కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అది సాతాను శకమా?

అది సాతాను శకమా?

అది సాతాను శకమా?

“ఈ శతాబ్దంలోని దుష్టత్వం స్థాయిని బట్టి చూస్తే, దీన్ని సాతాను శకమని పిలవడం సబబే. ప్రజలు జాతి, మత, వర్గ కారణాలను బట్టి లక్షలాదిమంది ఇతరులను చంపడానికి గతంలోని ఏ కాలంలోనూ ఇంత విపరీత వైఖరిని, తీవ్రకాంక్షను చూపించలేదు.”

నాజీ మృత్యు శిబిరాల్లో బంధించబడిన నిర్దోషులైన బాధితుల విముక్తి యొక్క 50వ వార్షికోత్సవం, 1995, జనవరి 26వ తేదీ ద న్యూయార్క్‌ టైమ్స్‌ సంపాదకీయంలో పై వ్యాఖ్యానం చేయబడేలా పురికొల్పింది. చరిత్రలో సర్వవిధితమైన జాతి నిర్మూలనాల్లో ఒకటైన హోలోకాస్ట్‌ దాదాపు 60 లక్షలమంది యూదులను సమూలంగా నాశనం చేసింది. “విస్మరించిన హోలోకాస్ట్‌” అని పిలువబడిన దానిలో సుమారు 30 లక్షలమంది యూదేతర పోలాండ్‌ పౌరులు మరణించారు.

“1900 నుండి 1989 మధ్య కాలంలో యుద్ధం మూలంగా 8.6 కోట్లమంది మరణించివుండవచ్చని అంచనా వేయబడింది” అని జోనథన్‌ గ్లోవర్‌ హ్యుమానిటీ​—⁠ఎ మోరల్‌ హిస్టరీ ఆఫ్‌ ద ట్వంటియత్‌ సెంచురీ అనే తన పుస్తకంలో అన్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “ఇరవయ్యవ శతాబ్దపు యుద్ధాల్లో మరణం ఏ స్థాయిలో సంభవించిందన్న విషయాన్ని అంత సులభంగా అర్థం చేసుకోలేము. సగటున ఇంతమంది మరణించారని చెప్పడం వాస్తవాలతో పొందికగా ఉండదు, ఎందుకంటే రెండు ప్రపంచ యుద్ధాల్లో దాదాపు మూడింట రెండొంతులమంది (5.8 కోట్లు) చంపబడ్డారు. కానీ ఈ మరణాలు ఇరవయ్యవ శతాబ్దమంతటా క్రమంగా సంభవించి ఉంటే, యుద్ధం మూలంగా ప్రతిరోజు దాదాపు 2,500 మంది చంపబడేవారు అంటే గంటకు 100 మంది చొప్పున తొంభై సంవత్సరాలపాటు నిర్విరామంగా చంపబడేవారు.”

ఆ కారణంగానే 20వ శతాబ్దం, మానవజాతి ఇంతవరకూ చూసిన వాటిలోకెల్లా ఘోరాతి ఘోరమైన రక్తపాత శతాబ్దం అని పిలువబడింది. హోప్‌ ఎగైనెస్ట్‌ హోప్‌ అనే పుస్తకంలో నాడెజ్డా మాండెల్‌స్టామ్‌ ఇలా వ్రాసింది: “మానవత్వపు విలువలు అపఖ్యాతిపాలు చేయబడి, అణగద్రొక్కబడడంతో దుష్టత్వం విజయం సాధించడాన్ని మనం చూశాము.” మరైతే మంచితనానికీ దుష్టత్వానికీ మధ్య పోరాటంలో దుష్టత్వం నిజంగానే విజయం సాధించిందా?

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

U.S. Department of Energy photograph

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

U.S. Department of Energy photograph