అందరిలోనూ మంచిని చూడండి
అందరిలోనూ మంచిని చూడండి
“నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.”—నెహెమ్యా 13:31.
చాలారోజులు కారుమబ్బులు కమ్మి ఆ తర్వాత వచ్చే సూర్యోదయాన్ని అందరూ ఆహ్వానిస్తారు. ప్రజల ప్రాణాలు తెప్పరిల్లుతాయి, వారు సంతోషంగా ఉంటారు. అదే విధంగా, అనేక దినాలు నిప్పులు చెరిగిన ఎండాకాలం తర్వాత కురిసే వానజల్లు, లేదా కుండపోత వర్షమైనా ఎంతో సేదదీర్పును, ఉపశమనాన్నిస్తుంది. మన ప్రేమగల సృష్టికర్తయైన యెహోవా భూమిని చుట్టివున్న వాయుమండలంలో ఇంత అద్భుతమైన వాతావరణం కలుగచేశాడు. యేసు తన బోధలో దేవుడు చూపిన ఈ ఔదార్యం వైపు శ్రద్ధమళ్ళిస్తూ ఇలా అన్నాడు: “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:43-45) అవును, యెహోవా అందరికీ మేలు చేస్తాడు. ఇతరుల్లో మంచిని చూడడం ద్వారా ఆయన సేవకులు ఆయనను అనుకరించడానికి కృషిచెయ్యాలి.
2 దేని ఆధారంగా యెహోవా మేలుచేస్తాడు? ఆదాము పాపం చేసినప్పటినుండి మానవుల్లో మంచిని చూడడంలో యెహోవా విఫలం కాలేదు. (కీర్తన 130:3, 4) విధేయతగల మానవజాతిని పరదైసుకు పునరుద్ధరించడమే యెహోవా సంకల్పం. (ఎఫెసీయులు 1:9, 10) ఆయన ఉచితకృప మనకు వాగ్దత్త సంతానం ద్వారా పాపమరణాలనుండి విడుదల పొందే ఉత్తరాపేక్షనిచ్చింది. (ఆదికాండము 3:15; రోమీయులు 5:12, 15) విమోచన క్రయధన ఏర్పాటును అంగీకరించడం క్రమేపి పరిపూర్ణతకు చేరుకోవడానికి మార్గం సుగమంచేస్తుంది. ఇతర విషయాలతోపాటు, తన ఔదార్యానికి మన స్పందన ఎలావుంటుందో చూసేందుకు ఇప్పుడు యెహోవా మనలో ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. (1 యోహాను 3:16) ఆయన చేసిన మేలుయెడల మన ప్రశంసను ప్రదర్శించడానికి మనంచేసే సమస్తం ఆయన గమనిస్తాడు. “తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—హెబ్రీయులు 6:10.
3 మరైతే, మనం ఇతరుల్లో మంచిని చూడడంలో యెహోవాను ఎలా అనుకరించగలం? ఈ ప్రశ్నకు జీవితంలోని నాలుగు రంగాల్లో జవాబును పరిశీలిద్దాం: (1) క్రైస్తవ పరిచర్య, (2) కుటుంబం, (3) సంఘం, (4) ఇతరులతో మన సంబంధాలు.
ప్రకటించడంలో, శిష్యులను చేయడంలో
4 గోధుమల, గురుగుల ఉపమాన భావానికి సంబంధించి శిష్యులడిగిన ప్రశ్నలకిచ్చిన జవాబులో “పొలము లోకము” అని యేసు వివరించాడు. క్రీస్తు ఆధునిక దిన శిష్యులుగా, పరిచర్యలో పాల్గొనేటప్పుడు మనమీ సత్యం గుర్తిస్తాము. (మత్తయి 13:36-38; 28:19, 20) మన ప్రాంతీయ పరిచర్యలో మన విశ్వాసాన్ని బహిరంగంగా వెల్లడిచేయడం ఒక భాగం. యెహోవాసాక్షులు ఇంటింటి పరిచర్యకు, వీధి పరిచర్యకు పేరుగాంచారనే వాస్తవం రాజ్య సందేశానికి యోగ్యులైన వారందరిని వెదకడంలో మనకున్న పట్టుదలకు నిదర్శనంగా ఉంది. నిజానికి యేసు, “మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణ” చేయమని ఆదేశించాడు.—మత్తయి 10:11; అపొస్తలుల కార్యములు 17:17; 20:20.
5 ప్రజలు పిలువకుండానే మనం వారియొద్దకు వెళ్ళినప్పుడు, మన సందేశానికి వారి ప్రతిస్పందన ఎలావుంటుందో మనం గమనిస్తాము. కొన్నిసార్లు మనం చెప్పేది ఒకరు వింటుంటే, ఇంటిలోపలి నుండి మరొకరు “మాకు ఆసక్తి లేదు” అని అరవడం మనం గమనిస్తాం, దాంతో ఆ సందర్శనం ముగుస్తుంది. ఒకరి వ్యతిరేకత లేదా అయిష్టత మరొకరి ప్రతిస్పందన మీద ప్రభావం చూపినందుకు మనమెంత బాధపడతామో గదా! అలాంటప్పుడు, అందరిలో మంచిని చూడడానికి మనమెలా పట్టుదల కలిగియుండగలం?
6 మనమదే ప్రాంతంలో మరోసారి ప్రకటిస్తున్నప్పుడు ఆ ఇంటికే మళ్ళీ ఒకసారి వెళ్ళడం అంతకుముందు సంభాషణను అడ్డగించిన వ్యక్తితో సూటిగా మాట్లాడే యోహాను 6:44; 1 తిమోతి 2:4.
అవకాశాన్నివ్వవచ్చు. అప్పుడు జరిగింది గుర్తుచేసుకోవడం మనం సిద్ధపడి వెళ్ళడానికి సహాయం చేస్తుంది. రాజ్య సందేశం వింటున్న వ్యక్తి వినకూడదని నమ్మి ఆ వ్యతిరేకి సదుద్దేశంతోనే అలా ప్రవర్తించియుండవచ్చు. మన భావాలను గూర్చిన తప్పుడు సమాచారంతో అతని మనోవైఖరి ప్రభావం చెందియుండవచ్చు. అలాంటి అపార్థాలను యుక్తిగా సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ పట్టుదలగా ఆ ఇంటిలో రాజ్యసువార్త ప్రకటించకుండా అది మనకు అడ్డుపడకూడదు. అందరూ దేవుని గూర్చిన ఖచ్ఛితమైన జ్ఞానం పొందేలా సహాయం చేయటంలో మనం శ్రద్ధ కలిగియున్నాము. అప్పుడు యెహోవా బహుశ ఆ వ్యక్తిని ఆకర్షించవచ్చు.—7 యేసు తన శిష్యులకు బోధించిన విషయాల్లో కుటుంబ వ్యతిరేకత కూడా ఒక భాగం. “ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని” అని ఆయన చెప్పలేదా? యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.” (మత్తయి 10:35, 36) అయినప్పటికీ పరిస్థితులు, దృక్పథాలు మారతాయి. ఆకస్మిక అస్వస్థత, బంధువు చనిపోవడం, విపత్తులు, మానసిక వ్యధ, ఇలా లెక్కపెట్టలేని అనేక విషయాలు మన ప్రకటనా పనియెడల ప్రజల ప్రతిస్పందనను ప్రభావితం చేస్తాయి. మనం ప్రకటించే ప్రజలు వినరనే ప్రతికూల అభిప్రాయం మనకుంటే, మనం నిజంగా వారిలో మంచి కోసం చూస్తున్నామా? మరో సందర్భంలో ఆనందంగా వారిని మరలా ఎందుకు సందర్శించకూడదు? మనకు వారినుండి భిన్నమైన ప్రతిస్పందన రావచ్చు. కొన్నిసార్లు మనం చెప్పే విషయమే కాదు, మనం చెప్పే పద్ధతి కూడా ప్రతిస్పందనలో మార్పు తీసుకువస్తుంది. ప్రకటించడానికి ముందు యెహోవాకు భావయుక్తంగా ప్రార్థన చేయడం మనం అనుకూల స్వభావంతో ఉండడానికి, అలాగే అందరికీ ప్రీతికరమైన రీతిలో రాజ్యసందేశాన్ని అందించడానికి నిశ్చయంగా సహాయం చేస్తుంది.—కొలొస్సయులు 4:6; 1 థెస్సలొనీకయులు 5:17.
8 కొన్ని సంఘాల్లో ఒకే కుటుంబానికి చెందిన అనేకమంది సభ్యులు యెహోవాను సేవిస్తుంటారు. ఇటు కుటుంబంలో అందరితో అటు వివాహబంధంలో మంచి సంబంధాలున్న వృద్ధ బంధువుకున్న పట్టుదల తరచూ యౌవనస్థుల మెప్పును గౌరవాన్ని చూరగొని వారి హృదయంలో మార్పుకు బాటవేసింది. అపొస్తలుడైన పేతురు సలహాను లక్ష్యపెట్టడం “వాక్యము లేకుండనే” తమ భర్తలను రాబట్టుకోవడానికి క్రైస్తవ భార్యలనేకమందికి సహాయంచేసింది.—1 పేతురు 3:1, 2.
కుటుంబంలో
9 కుటుంబ సభ్యుల్ని కలిసికట్టుగావుంచే దగ్గరి సంబంధాలు మనమితరుల్లో మంచిని చూడగల మరో రంగాన్ని మనకిస్తుంది. యాకోబు తన కుమారులతో వ్యవహరించడంలోని పాఠాన్ని పరిశీలించండి. బైబిలు ఆదికాండము 37వ అధ్యాయం, 3, 4 వచనాల్లో, యాకోబు యోసేపును అపురూపంగా ప్రేమించాడని సూచిస్తోంది. యోసేపు అన్నలైతే ఈర్ష్యతో తమ్ముణ్ణి హతమార్చేందుకు కుట్రపన్నారు. అయినాసరే, యాకోబు యోసేపులు ఆ తర్వాత తమ జీవితాల్లో చూపిన దృక్పథాల్ని గమనించండి. వారిరువురూ తమ కుటుంబ సభ్యుల్లో మంచిని వెదికారు.
10 కరవు ప్రబలిన ఐగుప్తులో యోసేపు ధాన్యాగార ముఖ్య అధికారిగా ఉన్నప్పుడు, తన అన్నలను స్వాగతించాడు. తనెవరో వెంటనే వారికి చెప్పకుండా, వారిని బాగుగా చూసుకునేలా, అలాగే వారు తమ వృద్ధ తండ్రికి తిరిగి ఆహారం తీసుకెళ్ళేలా ఏర్పాటు ఆదికాండము 41:53-42:8; 45:23) అదేవిధంగా, యాకోబు మరణశయ్య మీదున్నప్పుడు తన కుమారులందరికీ ప్రవచనార్థక ఆశీర్వాదాలు ప్రకటించాడు. తమ దుష్క్రియల ఫలితంగా వారు తమ ఆధిక్యతల్ని కొంతమేరకు పోగొట్టుకున్నా, వారిలో ఎవ్వరూ స్వాస్థ్యంగా భూమి పొందకుండా లేరు. (ఆదికాండము 49:3-28) అక్కడ యాకోబు ఓర్పుతో ప్రేమను ఎంత అద్భుతంగా ప్రదర్శించాడో గదా!
చేశాడు. అవును, యోసేపు వారి ద్వేషానికి గురైనా, ఆయన వారికి మేలుకలిగేలా చర్య తీసుకున్నాడు. (11 అవిశ్వాస ఇశ్రాయేలు జనాంగంతో వ్యవహరించినప్పుడు యెహోవా చూపిన దీర్ఘశాంతం తన ప్రజల్లో ఆయన మంచినెలా చూస్తాడనే విషయంలో మనకు మరింత అంతర్దృష్టినిస్తుంది. ప్రవక్తయగు హోషేయ కుటుంబ పరిస్థితుల ఆధారంగా, సదానిలిచే తన ప్రేమను యెహోవా ఉదహరించాడు. హోషేయ భార్య గోమెరు పలుమార్లు వ్యభిచారం చేసింది. అయినప్పటికి, యెహోవా హోషేయని ఇలా ఆదేశించాడు: “ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.” (హోషేయ 3:1) ఎందుకు అలా ఆదేశించాడు? తను చూపే సహనం కారణంగా, తననుండి వైదొలగిన జనాంగంలో నుండే కొందరు ప్రతిస్పందిస్తారని యెహోవాకు తెలుసు. హోషేయ ఇలా ప్రకటించాడు: “తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.” (హోషేయ 3:5) కుటుంబంలో కష్టాలొచ్చినప్పుడు నిశ్చయంగా ఇది ధ్యానించవలసిన చక్కని మాదిరి. మీరు కుటుంబంలోని ఇతర సభ్యుల్లో ఎడతెగక మంచిని చూడటం సహనానికి కనీసం చక్కని మాదిరిగా వుంటుంది.
12 స్వంత కుటుంబ సభ్యులకు సంబంధించి మంచిని మనమెలా చూడగలమనే విషయంలో, తప్పిపోయిన కుమారుని గూర్చిన యేసు ఉపమానం మనకు మరింత అంతర్దృష్టినిస్తుంది. తన విచ్చలవిడి జీవితం విడిచిపెట్టిన తర్వాత చిన్న కుమారుడు ఇంటికి తిరిగివచ్చాడు. తండ్రి అతనిమీద కనికరపడ్డాడు. ఇంటిని ఎన్నడూ విడిచిపెట్టని పెద్దకుమారుని ఫిర్యాదులకు మరి తండ్రి ఎలా స్పందించాడు? పెద్దకుమారునితో మాట్లాడుతూ, “కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడ ఉన్నావు; నావన్నియు నీవి” అని ఆ తండ్రి అన్నాడు. ఇవి కోపంగా పలికిన మాటలు లూకా 15:11-32.
కాదు, అవి కేవలం తండ్రి ప్రేమను రూఢిపర్చాయి. ఆయనింకనూ అతనితో, “మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని” చెప్పాడు. అదే ప్రకారం మనం కూడా ఇతరుల్లో మంచి కోసం చూడవచ్చు.—క్రైస్తవ సంఘంలో
13 ప్రేమను గూర్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞను ఆచరించడమే క్రైస్తవులుగా మనకున్న గురి. (యాకోబు 2:1-9) నిజమే, వస్తుసంపదలో మనతో హెచ్చుతగ్గులున్న సంఘసభ్యుల్ని బహుశ మనమంగీకరించవచ్చు. అయితే జాతి, సంస్కృతి లేదా చివరకు మతనేపథ్యాల ఆధారంగా మనలో వర్గ “భేదములు” ఉన్నాయా? అలాగైతే, యాకోబు ఇచ్చిన సలహాను మనమెలా లక్ష్యపెట్టగలం?
14 క్రైస్తవ కూటాలకు హాజరైన వారందరిని స్వాగతించడం మన హృదయవిశాలతకు రుజువునిస్తుంది. రాజ్యమందిరాన్ని సందర్శించే కొత్తవారితో మాట్లాడేందుకు మనం చొరవ తీసుకున్నప్పుడు, తొలుత వారిలోవుండే ఎలాంటి పిరికితనమైనా, బిడియమైనా బహుశ మటుమాయం కావచ్చు. నిజానికి, మొట్టమొదటిసారి క్రైస్తవ కూటానికి వచ్చిన కొందరు, “ప్రతిఒక్కరూ ఎంతో స్నేహంగా ఉన్నారు. అందరికి నేనిదివరకే తెలిసినట్టుగా ఉంది. ఎంతో హాయిగా అనిపించింది” అని అంటారు.
15 కొన్ని సంఘాల్లో, కూటం అయిపోయిన తర్వాత కొంతమంది యౌవనస్థులు వృద్ధులతో సహవసించకుండా రాజ్యమందిరం లోపల లేదా వెలుపల కలుసుకుంటుంటారు. ఈ స్వభావాన్ని తొలగించేందుకు ఏ సునిశ్చిత చర్య తీసుకోవచ్చు? మొదటి చర్య ఏమంటే, పిల్లల్ని కూటాలకు సిద్ధపరుస్తూ వారికి ఇంటియొద్దనే శిక్షణనివ్వడం. (సామెతలు 22:6) కూటాలకు తీసుకెళ్ళడానికి అందరికి కావలసిన వివిధ సాహిత్యాలు సిద్ధంచేసే పని వారికప్పగించవచ్చు. రాజ్యమందిరంలో వృద్ధులతో, ఆరోగ్యం సరిగాలేని వారితో కాసేపు మాట్లాడడానికి పిల్లల్ని ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రులు కూడా మంచి స్థానంలో ఉన్నారు. పిల్లలు అలాంటి వారితో ప్రయోజనకరమైనదేదైనా మాట్లాడడం వారికి సంతృప్తికర భావాన్నివ్వగలదు.
16 వృద్ధ సహోదర సహోదరీలు కూడా సంఘంలోని యౌవనులపట్ల శ్రద్ధచూపించాలి. (ఫిలిప్పీయులు 2:4) ప్రోత్సహించే రీతిలో యౌవనులతో మాట్లాడేందుకు వారు చొరవ తీసుకోవచ్చు. సాధారణంగా కూటంలో కొన్ని విశేషమైన అంశాలు విశదమౌతాయి. కూటాన్ని ఆనందించారా అనో, ప్రత్యేకంగా వారు ప్రశంసించే, వారు అన్వయించుకోగల అంశాలేమైనా ఉన్నాయా అనో యౌవనులను అడగవచ్చు. యౌవనులు సంఘంలో ఒక సమగ్ర భాగం గనుక వారు చూపించే అవధానాన్ని గుర్తించాలి, అలాగే వారు కూటంలో వ్యాఖ్యానించినా, ఏదైనా కార్యక్రమంలో భాగంవహించినా వారిని మెచ్చుకోవాలి. సంఘంలోని వృద్ధులతో యౌవనులు కలివిడిగావుండే తీరు, ఇంట్లో వారు చిన్నచిన్న పనులు చేసే విధానం, జీవితంలో ఆ తర్వాత బహుశా వారు మరిగొప్ప బాధ్యతలను చక్కగా చేపట్టగలరని సూచిస్తాయి.—లూకా 16:10.
17 బాధ్యతల్ని అంగీకరించడం ద్వారా కొందరు యౌవనులు మరి ప్రాముఖ్యమైన నియామకాలు పొందేంతగా తమలో ఆధ్యాత్మిక లక్షణాలు అభివృద్ధి చేసుకుంటారు. ఏదోకపని చేస్తూవుండడం అవివేక ప్రవర్తనను నివారించేందుకు కూడా సహాయపడుతుంది. (2 తిమోతి 2:22) అలాంటి నియామకాలు పరిచర్య సేవకులుగా అర్హత సంపాదించే సహోదరుల యోగ్యతను ‘పరీక్షిస్తాయి.’ (1 తిమోతి 3:10) కూటాల్లో పాల్గొనే వారి సంసిద్ధత, పరిచర్యలో వారి ఆసక్తి, అలాగే సంఘంలో అందరియెడల వారికున్న అనురాగ దృక్పథం, సంఘ పెద్దలు వారికి అదనపు నియామకాలు ఇవ్వాలని ఆలోచించేటప్పుడు వారిలోని కార్యశక్తిని వివేచించడానికి సహాయం చేస్తాయి.
అందరిలో మంచిని చూడటం
18 “న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు” అని సామెతలు 24:23 తెలియజేస్తోంది. సంఘంలో న్యాయం తీర్చేటప్పుడు పెద్దలు పక్షపాతం చూపకూడదని పరలోక జ్ఞానం కోరుతోంది. యాకోబు ఇలా ప్రకటించాడు: “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.” (యాకోబు 3:17) కాబట్టి, ఇతరుల్లో మంచిని చూసేటప్పుడు, పెద్దలు తమ బంధుత్వాల్నిబట్టి లేదా భావావేశాల్నిబట్టి పక్షపాతంతో న్యాయం తీర్చకుండా ఉండాలి. “దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు. దైవముల [లేదా ప్రత్యామ్నాయంగా మానవ న్యాయాధిపతులను సూచిస్తూ “దేవునివలెనున్న వారి”] మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపుదురు?” అని కీర్తనకర్త ఆసాపు వ్రాశాడు. (కీర్తన 82:1, 2) దీనిప్రకారం, స్నేహితుడు లేదా బంధువుకు సంబంధించిన విషయాలొచ్చినప్పుడు క్రైస్తవ పెద్దలు పక్షపాత వైఖరిని పూర్తిగా విసర్జిస్తారు. ఈ విధంగా వారు సంఘ ఐక్యతను కాపాడుతూ యెహోవా ఆత్మ ధారాళంగా ప్రవహించడాన్ని అనుమతిస్తారు.—1 థెస్సలొనీకయులు 5:23.
19 మన సహోదర సహోదరీల్లో మంచిని చూడడంలో మనం, పౌలు థెస్సలొనీక సంఘాన్ని సంబోధించినప్పుడు ఆయన చూపిన దృక్పథమే ప్రతిబింబిస్తాము. ఆయనిలా చెప్పాడు: “మేము మీకు ఆజ్ఞాపించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాము.” (2 థెస్సలొనీకయులు 3:4) ఇతరుల్లో మనం మంచిని చూసినప్పుడు వారి దోషాల్ని చూసీచూడనట్టు ఉండడానికే మనమెక్కువ మొగ్గు చూపుతాం. నిశ్చయంగా కఠిన స్వభావం విడిచిపెట్టి మనం మన సహోదరుల్లో మెచ్చుకోగల అంశాల కోసమే వెదకుతాం. “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము” అని పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 4:2) ఈ నమ్మకత్వం సంఘంలో గృహనిర్వాహకత్వమున్న వారినేకాదు మన క్రైస్తవ సహోదర సహోదరీలందరినీ మనకెంతో ప్రియమైనవారిగా చేస్తుంది. ఆ విధంగా మనం క్రైస్తవ స్నేహబంధాన్ని బలోపేతం చేసుకుంటూ వారికి మరింత సన్నిహితులమౌతాం. తన కాలమందలి సహోదరుల యెడల పౌలుకున్న అభిప్రాయాన్నే మనమూ ఏర్పరచుకుంటాం. వారు ‘దేవుని రాజ్యము నిమిత్తము జత పనివారై యున్నారు, వారివలన మనకు ఆదరణ కలుగుతుంది.’ (కొలొస్సయులు 4:11) అలా మనం యెహోవా దృక్పథాన్ని కనుపరుస్తాం.
20 నిశ్చయంగా మనం నెహెమ్యా ప్రార్థనను ప్రతిధ్వనిస్తాం: “నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.” (నెహెమ్యా 13:31) ప్రజల్లో మంచిని యెహోవా చూస్తున్నందుకు మనకెంత సంతోషమో గదా! (1 రాజులు 14:13) ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనమూ అలాగే ప్రవర్తించుదుము గాక. అలా చేయడం మనకు విమోచననూ, ప్రస్తుతం అతి సమీపంలోవున్న నూతనలోకంలో నిత్యజీవ ఉత్తరాపేక్షనందిస్తుంది.—కీర్తన 130:3-8.
మీరెలా జవాబిస్తారు?
• దేని ఆధారంగా యెహోవా అందరికీ మేలు చేస్తాడు?
• ఇతరుల్లో మనం
• మన పరిచర్యకు సంబంధించి మంచినెలా చూడగలం?
• మన కుటుంబానికి సంబంధించి మంచినెలా చూడగలం?
• మన సంఘానికి సంబంధించి మంచినెలా చూడగలం?
• వారితో మనకుండే సంబంధాల్లో మంచినెలా చూడగలం?
[అధ్యయన ప్రశ్నలు]
1. యెహోవా అందరికీ ఎలా మేలుచేస్తాడు?
2. (ఎ) దేని ఆధారంగా యెహోవా మేలుచేస్తాడు? (బి) యెహోవా చేసిన మేలుయెడల మన ప్రతిస్పందనలో ఆయన ఏమిచూస్తాడు?
3. ఏ ప్రశ్న మన పరిశీలనార్హమైనది?
4. క్రైస్తవ పరిచర్యలో పాల్గోవడం ఎలా ఇతరుల్లో మంచిని చూసే విధానమైయుంది?
5, 6. ప్రజలను వారి ఇండ్లవద్ద పదే పదే సందర్శించడంలో మనమెందుకు పట్టుదల కలిగివుంటాము?
7. మనం ప్రజలవద్దకు వెళ్ళినప్పుడు అనుకూల దృక్పథం కలిగియుండేందుకు మనకేది సహాయం చేయగలదు?
8. అవిశ్వాసులైన బంధువుల్లో క్రైస్తవులు మంచిని వెదకినప్పుడు దాని ఫలితమేమైయుంటుంది?
9, 10. యాకోబు యోసేపులిద్దరూ తమ కుటుంబంలో మంచినెలా చూశారు?
11, 12. (ఎ) కుటుంబంలో మంచిని చూసే ప్రాముఖ్యతను ఏ ప్రవచనార్థక ఉదాహరణ నొక్కిచెబుతోంది? (బి) తప్పిపోయిన కుమారుని గూర్చిన యేసు ఉపమానంలో తండ్రి మాదిరినుండి మనమే పాఠం నేర్చుకుంటాము?
13, 14. క్రైస్తవ సంఘంలో ప్రేమను గూర్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞను ఆచరించే ఒక మార్గమేమిటి?
15. వృద్ధులపట్ల శ్రద్ధ చూపించడానికి సంఘంలోని యౌవనులకు ఎలా సహాయం చేయవచ్చు?
16, 17. వయసులో పెద్దవారు సంఘంలోని యౌవనుల్లో మంచిని ఎలా చూడగలరు?
18. న్యాయతీర్పుకు సంబంధించి ఏ ప్రమాదాన్ని తప్పించుకోవాలి, ఎందుకు?
19. మనమితరుల్లో ఏయే విధాలుగా మంచిని చూడగలం?
20. అందరిలో మంచిని చూసేవారికి ఏ ఆశీర్వాదాలు కలుగుతాయి?
[18వ పేజీలోని చిత్రం]
తన అన్నలు అంతకుముందు తనను ద్వేషించినా, యోసేపు వారిలో మంచిని చూశాడు
[19వ పేజీలోని చిత్రం]
వ్యతిరేకత మనం అందరికి సహాయం చేయడాన్ని ఆపుజేయదు
[20వ పేజీలోని చిత్రం]
యాకోబు కుమారుల గతమెట్లున్ననూ, వారిలో ఎవ్వరూ ఆయన ఆశీర్వాదాలు పొందకుండా మినహాయింపబడలేదు
[21వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ కూటాలకు అందరిని ఆహ్వానించండి