మీరు మీ యథార్థతను కాపాడుకుంటారా?
మీరు మీ యథార్థతను కాపాడుకుంటారా?
నిన్న ఎన్ని పిచ్చుకలు చనిపోయాయి? ఎవరికీ తెలీదు, ఎన్నో పక్షులున్నాయి కాబట్టి, వాటి గురించి బహుశా చాలా తక్కువమందే పట్టించుకోవచ్చు. కానీ యెహోవా పట్టించుకుంటాడు. యేసు తన శిష్యులతో అంతగా ముఖ్యం కానివి అనిపించే ఈ పక్షులను సూచిస్తూ “మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు” అని అన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.”—మత్తయి 10:29-32.
ఆ తర్వాత శిష్యులు, యెహోవా తమను ఎంత విలువైనవారిగా ఎంచుతున్నాడో మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నారు. వారిలో ఒకరు అపొస్తలుడైన యోహాను, ఆయనిలా వ్రాశాడు: “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.” (1 యోహాను 4:9) యెహోవా విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయడమే కాదుగానీ తన ప్రతీ సేవకుడికి “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని హామీ కూడా ఇస్తున్నాడు.—హెబ్రీయులు 13:5.
యెహోవాకు తన ప్రజలపైనున్న ప్రేమ నిశ్చలమైనదని స్పష్టమవుతోంది. అయితే ప్రశ్నేమిటంటే ‘మనం యెహోవాను ఎన్నడూ వదిలిపెట్టలేనంతగా ఆయనను ప్రేమిస్తున్నామా?’
మన యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి సాతాను ప్రయత్నాలు
యెహోవా, యోబు యథార్థ ప్రవర్తన వైపుకు సాతాను అవధానాన్ని మళ్ళించినప్పుడు, “ఆరాధననుండి ఏ ప్రయోజనమూ పొందకపోతే యోబు నిన్ను ఆరాధిస్తాడా?” అని సాతాను ఎదురు ప్రశ్న వేశాడు. (యోబు 1:9, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) మానవులు దేవునికి విశ్వసనీయంగా ఉండడమనేది పూర్తిగా, వాళ్ళు ‘దాని నుండి పొందే ప్రయోజనం’ మీదే ఆధారపడి ఉంటుందని అతడు సూచించాడు. అదే గనుక నిజమైతే ఇవ్వజూపేది బాగా ప్రలోభపెట్టేదిగా ఉంటే ఏ క్రైస్తవుని యథార్థతైనా బలహీనమవ్వగలదు.
యోబు విషయంలో, యోబు తనకున్న వాటిలో అత్యంత ప్రియమైనవాటిని కోల్పోతే దేవునిపట్ల ఆయనకున్న విశ్వసనీయత మటుమాయమవుతుందని సాతాను మొదట వాదించాడు. (యోబు 1:10, 11) ఈ నింద తప్పని రుజువుకాగానే “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును” అని సాతాను ఆరోపించాడు. (యోబు 2:4) సాతాను వాదం కొంతమంది విషయంలో నిజమే కావచ్చు, కానీ యోబు మాత్రం తన యథార్థత విషయంలో రాజీపడడానికి నిరాకరించాడు. నమోదు చేయబడిన చరిత్ర దాన్ని రుజువుచేస్తోంది. (యోబు 27:5; 42:10-17) మీకూ అలాంటి విశ్వసనీయతే ఉందా? లేక సాతాను మీ యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి అనుమతిస్తారా? ప్రతి క్రైస్తవునికి వర్తించే కొన్ని సత్యాలను మనం పరిశీలిస్తుండగా మీ గురించి ఆలోచించుకోండి.
నిజమైన క్రైస్తవ విశ్వసనీయత చాలా బలంగా ఉండగలదని అపొస్తలుడైన పౌలు నమ్మాడు. ఆయనిలా వ్రాశాడు: ‘మరణమైనను జీవమైనను ఉన్నవియైనను రాబోవునవియైనను సృష్టించబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.’ (రోమీయులు 8:38, 39) యెహోవాపై మన ప్రేమ బలంగా ఉంటే మనం కూడా అలాంటి దృఢవిశ్వాసంతో ఉండగలుగుతాం. అలాంటి ప్రేమ మరణం కూడా జయించలేనటువంటి నాశనం చేయడానికి వీలుకాని ఒక బంధంగా ఉండగలదు.
యెహోవాతో మనకు అలాంటి సంబంధం ఉన్నట్లైతే ‘నేను ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా యెహోవాను 2 కొరింథీయులు 4:16-18) మనం యెహోవాను పూర్ణహృదయంతో ప్రేమిస్తే మనం ఆయనను ఎన్నడూ నిరాశపరచం.—మత్తయి 22:37; 1 కొరింథీయులు 13:8.
సేవిస్తూ ఉంటానా?’ అని ఎన్నడూ ప్రశ్నించుకోము. అలాంటి సందిగ్ధత, దేవునికి మనం విశ్వసనీయంగా ఉండడం జీవితగమనంలో మనకు సంభవించగల దానిపైనే ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది. నిజమైన యథార్థత బాహ్య పరిస్థితులకు ప్రభావితం కాకుండా ఉంటుంది. మనం అంతర్గతంగా ఎలాంటి వ్యక్తై ఉన్నామన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది. (అయితే సాతాను మన యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. మన శరీరాశలకూ తోటివారి ఒత్తిడికీ లొంగిపోయేలా అతడు మనల్ని శోధించవచ్చు లేదా ఏదైనా విపత్తు మనం సత్యాన్ని వదిలేసేందుకు కారణమయ్యేలా చేస్తుండవచ్చు. మన సొంత అపరిపూర్ణతలు సాతాను లక్ష్యాన్ని సులభతరం చేసినప్పటికీ సాతాను చేసే ఈ దాడిలో దేవుని నుండి దూరమైన ఈ లోకం ప్రముఖ పాత్ర వహిస్తోంది. (రోమీయులు 7:19, 20; 1 యోహాను 2:16) ఏదేమైనా ఈ పోరాటంలో మనకు కొన్ని సానుకూల విషయాలున్నాయి, మనం సాతాను తంత్రములను ఎరుగనివారముకాము అన్న వాస్తవం వాటిలో మొట్టమొదటిది.—2 కొరింథీయులు 2:11.
సాతాను తంత్రములు ఏమిటి? పౌలు తాను ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో వాటిని ‘పన్నాగాలు’ అని వర్ణించాడు. (ఎఫెసీయులు 6:11, ఈజీ-టు-రీడ్ వర్షన్) సాతాను మన యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి మన మార్గంలో కపటోపాయాలను ఉంచుతాడు. దేవుని వాక్యంలో మన కోసం అపవాది ఉపయోగించే పద్ధతులు నమోదు చేయబడి ఉన్నాయి కాబట్టి, మనం ఈ పన్నాగాలను గుర్తించవచ్చు. అందుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. యేసు యోబుల యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి సాతాను చేసిన ప్రయత్నాలు, మన క్రైస్తవ యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి అతడు అవలంబించే కొన్ని మార్గాలను మనకు సోదాహరణంగా తెలియజేస్తాయి.
యేసు యథార్థత విచ్ఛిన్నం చేయబడలేదు
యేసు పరిచర్య ప్రారంభంలో, ఒక రాయిని రొట్టెగా మార్చమని సవాలు చేయడం ద్వారా సాతాను దేవుని కుమారుడ్ని శోధించడానికి తెగించాడు. ఎంత కపటం! యేసు 40 రోజుల నుండి ఏమీ తినలేదు కాబట్టి ఆయన ఆకలితో ఉన్నాడనడంలో సందేహం లేదు. (లూకా 4:2, 3) యెహోవా చిత్తానికి విరుద్ధమైన రీతిలో తన సహజమైన కోరికను వెంటనే తీర్చుకోమని సాతాను యేసుకు సూచించాడు. అదేవిధంగా నేడు కూడా ఈ లోక ప్రచారం, పర్యవసానాల గురించి ఏదో కాస్త ఆలోచించి లేదా అసలు ఏమాత్రం పట్టించుకోకుండా కోరికలను తక్షణమే తీర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. అదిచ్చే సందేశం ఏమిటంటే, ‘దాన్ని ఇప్పుడు పొందడానికి నీవు అర్హుడవు,’ లేదా రెండు ముక్కల్లో చెప్పాలంటే ‘నీ ఇష్టమొచ్చినట్లు చెయ్యి!’
యేసు పర్యవసానాల గురించి ఆలోచించకుండా తన ఆకలి బాధను తీర్చుకొని ఉంటే ఆయన తన యథార్థత విషయంలో రాజీపడేలా చేయడంలో సాతాను విజయం సాధించి ఉండేవాడు. యేసు విషయాలను యెహోవాను సంతోషపెట్టే కోణంలో చూశాడు, ఆయన స్థిరంగా ఇలా జవాబిచ్చాడు: ‘మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నది.’—లూకా 4:4; మత్తయి 4:4.
అప్పుడు సాతాను తన వ్యూహాన్ని మార్చాడు. యేసు ఉదాహరిస్తున్న లేఖనాలను తప్పుగా ఉపయోగిస్తూ దేవాలయ శిఖరము నుండి క్రిందికి దూకమని యేసును ప్రోత్సహించాడు. ‘దేవదూత నిన్ను రక్షిస్తాడు’ అని సాతాను వాదించాడు. అవధానాన్ని కేవలం తనవైపుకు మళ్ళించుకోవడానికి తన తండ్రి నుండి అద్భుతమైన రక్షణను బలవంతంగా పొందాలనే ఉద్దేశం యేసుకు లేదు. అందుకే, “నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు” అని యేసు అన్నాడు.—మత్తయి 4:5-7; లూకా 4:9-12.
సాతాను ఉపయోగించిన చివరి తంత్రం మరింత సూటిగా ఉంది. అతడు కేవలం సాగిలపడి నమస్కారం చేస్తే లోకరాజ్యాలన్నిటినీ, మత్తయి 4:8-11; లూకా 4:5-8.
వాటి మహిమనూ ఇస్తానన్న ఒప్పందం ద్వారా యేసును దెబ్బ తీయడానికి ప్రయత్నించాడు. సాతాను ఇవ్వగలిగేదంతా అది మాత్రమే. కానీ యేసు తన తండ్రి ప్రధాన శత్రువు ఎదుట సాగిలపడి నమస్కారం ఎలా చేయగలడు? ఆ ఆలోచనైనా రాదు! “ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను” అని యేసు జవాబిచ్చాడు.—అలా మూడు ప్రయత్నాలూ విఫలమయ్యేసరికి సాతాను, “మరో అవకాశం చిక్కేవరకు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.” (ఇటాలిక్కులు మావి.) (లూకా 4:13, విత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) యేసు యథార్థతను పరీక్షించడానికి అవకాశం కోసం సాతాను నిరంతరం జాగ్రత్తగా చూస్తున్నాడని ఇది సూచిస్తోంది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత అంటే సమీపించిన తన మరణం కోసం యేసు తన శిష్యులను సిద్ధం చేస్తున్నప్పుడు ఆ అవకాశం చిక్కింది. అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: ‘ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదు.’—మత్తయి 16:21, 22.
మంచి ఉద్దేశంతోనే ఇవ్వబడిన అలాంటి తప్పుడు సలహా తన శిష్యుల్లో ఒకరి నుండి వచ్చింది కాబట్టి, యేసుకు ఆ సలహా ఆకర్షణీయమైనదిగా అనిపించి ఉండవచ్చా? యేసు ఆ మాటలు యెహోవా ఆలోచనలను కాదుగానీ సాతాను ఆలోచనలనే వ్యక్తం చేస్తున్నాయని వెంటనే గుర్తించాడు. క్రీస్తు దృఢంగా ఇలా జవాబిచ్చాడు: ‘సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచడంలేదు.’—మత్తయి 16:23.
యేసుకు యెహోవా మీదున్న శాశ్వతమైన ప్రేమ, సాతాను ఆయన యథార్థతను విచ్ఛిన్నం చేయకుండా సహాయపడింది. అపవాది ఇవ్వజూపేదేదీ కూడా ఏ శోధనైనా, అదెంత తీవ్రమైనదైనా యేసు తన పరలోకపు తండ్రిపట్ల విశ్వసనీయంగా ఉండడాన్ని అది బలహీనపరచలేదు. పరిస్థితులు మనం యథార్థంగా ఉండడం కష్టమయ్యేలా చేసినప్పుడు మనం అలాంటి దృఢ నిశ్చయంతో ఉంటామా? మనం ఎదుర్కొనే అవకాశమున్న కష్టాలను చక్కగా అర్థం చేసుకోవడానికి యోబు మాదిరి మనకు సహాయపడుతుంది.
కష్టాలనుభవిస్తున్నప్పుడు విశ్వసనీయత
యోబు కనుగొన్నట్లు కష్టాలు ఎప్పుడైనా రావచ్చు. ఆయన, వివాహమై పదిమంది పిల్లలతో దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనిస్తూ సంతోషంగా జీవిస్తున్న వ్యక్తి. (యోబు 1:5) కానీ యోబు దేవునికి యథార్థంగా ఉండడం ఆయనకు తెలియకుండానే పరలోకపు సభలో ఒక వివాదాంశమయ్యింది, తనకు సాధ్యమైన ఏ మార్గంలోనైనా ఆయన యథార్థతను విచ్ఛిన్నం చేయాలని సాతాను దృఢంగా నిర్ణయించుకున్నాడు.
అతి తక్కువ కాలంలోనే యోబు తన సర్వసంపదలనూ కోల్పోయాడు. (యోబు 1:14-17) అయినప్పటికీ యోబు యథార్థత ఆ పరీక్షకు తట్టుకొని స్థిరంగా ఉంది, ఎందుకంటే ఆయన తన నమ్మకాన్ని ధనంపై ఎన్నడూ పెట్టుకోలేదు. తాను ధనవంతుడిగా ఉన్న కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యోబు ఇలా వ్యక్తం చేశాడు: “సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను . . . నా ఆస్తి గొప్పదని గాని . . . నేను సంతోషించిన యెడలను . . . పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును. అదియు . . . . నేరమగును.”—యోబు 31:24, 25, 27, 28.
నేడు కూడా దాదాపు మనకున్నదంతా రాత్రికి రాత్రి కోల్పోయే అవకాశముంది. యెహోవాసాక్షి అయిన ఒక వ్యాపారస్థుడు మోసగించబడి, చాలా పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోవడంవల్ల దాదాపు పూర్తిగా దివాలా తీశాడు. ఆయన నిస్సంకోచంగా ఇలా ఒప్పుకుంటున్నాడు: “నాకు దాదాపు గుండెపోటు వచ్చినట్లయ్యింది. నాకు దేవునితో సంబంధం లేనట్లయితే నాకు నిజంగా గుండెపోటు వచ్చుండేదే. ఏదేమైనా ఈ అనుభవం, నేను నా జీవితంలో ఆధ్యాత్మిక విషయాలను మొదటి స్థానంలో పెట్టలేదన్న వాస్తవాన్ని గ్రహించేలా చేసింది. డబ్బు సంపాదించాలన్న ఆతృత మిగతా విషయాలన్నీ అల్పమైనవిగా కనబడేటట్లు చేసింది.” ఈ సాక్షి అప్పటినుండి తన వ్యాపార కార్యకలాపాలను కనీస స్థాయికి తగ్గించుకొని సహాయ పయినీరుగా క్రమంగా సేవ చేస్తున్నాడు, క్రైస్తవ పరిచర్యలో నెలకు 50 లేదా అంతకంటే ఎక్కువ గంటల సమయాన్ని అంకితం చేస్తున్నాడు. అయినా ఇతర సమస్యలు ఆస్తి పోగొట్టుకోవడం కంటే మరింత నాశనకరంగా ఉండగలవు.
యోబు తాను తన సంపదలన్నింటినీ కోల్పోయిన వార్తను చాలా కష్టమ్మీద జీర్ణించుకుంటున్నాడు, ఇంతలో తన పదిమంది పిల్లలు చనిపోయారన్న వార్త అందింది. అయినా కూడా ఆయన “యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” అని నిశ్చలంగా అన్నాడు. (యోబు 1:18-21) అకస్మాత్తుగా మన కుటుంబ సభ్యుల్లో కొందరు చనిపోతే మనం కూడా మన యథార్థతను కాపాడుకుంటామా? స్పెయిన్‌లో ఉంటున్న ఫ్రాన్సీస్కో అనే ఒక క్రైస్తవ పైవిచారణకర్త ఒక విషాదకరమైన బస్సు ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నాడు. ఆయన యెహోవాకు మరింత దగ్గరవ్వడం ద్వారా క్రైస్తవ పరిచర్య కార్యకలాపాలను అధికం చేసుకోవడం ద్వారా ఓదార్పును పొందాడు.
తన పిల్లలను కోల్పోవడం వంటి గుండెను తల్లడిల్లజేసే నష్టం జరిగాక కూడా యోబు విషమ పరీక్ష అంతటితో ఆగిపోలేదు. యోబు 2:9, 10) ఆయన యథార్థత ఆయన కుటుంబ మద్దతుపై ఆధారపడినది కాదుగానీ యెహోవాతో ఆయనకున్న వ్యక్తిగత సంబంధంపై ఆధారపడినది.
సాతాను ఆయనకు ఒక అసహ్యకరమైన బాధాకరమైన వ్యాధి వచ్చేలా చేశాడు. ఆ సమయంలో యోబు తన భార్య నుండి చాలా తప్పుడు సలహాను పొందాడు. ‘దేవుని దూషించి మరణించు’ అని ఆమె ఆయనను తొందరపెట్టింది. యోబు ఆమె సలహాను పట్టించుకోలేదు, ఆయన “నోటిమాటతోనైనను పాపము చేయలేదు.” (పది సంవత్సరాల కంటే ఎక్కువకాలం క్రితం ఫ్లోరా భర్తా, ఆమె పెద్ద కుమారుడూ క్రైస్తవ మార్గాన్ని వదిలి పెట్టేశారు. యోబు అనుభవించిన మానసిక వ్యధను ఆమె అర్థంచేసుకుంది. “మీ కుటుంబం నుండి ఆధ్యాత్మిక, భావోద్వేగపరమైన మద్దతును హఠాత్తుగా కోల్పోతే పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది” అని ఆమె అంగీకరిస్తోంది. “కానీ నేను యెహోవా సంస్థ బయట సంతోషాన్ని పొందలేనని నాకు బాగా తెలుసు. అందుకే నేను స్థిరంగా నిలబడి నా జీవితంలో యెహోవాను మొదటి స్థానంలో పెట్టాను, అదే సమయంలో ఒక మంచి భార్యగా మంచి తల్లిగా ఉండడానికి కృషిచేస్తూ ఉన్నాను. నేను ఎడతెగకుండా ప్రార్థించాను, యెహోవా నన్ను బలపరిచాడు. నా భర్తనుండి వ్యతిరేకత బలంగా ఉన్నప్పటికీ నేను పూర్తిగా యెహోవా మీద ఆధారపడడం నేర్చుకున్నాను కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను” అని ఆమె చెబుతోంది.
యోబు యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి సాతాను ఉపయోగించిన తర్వాతి పన్నాగంలో ఆయన ముగ్గురు స్నేహితులు ఉన్నారు. (యోబు 2:11-13) వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టే సరికి అది ఆయనకు ఎంతో బాధను కలిగించి ఉంటుంది. ఆయన వారి వాదాలను గనుక ఒప్పుకుని ఉంటే ఆయన యెహోవా దేవునిపై తన నమ్మకాన్ని కోల్పోయుండేవాడు. నిరుత్సాహపరిచే వారి సలహా ఆయనను కృంగదీసి ఆయన యథార్థతను విచ్ఛిన్నం చేసి ఉండేది, ఆ విధంగా సాతాను కుట్ర విజయవంతమయ్యుండేది.
దానికి భిన్నంగా యోబు, “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని ఖరాఖండీగా అన్నాడు. (యోబు 27:5) ‘నేను నా యథార్థతను విడిచిపెట్టేలా చేసేందుకు మిమ్మల్ని అనుమతించను!’ అని ఆయన అనలేదు, తన యథార్థత తనపైనా యెహోవాపై తనకున్న ప్రేమపైనా ఆధారపడి ఉందని యోబుకు తెలుసు.
కొత్త వేటను వేటాడడానికి పాత పన్నాగం
స్నేహితుల ద్వారా తోటి విశ్వాసుల ద్వారా తప్పుదారి పట్టించే సలహాను లేదా ఆలోచనారహితమైన వ్యాఖ్యానాలను సాతాను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. సంఘం బయట హింసల కంటే సంఘంలోపల ఎదురయ్యే నిరుత్సాహమే మన విశ్వాసాన్ని సులభంగా బలహీనపరచగలదు. గతంలో ఒక సైనికుడిగా యుద్ధాన్ని చవిచూసిన ఒక క్రైస్తవ పెద్ద ఆ యుద్ధంలో తను పడ్డ బాధను, కొందరు తోటి క్రైస్తవుల అనాలోచితమైన మాటలవల్ల చర్యలవల్ల అనుభవించిన బాధతో పోల్చి విశిష్టమైన భేదాన్ని చూపించాడు. రెండవ దాని గురించి ఆయన ఇలా అన్నాడు: “నేను అనుభవించిన బాధల్లో ఇది అత్యంత కఠినమైనది.”
మరొక దృక్కోణం నుండి అంటే మనం కొందరితో మాట్లాడడం మానేసేంతగా లేదా చివరికి క్రైస్తవ కూటాలకు వెళ్ళడం మానుకునేంతగా మన తోటి విశ్వాసుల అపరిపూర్ణతలు మనల్ని కలతపరచవచ్చు. గాయపడిన మన మనోభావాలకు ఓదార్పునివ్వడమే అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా అనిపిస్తుండవచ్చు. కానీ అలాంటి ముందుచూపు లేని దృక్కోణంతో, ఇతరులు ఏదో చేశారనో అన్నారనో మన అత్యంత అమూల్యమైన ఆస్తి—యెహోవాతో మనకున్న సంబంధం—బలహీనమవడానికి అనుమతించడం ఎంత విచారకరం. అలా జరిగేందుకు మనం గనుక అనుమతిస్తే సాతాను పాత పన్నాగాల్లో ఒకదానికి మనం ఎర అవుతాం.
మనం క్రైస్తవ సంఘంలో ఉన్నత ప్రమాణాల కోసం చూస్తామన్నది అర్థం చేసుకోదగిన విషయమే. కానీ ఇంకా అపరిపూర్ణులే అయిన మన తోటి ఆరాధకుల నుండి ఎక్కువగా ఎదురు చూసినట్లయితే, మనం నిరాశపడడం ఖాయం. దానికి భిన్నంగా, యెహోవా తన సేవకుల నుండి కోరేవాటి విషయంలో వాస్తవికంగా ఉంటాడు. మనం ఆయన మాదిరిని అనుకరించినట్లయితే మనం వారి అపరిపూర్ణతలను సహించడానికి సిద్ధంగా ఉంటాం. (ఎఫెసీయులు 4:1, 2, 32) అపొస్తలుడైన పౌలు ఈ సలహా ఇచ్చాడు: “కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.”—ఎఫెసీయులు 4:26-28.
బైబిలు స్పష్టంగా చూపిస్తున్నట్లు, సాతాను ఒక క్రైస్తవుని యథార్థతను విచ్ఛిన్నం చేయడానికి—అదీ తనకు సాధ్యమైతేనే—మార్గాన్ని కనుగొనేందుకు వివిధ రకాలైన పన్నాగాలను ఉపయోగిస్తాడు. అతని పన్నాగాల్లో కొన్ని తుచ్ఛమైన శరీరానికి ఆకర్షణీయంగా ఉంటాయి, మరికొన్ని బాధకు మూలంగా ఉంటాయి. వీటికి మీరు ఎన్నడూ ఎందుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదో ఇప్పటివరకు జరిగిన చర్చ నుండి అర్థం చేసుకోవచ్చు. మీ హృదయంలో స్థిరంగా ఉన్న దేవుని మీది ప్రేమతో, అపవాది అబద్ధికుడని రుజువు చేయడానికి తీర్మానించుకొని యెహోవా హృదయాన్ని సంతోషపరచండి. (సామెతలు 27:11; యోహాను 8:44) మన మార్గంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ నిజమైన క్రైస్తవ యథార్థత విషయంలో ఎన్నటికీ రాజీపడకూడదన్నది గుర్తుంచుకోండి.