కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమపూర్వక దయ ఎంత ప్రాముఖ్యమైనది?

ప్రేమపూర్వక దయ ఎంత ప్రాముఖ్యమైనది?

ప్రేమపూర్వక దయ ఎంత ప్రాముఖ్యమైనది?

“కృప [“ప్రేమపూర్వక దయ,” NW] చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 19:​22) అవును, ప్రేమచే పురికొల్పబడిన దయాపూర్వకమైన క్రియలు నిజంగా కోరదగినవే. అయితే బైబిలులోని “ప్రేమపూర్వక దయ” అనే పదబంధం, మానవుల మధ్య అప్పటికే ఉన్న సంబంధాలపై ఆధారపడివుండే దయను అంటే అంతకుముందు ఒక వ్యక్తి తమ కోసం దయాపూర్వకంగా చేసిన సహాయంపై ఆధారపడివుండే దయను సూచిస్తోంది. కాబట్టి దానిలో విశ్వసనీయత కూడా చేరివుంది.

అభిలషణీయమైన ఈ లక్షణాన్ని పెంపొందించుకోవడంలో యూదా రాజైన యోవాషు విఫలుడయ్యాడు. ఆయన తన అత్తకు, మామ యెహోయాదాకు కృతజ్ఞతతో ఎంతో రుణపడి ఉండాలి. యోవాషుకు ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్నప్పుడు దుష్టురాలైన ఆయన అమ్మమ్మ తనను తాను మహారాణిగా ప్రకటించుకొని, సింహాసనానికి వారసులైన యోవాషు సహోదరులందరినీ చంపేసింది. అయితే ఆమె యోవాషును చంపలేకపోయింది ఎందుకంటే ఆయన అత్త, మామ ఆయనను జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచారు. వారు ఆయనకు దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా బోధించారు. యోవాషుకు ఏడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన మామ యెహోయాదా ప్రధాన యాజకుడిగా తన అధికారాన్ని ఉపయోగించి దుష్టురాలైన మహారాణికి మరణ శిక్ష విధించి యోవాషును సింహాసనాసీనుడిని చేశాడు.​—⁠2 దినవృత్తాంతములు 22:10-23:15.

యౌవనుడైన యోవాషు రాజు తన మామ చనిపోయేంత వరకూ చక్కగా పరిపాలించాడు, కానీ ఆ తర్వాత ఆయన విగ్రహారాధన చేయడం ప్రారంభించాడు. యోవాషును అతని మతభ్రష్టత్వం విషయమై హెచ్చరించడానికి దేవుడు యెహోయాదా కుమారుడైన జెకర్యాను పంపించాడు. అయితే యోవాషు జెకర్యాను రాళ్ళతో కొట్టి చంపించాడు. తాను అంతగా రుణపడి వున్న కుటుంబం పట్ల ఎంత విశ్వాసఘాతుకమైన చర్యో కదా!​—⁠2 దినవృత్తాంతములు 24:17-21.

“రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును [“తనపట్ల చూపిన ప్రేమపూర్వక దయను,” NW] మరచినవాడై అతని కుమారుని చంపించెను” అని బైబిలు నివేదిస్తోంది. జెకర్యా చనిపోతున్నప్పుడు, “యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక” అని అన్నాడు. జెకర్యా మాటలను నిజం చేస్తూ యోవాషు అనారోగ్యం పాలై తన సొంత దాసుల చేతుల్లో హత్య చేయబడ్డాడు.​—⁠2 దినవృత్తాంతములు 24:17-25.

యోవాషు రాజులా తయారయ్యే బదులు, ఈ సలహాను పాటించేవారందరికీ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది: “దయను [“ప్రేమపూర్వక దయను,” NW] సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము . . . అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.”​—⁠సామెతలు 3:3, 4.