కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజ్యమందిరానికి గుర్తింపు పతకం

రాజ్యమందిరానికి గుర్తింపు పతకం

రా జ్య ప్ర చా ర కు ల ని వే ది క

రాజ్యమందిరానికి గుర్తింపు పతకం

ఫిన్‌లాండ్‌లోని పర్యావరణ మంత్రిత్వపు శాఖ, 2000 సంవత్సరాన్ని “లాండ్‌స్కేప్‌ సంవత్సరం”గా ప్రకటించింది. ఆ కార్యక్రమపు వ్యవస్థాపకులలో ఒకరు, “లాండ్‌స్కేప్‌ను (ప్రకృతి దృశ్యాలను కళాత్మకంగా తీర్చిదిద్దడం) సంవత్సరపు అంశంగా ఉపయోగించడానికి గల ఉద్దేశం, పచ్చని పరిసరాలు మన దైనందిన జీవితాలపై, మన సంక్షేమంపై చూపగల ప్రభావాన్ని మనందరికి గుర్తుచేయడమే” అని పేర్కొన్నారు.

2001, జనవరి 12న, ఫిన్నిష్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాండ్‌స్కేప్‌ ఇండస్ట్రీస్‌ నుండి ఫిన్‌లాండ్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఒక ఉత్తరం వచ్చింది. టిక్కురిలాలోని యెహోవాసాక్షుల రాజ్యమందిరపు పరిసరాలను అద్భుతంగా తీర్చిదిద్దడం వల్ల, తోటను చక్కగా లాండ్‌స్కేప్‌ చేయడం వల్ల దానికి ఆ సంవత్సరపు లాండ్‌స్కేపింగ్‌ పతకాలలో ఒకటి బహుకరించబడిందని ఆ ఉత్తరం వివరించింది. “రాజ్యమందిరం రూపం వేసవి కాలంలోనూ చలికాలంలోనూ ఆహ్లాదకరంగా, కళాత్మకత ఉట్టిపడుతూ అందంగా, అత్యుత్తమ నాణ్యతతో ఉంది” అని ఆ ఉత్తరంలో ఉంది.

ఫిన్‌లాండ్‌లోని టాంపీర్‌లో ఉన్న రోజెండాల్‌ హోటల్‌లో 400 మంది నిపుణులు, వ్యాపారవేత్తలు హాజరైన ఒక కార్యక్రమంలో యెహోవాసాక్షులకు ఆ పతకం అందించబడింది. ఫిన్నిష్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాండ్‌స్కేప్‌ ఇండస్ట్రీస్‌, వార్తాపత్రికలకూ ఇతర వార్తా మాధ్యమాలకూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన ఇలా ఉంది: “దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో, దాదాపు అన్ని సందర్భాల్లోనూ యెహోవాసాక్షుల రాజ్యమందిరాలు అందంగా తీర్చిదిద్దబడివున్నాయి. వారు పర్యావరణంపట్ల తీసుకునే శ్రద్ధ, అక్కడనుండి వెళ్ళే ప్రతి వ్యక్తి ఆసక్తిని రేకెత్తిస్తుంది. టిక్కురిలాలోని రాజ్యమందిరం, ఒక రమణీయమైన తోటకు చక్కని ఉదాహరణ. ఆ బిల్డింగ్‌, దాని చుట్టూ ఉన్న ప్రదేశమూ రెండూ నిర్మలత్వాన్నీ, సమతుల్యతనూ ప్రదర్శిస్తాయి.”

ఫిన్‌లాండ్‌లో 233 రాజ్యమందిరాలు ఉన్నాయి, వీటిలో చాలా రాజ్యమందిరాల చుట్టూ అందమైన తోటలు ఉన్నాయి. అయితే ఈ ప్రదేశాలను నిజంగా అందంగా చేసేది, అవి సత్యారాధనకు, బైబిలు విద్యకు కేంద్రాలు అన్నదే. ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలకంటే ఎక్కువమంది యెహోవాసాక్షులకు ఒక రాజ్యమందిరం​—⁠అది చక్కగా తీర్చిదిద్దబడినదైనా, నిరాడంబరమైనదైనా​—⁠ఎంతో ప్రియమైన ప్రదేశం. అందుకే వారు దాన్ని చక్కగా ప్రేమపూర్వకంగా శ్రద్ధగా చూసుకోవడంలో ఆసక్తిని చూపిస్తారు. మీ ప్రాంతంలో అందరికీ రాజ్యమందిరపు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి!