కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆయన శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు’

‘ఆయన శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు’

‘ఆయన శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు’

బైబిలులో చెప్పబడిన ప్రాంతాల్లోని ఉష్ణ వాతావరణంలో, గొర్రెలు ప్రతీరోజు నీళ్ళు త్రాగవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి, తన మందకు నీళ్ళు పెట్టడమనేది కాపరి చేయవలసిన పనిలో ప్రాముఖ్యమైన భాగం. కొన్నిసార్లు కాపరులు తమ మందలకోసం బావిలోంచి నీళ్ళు తోడి, గొర్రెలు త్రాగడానికి వీలుగా తొట్టెలలో పోస్తారు. (ఆదికాండము 29:​1-3) అయితే, ప్రత్యేకించి వర్షాకాలంలో చిన్న చిన్న వాగుల చుట్టూ నదుల చుట్టూ ఉండే ప్రదేశాలు ప్రశాంతమైన స్థలాలుగా, ‘సమృద్ధిగా జలములున్న విశ్రాంతి స్థలాలుగా’ ఉంటాయి.​—⁠కీర్తన 23:​2, NW.

తన మందకు తగిన పచ్చిక, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో ఒక మంచి కాపరికి తెలిసివుండాలి. ఒక ప్రాంతం విషయంలో ఆయన పూర్తి జ్ఞానాన్ని కలిగివుండడం, ఆయన గొర్రెల సంక్షేమానికి హామీ ఇస్తుంది. యూదయ కొండలలో గొర్రెలు కాచుకుంటూ అనేక సంవత్సరాలు గడిపిన దావీదు, దేవుని ఆధ్యాత్మిక నడిపింపును ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను మంచి పచ్చికగల ప్రాంతాలకు, జీవాన్నిచ్చే నీళ్ళున్న ప్రాంతాలకు నడిపించడంతో పోల్చాడు. “ఆయన . . . శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు” అని దావీదు అన్నాడు.​—⁠కీర్తన 23:​1-3.

సంవత్సరాల తర్వాత, యెహోవా తన ప్రవక్తయైన యెహెజ్కేలు ద్వారా అలాంటి ఉపమానాన్నే ఉపయోగించాడు. ఒక కాపరి తన గొర్రెలను పోగుచేసినట్లు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి ఉన్న తన ప్రజలను ఆ ప్రాంతాల నుండి తాను పోగు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. “వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను . . . వాటిని మేపెదను” అని ఆయన వారికి హామీ ఇచ్చాడు.​—⁠యెహెజ్కేలు 34:​13.

యెహోవా దేవుడు ఆధ్యాత్మిక నీళ్ళను అందించే విషయంలో కూడా చాలా శ్రద్ధ కలిగివున్నాడు. దేవుని సింహాసనం దగ్గర నుండి ప్రవహించే “జీవజలముల నది”ని ప్రకటన గ్రంథం వర్ణిస్తుంది. (ప్రకటన 22:⁠1) ఈ నది నీళ్ళు త్రాగమన్న ఆహ్వానం ప్రజలందరికీ ఇవ్వబడుతుంది. ‘ఇచ్ఛయించువాడు జీవజలమును ఉచితముగా పుచ్చుకొనవచ్చు.’​—⁠ప్రకటన 22:​17.

ఈ సూచనార్థకమైన జీవజలము, నిత్యజీవం కోసం దేవుడు చేసిన ఏర్పాట్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ‘అద్వితీయ సత్యదేవుని గురించిన ఆయన పంపిన యేసుక్రీస్తును గురించిన జ్ఞానము సంపాదించుకోవడం’ ద్వారా ఎవరైనా ఆ జలమును త్రాగడం ప్రారంభించవచ్చు.​—⁠యోహాను 17:​3, NW.