కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దాతృత్వానికి ఏమవుతోంది?

దాతృత్వానికి ఏమవుతోంది?

దాతృత్వానికి ఏమవుతోంది?

న్యూయార్క్‌ నగరంలోను, వాషింగ్‌టన్‌ డి.సి.లోను 2001, సెప్టెంబరు 11న దాడులు జరిగిన తర్వాత, ప్రజలు బాధితులకు పెద్దపెట్టున మద్దతు ఇచ్చారు. వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ధర్మసంస్థలకు 270 కోట్ల డాలర్లు విరాళంగా ఇవ్వబడ్డాయి. జరిగిన వినాశనాన్ని బట్టి దిగ్భ్రాంతులైన సర్వత్రావున్న ప్రజలు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

అయితే ప్రముఖ ధర్మసంస్థలు విరాళాలను దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలు తలెత్తడంతో కొంతమంది ప్రజలు వెంటనే చాలా నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఒక పెద్ద ధర్మసంస్థ తాను అందుకున్న 54.6 కోట్ల డాలర్లలో దాదాపు సగం ఇతర సంకల్పాల కోసం ఉపయోగించడానికి పథకం వేసిందనే నివేదిక విని ప్రజలు ఉగ్రులయ్యారు. ఆ తర్వాత ఆ సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుని క్షమాపణలు కోరినప్పటికీ ఒక రిపోర్టర్‌ ఇలా పేర్కొన్నది: “వారు క్షమాపణ చెప్పినా జరిగిన నష్టం ఎలాగు జరిగింది కాబట్టి అది” దాడులకు ముందు ధర్మసంస్థలపై ఉండిన “విశ్వాసాన్ని పునఃస్థాపించగల సత్తాలేని చర్య అని విమర్శకులు భావిస్తున్నారు.” మీ విషయమేమిటి? ధర్మసంస్థలపై మీకున్న విశ్వాసం కూడా ఇటీవల సడలిపోయిందా?

ప్రయోజనమా, నిష్ప్రయోజనమా?

ధర్మసంస్థలకు విరాళాలివ్వడం సాధారణంగా ఒక సుగుణంగా పరిగణించబడుతుంది. అయినా, అందరూ దాన్ని అలా దృష్టించరు. రెండు వందల కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, ఆంగ్ల వ్యాసరచయిత సామ్యెల్‌ జాన్‌సన్‌ ఇలా వ్రాశాడు: “కేవలం దానం చేయడం కంటే కష్టపడి పని చేసినవారికి జీతంగా డబ్బు చెల్లించినప్పుడు మంచి పని చేస్తున్నారన్న నమ్మకం మీకు మరింత ఎక్కువగా ఉంటుంది.” నేడు కొందరు ధర్మసంస్థలకు ఇవ్వడానికి అలాగే సంకోచిస్తున్నారు, ధర్మసంస్థలు తమకు అందిన విరాళాలను సరిగా వాడడంలేదని లేదా దుర్వినియోగం చేస్తున్నాయని వస్తున్న నివేదికలు ప్రజల నమ్మకాన్ని పెంచడానికేమీ దోహదపడవు. ఇటీవల జరిగిన రెండు ఉదాహరణలను పరిశీలించండి.

సాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఒక మతసంబంధ ధర్మసంస్థ డైరెక్టరు తాను కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకోవడానికైన ఖర్చును, రెండు సంవత్సరాలపాటు వారానికి 500 డాలర్ల చొప్పున రెస్టారెంట్‌లలో తాను చేసిన ఖర్చును తన సంస్థ పేరు మీద వాడుకున్నాడనే ఆరోపణలతో డిస్‌మిస్‌ చేయబడ్డాడు. అదేవిధంగా బ్రిటన్‌లో, విరాళాలు సేకరించడానికి ఒక పెద్ద టీవీ కార్యక్రమాన్ని నిర్వహించినవారు, రుమేనియాలో క్రొత్త అనాథాశ్రమాలను నిర్మించడానికి సహాయంగా పంపబడిన 65 లక్షల పౌండ్లతో (దాదాపు ఒక కోటి అమెరికా డాలర్లతో) ఇంతవరకు కేవలం 12 నాసిరకం కట్టడాలు నిర్మించబడ్డాయని, లక్షల డాలర్లు గల్లంతయ్యాయని బయటపడడంతో కలవరపడ్డారు. ఇటువంటి ప్రతికూల నివేదికలు, కొంతమంది దాతలు తాము ఎంత దానం చేస్తాము, ఎవరికి దానం చేస్తాము అనే విషయాల గురించి సరిగ్గానే మరింత అప్రమత్తంగా ఉండేలా చేశాయి.

ఇవ్వాలా వద్దా

ఇతరులపట్ల మనకున్న యథార్థమైన శ్రద్ధను, కనికరాన్ని కొంతమంది వ్యక్తుల లేదా సంస్థల చర్యలు అణచివేయడానికి అనుమతించడం అవమానకరమైన విషయం. ‘దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించడమే తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి’ అని బైబిలు చెబుతోంది. (యాకోబు 1:​27) అవును బీదవారి కోసం దరిద్రుల కోసం ఏవైనా చర్యలు తీసుకోవడం క్రైస్తవత్వంలో ఒక సమగ్ర భాగం.

అయినప్పటికీ, ‘ధర్మసంస్థలకు విరాళాలు ఇవ్వాలా లేక ఎవరికైనా నేనే స్వయంగా సహాయం చేయడానికి ప్రయత్నించాలా?’ అని మీరు అనుకుంటుండవచ్చు. మనం ఏ విధమైన దానం చేయాలని దేవుడు కోరుతున్నాడు? ఈ ప్రశ్నలను తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.