కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు అధ్యయనం చేయక ముందు, చేసిన తర్వాత

బైబిలు అధ్యయనం చేయక ముందు, చేసిన తర్వాత

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును”

బైబిలు అధ్యయనం చేయక ముందు, చేసిన తర్వాత

టోనీ యౌవనస్థుడిగా ఉన్నప్పుడు మీరు అతనిని కలిసివుంటే,ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పేరుగాంచిన చెడు ప్రదేశాలను తరచూ సందర్శించే ఆవేశపరుడైన మొరటు అబ్బాయిని మీరు చూసివుండేవారు. ముఠా సభ్యులు అతని స్నేహితులు. వారు తరచూ దొంగతనాలు, ముఠా పోరాటాలు, వీధుల్లో తుపాకులతో పోరాటాలు చేసేవారు.

టోనీ తొమ్మిదేళ్ళకే పొగత్రాగడం ప్రారంభించాడు. 14 ఏళ్ళకు అతను గంజాయిని వాడుతూ అనైతిక జీవితాన్ని గడిపేవాడు. 16 ఏళ్ళకల్లా అతను హెరాయిన్‌కు బానిసయ్యాడు, దానివల్ల అతను కొకైన్‌, ఎల్‌ఎస్‌డి వాడడం ప్రారంభించాడు. “నిజానికి, నాకు మత్తుకలిగించే దేన్నైనా నేను వాడేవాడిని” అని టోనీ చెబుతున్నాడు. ఆ తర్వాత అతను మాదకద్రవ్యాలను సరఫరా చేసే పేరుమోసిన నేరస్థుల రెండు ముఠాలతో సంబంధాలను ఏర్పర్చుకున్నాడు. ఎంతోకాలం గడవక ముందే, టోనీ ఆస్ట్రేలియాలోని తూర్పు తీరప్రాంతాల్లో మాదకద్రవ్యాలను సరఫరా చేసే అతి నమ్మకస్థుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

గంజాయి, హెరాయిన్‌ వాడే అలవాటు వల్ల టోనీకి రోజుకి 8,000 నుండి 16,000 రూపాయిల వరకూ ఖర్చయ్యేది. అయితే అతని కుటుంబం అనేక ఇతర రీతుల్లో కూడా బాధపడవలసి వచ్చేది. “మా ఇంట్లో ఉన్న మాదకద్రవ్యాల కోసం, డబ్బు కోసం వెదకుతున్న నేరస్థులు అనేక సందర్భాల్లో నా భార్యను నన్ను తుపాకులతో కత్తులతో బెదిరించేవారు” అని అతను చెబుతున్నాడు. మూడుసార్లు జైల్లో ఉన్న తర్వాత, తన జీవితవిధానం తనను ఎక్కడకు నడిపిస్తుందో గంభీరంగా ఆలోచించాలని టోనీకి అనిపించింది.

టోనీ చర్చికి వెళ్ళేవాడు, అయితే పాపులకు శిక్ష విధిస్తూ వారిని నిరంతరం నరకంలో కాల్చే దేవునికి అతను దగ్గర కాలేకపోయాడు. అయితే ఇద్దరు యెహోవాసాక్షులు అతనిని సందర్శించినప్పుడు దేవుడు అలాంటివాడు కాదని తెలుసుకొని టోనీ ఆశ్చర్యపోయాడు. తన జీవితాన్ని నిజంగానే సరిచేసుకొని తాను దేవుని ఆశీర్వాదాలను పొందవచ్చని టోనీ సంతోషించాడు. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు టోనీని ప్రేరేపించాయి: “దేవునికి సమస్తమును సాధ్యమే.” (మార్కు 10:​27) ప్రత్యేకంగా, “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అనే మాటలు టోనీని ఎంతో ప్రోత్సహించాయి.​—⁠యాకోబు 4:⁠8.

ఇప్పుడు తన జీవితాన్ని బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా మలచుకోవడమనే సవాలును టోనీ ఎదుర్కొన్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “నేను చేసిన మొదటి పని ఏమిటంటే పొగత్రాగడాన్ని మానేయడం, ఇంతకుముందు నేను ఎన్నోసార్లు అలా చేయడానికి ప్రయత్నించినప్పటికీ నేను మానుకోలేకపోయాను. నన్ను గత 15 సంవత్సరాలుగా అదుపుచేసిన హెరాయిన్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాల అలవాట్లను నేను యెహోవా శక్తితో మానుకోగలిగాను. ఈ అలవాట్లను మానుకోవడం సాధ్యమవుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు.”

ప్రజలను నరకంలో నిరంతరం హింసించే దేవునికి​—⁠బైబిలులో ఎక్కడా లేని సిద్ధాంతం​—⁠భయపడే బదులు టోనీ, ఆయన భార్య పరదైసు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణను స్వీకరించారు. (కీర్తన 37:10, 11; సామెతలు 2:​21) “నా జీవితాన్ని దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మలచుకోవడానికి నేను ఎంతో సమయం వెచ్చించి తీవ్రంగా కృషి చేయవలసి వచ్చింది, అయితే యెహోవా ఆశీర్వాదంతో నేను విజయం సాధించాను” అని టోనీ ఒప్పుకుంటున్నాడు.

అవును మునుపు మాదకద్రవ్యాలకు బానిసగా ఉన్న ఈ వ్యక్తి ఒక క్రైస్తవుడిగా మారాడు. ఆయనా ఆయన భార్యా తమ సమయాన్ని, వనరులను స్వచ్ఛందంగా ఉపయోగిస్తూ బైబిలు విద్యా పనిలో ఎన్నో వేల గంటలు గడిపారు. వారు దైవభక్తిగల ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. ఈ అద్భుతమైన మార్పు, దేవుని వాక్యమైన బైబిలుకున్న ప్రబలమైన శక్తి ద్వారానే సాధించబడింది. నిజమే అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉంది.​—⁠హెబ్రీయులు 4:12.

ఇలాంటి ప్రోత్సాహకరమైన ఉదాహరణలు ఉన్నప్పటికీ, యెహోవాసాక్షులు చేసే బైబిలు ఆధారిత విద్యా పని కుటుంబాలను నాశనం చేస్తుందనీ, యౌవనస్థుల ఆరోగ్యకరమైన విలువలను నశింపజేస్తుందనీ కొందరు నిర్హేతుకంగా వాదిస్తారు. ఆ వాదన తప్పు అని టోనీ ఉదాహరణ ఖచ్చితంగా నిరూపిస్తోంది.

ప్రాణాంతకమైన వ్యసనాలను అధిగమించవచ్చని టోనీలాగే, అనేకులు నేర్చుకున్నారు. ఎలా? దేవునిపై విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనపై ఆయన వాక్యంపై ఆధారపడడం ద్వారా, శ్రద్ధగల ప్రేమపూర్వకమైన క్రైస్తవ సహవాసుల మద్దతు ద్వారా వారు నేర్చుకున్నారు. టోనీ సంతోషంగా ఇలా అంటున్నాడు: “బైబిలు సూత్రాలు నా పిల్లలను ఎలా రక్షించాయో నేను చూశాను. బైబిలు బోధనలు నా వైవాహిక బంధాన్ని కాపాడాయి. ఇప్పుడు మా పొరుగువారు మరింత భద్రతగా ఉన్నట్లు భావిస్తారు ఎందుకంటే నేను వారికి ఇక ఎంతమాత్రం ఒక ప్రమాదంగా లేను.”

[9వ పేజీలోని బ్లర్బ్‌]

‘నన్ను 15 సంవత్సరాలుగా అదుపుచేసిన మాదకద్రవ్యాల అలవాటును నేను యెహోవా శక్తితో మానుకోగలిగాను’

[9వ పేజీలోని బాక్సు]

సహాయపడే బైబిలు సూత్రాలు

మాదకద్రవ్యాలకు బానిసలైన అనేకమంది ఆ వినాశకరమైన అలవాటును మానుకోవడానికి వివిధ బైబిలు సూత్రాలు సహాయం చేశాయి. ఆ సూత్రాలలో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:

“దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.” (2 కొరింథీయులు 7:⁠1) మాదకద్రవ్యాలను వాడడం దేవుని నియమాలకు విరుద్ధం.

యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.” (సామెతలు 9:​10) యెహోవా గురించిన ఆయన మార్గాల గురించిన ఖచ్చితమైన జ్ఞానంపై ఆధారపడిన దైవభక్తి, మాదకద్రవ్యాల అలవాటును మానుకోవడానికి అనేకులకు సహాయం చేసింది.

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:​5, 6) దేవునిపై హృదయపూర్వకంగా నమ్మకముంచడం ద్వారా, ఆయనపై పూర్తిగా ఆధారపడడం ద్వారా వినాశకరమైన అలవాట్లను మానుకోవచ్చు.