సంతృప్తి రహస్యాన్ని తెలుసుకోవడం
సంతృప్తి రహస్యాన్ని తెలుసుకోవడం
ఫిలిప్పీలోని క్రైస్తవులకు పంపిన ఒక ప్రోత్సాహకరమైన ఉత్తరంలో అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. . . . ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను.”—ఫిలిప్పీయులు 4:11, 12.
పౌలు సంతృప్తికి రహస్యం ఏమిటి? నేడు ఎంతో అధికంగావున్న జీవన వ్యయం, ఆర్థిక అస్థిరతల దృష్ట్యా నిజ క్రైస్తవులు తమ అవధానాన్ని దేవుని సేవపై నిలిపి ఉంచడానికి, సంతృప్తితో ఎలా ఉండాలో తెలుసుకోవడం తప్పకుండా ప్రయోజనకరంగా ఉంటుంది.
పౌలు తన ఉత్తరంలో, విజయవంతమైన తన పూర్వపు జీవితగమనాన్ని ఇలా వర్ణించాడు: “మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును. ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.” (ఫిలిప్పీయులు 3:4-6) అంతేకాక యెరూషలేములోని ప్రధాన యాజకులు, అత్యాసక్తిగల యూదుడైన పౌలుకు ఒక ఆజ్ఞయచ్చి ఆయనకు మద్దతునిచ్చారు. కాబట్టి పౌలు యూదా వ్యవస్థలో రాజకీయపరంగా, మతపరంగా, నిస్సందేహంగా ఆర్థికపరంగా కూడా అధికారం, గొప్ప ప్రతిష్ఠ పొందే అవకాశం ఉంది.—అపొస్తలుల కార్యములు 26:10, 12.
అయితే పౌలు అత్యంతాసక్తిగల క్రైస్తవ పరిచారకుడిగా మారినప్పుడు పరిస్థితుల్లో గొప్ప మార్పు వచ్చింది. సువార్త కోసం ఆయన విజయవంతమైన తన జీవనవృత్తిని, యూదా సమాజంలో మునుపు ప్రాముఖ్యంగా పరిగణించబడే వాటన్నింటిని ఇష్టపూర్వకంగా వదులుకున్నాడు. (ఫిలిప్పీయులు 3:7, 8) ఆయన ఇప్పుడు తనను తాను ఎలా పోషించుకుంటాడు? ఒక పరిచారకుడిగా ఆయనకు జీతం లభిస్తుందా? ఆయన తన వ్యక్తిగత అవసరాలను ఎలా తీర్చుకుంటాడు?
పౌలు తన పరిచర్యను ఉచితంగా చేశాడు. తాను ఎవరికైతే పరిచర్య చేస్తున్నాడో వారికి భారంగా ఉండకూడదని ఆయన కొరింథులో ఉన్నప్పుడు అకుల, ప్రిస్కిల్లతోపాటు డేరాలు కుట్టేవాడు, తనను తాను పోషించుకోవడానికి ఆయన వేరే పనులు కూడా చేసేవాడు. (అపొస్తలుల కార్యములు 18:1-3; 1 థెస్సలొనీకయులు 2:9; 2 థెస్సలొనీకయులు 3:8-10) పౌలు విస్తృతమైన మూడు మిషనరీ ప్రయాణాలను చేశాడు, సందర్శనం అవసరమైన సంఘాలకు కూడా ఆయన ప్రయాణించి వెళ్ళాడు. ఆయన దేవుని సేవలో నిమగ్నమై ఉండేవాడు కాబట్టి ఆయనకు భౌతిక సంపదలు చాలా తక్కువగా ఉండేవి. సాధారణంగా సహోదరులే ఆయన అవసరాలను తీర్చేవారు. అయితే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో ఆయన భౌతిక అవసరాలు తీర్చుకోలేక కష్టాలు అనుభవించాడు. (2 కొరింథీయులు 11:27; ఫిలిప్పీయులు 4:15-18) అయినప్పటికీ పౌలు తన దుస్థితి గురించి ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు, ఇతరుల దగ్గర ఉన్నవి తనకు కూడా ఉండాలని ఆయన కోరుకోలేదు. తోటి క్రైస్తవుల ప్రయోజనార్థం ఆయన ఇష్టపూర్వకంగా సంతోషంగా కృషి చేశాడు. నిజానికి, ప్రఖ్యాతిగాంచిన యేసు మాటలను ఉల్లేఖించింది పౌలే: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” మనందరికీ ఎంత విశిష్టమైన మాదిరో కదా!—అపొస్తలుల కార్యములు 20:33-35.
సంతృప్తి యొక్క భావం
పౌలు సంతోషానికి కారణమైన ప్రధానాంశం, ఆయనకున్న సంతృప్తి స్వభావం. సంతృప్తితో ఉండడం అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే, కనీస అవసరాలతో తృప్తిగా ఉండడమని దాని భావం. పరిచర్యలో తన సహచరుడైన తిమోతికి పౌలు ఆ విషయం గురించి ఇలా చెప్పాడు: “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.”—1 తిమోతి 6:6-8.
పౌలు సంతృప్తిని దైవభక్తితో జతచేశాడని గమనించండి. నిజమైన సంతోషం దైవభక్తి నుండి వస్తుందని, అంటే భౌతిక సంపదలకు లేదా ధనానికి కాక దేవుని సేవకు మొదటి స్థానాన్నివ్వడం ద్వారా వస్తుందని ఆయన గ్రహించాడు. ఆయన దైవభక్తిని వెంటాడుతూనే ఉండడానికి “అన్నవస్త్రములు” కేవలం సహాయకాలుగానే ఉపయోగపడ్డాయి. కాబట్టి పౌలు సంతృప్తికి రహస్యం, పరిస్థితులు ఏవైనప్పటికీ యెహోవాపై ఆధారపడడమే.
నేడు చాలామందికి ఆ రహస్యం తెలియదు, ఒకవేళ తెలిసినా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వారు చాలా ఒత్తిడికి గురై బాధను అనుభవిస్తున్నారు. సంతృప్తిని పెంపొందించుకోకుండా వారు డబ్బు మీద, డబ్బుతో కొనగల వస్తువుల మీద తమ నమ్మకాన్ని ఉంచడానికి 1 తిమోతి 6:9, 10.
ఇష్టపడుతున్నారు. వాణిజ్య ప్రకటనల పరిశ్రమ, సమాచార మాధ్యమాలు ప్రజల దగ్గర అధునాతనమైన, ఖరీదైన వస్తువులూ పరికరాలూ ఉంటేనే తప్ప—వాటిని వెంటనే కొనుక్కుంటేనే తప్ప—వారు సంతోషంగా ఉండలేరని భావించేలా చేస్తాయి. తత్ఫలితంగా చాలామంది డబ్బును, ఆస్తిని సంపాదించుకోవడంలో మునిగిపోవడమనే ఉరిలో చిక్కుకుంటారు. వారు సంతోషాన్నీ సంతృప్తినీ పొందే బదులు “శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు.”—వారు ఆ రహస్యాన్ని తెలుసుకున్నారు
ఈ రోజుల్లో దైవభక్తితోను, సంతృప్తితోను జీవిస్తూ సంతోషాన్నీ సంతృప్తినీ పొందడం నిజంగా సాధ్యమేనా? అవును, సాధ్యమే. నిజానికి నేడు లక్షలాదిమంది సరిగ్గా అలాగే జీవిస్తున్నారు. తమకున్న భౌతిక వస్తువులతోనే సంతోషంగా ఉండే రహస్యాన్ని వారు నేర్చుకున్నారు. వారే యెహోవాసాక్షులు, వారు దేవునికి తమను తాము సమర్పించుకొని, ఆయన చిత్తం చేస్తూ ఆయన సంకల్పం గురించి అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు బోధిస్తున్నారు.
మత్తయి 24:14) తరచుగా, వారు పంపించబడే దేశాలు తాము ముందు నివసించిన దేశాల్లా వస్తుపరంగా అభివృద్ధి చెందినవి కావు. ఉదాహరణకు 1947 ప్రారంభంలో ఆసియాలోని ఒక దేశానికి మిషనరీలు వచ్చినప్పుడు, ఆ దేశంలో యుద్ధ ప్రభావాలు ఇంకా ఉన్నాయి, కొన్ని ఇళ్ళల్లో మాత్రమే ఎలక్ట్రిక్ లైట్లు ఉన్నాయి. చాలా దేశాల్లో మిషనరీలు తమ బట్టల్ని ఎలక్ట్రిక్ వాషింగ్ మెషీన్‌లో కాక ఒక్కొక్కటిగా బండ మీద లేదా నది పక్కన ఉన్న రాళ్ళపై ఉతుక్కోవలసి వచ్చింది. అయితే వారు ప్రజలకు బైబిలు సత్యాన్ని నేర్పించడానికి వచ్చారు కాబట్టి వారు స్థానిక పరిస్థితులకు సర్దుకుపోయి పరిచర్యలో ఎక్కువగా పాల్గొనేవారు.
ఉదాహరణకు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వేరే దేశాలకు మిషనరీలుగా వెళ్ళేందుకు శిక్షణపొందడం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి గురించి ఆలోచించండి. (ఇతరులు పూర్తికాల ప్రకటనా పనిని చేపట్టారు లేదా ఇంకా సువార్త చేరని మారుమూల ప్రాంతాలకు వెళ్ళారు. అడాల్ఫో మెక్సికోలోని వేర్వేరు ప్రాంతాల్లో 50 సంవత్సరాల పాటు పూర్తికాల పరిచారకుడిగా సేవచేశాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేనూ నా భార్యా అపొస్తలుడైన పౌలువలే పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం నేర్చుకున్నాము. ఉదాహరణకు మేము సందర్శించిన ఒక సంఘం నగరానికి లేదా మార్కెట్‌కు చాలా దూరంగా ఉండేది. భోజన సమయాల్లో సహోదరులు కేవలం కొంచెం లార్డ్, ఉప్పుతోపాటు ఒక టార్టిల్లా తిని ఒక కప్పు కాఫీ తాగి సంతృప్తిపడేవారు. వారు భుజించడానికి రోజుకు కేవలం మూడు టార్టిల్లాలు మాత్రమే ఉండేవి. కాబట్టి మేము కూడా ఆ సహోదరుల్లా జీవించడం నేర్చుకున్నాము. యెహోవాకు నేను పూర్తికాల సేవ చేసిన 54 సంవత్సరాల్లో నేను అలాంటి అనుభవాలను ఎన్నో చవిచూశాను.”
తను, తన కుటుంబం కష్టమైన పరిస్థితుల్లో ఎలా సర్దుకుపోవలసి వచ్చిందో ఫ్లోరెంటినోకు గుర్తుంది. తన తొలి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన ఇలా చెబుతున్నాడు: “ఒకప్పుడు నా తండ్రి సంపన్నుడైన వ్యాపారి. ఆయనకు ఎంతో భూమి ఉండేది. మా కిరాణా కొట్టు సరుకుల బల్ల నాకు ఇంకా గుర్తుంది. అక్కడ 50 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉన్న ఒక సొరుగు ఉండేది, దానిలో నాలుగు భాగాలు ఉండేవి. కొనుగోలుదారుల నుండి వచ్చిన డబ్బును మేము అక్కడ పెట్టేవాళ్ళం. రోజు పూర్తయ్యేసరికి ఎల్లప్పుడూ అది నాణాలతో, నోట్లతో నిండిపోయేది.
“అకస్మాత్తుగా మాకు ఆర్థిక నష్టం వచ్చింది, గొప్పవాళ్ళమైన మేము పేదవారిగా మారిపోయాము. మేము మా ఇంటిని తప్ప అన్నింటినీ పోగొట్టుకున్నాము. అంతేకాక మా అన్న ఒకాయన రోడ్డు ప్రమాదానికి గురైనందువల్ల ఆయన రెండు కాళ్ళకు పక్షవాతం వచ్చింది. మా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొంతకాలం పాటు నేను పండ్లు, మాంసం అమ్మేవాడిని. పత్తి, ద్రాక్ష, ఆల్ఫాల్ఫాల కోతపనిలో పనిచేశాను, పొలాలకు నీళ్ళు కూడా పెట్టేవాడిని. కొంతమంది నన్ను అన్ని పనుల్లోను ప్రవేశం ఉన్నవాడు అని పిలిచేవారు. చాలా కొద్దిమంది దగ్గర మాత్రమే ఉండే ఆధ్యాత్మిక సంపద, అంటే సత్యం మన దగ్గర ఉందని చెప్పి అమ్మ మమ్మల్ని తరచూ ఓదార్చేది. కాబట్టి నేను సమృద్ధిలోను, లేమిలోను లేదా అస్సలు ఏమీ లేనప్పుడు కూడా జీవించడం నేర్చుకున్నాను. నేను ఇప్పటికి యెహోవాకు 25 సంవత్సరాలు పూర్తికాల సేవచేశాను కాబట్టి, నేను అత్యుత్తమమైన జీవిత విధానాన్నే ఎంపిక చేసుకున్నాను అని తెలిసివుండడం వల్ల వచ్చే సంతోషాన్ని నేను ప్రతీరోజు అనుభవించానని నేను చెప్పగలను.”
“ఈ లోకపు నటన గతించుచున్నది” అని బైబిలు మనకు స్పష్టంగా చెబుతోంది. ఆ కారణంగా, అది మనల్ని ఇలా ప్రోత్సహిస్తోంది: “సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను.”—1 కొరింథీయులు 7:29-31.
అందువల్ల ఇది మనం మన జీవిత విధానాన్ని పరిశీలించుకోవలసిన సమయం. మీరు పరిమితమైన వనరులున్న పరిస్థితుల్లో ఉంటే మీ పరిస్థితులను బట్టి కోపం తెచ్చుకొని ద్వేషంతో అసూయతో నిండిపోకుండా జాగ్రత్త పడండి. మరోవైపు మీ దగ్గర ఎలాంటి వస్తుసంపదలు ఉన్నప్పటికీ అవి మీ యజమానిగా మారకుండా ఉండేందుకు వాటిని మీ జీవితంలో సరైన స్థానంలో ఉంచడం జ్ఞానయుక్తం. అపొస్తలుడైన పౌలు ఉద్బోధించినట్లు మీరు “అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుం[చాలి].” మీరలా చేస్తే మీరు కూడా సంతృప్తి రహస్యాన్ని నేర్చుకున్నారని చెప్పవచ్చు.—1 తిమోతి 6:17-19.
[9వ పేజీలోని చిత్రం]
పౌలు ఇతరులకు భారంగా ఉండకూడదని స్వయంగా పని చేశాడు
[10వ పేజీలోని చిత్రాలు]
వేలాదిమంది “సంతుష్టి సహితమైన దైవభక్తి”తో జీవించడం ద్వారా ఆనందాన్ని పొందుతున్నారు