కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నాకు కావలసిందంతా లభించింది”

“నాకు కావలసిందంతా లభించింది”

“నాకు కావలసిందంతా లభించింది”

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 12 కోట్లకంటే ఎక్కువమంది కృంగుదలతో బాధపడుతున్నట్లు అంచనా వేయబడింది. ప్రతి సంవత్సరం పది లక్షలమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒకటి రెండు కోట్లమంది తమ జీవితాలను అంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కృంగుదలతో బాధపడేవారికి ఎలాంటి సహాయం ఉంది? చికిత్స బాధను తగ్గించవచ్చు, భావోద్వేగపరమైన మద్దతు చాలా అవసరం. అంతేకాకుండా, అలాంటి భావాలతో బాధపడుతున్న కొంతమందికి యెహోవాసాక్షులు ప్రచురించిన ఆచరణాత్మకమైన బైబిలు ఆధారిత ప్రచురణల ద్వారా అదనపు సహాయం లభించింది. ఫ్రాన్స్‌నుండి వచ్చిన ఈ ఉత్తరం అదే చూపిస్తోంది.

“కొంతకాలం క్రితం, నేను జీవించివుండడంలో అర్థంలేదని నాకు అనిపించింది. నన్ను చనిపోవడానికి అనుమతించమని నేను దేవునికి ప్రార్థించాను. నేను అప్పటికే జీవచ్ఛవంలా ఉన్నాను. మార్గనిర్దేశం కోసం నేను యెహోవాకు తీవ్రంగా ప్రార్థించాను. నేను 2002 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం) చదవాలని కూడా నిర్ణయించుకొని, దాన్ని మూడు రోజుల్లో చదివేశాను. అది నన్ను ఎంతగానో ప్రోత్సహించి, నా విశ్వాసాన్ని బలపరిచిందని నేను ఒప్పుకోవలసిందే.

నేను కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో కొంత పరిశోధన చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఈ పత్రికలను నేను క్రమంగా 15 కంటే ఎక్కువ సంవత్సరాలనుండి చదువుతున్నాను, కానీ వాటిలోని ఆర్టికల్‌లు ఇంత ప్రోత్సాహకరంగా ఇంత ఆసక్తికరంగా ఉంటాయని నేను గ్రహించలేకపోయాను. ఆ ఆర్టికల్‌లు ప్రేమ​—⁠ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే లక్షణంతో​—⁠నిండివున్నాయి. నాకు కావలసిందంతా లభించింది.”

“విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని బైబిలు చెబుతోంది. (కీర్తన 34:​18) “విరిగిన హృదయము” లేదా “నలిగిన మనస్సు” గల వారందరూ బైబిలు ద్వారా ప్రోత్సాహాన్నీ భవిష్యత్తు కోసం నిరీక్షణనూ పొందుతారనడంలో సందేహం లేదు. అవసరంలో ఉన్నవారు ఓదార్పుకు మూలమైన దేవుని ద్వారా ప్రేరేపించబడిన ఆ సమాచారం నుండి ప్రయోజనం పొందేందుకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు బైబిలు ఆధారిత ప్రచురణలను అందజేస్తారు.