కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉత్కంఠభరితమైన ఒక లాగ్‌బుక్‌

ఉత్కంఠభరితమైన ఒక లాగ్‌బుక్‌

ఉత్కంఠభరితమైన ఒక లాగ్‌బుక్‌

రిచర్డ్‌ ఇ. బయర్డ్‌ అనే పరిశోధకుడు 1928 నుండి 1956 వరకు దక్షిణధ్రువ ప్రాంతాల్లో అయిదుసార్లు సాహసయాత్రలు చేశాడు. ఆయన, ఆయన బృందాలు డైరీ వ్రాసుకోవడం వల్ల, లాగ్‌ పుస్తకాలను వ్రాసిపెట్టుకోవడం వల్ల వాయు గమనాలను నిర్ధారించగలిగారు, నైసర్గిక స్వరూప పటాలను రూపొందించగలిగారు, అంటార్కిటికా భూభాగం గురించి గణనీయమైన సమాచారాన్ని సేకరించగలిగారు.

ప్రయాణ వివరాలను వ్రాసి పెట్టే లాగ్‌బుక్‌ విలువను బయర్డ్‌ సాహసయాత్రలు స్పష్టీకరిస్తాయి. లాగ్‌బుక్‌లో ఓడ లేక విమాన ప్రయాణ విశేషాలు సంపుటీకరించబడతాయి. ఈ సమాచారం, ఆ ప్రయాణంలో ఏమి జరిగిందో పరిశీలించేందుకు లేదా భవిష్యత్తులో మళ్ళీ అక్కడకు పయనించడమెలాగో విశ్లేషించేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది.

నోవహు రోజుల్లో జరిగిన జలప్రళయం గురించి లేఖనాలు ఉత్కంఠభరితమైన వృత్తాంతాన్ని సమకూర్చాయి. విశ్వవ్యాప్తంగా జరిగిన ఆ జలప్రళయం సంవత్సరం కంటే ఎక్కువకాలం కొనసాగింది. ఆ జలప్రళయానికి సన్నద్ధమయ్యేందుకుగాను నోవహు, ఆయన భార్య, వారి ముగ్గురు కుమారులు, వారి భార్యలు దాదాపు 40,000 క్యూబిక్‌ మీటర్ల పరిమాణం గల బ్రహ్మాండమైన ఒక ఓడను నిర్మించడానికి 50, 60 సంవత్సరాలు గడిపారు. అంత పెద్ద ఓడ దేనికి? జలప్రళయం నుండి కొందరు మానవులను, కొన్ని జంతువులను కాపాడడానికే.​—⁠ఆదికాండము 7:​1-3.

వాస్తవానికి జలప్రళయం ఆరంభం నుండి, నోవహు ఆయన కుటుంబము ఆ ఓడ నుండి బయటకు వచ్చేంతవరకు జరిగిన నోవహు లాగ్‌బుక్‌ అని పిలువబడగల సమాచారం బైబిలు పుస్తకమైన ఆదికాండములో నమోదు చేయబడివుంది. దానిలో నేడు మనకు సూచనార్థకమేమైనా ఉందా?