కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనకు సరిగ్గా తెలియని దేవుణ్ణి నమ్మడం

మనకు సరిగ్గా తెలియని దేవుణ్ణి నమ్మడం

మనకు సరిగ్గా తెలియని దేవుణ్ణి నమ్మడం

జర్మనీలో ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు దేవుణ్ణి నమ్ముతారు. అయితే వెయ్యికంటే ఎక్కువ మందిని తామునమ్మే దేవుణ్ణి వర్ణించమని అడిగినప్పుడు అందరూ రకరకాల సమాధానాలిచ్చారు. “జర్మనీ దేశస్థులు వ్యక్తిగతంగా ఒకరి నుండి ఒకరు భిన్నంగా ఉన్నట్లే దేవుని గురించి వారి భావనలు కూడా రకరకాలుగా ఉన్నాయి” అని ఫోకస్‌ అనే వార్తాపత్రిక నివేదిస్తోంది. దేవుని మీద నమ్మకముంచడం ప్రశంసనీయమే అయినా ఆయనెలాంటి వాడో తెలియకుండానే ఆయనను నమ్మడం శోచనీయం కాదా?

దేవుని స్వభావం, ఆయన వ్యక్తిత్వం గురించిన అనిశ్చయత కేవలం జర్మనీలోనే కాదు యూరపులో వేరే ప్రాంతాల్లో కూడా కనబడుతుంది. దేవుడంటే “ఒక గొప్ప శక్తి లేదా అనిర్వచనీయమైన ఒక మర్మం” అనే అభిప్రాయం ప్రబలంగా ఉన్నట్లు ఆస్ట్రియా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌లలో నిర్వహించబడిన ఒక సర్వే వెల్లడిచేసింది. ప్రత్యేకించి యౌవనులకు, చివరికి దేవుని మీద నమ్మకమున్నవారికి కూడా ఆయన అగోచరమే.

దేవుడు మీకు వ్యక్తిగతంగా తెలుసా?

ఒక వ్యక్తి గురించి తెలియడానికీ ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి​—⁠ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్న ఒక రాజు, అగ్రస్థానంలో ఉన్న ఒక క్రీడాకారుడు లేదా సినిమా నటుడు​—⁠గురించి తెలియడం అంటే ఆయన ఉనికిలో ఉన్నాడని అంగీకరించడం మాత్రమే. అయితే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా తెలుసుకోవడంలో అంతకంటే ఎక్కువే ఉంది. అందులో ఆయన వ్యక్తిత్వం, ప్రవర్తన, భావాలు, ఇష్టాయిష్టాలేకాక భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా సుపరిచితులై ఉండడం ఉంది. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం ఆయనతో సన్నిహిత సంబంధానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.

దేవుని గురించి కేవలం ఒక అస్పష్టమైన తలంపుతో ఉండడం​—⁠లేదా కేవలం ఆయన గురించి తెలుసుకొని ఉండడం​—⁠మాత్రమే సరిపోదని లక్షలాదిమంది గ్రహించారు. దేవుణ్ణి సన్నిహితంగా తెలుసుకోవడం ద్వారా వాళ్ళు పురోగమించారు. అలా తెలుసుకోవడం ప్రయోజనకరమేనని వాళ్ళు గ్రహించారా? ఉత్తర జర్మనీలో నివసిస్తున్న పౌలు అనే ఒక వ్యక్తికి ఒకప్పుడు దేవుని మీద నమ్మకం అంతంత మాత్రమే ఉండేది, దేవునికి వ్యక్తిగతంగా మరింత సన్నిహితం కావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. పౌలు ఇలా చెబుతున్నాడు: “దేవుణ్ణి సన్నిహితంగా తెలుసుకోవడానికి సమయమూ కృషీ అవసరమైనప్పటికీ, దాని ఫలితాలు ఎంతో విలువైనవి. సృష్టికర్తతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడం దైనందిన జీవితాన్ని ఎంతో శ్రేష్ఠమైనదిగా చేస్తుంది.”

దేవుణ్ణి సన్నిహితంగా తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం కృషి చేయడం ప్రతిఫలదాయకమైనవేనా? దయచేసి దీని తర్వాతి ఆర్టికల్‌ చదవండి.

[3వ పేజీలోని బ్లర్బ్‌]

ఒక వ్యక్తి గురించి తెలియడానికీ ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది