కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్త పవిత్రతను కాపాడుకోవడానికి సహాయం

రక్త పవిత్రతను కాపాడుకోవడానికి సహాయం

రాజ్యప్రచారకుల నివేదిక

రక్త పవిత్రతను కాపాడుకోవడానికి సహాయం

రక్త పవిత్రతకు సంబంధించి, భూవ్యాప్తంగా ఉన్న యెహోవా సేవకులు దేవుని పట్ల విశ్వసనీయులుగా ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 15:​28, 29) క్రైస్తవ సహోదరులకు సహాయపడేందుకు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ఏర్పాట్లు చేసింది. (మత్తయి 24:​45-47) ఫిలిప్పీన్స్‌లోని ఫలితాలు ఏమిటో చూద్దాం.

ఫిలిప్పీన్స్‌ బ్రాంచి ఇలా నివేదిస్తోంది: “బ్రూక్లిన్‌ బేతేలు నుండి వచ్చే ప్రతినిధులు ఫిలిప్పీన్స్‌లో ఒక సెమినార్‌ జరుపబోతున్నారని 1990లో మాకు తెలియజేయబడింది. కొరియా, తైవాన్‌, హాంకాంగ్‌ బ్రాంచీలతోసహా ఆసియాలోని వివిధ బ్రాంచీల నుండి సహోదరులు ఆహ్వానించబడ్డారు. ఆయా బ్రాంచీలలోని ఆసుపత్రి సమాచార సేవా విభాగాలకు సహాయపడడం, ఆసుపత్రి అనుసంధాన కమిటీలను ఏర్పాటు చేయడమే ఆ సెమినార్‌ ఉద్దేశం. ఫిలిప్పీన్స్‌లో ఈ కమిటీలు మొదట నాలుగు పెద్ద నగరాల్లో నెలకొల్పబడ్డాయి.” రక్తం విషయంలో మన క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి మనకు సహకరించడానికి ఇష్టపడే డాక్టర్లను వెదకడానికి ఈ కమిటీలు కృషి చేస్తాయి. రక్తానికి సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు కూడా అవి సహోదరులకు సహాయం చేస్తాయి.

బాగీవో నగరంలోని ఆసుపత్రి అనుసంధాన కమిటీలో సేవ చేయడానికి రెమెగ్యో ఎంపికచేయబడ్డాడు. కాలం గడుస్తుండగా డాక్టర్లు ఈ కమిటీని గుర్తించడం ప్రారంభించారు. రక్తాన్ని తిరస్కరించే సాక్షుల రోగులకు ఎలా చికిత్స చేయాలో తెలుసుకోవడానికి, కొందరు డాక్టర్లు ఆసుపత్రి అనుసంధాన కమిటీతో సమావేశమైన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెమెగ్యో ఇలా అన్నాడు: “డాక్టర్లు ప్రశ్నించడం ప్రారంభించారు, కానీ ఆ ప్రశ్నలు పూర్తిగా సాంకేతికపరమైనవి కావడం వల్ల నాకు గొంతు పెగలకుండా అయ్యింది.” ఆ సమస్యతో వ్యవహరించేందుకు సహాయపడమని ఆయన యెహోవాకు ప్రార్థించాడు. రెమెగ్యో ఇంకా ఇలా చెప్పాడు: “ప్రతీ ప్రశ్న తర్వాత, ఇతర డాక్టర్లు తమ చేతులను పైకెత్తి అలాంటి పరిస్థితులను తామెలా ఎదుర్కొన్నారో చెప్పారు.” అలా ఆ ప్రశ్నా జవాబుల కార్యక్రమం రెండు గంటలపాటు కొనసాగి ప్రత్యేకించి తనకు సహాయం లభించినందుకు రెమెగ్యో సంతోషించాడు.

ఇప్పుడు అక్కడ దేశవ్యాప్తంగా మొత్తం 21 కమిటీలు ఉన్నాయి, వాటిలో 77 మంది సహోదరులు సేవ చేస్తున్నారు. డాక్టర్‌గా సేవ చేస్తున్న డానీలో అనే ఒక సాక్షి ఇలా అంటున్నాడు: “తమ రోగుల్లోని సాక్షులకు ప్రేమపూర్వకంగా చూసుకునే ఒక సంస్థ మద్దతు ఉందని డాక్టర్లు గ్రహిస్తున్నారు.” రక్తమార్పిడి లేకుండా ఒక సహోదరునికి సర్జరీ చేయడానికి ఒక డాక్టర్‌ మొదట నిరాకరించాడు. అయినా ఆ సహోదరుడు తన నిర్ణయాన్ని హత్తుకొని ఉన్నాడు. ఎట్టకేలకు సర్జరీ జరిగింది, విజయవంతమయ్యింది కూడా. అక్కడి ఆసుపత్రి సమాచార సేవా విభాగం ఇలా నివేదిస్తోంది: “ఆ సహోదరుడు కోలుకున్న తీరును చూసి ఆ డాక్టర్‌ ఆశ్చర్యపోయాడు. ఆ డాక్టర్‌ ఇలా అన్నాడు: ‘ఇక్కడ జరిగిందాన్ని బట్టి, మీ సభ్యుల్లో ఎవరికైనా ఇక మీదట ఇలాంటి రక్తరహిత సర్జరీ అవసరమైతే నేను సంతోషంగా చేస్తాను.’”