే నేను మీ డబ్బు తిరిగి ఇచ్చేదాన్ని కాదు” అని ఆమె చెప్పింది.

ఆ డబ్బు పోగొట్టుకున్న పోలీసు అధికారి, నానా యథార్థ ప్రవర్తనకు కృతజ్ఞతగా 20 లారీలను ఇచ్చాడు.

ఈ కథనం త్వరలోనే కస్పి జిల్లా అంతటా వ్యాపించిపోయింది. ఆ మరుసటి రోజు పోలీసు స్టేషనులో పనిచేసే పనిమనిషి స్టేషను బయటకు వచ్చి, “[పోలీసు అధికారి] మీ సాహిత్యాలను ఎప్పుడూ తన ఆఫీసులో ఉంచుకుంటున్నాడు. బహుశా ఆయన ఇప్పుడు వాటిని మరింత విలువైనవిగా పరిగణిస్తాడు కాబోలు” అని నానాతో అంది. ఒక పోలీసు అయితే “ప్రజలందరూ యెహోవాసాక్షులే అయితే ఇక నేరాలు ఎవరు చేస్తారు?” అని కూడా అన్నాడు.