కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సహనం, పట్టుదలవల్ల సంతోషకరమైన ఫలితాలు

సహనం, పట్టుదలవల్ల సంతోషకరమైన ఫలితాలు

రాజ్యప్రచారకుల నివేదిక

సహనం, పట్టుదలవల్ల సంతోషకరమైన ఫలితాలు

అం త్యదినాల్లో “అనేకుల ప్రేమ చల్లారును” అని యేసుక్రీస్తు ప్రవచించాడు. ఫలితంగా, నేడు ప్రపంచమందలి అనేక ప్రాంతాల్లో రాజ్య సువార్త విషయంలో సాధారణ ప్రజానీకం ఉదాసీనంగా ఉంది. కొందరు మతాన్ని ఏవగించుకుంటున్నారు కూడా.​—⁠మత్తయి 24:12, 14.

అయినప్పటికీ, రాజ్య ప్రచారకులు సహనంతో, విశ్వాసంతో ఆ సవాలును విజయవంతంగా ఎదుర్కొంటున్నారని ఛెక్‌ రిపబ్లిక్‌లోని ఈ క్రింది అనుభవం చూపిస్తోంది.

మూసివున్న తలుపు సందుగుండా ఇద్దరు సాక్షులు ఒక స్త్రీతో మాట్లాడారు. కొద్దిసేపైన తర్వాత ఆవిడ కొద్దిగా తలుపుతెరిచి చెయ్యిచాచి సాక్షులు అందించిన కావలికోట, తేజరిల్లు! పత్రికలు తీసుకుంది. ఆమె “ధన్యవాదాలు” చెప్పి వెంటనే తలుపేసుకుంది. “మనం మళ్ళీ వద్దామా?” అని సాక్షులు ఆలోచించారు. వారిలో ఒక పయినీరు లేదా పూర్తికాల పరిచారకురాలు మళ్ళీ వెళ్ళడానికే నిర్ణయించుకుంది, ఈసారీ అలాగే జరిగింది, ఇలా ఒక సంవత్సరంపాటు జరిగింది.

ఆ పయినీరు తన సంభాషణా రీతిని మార్చుకోవడానికి నిర్ణయించుకొని, సహాయం కోసం యెహోవాకు ప్రార్థించింది. ఆమె ఈ సారి పత్రికలందించినప్పుడు, ఆ స్త్రీని స్నేహపూర్వకంగా, “ఎలా ఉన్నారు? పత్రికలు చదివి మీరెలా ఆనందించారు?” అని ప్రశ్నించింది. మొదట సమాధానం రాలేదు, అయితే మరికొన్ని సందర్శనాల తర్వాత ఆ స్త్రీ స్నేహశీలిగా మారడం ఆరంభించింది. ఒక సందర్భంలో ఆమె తలుపు తెరిచిందిగాని, సంభాషణ క్లుప్తంగానే ముగిసింది.

తలుపు దగ్గర ఆ స్త్రీ ఎక్కువగా మాట్లాడేందుకు అయిష్టత చూపుతున్నందున, సందర్శనాల ఉద్దేశమేమిటో వివరించడానికి, బైబిలు అధ్యయనం ప్రతిపాదించడానికి ఆమెకు ఉత్తరం వ్రాయాలని పయినీరు నిర్ణయించుకుంది. చివరకు, ఏడాదిన్నరపాటు ఓపికగాచేసిన ప్రయత్నంతో ఆ పయినీరు ఆ స్త్రీతో బైబిలు అధ్యయనం ఆరంభించడంలో కృతార్థురాలయ్యింది. “మీరు ఆ పత్రికలు నాకు తెచ్చి ఇవ్వడం ఆరంభించిన దగ్గరనుండి నేను దేవుణ్ణి విశ్వసించాను” అని తర్వాత ఆ స్త్రీ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినా ఆమె ప్రోత్సాహం పొందింది.

అవును, రాజ్య ప్రకటనా పనిలో, శిష్యుల్నిచేసే పనిలో సహనం, పట్టుదల సంతోషభరితమైన ఫలితాలు తీసుకురాగలవు.​—⁠మత్తయి 28:19, 20.