కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బీదరికం ఎన్నటికైనా నిర్మూలమవుతుందా?

బీదరికం ఎన్నటికైనా నిర్మూలమవుతుందా?

బీదరికం ఎన్నటికైనా నిర్మూలమవుతుందా?

“బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను” అని ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను అన్నాడు. (ప్రసంగి 4:⁠1) ఆయన మనస్సులో బాధింపబడినవారిలో అనేకమంది బీదవారు కూడా ఉన్నారనడంలో సందేహం లేదు.

కేవలం ఆర్థిక గణాంకాలతో బీదరికాన్ని అంచనా వేయలేము. 2002 జూన్‌లో వరల్డ్‌ బ్యాంక్‌ ఇచ్చిన వివరాల ప్రకారం, “1998లో ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లమంది రోజువారి వ్యయ స్థాయులు ఒక డాలరు కంటే తక్కువనీ, . . . 280 కోట్ల మంది రోజుకు 2 డాలర్ల కంటే తక్కువతో జీవించారని అంచనా వేయబడింది.” ఈ రెండు వర్గాల్లోని ప్రజల సంఖ్య గతంలోని అంచనాల కంటే తక్కువే అయినా “బీదరికంతో బాధపడుతున్న వారిని బట్టి చూస్తే ఆ గణాంకాలు ఇంకా అధిక స్థాయిలోనే ఉన్నాయి” అనేది అందరికీ తెలిసిన విషయమే.

బీదరికం ఎన్నటికైనా నిర్మూలమవుతుందా? యేసుక్రీస్తు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురు.” (యోహాను 12:⁠8) అంటే బీదరికము, దాని తీవ్ర పరిణామాలు నిత్యం కొనసాగుతాయని దీని భావమా? కాదు, ఎందుకంటే యేసు తన అనుచరులందరూ భౌతికపరంగా ధనవంతులవుతారని వాగ్దానం చేయలేదు అయినా, ఆయన మాటలను బట్టి బీదలకు నిరీక్షణ లేదనే నిర్ధారణకు మనం రాకూడదు.

బీదరికాన్ని నిర్మూలం చెయ్యాలన్న మానవ ప్రయత్నాలు, వాగ్దానాలు తరచూ విఫలమవుతున్నా, కొద్దికాలం తర్వాత బీదవారు ఇక ఉండరని దేవుని వాక్యమైన బైబిలు మనకు హామీ ఇస్తోంది. వాస్తవానికి యేసు “బీదలకు సువార్త” ప్రకటించాడు. (లూకా 4:​18) ఈ సువార్తలో బీదరికం నిర్మూలించబడుతుందనే వాగ్దానం కూడా ఉంది. దేవుని రాజ్యం భూమిపై నీతియుక్తమైన పరిస్థితులను తీసుకువచ్చినప్పుడు అది సంభవిస్తుంది.

ఆ లోకం ఎంత భిన్నంగా ఉంటుందో కదా! పరలోక రాజు యేసుక్రీస్తు “నిరుపేదలయందును బీదలయందును . . . కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును.” నిజంగానే “కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును.”​—⁠కీర్తన 72:​13, 14.

ఆ కాలం గురించి మీకా 4:⁠4 ఇలా చెబుతోంది: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవామాట యిచ్చియున్నాడు.” మానవాళిని పీడిస్తున్న సమస్యలన్నింటినీ దేవుని రాజ్యం పరిష్కరిస్తుంది, చివరికి అనారోగ్యాన్నీ మరణాన్నీ కూడా నిర్మూలిస్తుంది. దేవుడు “మరెన్నడును ఉండకుండ మరణమును . . . మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”​—⁠యెషయా 25:⁠8.

మీరు ఈ వాగ్దానాలను నమ్మవచ్చు, ఎందుకంటే అవి స్వయంగా దేవుడు చేసిన వాగ్దానాలు. బైబిలు ప్రవచనాలు నమ్మదగినవని నిరూపించే రుజువులను ఎందుకు పరిశీలించకూడదు?

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

FAO photo/M. Marzot