కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవించివుండడానికి అత్యుత్తమమైన సమయం

జీవించివుండడానికి అత్యుత్తమమైన సమయం

జీవించివుండడానికి అత్యుత్తమమైన సమయం

మీరు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు గడిచిన మంచి రోజులు మళ్ళీ రావాలని వాటి కోసం పరితపిస్తారా? అలా అయితే జ్ఞానియైన సొలొమోను రాజు మాటలను పరిగణలోనికి తీసుకోండి: “ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు.”​—⁠ప్రసంగి 7:​10.

సొలొమోను ఆ సలహా ఎందుకిచ్చాడు? ఎందుకంటే, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితులతో విజయవంతంగా వ్యవహరించడానికి గతాన్ని వాస్తవిక దృష్టితో చూడడం ఎంతో విలువైన సహాయకం అని ఆయనకు తెలుసు. గడిచిన మంచి రోజుల గురించి పరితపించే వారు, నిజానికి ఆ రోజులు కూడా సమస్యలతో కష్టాలతో నిండివుండేవనీ జీవితం నిజంగా ఎప్పుడూ ప్రశాంతంగా లేదనీ మరచిపోతుండవచ్చు. గతంలో జరిగిన విషయాల్లో కొన్ని మంచివై ఉండవచ్చు, ఇతర విషయాలు అంత మంచివికాకపోయి ఉండవచ్చు. సొలొమోను చెప్పినట్లు, అవాస్తవికంగా గతాన్ని గూర్చి ఆలోచించడం యుక్తమైనది కాదు ఎందుకంటే మనం గడిచిన రోజులను తిరిగి తెచ్చుకోలేమన్నది స్పష్టం.

తీరని వాంఛతో గతం గురించి పరితపించడంలో ఏదైనా హాని ఉండగలదా? అవును, అది మనం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారి సర్దుకుపోనివ్వకుండా చేస్తే లేక మనం జీవిస్తున్న కాలాన్నీ మనదవ్వగల నిరీక్షణనూ కృతజ్ఞతతో గ్రహించనివ్వకుండా చేస్తే అది మనకు హానికరమే.

నిజానికి, ప్రపంచ సమస్యలు పెరుగుతున్నప్పటికీ మనం జీవించివుండడానికి ఇదే అత్యుత్తమమైన సమయం. ఎందుకు? ఎందుకంటే మన భూమి గురించీ తన రాజ్యం చేయబోయే శాంతియుతమైన పరిపాలనలో ఉండే ఆశీర్వాదాల గురించీ దేవుని సంకల్పాలు నెరవేరబోయే సమయం సమీపించింది. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపో[తాయి].” (ప్రకటన 21:⁠4) అప్పుడు, ఎంతో మెరుగైన పరిస్థితులలో, గడిచిన మంచి రోజుల కోసం పరితపించవలసిన అవసరం ఎవ్వరికీ ఉండదు.