“మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును” చూపించండి
“మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును” చూపించండి
‘మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు శాంతులై యుండవలెనని వారికి జ్ఞాపకము చేయుము.’—తీతు 3:1, 2.
అపొస్తలుడైన పౌలు, “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని వ్రాశాడు. (1 కొరింథీయులు 11:1) నేటి దేవుని సేవకులందరూ ఈ హెచ్చరికను లక్ష్యపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తారు. అదంత సులభం కాదని ఒప్పుకోవలసిందే, ఎందుకంటే మనం క్రీస్తు మాదిరికి అనుగుణంగా లేని స్వార్థపూరితమైన కోరికలను, స్వభావాలను మన మొదటి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందాము. (రోమీయులు 3:23; 7:21-25) అయితే, సాత్వికమును చూపించే విషయానికొస్తే, మనం కృషి చేస్తే గనుక మనమందరం సఫలులం కావచ్చు. కానీ కేవలం మన సంకల్పశక్తిపై ఆధారపడడమే సరిపోదు. ఇంకా ఏమవసరం?
2 దేవుడు చూపించే సాత్వికము పరిశుద్ధాత్మ ఫలములో ఒక భాగం. దేవుని చురుకైన శక్తి ఇచ్చే నిర్దేశాలకు మనం ఎంత విధేయులమైతే, దాని ఫలం మనలో అంత స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు, కేవలం అప్పుడే, మనం ప్రతి ఒక్కరి పట్ల “సంపూర్ణమైన సాత్వికమును” చూపించగలుగుతాము. (ఇటాలిక్కులు మావి.) (తీతు 3:1, 2) మనం యేసు మాదిరిని ఎలా అనుకరించవచ్చో, మనతో సహవసించే వారికి ‘ఉత్తేజం కలిగేలా,’ ఎలా చేయవచ్చో మనం పరిశీలిద్దాం.—మత్తయి 11:29, NW; గలతీయులు 5:22.
కుటుంబంలో
3 సాత్వికము అత్యావశ్యకమైన ఒక రంగం కుటుంబం. రోడ్డు ప్రమాదాలు, మలేరియా ఈ రెండూ కలిసి స్త్రీల ఆరోగ్యానికి కలిగిస్తున్న హాని కన్నా గృహ దౌర్జన్యమే వారికి ఎక్కువ హాని కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఉదాహరణకు, ఇంగ్లాండ్‌లోని లండన్‌లో ఫిర్యాదు చేయబడిన దౌర్జన్యపూరిత నేరాల్లో పాతిక శాతం ఇళ్ళలో జరిగినవే. “అల్లరి, దూషణ” ద్వారా తమ భావాలను వెల్లడిచేసే ప్రజలు పోలీసులకు తరచూ ఎదురవుతున్నారు. అంతకంటే ఘోరమేమిటంటే, కొంతమంది దంపతులు “ద్వేషము” తమ మధ్యనున్న సంబంధాన్ని ప్రభావితం చేయడానికి అనుమతించారు. దుఃఖకరంగా ఈ ప్రవర్తనంతా కూడా “లౌకికాత్మ”ను ప్రతిబింబిస్తుంది, ఇలాంటి ప్రవర్తనకు క్రైస్తవ కుటుంబాల్లో స్థానంలేదు.—ఎఫెసీయులు 4:31; 1 కొరింథీయులు 2:12.
4 లోకసంబంధమైన అభిప్రాయాలను అడ్డగించడానికి మనకు దేవుని ఆత్మ అవసరం. “ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.” (2 కొరింథీయులు 3:17) ప్రేమ, దయ, ఆశానిగ్రహం, సహనం అపరిపూర్ణులైన భార్యాభర్తల ఐక్యతను బలపరుస్తాయి. (ఎఫెసీయులు 5:33) సాధు స్వభావం ఇంట్లో వాతావరణాన్ని శాంతపరచి, అనేక కుటుంబాలను పట్టిపీడిస్తున్న కొట్లాటలు, వాగ్వివాదాలు లేని ఆహ్లాదకరమైన పరిస్థితి నెలకొనేలా చేస్తుంది. ఒక వ్యక్తి చెప్పేది ప్రాముఖ్యమైనదే అయినా ఆయన తన భావాలను వ్యక్తం చేసే విధానమే ఆ మాటల వెనుకనున్న స్ఫూర్తిని తెలియజేస్తుంది. చింతను, వ్యథను కలిగించే విషయాలను సాత్వికముతో వ్యక్తం చేస్తే, ఉద్వేగాలు తగ్గుతాయి. జ్ఞానవంతుడైన సొలొమోను రాజు ఇలా వ్రాశాడు: “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.”—సామెతలు 15:1.
5 మతపరంగా విభాగింపబడిన కుటుంబాల్లో సాత్వికము మరింత ప్రాముఖ్యం. దానికి ప్రేమగల కార్యాలు తోడైతే, సుముఖత చూపించని వారిని యెహోవా వైపుకు రాబట్టడానికి అది తోడ్పడుతుంది. పేతురు క్రైస్తవ భార్యలకు ఇలా సలహా ఇచ్చాడు: “మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”—1 పేతురు 3:1-4.
6 ప్రాముఖ్యంగా, యెహోవా పట్ల ప్రేమ కొరవడినప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యనున్న సంబంధం దెబ్బతినే అవకాశముంది. కానీ క్రైస్తవ కుటుంబాలన్నిటిలోనూ సాత్వికమును చూపించవలసిన అవసరం ఉంది. పౌలు తండ్రులకు ఇలా సలహా ఇచ్చాడు: “మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) కుటుంబంలో అందరూ ఎల్లవేళలా సాత్వికమును చూపిస్తే, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యవుండే సన్నిహిత సంబంధాలు బలపడతాయి. ఐదుగురు పిల్లల్లో ఒకరైన డీన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నాడు: “మా నాన్నగారు సౌమ్యులు. నేను ఆయనతో—నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు కూడా—వాదించినట్లుగా నాకు ఏమాత్రం గుర్తులేదు. ఆయన ఎల్లప్పుడూ ఎంతో శాంతంగా ఉండేవారు, మనసు బాగోలేనప్పుడు కూడా శాంతంగానే ఉండేవారు. కొన్నిసార్లు నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షగా ఆయన నన్ను గదిలో బంధించేవారు లేదా కొన్ని ఆంక్షలను పెట్టేవారు. అంతేగానీ, మేమెన్నడూ వాదించుకోలేదు. ఆయన మాకు తండ్రి మాత్రమే కాదు, మా స్నేహితుడు కూడా, మేము ఆయనను ఎన్నడూ అసంతృప్తిపరచదలచుకోలేదు.” తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి సాత్వికము నిజంగా సహాయం చేస్తుంది.
మన పరిచర్యలో
7 సాత్వికము అవసరమైన మరో రంగం క్షేత్ర పరిచర్య. మనం ఇతరులతో రాజ్య సువార్త పంచుకునేటప్పుడు, వివిధ స్వభావాలుగల వ్యక్తులను కలుస్తాము. కొంతమంది మనం తెలియజేసే నిరీక్షణా సందేశాన్ని ఆనందంగా వింటారు. ఇతరులు, వివిధ కారణాలను బట్టి, ప్రతికూలంగా ప్రతిస్పందించవచ్చు. అలాంటి సమయంలోనే, భూదిగంతముల వరకు సాక్షులై ఉండే మన నియామకాన్ని నెరవేర్చడంలో సాత్వికము మనకు గొప్ప సహాయంగా ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 1:8; 2 తిమోతి 4:5.
8 అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.” (1 పేతురు 3:15, 16) మనం మన హృదయాల్లో క్రీస్తును మన మాదిరికర్తగా ఎంచుతాము కాబట్టి, కఠినంగా మాట్లాడేవారికి సాక్ష్యమిచ్చేటప్పుడు సాత్వికమును, గౌరవాన్ని చూపించడానికి మనం కృషి చేస్తాము. ఈ విధమైన ప్రవర్తన తరచూ గమనార్హమైన ఫలితాలను తీసుకువస్తుంది.
9 ఎవరో తలుపు తడితే, కీత్ భార్య తలుపు తెరిచినప్పుడు కీత్ అక్కడే ఉన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ఒక యెహోవాసాక్షి అని తెలియగానే, సాక్షులు పిల్లలపట్ల క్రూరంగా వ్యవహరిస్తారని కీత్ భార్య కోపంగా ఆరోపించింది. ఆ సహోదరుడు ప్రశాంతంగా ఉండిపోయాడు. ఆయన, “మీరలా భావిస్తున్నందుకు నేను బాధపడుతున్నాను. యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారో మీకు చూపించడానికి నన్ను అనుమతిస్తారా?” అని మృదువుగా అడిగాడు. వాళ్ళ సంభాషణ వింటూ అక్కడే ఉన్న కీత్ ఆ సహోదరుణ్ణి పంపివేయడానికి తలుపు దగ్గరికి వచ్చాడు.
10 ఆ తర్వాత, తమను సందర్శించడానికి వచ్చిన ఆ వ్యక్తితో కఠినంగా వ్యవహరించామే అని ఆ దంపతులు బాధపడడం మొదలుపెట్టారు. సాత్వికముతో కూడిన ఆయన ప్రవర్తన వారిని ఎంతో ప్రభావితం చేసింది. వారికి ఆశ్చర్యం కలిగిస్తూ ఒక వారం తర్వాత ఆ సహోదరుడు మళ్ళీ వచ్చాడు, ఆయన తన నమ్మకాలను లేఖనాల ఆధారంగా వివరించడానికి కీత్, ఆయన భార్య అంగీకరించారు. “ఆ తర్వాతి రెండు సంవత్సరాలూ ఇతర సాక్షులు
చెప్పిన ఎన్నో విషయాల్ని మేము విన్నాము” అని వారు ఆ తర్వాత తెలియజేశారు. వారు బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించారు, చివరికి ఇద్దరూ తాము యెహోవాకు చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారు. కీత్‌ను ఆయన భార్యను మొదటిసారి కలిసిన ఆ సాక్షికి ఎంతటి ప్రతిఫలం లభించిందో కదా! ఆ సాక్షి సంవత్సరాల తర్వాత ఆ జంటను కలిసి, వారిప్పుడు తన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలని తెలుసుకున్నాడు. సాత్వికము ఫలప్రదమవుతుంది.11 ఒక సైనికుడిగా హెరాల్డ్‌కున్న అనుభవం, ఆయనను కోపిష్ఠిగా చేసి, ఆయన దేవుని ఉనికినే సందేహించేలా చేసింది. ఆయనకున్న సమస్యల్ని మరింత తీవ్రం చేస్తూ ఒక త్రాగుబోతు డ్రైవరు వల్ల జరిగిన దుర్ఘటన మూలంగా ఆయన శాశ్వతంగా వికలాంగుడయ్యాడు. యెహోవాసాక్షులు హెరాల్డ్ ఇంటికి వచ్చినప్పుడు ఆయన వారిని తన దగ్గరికి రావద్దని చెప్పాడు. కానీ ఒకరోజు బిల్ అనే సాక్షి, హెరాల్డ్ నివసిస్తున్న ఇంటికి రెండు ఇళ్ళ అవతల ఉంటున్న ఆసక్తిగల ఒక వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరాడు. బిల్ పొరపాటున హెరాల్డ్ ఇంటి తలుపు తట్టాడు. హెరాల్డ్ చేతికర్రల సహాయంతో వచ్చి తలుపు తెరిచాడు, బిల్ వెంటనే క్షమాపణ చెప్పి, దగ్గరలో ఉన్న ఒక ఇంటిని దర్శించడానికి వచ్చానని ఆయనకు వివరించాడు. హెరాల్డ్ ఎలా ప్రతిస్పందించాడు? అయితే బిల్‌కు తెలియని విషయం ఒకటుంది, సాక్షులు అతి తక్కువ సమయంలో కొత్త రాజ్య మందిరాన్ని నిర్మించడానికి కలిసికట్టుగా పనిచేయడాన్ని హెరాల్డ్ టీవీ వార్తల్లో చూశాడు. అంతమంది ప్రజలు ఐక్యంగా పనిచేయడం చూసి ఆయన ఎంతో ప్రభావితుడై సాక్షుల పట్ల తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. బిల్ మర్యాదపూర్వకంగా క్షమాపణలు కోరడం వల్ల, సంతోషం కలిగించే ఆయన మృదు స్వభావం వల్ల ముగ్దుడైన హెరాల్డ్ సాక్షులు తనను సందర్శించడానికి అంగీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన బైబిలు అధ్యయనం చేసి, ప్రగతి సాధించి, బాప్తిస్మం తీసుకొని యెహోవా సేవకుడయ్యాడు.
సంఘంలో
12 సాత్వికము అత్యావశ్యకమైన మూడో రంగం క్రైస్తవ సంఘం. నేటి సమాజంలో పోరాటం సర్వసాధారణం. జీవితంపట్ల లోకసంబంధ దృక్పథం ఉన్నవారి మధ్య వాదోపవాదాలు, వాగ్వాదాలు, వాదించుకోవడాలు సర్వసామాన్యం. అప్పుడప్పుడు, అలాంటి లోకసంబంధమైన లక్షణాలు క్రైస్తవ సంఘంలోకి కూడా నెమ్మదిగా ప్రవేశించి వివాదాలు, వాక్‌యుద్ధాల రూపంలో దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితులతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు బాధ్యతగల సహోదరులు ఎంతో బాధపడతారు. అయినప్పటికీ యెహోవా పట్ల ప్రేమ, తమ సహోదరులపట్ల ప్రేమ, తప్పు చేస్తున్న వ్యక్తిని తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నించేలా వారిని పురికొల్పుతాయి.—గలతీయులు 5:25, 26.
13 మొదటి శతాబ్దంలో, పౌలు ఆయన సహచరుడైన 2 తిమోతి 2:20, 21, 24-26) పౌలు మృదుత్వాన్నీ నిగ్రహించుకోవడాన్నీ సాత్వికముతో జతచేస్తున్నాడని గమనించండి.
తిమోతి సంఘంలో కొందరి నుండి సమస్యలను ఎదుర్కొన్నారు. “ఘనహీనతకు” వినియోగింపబడే పాత్రలను పోలివున్న సహోదరుల గురించి జాగ్రత్త వహించమని పౌలు తిమోతిని హెచ్చరించాడు. ‘ప్రభువుయొక్క దాసుడు ఎదురాడు వారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను’ అని పౌలు తర్కించాడు. రెచ్చగొట్టబడినప్పుడు కూడా మనం సాత్వికముతో ఉంటే, విభేదాలు ఉన్నవారు తరచూ తమ విమర్శలను పునఃపరిశీలించుకోవడానికి పురికొల్పబడతారు. తత్ఫలితంగా, పౌలు ఆ తర్వాత వ్రాస్తున్నట్లుగా, యెహోవా ‘వారికి సత్యవిషయమైన అనుభవజ్ఞానము కలుగుటకై, వారికి మారుమనస్సు దయచేయవచ్చు.’ (14 పౌలు తాను ప్రకటించినదాన్ని ఆచరణలో పెట్టాడు. ఆయన కొరింథు సంఘంలోవున్న ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులతో’ వ్యవహరించేటప్పుడు సహోదరులను ఇలా ఉద్బోధించాడు: “మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొనుచున్నాను.” (2 కొరింథీయులు 10:1; 11:5) పౌలు నిజంగానే క్రీస్తును అనుకరించాడు. ఆయన క్రీస్తు యొక్క “సాత్వికము”తో ఈ సహోదరులను వేడుకున్నాడని గమనించండి. ఆ విధంగా ఆయన అహంభావ, నిరంకుశ ధోరణిని నివారించాడు. ఆయన చేసిన ఉద్బోధ, సంఘంలోని ప్రతిస్పందించే హృదయంగల వారిని నిస్సందేహంగా ఆకర్షించింది. ఆయన చెడిపోయిన సంబంధాలను సరిచేసి, సంఘంలో శాంతి ఐక్యతలు నెలకొనడానికి దోహదపడ్డాడు. ఇది మనమందరం అనుకరించడానికి కృషి చేయదగిన కార్యవిధానం కాదంటారా? ప్రాముఖ్యంగా పెద్దలు క్రీస్తు మాదిరిని, పౌలు కార్యవిధానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది.
15 ఇతరులకు సహాయం చేయడమనే బాధ్యత, కేవలం సంఘ శాంతి ఐక్యతలు ప్రమాదంలో ఉన్న సమయాలకే పరిమితం కాదు. సంబంధాలు దెబ్బతినడానికి ఎంతో ముందే సహోదరులకు ప్రేమపూర్వక మార్గనిర్దేశం అవసరం. “సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు . . . సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను” అని పౌలు ఉద్బోధించాడు. కానీ ఎలా మంచి దారికి తీసుకురావాలి? “మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో” అలా చెయ్యాలి. (గలతీయులు 6:1) “సాత్వికమైన మనస్సు”ను కాపాడుకోవడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు, ఎందుకంటే నియమింపబడిన వారితో సహా క్రైస్తవులందరూ పాపభరిత వైఖరులకు లోనవుతారు. అయినప్పటికీ తప్పు చేస్తున్న వ్యక్తి అవసరమైన మార్పులు చేసుకోవడాన్ని సులభం చేసేది సాత్వికమే.
16 మూలభాషయైన గ్రీకులో, ‘మంచి దారికి తీసికొని రావడం’ అని అనువదించబడిన పదబంధం, విరిగిన ఎముకలను సరైన స్థానంలోకి తీసుకు రావడాన్ని కూడా సూచించవచ్చు, అది ఎంతో బాధాకరమైన ప్రక్రియ. విరిగిన ఎముకను సరిచేసే ప్రేమగల వైద్యుడు ఆ ప్రక్రియ వల్ల చేకూరే ప్రయోజనాల గురించి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు. ప్రశాంతమైన సామెతలు 25:15.
ఆయన తీరు ఓదార్పునిస్తుంది. ఆయన ముందుగా చెప్పే కొన్ని మాటలు, రానున్న తీవ్రమైన బాధను కాస్త తగ్గిస్తాయి. అలాగే, ఆధ్యాత్మికంగా మంచి దారికి తీసుకు రావడం బాధ కలిగించేదిగానే ఉండవచ్చు. కానీ సాత్వికము దాన్ని మరింత అంగీకారమైనదిగా చేయడానికి సహాయపడుతుంది, తద్వారా మంచి సంబంధాలను పునఃస్థాపించి, తప్పు చేస్తున్న వ్యక్తి తన మార్గాన్ని మార్చుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రారంభంలో సలహాను అనుసరించడానికి ఒకరు కాస్త వెనుకాడినా, సహాయం చేస్తున్న వ్యక్తి చూపించే సాత్వికము చక్కని లేఖనాధారిత సలహాను పాటించడం పట్ల ఉన్న అయిష్టాన్ని తొలగించవచ్చు.—17 మంచి దారికి రావడానికి ఇతరులకు సహాయం చేసేటప్పుడు, ఇస్తున్న సలహాను విమర్శలా తీసుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక రచయిత దాన్నిలా వివరిస్తున్నాడు: “ఇతరులను సరిదిద్దేటప్పుడు అతిగా నొక్కిచెప్పే ధోరణి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు సాధుత్వము ఆవశ్యకం.” వినయం నుండి ఉత్పన్నమయ్యే సాత్వికమును వృద్ధి చేసుకోవడం, ఈ ప్రమాదాన్ని నివారించడానికి క్రైస్తవ సలహాదారుడికి సహాయం చేస్తుంది.
“మనుష్యులందరియెడల”
18 చాలామంది సాత్వికము చూపించడం కష్టమని భావించే ఒక రంగం లౌకిక అధికారులతో వ్యవహరించడం. అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తించే తీరు కఠినత్వాన్ని, తదనుభూతి లేకపోవడాన్ని చూపిస్తుందని అంగీకరించవలసిందే. (ప్రసంగి 4:1; 8:9) అయితే యెహోవాపట్ల మనకున్న ప్రేమ, ఆయన సర్వోన్నత అధికారాన్ని గుర్తించడానికి, ప్రభుత్వ అధికారులకు చెందవలసిన సాపేక్షిక విధేయతను చూపించడానికి మనకు సహాయం చేస్తుంది. (రోమీయులు 13:1, 3, 4; 1 తిమోతి 2:1, 2) అధికార స్థానాల్లో ఉన్న కొందరు, మనం యెహోవాకు చేసే ఆరాధనకు సంబంధించిన బహిరంగ వ్యక్తీకరణను పరిమితం చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా మన స్తుతి యాగమును బహిరంగంగా అర్పించడానికి మార్గాల కోసం మనం సంతోషంగా అన్వేషిస్తాము.—హెబ్రీయులు 13:15.
19 మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ జగడానికి పూనుకోము. నీతియుక్తమైన సూత్రాలతో ఎన్నడూ రాజీపడకుండా ఉంటూనే మనం సహేతుకంగా ఉండడానికి తీవ్రంగా కృషి చేస్తాము. ఈ విధంగానే, మన సహోదరులు ప్రపంచవ్యాప్తంగా 234 దేశాల్లో తమ పరిచర్యను కొనసాగించడంలో సఫలులవుతున్నారు. “అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెనని” పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని మనం లక్ష్యపెడతాము.—తీతు 3:1, 2.
20 సాత్వికమును చూపించే వారికి పుష్కలమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” అని యేసు చెప్పాడు. (మత్తయి 5:5) క్రీస్తు ఆత్మాభిషిక్త సహోదరుల విషయంలోనైతే, సాత్వికమును కాపాడుకోవడం వారికి సంతోషం కలిగేలా చేస్తుంది, రాజ్యం యొక్క భూపరిధిలో పరిపాలించే ఆధిక్యతను వారికిస్తుంది. “వేరే గొఱ్ఱెల”కు చెందిన “గొప్ప సమూహము” విషయంలోనైతే, వారు సాత్వికమును చూపించడం కొనసాగిస్తూ ఇక్కడ భూమిపై పరదైసులో జీవితం కోసం ఎదురు చూస్తారు. (యోహాను 10:16; ప్రకటన 7:9; కీర్తన 37:11) ఎంత అద్భుతమైన ఉత్తరాపేక్షలు వేచివున్నాయో కదా! కాబట్టి, పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు జ్ఞాపకం చేసిన దానిని మనమెన్నడూ నిర్లక్ష్యం చేయకుండా ఉందాము: “మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.” (ఇటాలిక్కులు మావి.)—ఎఫెసీయులు 4:1-3.
పునఃపరిశీలనలో
• కుటుంబంలో సాత్వికమును చూపించడం ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?
• క్షేత్ర పరిచర్యలో సాత్వికమును చూపించడం ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?
• సంఘంలో సాత్వికమును చూపించడం ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?
• సాత్వికుల కోసం ఎలాంటి ప్రతిఫలాలు వాగ్దానం చేయబడ్డాయి?
[అధ్యయన ప్రశ్నలు]
1. సాత్వికమును చూపించడం అన్నివేళలా ఎందుకు సులభం కాదు?
2. “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును” మనమెలా చూపించవచ్చు?
3. కుటుంబంలో ఉన్న ఎలాంటి పరిస్థితి లౌకికాత్మను ప్రతిబింబిస్తుంది?
4. సాత్వికము కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
5. మతపరంగా విభాగింపబడిన కుటుంబాల్లో సాత్వికము ఎలా తోడ్పడుతుంది?
6. సాత్వికమును చూపించడం, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న అనుబంధాలను ఎలా బలపరుస్తుంది?
7, 8. క్షేత్ర పరిచర్యలో సాత్వికమును చూపించడం ఎందుకు ఆత్యావశ్యకం?
9, 10. క్షేత్ర పరిచర్యలో సాత్వికానికున్న విలువను చూపించే ఒక అనుభవాన్ని చెప్పండి.
11. ఒక వ్యక్తి క్రైస్తవ సత్యాన్ని అంగీకరించడానికి సాత్వికము ఎలా మార్గాన్ని సుగమం చేయగలదు?
12. క్రైస్తవ సంఘ సభ్యులు ఎలాంటి లోకసంబంధమైన లక్షణాలను నిరోధించాలి?
13, 14. ‘ఎదురాడు వారికి సాత్వికముతో’ ఉపదేశించినప్పుడు వచ్చే ఫలితం ఎలా ఉంటుంది?
15. సలహా ఇచ్చేటప్పుడు సాత్వికము ఎందుకు ప్రాముఖ్యము?
16, 17. సలహాను పాటించడం పట్ల ఉన్న అయిష్టతను తొలగించుకోవడానికి ఏమి సహాయం చేస్తుంది?
18, 19. (ఎ) క్రైస్తవులు, లౌకిక అధికారులతో వ్యవహరించేటప్పుడు సాత్వికమును చూపించడం కష్టంగా ఉన్నట్లు ఎందుకు భావించవచ్చు? (బి) అధికారంలో ఉన్నవారి పట్ల సాత్వికమును చూపించడానికి క్రైస్తవులకు సహాయం చేసేది ఏమిటి, దాని వల్ల ఎలాంటి ఫలితం వచ్చే అవకాశముంది?
20. సాత్వికమును చూపించే వారి కోసం ఎలాంటి ప్రతిఫలాలు వేచివున్నాయి?
[21వ పేజీలోని చిత్రం]
మతపరంగా విభాగింపబడిన కుటుంబాల్లో సాత్వికము మరింత ప్రాముఖ్యం
[21వ పేజీలోని చిత్రం]
సాత్వికము కుటుంబ బంధాలను బలపరుస్తుంది
[23వ పేజీలోని చిత్రం]
మిమ్మల్ని మీరు సమర్థించుకునేటప్పుడు సాత్వికమును, ప్రగాఢమైన గౌరవాన్ని చూపించండి
[24వ పేజీలోని చిత్రం]
సలహాదారుడి సాత్వికము తప్పు చేస్తున్న వ్యక్తికి సహాయం చేయవచ్చు