కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

మరో మత గుంపు నుండి ఒక భవనాన్ని కొనుక్కొని దాన్ని రాజ్యమందిరంగా మార్చుకోవడం ఒక విధంగా చెప్పాలంటే మిశ్రిత విశ్వాసంతో సమానమవుతుందా?

సాధారణంగా యెహోవాసాక్షులు ఇతర మతాలతో అలాంటి వ్యవహారాలను నివారిస్తారు. ఒకవేళ అలాంటి వ్యవహారం జరిగినప్పటికీ అది మిశ్రిత విశ్వాసంతో సమానం కాదు. దాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే వ్యాపార వ్యవహారంగా దృష్టించవచ్చు. యెహోవాసాక్షుల స్థానిక సంఘం మరో మత గుంపుతో కలిసి ఇరువర్గాలూ ఉపయోగించుకునేలా ఒక ఆరాధనా స్థలాన్నేమీ నిర్మించడం లేదు.

మరైతే యెహోవా దృష్టిలో ఏది మిశ్రిత విశ్వాసంతో సమానమవుతుంది? అపొస్తలుడైన పౌలు ఇస్తున్న ఈ నిర్దేశాన్ని పరిశీలించండి: ‘మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని, నేను మిమ్మును చేర్చుకొందునని ప్రభువు చెప్పుచున్నాడు.’ (2 కొరింథీయులు 6:​14-18) “సాంగత్యము,” “పొత్తు” అనే పదాలను ఉపయోగించడం ద్వారా పౌలు చెప్పాలనుకుంటున్నదేమిటి?

పౌలు పేర్కొన్న సాంగత్యములో విగ్రహారాధకులతోనూ అవిశ్వాసులతోనూ కలిసి ఆరాధించడం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి వారితో వ్యవహరించడం స్పష్టంగా చేరి ఉన్నాయి. ‘దయ్యముల బల్లమీద ఉన్నదానిలో పాలుపొందడం’ గురించి ఆయన కొరింథీయులను హెచ్చరించాడు. (1 కొరింథీయులు 10:​20, 21) కాబట్టి, ఇతర మత సంస్థలతో కలిసి ఆరాధనలో భాగం వహించడం లేదా వాటితో ఆధ్యాత్మికపరంగా సాంగత్యము చేయడం మిశ్రిత విశ్వాసానికి సంబంధించిన చర్యగా పరిగణించబడుతుంది. (నిర్గమకాండము 20:5; 23:13; 34:​12) ఒక మత సంస్థ ఉపయోగించుకుంటున్న భవనాన్ని కొనుగోలు చేయడంలోని ఉద్దేశం రాజ్యమందిరానికి అవసరమైన ఒక భవంతిని సంపాదించుకోవాలన్నదే. రాజ్యమందిరంగా ఉపయోగించుకోవడానికి ముందు దానిలో అబద్ధ ఆరాధనకు సంబంధించినవేవీ ఉండకుండా తీసివేయబడతాయి. అలా చేసిన తర్వాత, యెహోవా ఆరాధన కోసం మాత్రమే ఉపయోగించేందుకు అది ఆయనకు ప్రతిష్ఠించబడుతుంది. సత్యారాధనకు, అబద్ధ ఆరాధనకు ఏ విధమైన పొత్తు లేదా సాంగత్యము ఉండదు.

అలాంటి కొనుగోలుకు సంబంధించిన వివరాలను చర్చించడంలో, అవతలి పార్టీతో సంబంధాలు పరిమితంగా ఉండాలి, కేవలం కొనుగోలుకు సంబంధించినవే అయ్యుండాలి. “అవిశ్వాసులతో జోడుగా” ఉండవద్దని పౌలు చేసిన హెచ్చరికను క్రైస్తవ సంఘ సభ్యులు మనస్సులో ఉంచుకోవడం మంచిది. ఇతర విశ్వాసాలు గలవారి కంటే మనమేదో ఉన్నతులమని మనం భావించకపోయినప్పటికీ వారితో కలిసి మెలిసి ఉండడాన్ని లేదా వారి ఆరాధనలో కలిసేలా ప్రభావితమవ్వడాన్ని మనం నివారిస్తాము. *

ఒక మత సంస్థకు చెందిన ఒక భవనాన్ని సంఘం అద్దెకు తీసుకోవాలనుకుంటే అప్పుడేమిటి? అద్దెకు తీసుకుంటే సాధారణంగా ఆ మత సంస్థ సభ్యులతో తరచూ సంప్రదింపులు జరపవలసి ఉంటుంది, దాన్ని మనం నివారించాలి. ఏదైనా ఒక సందర్భం కోసం మాత్రమే అలాంటి భవనాన్ని అద్దెకు తీసుకోవాలన్నా, పెద్దల సభ ఈ విషయాలను పరిశీలించాలి: భవనం లోపల లేదా వెలుపల విగ్రహాలు గానీ మతసంబంధమైన చిహ్నాలు గానీ ఉంటాయా? మనం ఆ భవనాన్ని ఉపయోగించుకోవడాన్ని ఆ పరిసరాల్లోని ప్రజలు ఎలా దృష్టిస్తారు? మనం ఆ భవనాన్ని ఉపయోగించుకోవడాన్ని బట్టి సంఘంలోని వారెవరైనా అభ్యంతరపడతారా? (మత్తయి 18:6; 1 కొరింథీయులు 8:7-13) పెద్దలు ఈ అంశాలను పరిశీలించుకుని తదనుగుణంగా చర్య తీసుకుంటారు. అలాంటి భవనాన్ని కొనుగోలు చేసి రాజ్యమందిరంగా మార్చాలా వద్దా అనేది నిశ్చయించుకోవడంలో వారు తమ స్వంత మనస్సాక్షిని, అలాగే సంఘ సభ్యుల మనస్సాక్షిని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

[అధస్సూచి]

^ పేరా 6 యెహోవా ఆమోదించని సంస్థలతో వ్యాపార వ్యవహారాలు కలిగివుండడం సముచితమా అన్నదానికి సంబంధించిన సమాచారం కోసం కావలికోట, ఏప్రిల్‌ 15, 1999, 28, 29 పేజీలు చూడండి.

[27వ పేజీలోని చిత్రం]

ఒకప్పుడు చర్చీగా ఉన్న ఈ భవనాన్ని కొనుగోలు చేసి రాజ్యమందిరంగా మార్చడం జరిగింది