మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• తదనుభూతి అంటే ఏమిటి, దాన్ని క్రైస్తవులు ఎందుకు అలవరచుకోవాలి?
తదనుభూతి అంటే వేరే వ్యక్తి స్థానంలో తనను తాను ఊహించుకోగల సామర్థ్యం అంటే వేరే వ్యక్తి బాధను మన హృదయంలో అనుభవించడం. క్రైస్తవులు, ‘ఒకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపంచుకొని, సహోదరప్రేమ కలిగి, కరుణాచిత్తులై’ ఉండాలని ఉపదేశించబడ్డారు. (1 పేతురు 3:8) తదనుభూతి చూపించడంలో మనం అనుసరించడానికి యెహోవాయే మనకొక మాదిరిని ఉంచాడు. (కీర్తన 103:14; జెకర్యా 2:8) మనం వినడం ద్వారా గమనించడం ద్వారా ఊహించడం ద్వారా ఇతరుల మనోభావాలను అర్థం చేసుకోవడాన్ని మెరుగుపరచుకోగలం.—4/15, 24-6 పేజీలు.
• నిజమైన సంతోషాన్ని పొందడానికి, శారీరక అశక్తతల అంతిమ పరిష్కారానికంటే ముందుగా ఆధ్యాత్మిక స్వస్థత ఎందుకు జరగాలి?
శారీరకంగా ఆరోగ్యవంతులైన చాలామంది అసంతోషంతో సమస్యలతో కృంగిపోయి ఉన్నారు. దానికి భిన్నంగా నేడు అనేకమంది క్రైస్తవులు శారీరక అశక్తతలున్నప్పటికీ యెహోవా సేవ చేస్తూ సంతోషంగా ఉన్నారు. ఆధ్యాత్మిక స్వస్థత నుండి ప్రయోజనం పొందుతున్నవారు నూతనలోకంలో శారీరక అశక్తతలు లేకుండా జీవించే అవకాశం ఉంది.—5/1, 6, 7 పేజీలు.
• హెబ్రీయులు 12:16వ వచనం ఏశావును ఒక వ్యభిచారి కోవలోకి ఎందుకు చేర్చింది?
ఏశావు, సత్వర ఫలితాలను కోరే మనస్తత్వాన్ని చూపించాడనీ పవిత్ర విషయాలను నిర్లక్ష్యం చేశాడనీ బైబిలు వృత్తాంతం తెలియజేస్తోంది. నేడు ఎవరైనా అలాంటి మనస్తత్వం వృద్ధి చెందడానికి అనుమతిస్తే అది వ్యభిచారం వంటి గంభీరమైన పాపానికి దారి తీసే అవకాశముంది.—5/1, 10, 11 పేజీలు.
• టెర్టూలియన్ ఎవరు, ఆయన దేనికి ప్రఖ్యాతిగాంచాడు?
ఆయన ఒక రచయిత, వేదాంతి. సా.శ. రెండు, మూడు శతాబ్దాల కాలంలో ఆయన జీవించాడు. ఆయన, నామమాత్రపు క్రైస్తవత్వాన్ని కాపాడేందుకు అనేక సాహిత్యాలను వ్రాసినందుకు ప్రఖ్యాతిగాంచాడు. ఆయన దాన్నలా కాపాడుతూ తత్త్వజ్ఞానపు ఆలోచనలను పరిచయం చేశాడు, అలా చేయడం చివరికి త్రిత్వం లాంటి సిద్ధాంతపరమైన తప్పులకు ఆధారమైంది.—5/15, 29-31 పేజీలు.
• మానవుల వ్యాధులకూ ప్రవర్తనకూ మరణానికీ జన్యు శాస్త్రమే పూర్తిగా ఎందుకు కారణం కాదు?
మానవుల వివిధ వ్యాధులకు స్పష్టంగా జన్యువులే నిందార్హం అనే ముగింపుకు శాస్త్రజ్ఞులు వచ్చారు, ప్రవర్తన మన జన్యువుల చేత నిశ్చయించబడుతుందని కొందరు విశ్వసిస్తారు. కానీ బైబిలు మానవజాతి ఆరంభం విషయమై అంతర్దృష్టిని ఇస్తుంది, మానవజాతిని కష్టపెట్టడానికి పాపమూ అపరిపూర్ణతా ఎలా వచ్చాయో కూడా అది తెలియజేస్తుంది. వ్యక్తిత్వాలను రూపుదిద్దడంలో బహుశా జన్యువులు పాత్ర వహించినా మన అపరిపూర్ణత మన పరిసరాలు కూడా అధికంగా ప్రభావాన్ని చూపిస్తాయి.—6/1, 9-11 పేజీలు.
• ఈజిప్టులోని ఆక్సిరింఖస్‌లో కనుగొనబడిన రెల్లు కాగితపు అవశేషం, దేవుని పేరును ఉపయోగించే విషయాన్ని ఎలా వెలుగులోకి తెచ్చింది?
యోబు 42:11, 12 వచనాలున్న ఈ అవశేషం టెట్రగ్రామటన్ (నాలుగు హీబ్రూ అక్షరాల్లో దేవుని పేరు) ఉన్న గ్రీకు సెప్టాజింట్‌కు చెందినది. సెప్టాజింట్‌లో దేవుని పేరు హీబ్రూ అక్షరాల్లో కనిపిస్తుందనడానికి ఇది అదనపు రుజువు, క్రైస్తవ గ్రీకు లేఖనాల రచయితల చేత ఇది తరచుగా ఉల్లేఖించబడింది.—6/1, 30వ పేజీ.
• రోమా సామ్రాజ్యంలోని దౌర్జన్యపూరితమైన ప్రాణాంతకమైన గ్లాడియేటర్ల సంఘటనలు ఏ ఆధునిక ఆటల పోటీలతో పోల్చబడ్డాయి?
ఇటీవల ఇటలీలోని రోమ్‌లోని కలోసియమ్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో ఆధునిక నమూనాలను సూచించింది. అది చూపించిన కొన్ని వీడియో భాగాల్లో పశువులతో పోరాటం, ముష్టియుద్ధం, కారు రేసుల్లోనూ మోటర్ సైకిల్ రేసుల్లోనూ జరిగే భయంకరమైన ప్రమాదాలు, ఇతర ఆధునిక ఆటల పోటీల్లో ప్రేక్షకుల పోట్లాటలు ఉన్నాయి. యెహోవా దౌర్జన్యాన్నీ బలాత్కారం చేసేవారినీ ప్రేమించడనే విషయాన్ని తొలి క్రైస్తవులే కాదు నేటి క్రైస్తవులు కూడా గంభీరంగా తీసుకుంటారు. (కీర్తన 11:5)—6/15, 29వ పేజీ.
• సమర్థవంతులైన బోధకులవ్వడానికి మనం కృషి చేస్తూ ఎజ్రా మాదిరి నుండి ఏమి నేర్చుకోవచ్చు?
ఎజ్రా చేసిన నాలుగు విషయాలను ఎజ్రా 7:10 నొక్కి చెబుతోంది, వాటిని అనుకరించడానికి మనం కృషి చేయవచ్చు. అదిలా చెబుతోంది: ‘ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించుటకును, దానిచొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను [“తన హృదయమును సిద్ధపర్చుకొనెను,” NW].’—7/1, 20వ పేజీ.
• ఒక క్రైస్తవ స్త్రీ ఏ రెండు కారణాలను బట్టి తన తలపై ముసుగు వేసుకోవడం సరైనది?
ఒకటి ఇంట్లో ఎదురయ్యే పరిస్థితుల్లోనిది. ఆమె తలపై ముసుగు వేసుకోవడం, ప్రార్థన చేయడంలో బైబిలు ఉపదేశం ఇవ్వడంలో నాయకత్వం వహించేందుకు తన భర్తకు గల బాధ్యతను అంగీకరిస్తున్నట్లు సూచిస్తుంది. మరొకటి సంఘ కార్యకలాపాల్లో, అక్కడ బాప్తిస్మం పొందిన పురుషులకు బోధించడానికీ నిర్దేశించడానికీ లేఖనాధారంగా అధికారమివ్వబడిందని ఆమె కృతజ్ఞతతో తన సమ్మతిని చూపిస్తుంది. (1 కొరింథీయులు 11:3-10)—7/15, 26-7 పేజీలు.
• యోగం కేవలం వ్యాయామం కాదనీ అది ప్రమాదకరమైనదనీ క్రైస్తవులు ఎందుకు ఒప్పుకుంటారు?
ఒక శిక్షణగా యోగం లక్ష్యమేమిటంటే, ఒక వ్యక్తి మానవాతీతమైన శక్తితో ఐక్యమవడమే. దేవుని నిర్దేశానికి భిన్నంగా, యోగంలో స్వయంగా ఆలోచించడాన్ని ఆపివేయడం ఉంది. (రోమీయులు 12:1, 2) యోగం ఒక వ్యక్తిని అభిచారపు ప్రమాదాలకూ అతీంద్రియానికీ గురిచేసే అవకాశం ఉంది. (ద్వితీయోపదేశకాండము 18:10, 11)—8/1, 20-2 పేజీలు.