కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు

మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు

మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ప్రారంభించిన ప్రభువు రాత్రి భోజనం కేవలం చారిత్రాత్మకమైన సంఘటన మాత్రమే కాదు. అది ప్రారంభించబడినప్పటినుండి ప్రజలపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఆ రాత్రి జరిగిన విషయాల గురించి సువార్త నివేదికలలో చదివిన దాన్నిబట్టి కదిలించబడి ప్రభువు రాత్రి భోజనాన్ని వివిధ రకాలుగా ఆచరించడానికి అనేకమంది కృషి చేస్తున్నారు.

ఈ సంఘటనను క్రమంగా గుర్తుచేసుకొమ్మని యేసుక్రీస్తే స్వయంగా తన అనుచరులకు ఆజ్ఞాపించాడు కాబట్టి ప్రభువు రాత్రి భోజనం విషయంలో అనేకులు ఆసక్తి చూపించడం అర్థం చేసుకోదగినదే. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయు[డి]” అని ఆయన వారికి నిర్దిష్టంగా చెప్పాడు.​—⁠లూకా 22:19; 1 కొరింథీయులు 11:23-25.

అయితే ఈ ఆచరణ నిజంగా ఆశీర్వాదకరమైన అనుభవంగా ఉండాలంటే, ఒక వ్యక్తికి దాని భావం గురించి దేవుని వాక్యమైన బైబిలులో ఇవ్వబడినట్లు ఖచ్చితమైన అవగాహన ఉండాలి. అంతేకాక ఈ ఆచరణను ఎప్పుడు, ఎలా ఆచరించాలి అనే విషయంలో బైబిలు ఏమి చెబుతున్నదో తెలుసుకోవడం కూడా ప్రాముఖ్యం.

యేసు ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు, 2003 ఏప్రిల్‌ 16, బుధవారం సాయంత్రం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సమావేశమవుతారు. ఆ సందర్భంలో వారు లేఖనాలను పరిశీలించి, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తునందు తమ విశ్వాసాన్ని, ఆయనపై తమకున్న ప్రేమను పునరుజ్జీవింపజేసుకుంటారు. (యోహాను 3:​16) మీరు కూడా యేసుక్రీస్తునందు, పరలోక తండ్రి అయిన యెహోవా దేవునియందు మీకున్న విశ్వాసాన్నీ ప్రేమనూ బలపరచుకొనేందుకు వారితో కలిసి ఆ సాయంత్రం సమావేశమవమని హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు.