కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శుద్ధాంతఃకరణ కోరదగినదే, అయితే అది మాత్రమే సరిపోతుందా?

శుద్ధాంతఃకరణ కోరదగినదే, అయితే అది మాత్రమే సరిపోతుందా?

శుద్ధాంతఃకరణ కోరదగినదే, అయితే అది మాత్రమే సరిపోతుందా?

మన దైనందిన జీవితంలో శుద్ధాంతఃకరణ కలిగివుండడం నిజంగా కోరదగినదేనా? “శుద్ధాంతఃకరణ” అంటే “మోసరహితమైన, నటనలేని, ఊహాజనితం కాని, నిజమైన, నిష్కపటమైన” అంతఃకరణ అని ఒక నిఘంటువు నిర్వచిస్తుంది. ఇతరులతో ఉన్న మంచి సంబంధాలను బలపర్చుకోవడానికి ఈ లక్షణం ప్రయోజనకరమైనదని స్పష్టమౌతోంది. అపొస్తలుడైన పౌలు ఇలా ఉద్బోధించాడు: “మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి.” (కొలొస్సయులు 3:​22) శుద్ధాంతఃకరణగల ఇలాంటి వ్యక్తి తన క్రింద పనిచేయడం ఎవరికి ఇష్టముండదు? నేడు, ఉద్యోగాలు సంపాదించుకోవడంలో, వాటిలో కొనసాగడంలో శుద్ధాంతఃకరణగల ప్రజలకు ఇతరులకంటే ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు.

అయితే, శుద్ధాంతఃకరణను ఎంతో కోరదగినదిగా చేసేది, దేవునితో మనకున్న సంబంధాన్ని అది ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్న విషయమే. ప్రాచీన ఇశ్రాయేలీయులు జాగ్రత్తగా ఆజ్ఞలను పాటించి, పండుగలను ఆచరించినప్పుడు దేవుని ఆశీర్వాదాలను అనుభవించారు. సంఘ శుభ్రత గురించి చర్చిస్తూ పౌలు క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.” (1 కొరింథీయులు 5:⁠8) మన ఆరాధన దేవునికి అంగీకారయోగ్యమైనదిగా ఉండాలంటే, నిష్కపటంగా ఉండడం కేవలం కోరదగినదే కాక చాలా ప్రాముఖ్యమైనది కూడా. అయితే, కేవలం నిష్కపటంగా ఉండడం మాత్రమే సరిపోదని గుర్తుంచుకోండి. దానితోపాటు సత్యము కూడా ఉండాలి.

టైటానిక్‌ నిర్మాణకులూ దాని ప్రయాణికులూ, ఆ ఓడ మునిగే అవకాశం లేదని చిత్తశుద్ధితో విశ్వసించి ఉండవచ్చు. 1912వ సంవత్సరంలో ఆ ఓడ తన తొలి ప్రయాణం చేసేటప్పుడు ఒక మంచుకొండను ఢీకొనడంతో 1,517 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కొంతమంది మొదటి శతాబ్దపు యూదులు తాము దేవుణ్ణి ఆరాధించే పద్ధతిని చిత్తశుద్ధితో విశ్వసించి ఉండవచ్చు, కానీ వారి “ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.” (రోమీయులు 10:⁠2) మనం దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలంటే, శుద్ధాంతఃకరణతో మనం నమ్ముతున్నవి ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి ఉండాలి. దేవుణ్ణి నిష్కాపట్యముతో, సత్యముతో ఆరాధించడంలో ఏమి చేరివుందో పరిశీలించేందుకు మీకు సహాయం చేయడానికి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు సంతోషిస్తారు.