కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్యాప్టన్‌ టేబుల్‌పై అందించబడింది

క్యాప్టన్‌ టేబుల్‌పై అందించబడింది

క్యాప్టన్‌ టేబుల్‌పై అందించబడింది

ఆసక్తికరమైన ప్రజలు, రుచికరమైన ఆహారం, ఆహ్లాదకరమైన సంభాషణ, ఇవన్నీ ఓడలోని క్యాప్టన్‌ టేబుల్‌ వద్ద భోజనం చేయడాన్ని ఆహ్లాదకరం చేస్తాయి. అయితే వైట్‌ స్టార్‌ లైన్‌కు (బ్రిటీష్‌ సముద్రపు ఓడల కంపెనీ) చెందిన క్యాప్టన్‌ రాబర్ట్‌ జి. స్మిత్‌ ఆధ్యాత్మిక విందును గురించి వెల్లడిచేశాడు.​—⁠యెషయా 25:⁠6.

1894వ సంవత్సరంలో, 24 సంవత్సరాల రాబర్ట్‌, మొదటిసారిగా ప్రపంచం చుట్టూ సముద్ర ప్రయాణం చేయడానికి కిన్‌క్లూన్‌ ఆఫ్‌ డండీ అనే ఓడకు క్యాప్టన్‌ అయ్యాడు. తర్వాత సెడ్రిక్‌, సెవిస్‌, ర్యూనిక్‌ వంటి వైట్‌ స్టార్‌ కంపెనీ ఓడలకు క్యాప్టన్‌గా పనిచేశాడు. * న్యూయార్క్‌ నుండి ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌కు వెళ్ళడానికి అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని దాటేటప్పుడు, పైన చెప్పబడిన ఓడలలోని ఒక దాంట్లో, రాబర్ట్‌ క్యాప్టన్‌ టేబుల్‌ వద్ద చార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. రస్సెల్‌తో జరిగిన సంభాషణ, బైబిలు సందేశంపట్ల రాబర్ట్‌ ఆసక్తిని రేకెత్తించింది. తాను ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి సహాయపడేందుకు ఆయన రస్సెల్‌ నుండి స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ ప్రతులను సంతోషంగా స్వీకరించాడు.

రస్సెల్‌ ఉత్తరాలు వ్రాస్తూ ఉండడం వల్ల బైబిలు సందేశం పట్ల రాబర్ట్‌కున్న ఆసక్తి పెరిగింది. రాబర్ట్‌, తాను క్రొత్తగా కనుగొన్న జ్ఞానాన్ని తన భార్యతో పంచుకున్నాడు. ఎంతోకాలం గడవక ముందే, వారిద్దరూ చురుకైన బైబిలు విద్యార్థులుగా (అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు) తయారయ్యారు. కొంతకాలం తర్వాత రాబర్ట్‌కు బైబిలు ప్రసంగాలిచ్చే ఆధిక్యత లభించింది. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో ఆయన “గిలాదు గుగ్గిలము” అనే అంశంపై మాట్లాడుతూ, “భూమ్మీదున్న దుఃఖాలన్నింటికీ విరుగుడు”లాంటి సందేశాన్ని దేవుని వాక్యం కలిగివుందని చూపించాడు. ఇంగ్లాండ్‌లో ఆయన భార్య, పిల్లలు “ఫోటో-డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌”ను ప్రదర్శించడానికి సహాయపడేవారు. స్లైడ్‌లు చూపించబడుతున్నప్పుడు వారు రస్సెల్‌ వ్యాఖ్యానాల రికార్డింగులను ప్లే చేసి వినిపించేవారు.

రాబర్ట్‌ తాను పొందిన రాజ్య సత్యపు వారసత్వాన్ని తన పిల్లలకు అందజేశాడు. ఐదు తరాల తర్వాత నేడు, 18 మంది కుటుంబ సభ్యులు క్యాప్టన్‌ టేబుల్‌పై అందించబడినదానికి కృతజ్ఞతతో సువార్తను ఇతరులతో పంచుకోవడంలో చురుగ్గా పనిచేస్తున్నారు.

ఒకప్పుడు క్యాప్టన్‌ స్మిత్‌ను అంతగా ఆసక్తిపరచిన బైబిలు సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు నేర్చుకోవడానికి యెహోవాసాక్షులు తమ ప్రచురణల ద్వారా, బైబిలు విద్యా పని ద్వారా సహాయపడుతున్నారు. క్యాప్టన్‌ టేబుల్‌ వద్ద ఆసక్తికరంగా ఉన్నది ఏమిటో మీరు కూడా కనుక్కోవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 3 అలాంటి మరో ఓడ టైటానిక్‌, క్యాప్టన్‌ ఇ. జె. స్మిత్‌ (రాబర్ట్‌ జి. స్మిత్‌ బంధువు కాదు) ఆధ్వర్యంలో విపత్కరమైన తన మొదటి సముద్రప్రయాణాన్ని ప్రారంభించింది.

[8వ పేజీలోని చిత్రం]

రాబర్ట్‌ జి. స్మిత్‌

[8వ పేజీలోని చిత్రం]

చార్లెస్‌ టి. రస్సెల్‌