అది నా హృదయ శూన్యాన్ని నింపింది
అది నా హృదయ శూన్యాన్ని నింపింది
“యెహోవాకు సన్నిహితమవ్వండి (ఆంగ్లం) అనే అందమైన బహుమతి కొరకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అది నా హృదయ శూన్యాన్ని నింపింది. అంటే యెహోవా నన్ను ప్రేమించి కాపాడాలనే నా భావాల అవసరాన్నది తీర్చింది. యెహోవాకు ఆయన ప్రియ కుమారునికి నేనిప్పుడెంతో సమీపంగా ఉన్నట్టు భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆ పుస్తకం గురించి చెప్పాలని, నాకు ప్రియమైన వారందరికి ఒక కాపీ ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని 2002/03లో జరిగిన “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” అనే జిల్లా సమావేశాల్లో విడుదల చేయబడిన ఈ 320 పేజీల పుస్తకాన్నిగూర్చి ఒక యెహోవాసాక్షి భావించింది. ఈ క్రొత్త పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాల్ని, అలాగే అదెందుకు ప్రచురింపబడిందో మనం పరిశీలిద్దాం.
క్రొత్త పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలు
ఈ క్రొత్త పుస్తకంలో ఏముంది? ఈ సంచికలోని రెండు అధ్యయన ఆర్టికల్స్‌లోని యావత్ సమాచారంతోపాటు మరెంతో దీన్లోవుంది! ఈ పుస్తకంలో 31 అధ్యాయాలున్నాయి, ఒక్కోటి కావలికోట అధ్యయన ఆర్టికలంత ఉంటుంది. ఉపోద్ఘాతం మొదటి మూడు అధ్యాయాలూ పూర్తయిన తర్వాత, పుస్తకం నాలుగు భాగాలుగా విభజింపబడింది, ప్రతిభాగం యెహోవా ప్రధాన లక్షణాల్లో ఒక్కొక్క దానిని చర్చిస్తుంది. ప్రతీది ఒక్కొక్క లక్షణపు సంగ్రహ సారాంశంతో మొదలౌతుంది. ఆ తర్వాతి కొన్ని అధ్యాయాలు యెహోవా ఆ లక్షణాన్ని ఎలావ్యక్తం చేస్తాడో చర్చిస్తాయి. ప్రతిభాగంలో యేసు గురించి ఒక అధ్యాయం ఉంటుంది. ఎందుకు? యేసు ఇలా అన్నాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:9) యెహోవాకు పరిపూర్ణ మూర్తిమంతమైన యేసు స్పష్టమైన మాదిరి ద్వారా దేవుని లక్షణాల్ని కార్యాచరణలో మనకు చూపిస్తాడు. ప్రతిభాగం, పరిశీలనలోవున్న లక్షణాన్ని చూపించడానికి యెహోవానెలా అనుకరించాలో మనకునేర్పే అధ్యాయంతో ముగుస్తుంది. యెహోవా లక్షణాల్ని చర్చించడంలో ఈ క్రొత్త పుస్తకం బైబిల్లోని ప్రతి పుస్తకాన్ని సంప్రదిస్తుంది.
యెహోవాకు సన్నిహితమవ్వండి పుస్తకంలో కొన్ని ప్రత్యేకాంశాలు కూడా ఉన్నాయి. రెండవ అధ్యాయం మొదలుకొని ప్రతి అధ్యాయంలో “ధ్యానించడానికి ప్రశ్నలు” అనే బాక్సు ఉంటుంది. అందులోవున్న లేఖనాలు, ప్రశ్నలు అధ్యాయాన్ని పునఃసమీక్షించడానికి కాదుగాని, విషయాన్ని లోతుగా ధ్యానించేందుకు బైబిలును ఉపయోగించడంలో మీకు సహాయం చేయడానికి అవి రూపొందించబడ్డాయి. ప్రతి లేఖన భాగాన్ని మీరు జాగ్రత్తగా చదవాలని సిఫారసు చేయబడుతోంది. ఆ తర్వాత ప్రశ్ననాలోచించి, వ్యక్తిగత అన్వయింపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ విధంగా ధ్యానించడం యెహోవాకు మరింత సన్నిహితులయ్యేందుకు సహాయం చేస్తూ మీ హృదయాన్ని పురికొల్పగలదు.—కీర్తన 19:14.
యెహోవాకు సన్నిహితమవ్వండి పుస్తకంలోని చిత్రాలు బోధించి, పురికొల్పేలా జాగ్రత్తగా పరిశోధన చేసి సిద్ధం చేయబడ్డాయి. పదిహేడు అధ్యాయాల్లో బైబిలు దృశ్యాల అందమైన, పూర్తి పేజీ చిత్రాలు ఉన్నాయి.
ఎందుకు ప్రచురింపబడింది?
యెహోవాకు సన్నిహితమవ్వండి పుస్తకం ఎందుకు ప్రచురింపబడింది? మన దేవుడైన యెహోవాను మరియెక్కువ తెలుసుకొని, ఆయనతో బలమైన వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవడానికి సహాయం చేయడమే ఈ క్రొత్త ప్రచురణ ప్రాథమిక సంకల్పం.
యెహోవాకు సన్నిహితమవ్వండి పుస్తకంనుండి ప్రయోజనం పొందగల బహుశా బైబిలు విద్యార్థి లేదా నిష్క్రియంగా మారిన సహోదరుని లేదా సహోదరి గూర్చి ఆలోచించగలరా? మీ విషయమేమిటి—ఈ క్రొత్త పుస్తకం చదవడం ఆరంభించారా? ఒకవేళ ఇంకా ఆరంభించకపోతే, సాధ్యమైనంత త్వరగా ఆరంభించడానికి సమయ పట్టిక ఎందుకు వేసికొనకూడదు. మీరు చదివింది ధ్యానించడానికి సమయం తీసుకోండి. యెహోవా దేవుని రాజ్య సువార్తను అత్యంత ఆనందంగా, ఆసక్తితో ప్రకటించగలిగేలా, ఆయనకు సన్నిహితం కావడానికి ఈ ప్రచురణ మీకు సహాయం చేయును గాక!