కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యారాధన ఒక కుటుంబాన్ని ఐక్యపరచడం

సత్యారాధన ఒక కుటుంబాన్ని ఐక్యపరచడం

సత్యారాధన ఒక కుటుంబాన్ని ఐక్యపరచడం

మారియాకు 13 సంవత్సరాలున్నప్పుడు ఆమె, ఆమె చెల్లి లూసీ వారి బంధువుల్లో ఒకరు యెహోవా గురించి చెప్పడం విన్నారు. ఆయన భూపరదైసు నిరీక్షణను కూడా వివరించాడు. కుతూహలంతో వారు ఆయనతోపాటు యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్ళారు. అక్కడివ్వబడిన స్పష్టమైన ఉపదేశంవిని మారియా ముగ్ధురాలయ్యింది. అది చర్చి నుండి ఎంతో భిన్నంగా ఉంది ఎందుకంటే చర్చిలో వారు కేవలం పాటలు పాడడంతప్ప మరింకేమీ చేసేవారు కాదు! త్వరలోనే ఆ పిల్లలు ఒక యెహోవాసాక్షితో బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించారు.

వారి అన్నయ్య యూగోకు తత్వశాస్త్రంలో, పరిణామంలో ఆసక్తివుండేది. ఆయన తాను ఒక నాస్తికుడనని చెప్పుకొనేవాడు. అయితే సైనికవృత్తిలో ఉన్నప్పుడు, ఆయన జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) * పుస్తకం చదివాడు. ఇతర మతమేదీ జవాబివ్వలేని ప్రశ్నలకు ఆయన సమాధానాలు కనుగొన్నాడు. తన సైనికవృత్తి ముగిస్తూనే, బైబిలు అధ్యయనం ద్వారా, అలాగే చెల్లెళ్ళతోపాటు కూటాలకు హాజరవడం ద్వారా ఆయన దేవునిపై తన క్రొత్త విశ్వాసాన్ని బలపర్చుకోవడం ఆరంభించాడు. మారియా, లూసీ తాము సత్యం విన్న రెండు సంవత్సరాల తర్వాత అంటే 1992లో బాప్తిస్మం తీసుకున్నారు, మరో రెండు సంవత్సరాలకు వాళ్ళ అన్నయ్య కూడా బాప్తిస్మం తీసుకున్నాడు.

అయితే క్యాథలిక్‌ ఆచారాలు నిష్ఠగాపాటించే వారి తల్లిదండ్రులు సత్యమందు ఏమాత్రం ఆసక్తి చూపించేవారు కాదు. తమ పిల్లలు, యౌవన సాక్షులను ఇంటికి ఆహ్వానించినప్పుడు వారి మంచి మర్యాదను, నమ్రతగల దుస్తులను వారు మెచ్చుకున్నా, యెహోవాసాక్షులను విసిగించేవారిగా పరిగణించేవారు. అంతేకాకుండా, భోజన సమయాల్లో పిల్లలు తాము కూటాల్లో నేర్చుకున్న వాటి గురించి మాట్లాడుకోవడం, వారి తల్లిదండ్రుల్లో కుతూహలం కలిగించింది.

అయితే, ఆ తల్లిదండ్రులిద్దరికి మంత్రవిద్యలో ఆసక్తివుంది. తండ్రి త్రాగుబోతు తల్లిని కొట్టేవాడు. ఆ కుటుంబం విచ్ఛిన్నపు అంచునవుంది. అప్పుడు, తండ్రి త్రాగితందనాలాడినందున రెండు వారాలపాటు జైలు జీవితం గడిపాడు. అలా జైల్లో ఉన్నప్పుడు, అతను బైబిలు చదవడం ఆరంభించాడు. అతనలా చదువుతున్నప్పుడు అంత్యకాలాల సూచనకు సంబంధించి యేసు పలికిన మాటలు ఆయన కంటబడ్డాయి. దాంతో అనేక ప్రశ్నలు మదిలోకి రావడంతో తల్లిదండ్రులిద్దరూ రాజ్యమందిరానికి వెళ్ళి గృహ బైబిలు అధ్యయనానికి అంగీకరించారు. సత్యం నేర్చుకోవడంతో వారు తమదగ్గరున్న మంత్రవిద్యకు సంబంధించిన పుస్తకాలన్నీ నాశనంచేసి, యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయడం ద్వారా దయ్యాల దాడులనుండి విముక్తి పొందారు. వారు తమ వ్యక్తిత్వాల్లో గణనీయమైన మార్పులు చేసుకోవడం ఆరంభించారు.

బొలీవియాలో 1999లో జరిగిన ఒక జిల్లా సమావేశంలో యూగో తనచేతుల మీదుగా తల్లిదండ్రులకు బాప్తిస్మం ఇవ్వడం చూసిన మారియా లూసీలు ఎంతగా పులకించి ఉంటారో మీరూహించగలరా? యెహోవాను గురించి ఆయన వాగ్దానాలను గురించి మారియా లూసీలు మొదటిసారి విన్నప్పటినుండి అప్పటికి తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి. యూగోతోపాటు వారిప్పుడు పూర్తికాల పరిచర్యలో ఉన్నారు. సత్యారాధన వారి కుటుంబాన్ని ఐక్యపరచినందుకు వారెంత సంతోషిస్తున్నారో గదా!

[అధస్సూచి]

^ పేరా 3 యెహోవాసాక్షులు ప్రచురించినది.