కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సహాయం కోసం అర్థిస్తున్నవారికి ఉపశమనం

సహాయం కోసం అర్థిస్తున్నవారికి ఉపశమనం

సహాయం కోసం అర్థిస్తున్నవారికి ఉపశమనం

బైబిలు మనస్తత్వశాస్త్ర గ్రంథం కాదు. అయితే, అది మనకు ఉపశమనమిచ్చి, మనకు ఎదురయ్యే కష్టాలు ఎన్నో ఉన్నప్పటికీ జీవితాన్ని విలువైనదిగా ఎంచడానికి మనకు సహాయం చేస్తుంది. వాస్తవికంగానే, లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.” (యోబు 14:⁠1) మన సొంత అపరిపూర్ణత మూలంగా మనకు కొన్ని శ్రమలు వస్తాయి. మానవులు అనుభవిస్తున్న బాధలకు ప్రధానంగా బాధ్యులెవరు?

బైబిలు అతడిని అపవాది, సాతాను అని పిలువబడే దుష్టాత్మగా గుర్తిస్తోంది. అతడు “సర్వలోకమును మోసపుచ్చుచు[న్నాడు],” మానవజాతికి ఎదురవుతున్న అనేక శ్రమలకు అతడే కారణం. అయినప్పటికీ అతడికింక ఎక్కువ సమయం లేదని కూడా బైబిలు మనకు చెబుతోంది. (ప్రకటన 12:​9, 12) భూనివాసులపైకి సాతాను తీసుకువచ్చిన వేదన అంతా త్వరలోనే దేవుడు జోక్యం చేసుకోవడం మూలంగా అంతమవుతుంది. బైబిలు చెబుతున్నదాని ప్రకారం, దేవుడు వాగ్దానం చేసిన నీతియుక్తమైన నూతనలోకం నిరాశానిస్పృహలను అంతమొందిస్తుంది.​—⁠2 పేతురు 3:​13.

మానవులు అనుభవిస్తున్న బాధ తాత్కాలికమైనదని తెలుసుకోవడం ఎంతటి ఉపశమనాన్నిస్తుందో కదా! యేసుక్రీస్తు అధికారమందలి దేవుని పరలోక రాజ్య పరిపాలన క్రింద అన్యాయం, బాధ అంతమవుతాయి. దేవుడు నియమించిన రాజు గురించి లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.”​—⁠కీర్తన 72:​12-14.

ఈ ప్రవచనార్థక మాటల నెరవేర్పు అత్యంత సమీపంలోనే ఉంది. అద్భుతమైన పరిస్థితుల్లో పరదైసు భూమిపై మనం నిత్యజీవాన్ని ఆనందించవచ్చు. (లూకా 23:43; యోహాను 17:⁠3) ఓదార్పునిచ్చే ఈ లేఖన వాగ్దానాలను గురించిన జ్ఞానము, సహాయం కోసం అర్థిస్తున్నవారికి నిరీక్షణను, ఉపశమనాన్ని ఇస్తుంది.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

కృంగిన బాలిక: Photo ILO/J. Maillard