కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నాకు దేవుని గురించి ఎక్కువగా తెలియదు”

“నాకు దేవుని గురించి ఎక్కువగా తెలియదు”

“నాకు దేవుని గురించి ఎక్కువగా తెలియదు”

“గత సంవత్సరం నుండి యెహోవాసాక్షులు నన్ను సందర్శిస్తూ దేవుని రాజ్యం గురించి అద్భుతమైన విషయాలను నాకు తెలియజేస్తున్నారు. ఎనిమిది సంవత్సరాలపాటు నేను క్యాథలిక్‌గా ఉన్నాను కానీ దేవుని గురించి నాకు ఎక్కువగా తెలియదు. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే నేను ఎంతో నేర్చుకున్నాను” అని భారతదేశంలోని కేరళ నుండి ఒక వ్యక్తి వ్రాశాడు. ఆయన ఇంకా ఇలా వ్రాశాడు: “కావలికోట 139 [ప్రస్తుతం 146] భాషల్లో ప్రచురించబడుతోందని తెలిసి నేను ఎంతో ఆనందించాను. అన్ని భాషల్లోని ప్రజలు దేవుని గురించిన సందేశాన్ని తెలుసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.”

దేవుని గురించి తెలుసుకోవడం అసాధ్యమని అనేకమంది తత్త్వవేత్తలు అంటున్నప్పటికీ, అపొస్తలుడైన పౌలు అది సాధ్యమేనని స్పష్టం చేశాడు. ఏథెన్సులోని కొందరు “తెలియబడని దేవునికి” సమర్పించబడిన బలిపీఠము వద్ద ఆరాధిస్తుండేవారు, పౌలు అలాంటి కొందరు ప్రజలున్న ఒక గుంపును సంబోధిస్తూ “మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు . . . అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు . . . మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టిం[చాడు.]”​—⁠అపొస్తలుల కార్యములు 17:​23-27.

సృష్టికర్తను వెదకమని, “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అని పౌలు తన ప్రేక్షకులకు ఉద్బోధించాడు. (అపొస్తలుల కార్యములు 17:26, 27) మీరు సత్య దేవుని గురించీ ఆకర్షణీయమైన ఆయన లక్షణాల గురించీ తెలుసుకోవడానికి సహాయపడేందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు.