కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సర్వశ్రేష్ఠమైన ప్రేమ

సర్వశ్రేష్ఠమైన ప్రేమ

సర్వశ్రేష్ఠమైన ప్రేమ

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో లేదా క్రొత్త నిబంధనలో అత్యధిక సందర్భాల్లో కనిపించే “ప్రేమ” అనే పదం, అగాపే అనే గ్రీకు పదం యొక్క అనువాదమే.

లేఖనాలపై అంతర్దృష్టి * (ఆంగ్లం) అనే రెఫరెన్సు గ్రంథం ఆ పద భావాన్ని వివరిస్తూ ఇలా చెబుతోంది: “సాధారణంగా ప్రజలు అనుకునేలా [అగాపే] కేవలం వ్యక్తిగత అనుబంధాన్నిబట్టి భావావేశంతో చూపే ప్రేమ కాదు. అయితే అది, ఏది యోగ్యమైనదో దాని ప్రకారం చిత్తశుద్ధితో ఇతరుల మేలు కోరుతూ చూపించబడుతుంది, అది సూత్రాన్ని, విధ్యుక్త ధర్మాన్ని, సరైన మర్యాదను పరిగణలోకి తీసుకుంటూ ముందుగా నిర్ణయించుకున్నదాని అనుసారంగా చూపించే ప్రేమ. అగాపే (ప్రేమ) వ్యక్తిగత శత్రుత్వాలను అధిగమిస్తుంది, ఈ శత్రుత్వాలు సరైన సూత్రాలను విసర్జించి తిరిగి పగతీర్చుకునేలా చేసేందుకు అది ఎన్నడూ అనుమతించదు.”

అగాపేలో లోతైన భావాలు కూడా ఇమిడివుండగలవు. “ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమ [అగాపే] గలవారై యుండుడి” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.) (1 పేతురు 4:⁠8) కాబట్టి అగాపేలో హృదయం, మనస్సు రెండు చేరివుంటాయని చెప్పవచ్చు. సర్వశ్రేష్ఠమైన ఈ ప్రేమ యొక్క శక్తిని, పరిధిని చూపించే కొన్ని లేఖనాలను ఎందుకు పరిశీలించకూడదు? ఈ లేఖనాలు సహాయకరంగా ఉండవచ్చు: మత్తయి 5:43-47; యోహాను 15:12, 13; రోమీయులు 13:8-10; ఎఫెసీయులు 5:2, 25, 28; 1 యోహాను 3:15-18; 4:​16-21.

[అధస్సూచి]

^ పేరా 3 యెహోవాసాక్షులు ప్రచురించినది.