కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అన్యాయానికి గురైన వారిని ఓదార్చిన బైబిలు సూత్రాలలో కొన్ని:

అన్యాయానికి గురైన వారిని ఓదార్చిన బైబిలు సూత్రాలలో కొన్ని:

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును”

ఆమె జీవితం మలుపు తిరగడానికి ముందు, ఆ తర్వాత

మాట్స్‌పాంగ్‌ జీవితం ఎంత ఘోరంగా, అర్థరహితంగా తయారయ్యిందో! ఆమె దక్షిణాఫ్రికా మధ్యభాగంలోని లెసోతో దేశంలో నివసించే యువతి. మాట్స్‌పాంగ్‌ క్యాథలిక్‌గా పెంచబడింది. అయితే నన్‌లు, దేవునికి సన్నిహితమవ్వడానికి సహాయపడే బదులు అనైతిక చర్యల్లో పాల్గొనేందుకు ఆమెను ప్రలోభపెట్టడానికి డబ్బు ఆశ చూపించి సంవత్సరాలపాటు ఆమెతో చెడుగా వ్యవహరించారు.

తత్ఫలితంగా మాట్స్‌పాంగ్‌ మతం విషయంలో నిరాశ చెంది, తాను సృష్టించిన మానవుల గురించి నిజంగా శ్రద్ధతీసుకునే ప్రేమగల సృష్టికర్త ఉన్నాడనే విషయాన్ని అంగీకరించలేకపోయేది. తాను అనుభవించిన నిర్లక్ష్యం వల్ల, అన్యాయం వల్ల మాట్స్‌పాంగ్‌ భావోద్వేగపరంగా తీవ్రంగా గాయపడింది, తాను ఎందుకూ పనికిరానని ఆమె భావించేది. ఆమె పెరిగి పెద్దయ్యాక చాలా దౌర్జన్యపూరితంగా, ఆవేశపూరితంగా తయారయ్యింది. అది ఆమె నేరాలు చేయడానికి దారితీసింది.

కొద్దికాలానికి, మాట్స్‌పాంగ్‌ రైళ్ళలో ప్రయాణీకులను దోచుకునే ఒక ముఠాలో చేరింది. ఆమె అరెస్టు చేయబడి, దక్షిణాఫ్రికాలోని జైలుకు పంపించబడింది. ఆ తర్వాత ఆమె తన స్వదేశమైన లెసోతోకు పంపించబడింది, అక్కడ ఆమె నేరాలు చేస్తూ తాగుబోతుగా, దౌర్జన్యపూరితమైన, అనైతికమైన జీవితాన్ని కొనసాగించింది.

మాట్స్‌పాంగ్‌ తన జీవితంలోని ఎంతో కృంగిపోయిన స్థితిలో సహాయం కోసం దేవునికి తీవ్రంగా ప్రార్థించింది. “దేవా, నేను బ్రతికే ఉంటే, నీ సేవ చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను” అని ఆమె వాగ్దానం చేసింది.

ఆ తర్వాత కొంతకాలానికి, యెహోవాసాక్షుల మిషనరీలు మాట్స్‌పాంగ్‌ను కలుసుకున్నారు. ఆమెతో బైబిలు అధ్యయనం చేస్తామని వారు చెప్పారు. అధ్యయనం ద్వారా దేవుడు నిర్లక్ష్యం చేసే, శ్రద్ధలేని వ్యక్తి కాదని ఆమె గ్రహించింది. నిజానికి “అబద్ధమునకు జనకు[డైన]” సాతాను కొంతమందిలో తాము ఎందుకూ పనికిరామనే భావాలను వృద్ధి చేయడానికి, యెహోవా వారిని ఎన్నడూ ప్రేమింపదగినవారిగా దృషించడని వారు నమ్మేలా చేయడానికి కుయుక్తితో కూడిన మోసకరమైన పన్నాగాలను ఉపయోగిస్తాడని ఆమె గ్రహించింది.​—⁠యోహాను 8:44; ఎఫెసీయులు 6:11.

దానికి భిన్నంగా మనం గతంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, దేవుని క్షమాపణ కోరి, ఆయనను సంతోషపరచడానికి కృషి చేస్తే మనం ఆరోగ్యదాయకమైన ఆత్మగౌరవాన్ని కలిగివుండవచ్చు అని మాట్స్‌పాంగ్‌ తెలుసుకున్నప్పుడు ఆమెకు అది ఎంత ఓదార్పునిచ్చివుంటుందో కదా! “దేవుడు మన హృదయముకంటే అధికు[డు]” అని, మనల్ని మనం దృష్టించుకునే దానికి ఎంతో భిన్నంగా ఆయన మనల్ని దృష్టిస్తాడని అర్థం చేసుకోవడానికి ఆమెకు సహాయం లభించింది.​—⁠1 యోహాను 3:​19, 20.

కీర్తనకర్త దావీదు వ్రాసిన ఈ మాటలను చదివి మాట్స్‌పాంగ్‌ ఎంతో సంతోషించింది: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు; నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్తన 34:​18) “విరిగిన హృదయముగలవారి[లో]” ఒకరిగా ఆమె, యెహోవా సేవకులలో కొందరు నిరుత్సాహపడినా లేదా తాము విలువలేనివారమని భావించినా ఆయన వారిని ఎడబాయడని గ్రహించింది. దేవుడు తన గొఱ్ఱెలందరి పట్ల శ్రద్ధ చూపిస్తాడనీ కష్టకాలాల్లో వారికి సహాయం చేస్తాడనీ తెలుసుకోవడం ఆమె హృదయాన్ని ఆనందంతో నింపింది. (కీర్తన 55:22; 1 పేతురు 5:​6, 7) ప్రత్యేకించి ఈ మాటలు ఆమెను కదిలించాయి: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”​—⁠యాకోబు 4:⁠8.

కొద్దికాలానికే, దేవునివాక్యమైన బైబిలుకున్న శక్తి మాట్స్‌పాంగ్‌ జీవితంలో స్పష్టంగా కనిపించింది. ఆమె క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడం ప్రారంభించి, లేఖన విరుద్ధమైన అలవాట్లను మానుకుంది. దాని ఫలితం? ఆమె ఇప్పుడు దేవుని ప్రేమకు, అనుగ్రహానికి తాను అర్హురాల్ని కాదని భావించడం లేదు. ఆమె యెహోవాసాక్షులలో ఒకరిగా బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి, రాజ్య సువార్త ప్రచారకురాలిగా క్రైస్తవ పరిచర్యలో వేలాది గంటల సమయాన్ని గడిపింది. గతంలో భావోద్వేగపరంగా గాయపడినప్పటికీ మాట్స్‌పాంగ్‌ ఇప్పుడు సంతోషకరమైన, అర్థవంతమైన జీవితాన్ని గడుపుతోంది. జీవితాలను మెరుగుపరచడంలో బైబిలుకున్న శక్తికి ఇది ఎంత చక్కని నిదర్శనమో కదా!​—⁠హెబ్రీయులు 4:12.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

“దేవా, నేను బ్రతికే ఉంటే, నీ సేవ చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను”

[9వ పేజీలోని బాక్సు]

సహాయపడే బైబిలు సూత్రాలు

అన్యాయానికి గురైన వారిని ఓదార్చిన బైబిలు సూత్రాలలో కొన్ని:

“నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ [దేవుని] గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.” (కీర్తన 94:​19) యెహోవా వాక్యంలో లభించే ఆయన “ఆదరణ” గొప్ప ఓదార్పుకు మూలం. అధ్యయనం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు దాని గురించి ఆలోచించడం విచారకరమైన తలంపులను అణచివేసుకోవడానికి, మనల్ని అర్థంచేసుకునే స్నేహితుడిగా దేవునిపై మన నమ్మకాన్ని అధికం చేసుకోవడానికి సహాయపడుతుంది.

“గుండె చెదరినవారిని ఆయన [యెహోవా] బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు.” (కీర్తన 147:⁠3) యెహోవా దయకు, యేసు విమోచన క్రయధన బలి ద్వారా మన పాపాలను కప్పివేయడానికి ఆయన చేసిన ఏర్పాటుకు మనం కృతజ్ఞులమై ఉంటే, మనం దోషులమనే భావాలు లేకుండా ధైర్యంగా దేవుణ్ణి సమీపించవచ్చు. ఇది సాటిలేని ఓదార్పును, మనశ్శాంతిని ఇవ్వగలదు.

“నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా [యేసుక్రీస్తు] యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.” (యోహాను 6:​44) యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా, రాజ్య ప్రచార పని ద్వారా తానే స్వయంగా మనల్ని తన కుమారుని వద్దకు ఆకర్షించి, నిత్యజీవ నిరీక్షణనిస్తాడు.