కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సొలొమోను వీటిలో ఒకదానిలా కూడా

‘సొలొమోను వీటిలో ఒకదానిలా కూడా

‘సొలొమోను వీటిలో ఒకదానిలా కూడా

అలంకరింపబడలేదు’

క్కడ కనిపిస్తున్నలాంటి అడవిపువ్వులు దక్షిణాఫ్రికాలోని రహదారుల వెంబడి సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని కాస్‌మోస్‌ పువ్వులంటారు, ఇవి సాధారణంగా అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇలాంటి రమ్యమైన పూలు, యేసు బోధించిన ఒక పాఠాన్ని మన మనస్సుకు తేవచ్చు. ఆయన చెబుతున్నది వింటున్నవారిలో చాలామంది పేదవారు, వాళ్ళు తమ శారీరక అవసరాల గురించి, ఆహార వస్త్రాల గురించి చింతించేవాళ్ళే.

యేసు ఇలా అడిగాడు: “వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.”​—మత్తయి 6:​28, 29.

యేసు మనస్సులో ఉండిన అడవిపువ్వుల నిర్దిష్టమైన రకం గురించి వివిధ సూచనలు ఇవ్వబడ్డాయి. అయితే, యేసు దాన్ని అడవి గడ్డితో పోలుస్తూ ఇలా అన్నాడు: “నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.”​—మత్తయి 6:​30.

కాస్‌మోస్‌ పువ్వులు సాధారణంగా ఇజ్రాయేల్‌లో ఉండకపోయినప్పటికీ అవి యేసు బోధించిన పాఠాన్ని తప్పక సమర్థిస్తాయి. దూరం నుండి చూసినా, దగ్గరి నుండి పరీక్షించినా అవి ఎంతో రమ్యంగా ఉంటాయి, ఫోటోగ్రాఫర్లకు, చిత్రకారులకు అవి ప్రియమైన అంశాలు. నిజంగా, “తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు” అని యేసు అన్నప్పుడు ఆయన అతిశయోక్తిగా ఏమీ చెప్పడం లేదు.

నేడు మనమే పాఠం నేర్చుకోవచ్చు? దేవుని సేవ చేసేవారు కష్టసమయాల్లో సహితం నిత్యావసరాలు తీర్చుకోవడానికి ఆయన సహాయం చేస్తాడని నిశ్చయత కలిగివుండవచ్చు. “మీరైతే [దేవుని] రాజ్యమును వెదకుడి; దానితోకూడ ఇవి [అవసరమైన ఆహారం, వస్త్రాలు వంటివి] మీ కనుగ్రహింపబడును” అని యేసు వివరించాడు. (లూకా 12:​31) అవును, దేవుని రాజ్యాన్ని వెదికితే నిజమైన ప్రయోజనాలు చేకూరతాయి. అయితే దేవుని రాజ్యమంటే ఏమిటో, అది మానవజాతి కోసం ఏమి చేస్తుందో మీకు తెలుసా? బైబిలు నుండి సమాధానాలు పొందడానికి మీకు సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు.