మనం ఎడతెగక ఎందుకు ప్రార్థించాలి?
మనం ఎడతెగక ఎందుకు ప్రార్థించాలి?
“యెడతెగక ప్రార్థనచేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.” —1 థెస్సలొనీకయులు 5:15-18.
దానియేలు ప్రవక్త వాడుకగా రోజుకి మూడుసార్లు దేవునికి ప్రార్థించేవాడు. ఆయన తన ఇంటి పైగదిలో యెరూషలేముకు నగరానికి అభిముఖంగావున్న కిటికీ దగ్గర మోకాళ్లూని ప్రార్థించేవాడు. (1 రాజులు 8:46-49; దానియేలు 6:10) మాదీయ రాజైన దర్యావేషుకు తప్ప మరెవ్వరికీ విన్నపాలు చేయకూడదని రాజాజ్ఞ వెలువడినా దానియేలు ఏ మాత్రం సంశయించలేదు. తనకు ప్రాణభయం కలిగించినా, లేకున్నా ఈ ప్రార్థనాపరుడు యెహోవాకు ఎడతెగక విన్నవించుకున్నాడు.
2 యెహోవా దానియేలును ఎలా దృష్టించాడు? దానియేలు చేసిన ప్రార్థనకొకదానికి జవాబిచ్చేందుకు గబ్రియేలు దూత వచ్చినప్పుడు, ఆయన ఆ ప్రవక్తను ‘బహు ప్రియమైనవాడు’ అని వర్ణించాడు. (దానియేలు 9:20-23) యెహెజ్కేలు ప్రవచనంలో దానియేలును యెహోవా నీతిమంతుడని సూచించాడు. (యెహెజ్కేలు 14:14, 20) దానియేలు తన జీవితకాలంలో చేసిన ప్రార్థనల ఫలితంగా ఆయనకు దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడిందని స్పష్టమవుతోంది, ఈ వాస్తవాన్ని దర్యావేషు కూడా గుర్తించాడు.—దానియేలు 6:16.
3 క్రమంగాచేసే ప్రార్థన మనం తీవ్ర పరీక్షలను ఎదుర్కోవడానికి కూడా మనకు సహాయం చేయగలదు. ఉదాహరణకు, చైనాలో మిషనరీగా సేవచేసిన హెరాల్డ్ కింగ్ విషయమే పరిశీలించండి. ఆయనకు ఐదు సంవత్సరాల ఏకాంత కారాగార శిక్ష విధించబడింది. తన అనుభవాన్ని గురించి సహోదరుడు కింగ్ ఇలాచెప్పాడు: “తోటి మనుషులనుండి నన్ను వేరుచేశారు గానీ, నన్ను దేవునినుండి ఎవ్వరూ వేరుచేయలేకపోయారు. . . . బైబిలు చెబుతున్న దానియేలును దృష్టిలో ఉంచుకుని జైలుగదిలో మోకాళ్లూని నేను రోజుకు మూడుసార్లు బిగ్గరగా ప్రార్థించడం నా జైలుగది సమీపంగా వెళ్లే ఎవరికైనా స్పష్టంగా కనబడేది. . . . అలాంటి సందర్భాల్లో దేవుని ఆత్మ అత్యంత ప్రయోజనకర విషయాల మీదకు నా
మనస్సు మళ్లించి నాకు ప్రశాంతత కలిగించినట్లుగా అనిపించేది. ప్రార్థన నాకెంతో ఆధ్యాత్మిక బలాన్ని ఓదార్పును తీసుకొచ్చింది.”4 బైబిలిలా చెబుతోంది: “యెడతెగక ప్రార్థనచేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.” (1 థెస్సలొనీకయులు 5:15, 16) ఈ ఉపదేశం దృష్ట్యా, మనమీ క్రింది ప్రశ్నలు పరిశీలిద్దాం: మన ప్రార్థనలకు మనమెందుకు అవధానమివ్వాలి? తదేకంగా యెహోవాను సమీపించేందుకు మనకు ఏ కారణాలున్నాయి? మన అపరాధాలనుబట్టి దేవునికి ప్రార్థించడానికి మనకర్హతలేదని మనం భావిస్తే మనమేమి చేయాలి?
ప్రార్థన ద్వారా స్నేహం పెంచుకోండి
5 యెహోవా మిమ్ములను తన స్నేహితునిగా తలంచాలని మీరిష్టపడతారా? ఆయన పితరుడైన అబ్రాహామును గురించి అలాగే మాట్లాడాడు. (యెషయా 41:8; యాకోబు 2:23) తనతో మనం అలాంటి సంబంధం పెంచుకోవాలని యెహోవా కోరుతున్నాడు. నిజానికి తనను సమీపించమని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. (యాకోబు 4:8) అలాంటి ఆహ్వానం ఉత్కృష్టమైన ప్రార్థనా ఏర్పాటును గురించి జాగ్రత్తగా ఆలోచించేటట్లు చేయవద్దా? ముఖ్యమైన ఓ ప్రభుత్వాధికారికి స్నేహితుడు కావడం ఓ ప్రక్కనుంచి, అసలు ఆయనతో కలిసి మాట్లాడే సమయం దొరకడమే ఎంత కష్టమో గదా! అయితే, మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లేదా అవసరమైనప్పుడు ఏ ఆటంకం లేకుండా ప్రార్థనలో తనను సమీపించమని విశ్వ సృష్టికర్త మనలను ప్రోత్సహిస్తున్నాడు. (కీర్తన 37:5) మనం ఎడతెగకచేసే ప్రార్థనలు యెహోవాతో సన్నిహిత స్నేహం కలిగియుండేందుకు మనకు సహాయం చేస్తాయి.
6 అయినప్పటికీ, మనమెంత సులభంగా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తామో గదా! దైనందిన జీవిత ఒత్తిళ్లతో వ్యవహరించడం మన అవధానాన్ని ఎంతగా హరించివేయగలదంటే మనమిక దేవునితో మాట్లాడే ప్రయత్నమే చేయము. విడువక “ప్రార్థనచేయుడి” అని యేసు తన శిష్యులను ప్రోత్సహించడమే కాకుండా తనే స్వయంగా అలా ప్రార్థించాడు. (మత్తయి 26:41) ఉదయంనుండి చీకటిపడేవరకు తీరికలేకుండా పనిచేసినా, తన పరలోక తండ్రితో మాట్లాడేందుకు ఆయన సమయం కేటాయించాడు. కొన్నిసార్లు “ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే” ప్రార్థించేవాడు. (మార్కు 1:35) మరితర సందర్భాల్లో, యెహోవాతో మాట్లాడేందుకు ఆయన సాయంకాలంపూట ఏకాంత ప్రదేశానికి వెళ్లేవాడు. (మత్తయి 14:23) అన్ని సమయాల్లో యేసు ప్రార్థనకు సమయం తీసుకున్నాడు, మనమూ అలాగే చేయాలి.—1 పేతురు 2:21.
ఎఫెసీయులు 6:18) మన జీవితపు ప్రతిరంగంలో మనం దేవుని నడిపింపును వెదకినప్పుడు, ఆయనతో మన స్నేహం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇద్దరు స్నేహితులు కూడి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, వారి మధ్యనున్న స్నేహబంధం మరింత బలోపేతం కాదా? (సామెతలు 17:17) మనం యెహోవాపై ఆధారపడి ఆయన సహాయాన్ని పొందినప్పుడు ఆయనతో మన బంధం మరింత బలపడుతుంది.—2 దినవృత్తాంతములు 14:11.
7 సమస్యలు, శోధనలు ఎదుర్కొంటూ మనం నిర్ణయాలు తీసుకుంటుండగా ఏకాంత ప్రార్థనకు యుక్త సమయాలు ప్రతిదినం మనకెన్నో లభిస్తాయి. (8 మనం ప్రార్థనలో దేవునితో ఎంతసేపు మాట్లాడతాం లేదా ఎంత తరచుగా మాట్లాడుతాం అనేవాటికి ఆయన హద్దులు పెట్టకపోవడాన్నిబట్టి మనమెంతగా సంతోషించగలమో గదా! పారసీకదేశపు రాజుకు మనవి చేసేముందు నెహెమ్యా అప్పటికప్పుడే మనస్సులో మౌనంగా ప్రార్థనచేసుకున్నాడు. (నెహెమ్యా 2:4, 5) లాజరును పునరుత్థానం చేసేలా తనకు శక్తినిమ్మని అడిగేందుకు యేసు కూడా యెహోవాకు క్లుప్తంగా ప్రార్థించాడు. (యోహాను 11:41, 42) మరోవైపున, హన్నా తన హృదయం కుమ్మరించి చాలాసేపు “యెహోవా సన్నిధిని ప్రార్థన చే[సింది].” (1 సమూయేలు 1:11, 12, 15, 16) అవసరాన్నిబట్టి, పరిస్థితులనుబట్టి మన వ్యక్తిగత ప్రార్థనలు క్లుప్తంగా లేదా సుదీర్ఘంగా ఉండవచ్చు.
9 బైబిల్లోని అనేక ప్రార్థనలు యెహోవా సర్వోన్నత స్థానంపట్ల, ఆయన అద్భుతకార్యాలపట్ల కృతజ్ఞతాపూర్వక గుర్తింపును వ్యక్తంచేస్తూ చేయబడ్డాయి. (నిర్గమకాండము 15:1-19; 1 దినవృత్తాంతములు 16:7-36; 145వ కీర్తన) తమ పరలోక స్థానంలోవున్న అభిషిక్త క్రైస్తవుల పూర్తి సంఖ్యకు సూచనగావున్న 24 మంది పెద్దలు “ప్రభువా [“యెహోవా,” NW], మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని” చెబుతూ యెహోవాను స్తుతించడాన్ని అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో చూశాడు. (ప్రకటన 4:10, 11) సృష్టికర్తను క్రమంగా స్తుతించడానికి మనకూ కారణం ఉంది. తమ పిల్లవాడు తనకు చేసిన దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపినప్పుడు ఆ తలిదండ్రులు ఎంత సంతోషిస్తారో గదా! యెహోవా దయను ప్రశంసాపూర్వకంగా ధ్యానిస్తూ దానికొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం మన ప్రార్థనల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ఒక శ్రేష్ఠమైన మార్గం.
ఎందుకు ‘ఎడతెగక ప్రార్థించాలి’?
10 మన విశ్వాసానికి క్రమంగా ప్రార్థించడం అవశ్యం. “విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె”నని సోదాహరణంగా చెప్పిన తర్వాత, యేసు ఇలా అడిగాడు: లూకా 18:1-8) అర్థవంతమైన హృదయపూర్వక ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తుంది. పితరుడైన అబ్రాహాము తాను వృద్ధుడైపోతున్నప్పటికీ తనకు ఇంకాపిల్లలు కలగనప్పుడు ఆ విషయాన్ని గురించి ఆయన దేవునితో మాట్లాడాడు. దానికి జవాబుగా, యెహోవా మొదట చేతనైతే ఒకసారి ఆకాశంవైపు తేరిచూసి నక్షత్రాలను లెక్కబెట్టగలవేమో చూడమని ఆయనను అడిగాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాహాముకు ఇలా వాగ్దానం చేశాడు: “నీ సంతానము ఆలాగవు[ను].” దాని ఫలితం? అబ్రాహాము, “యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.” (ఆదికాండము 15:5, 6) ప్రార్థనలో మనం యెహోవా ఎదుట మన హృదయాలు విప్పి, బైబిల్లోని ఆయన హామీలను అంగీకరించి ఆయనకు లోబడితే, ఆయన మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తాడు.
“మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” (11 సమస్యలతో వ్యవహరించడానికి సహితం ప్రార్థన మనకు సహాయం చేయగలదు. మన దైనందిన జీవితం భారంగా, మనమెదుర్కొనే పరిస్థితులు కష్టభరితంగా ఉన్నాయా? బైబిలు మనకిలా చెబుతోంది: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:22) కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు, మనం యేసు మాదిరిని అనుకరించవచ్చు. తన 12 మంది అపొస్తలులను నియమించడానికి ముందు ఆయన ఏకాంత ప్రార్థనలో ఒక రాత్రంతా గడిపాడు. (లూకా 6:12-16) అలాగే తాను చనిపోవడానికి ముందు రాత్రి, “ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె” కారునంతగా యేసు ప్రార్థించాడు. (లూకా 22:44) దాని ఫలితం? “భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.” (హెబ్రీయులు 5:7) ఒత్తిడిగల పరిస్థితులను, కష్టభరిత పరీక్షలను తాళుకునేందుకు తీవ్రమైన, ఎడతెగని ప్రార్థనలు మనకు కూడా సహాయం చేస్తాయి.
12 ప్రార్థన ద్వారా యెహోవాను సమీపించేందుకు మరో కారణం, ఆయన మనకు దగ్గరౌతాడు. (యాకోబు 4:8) యెహోవాకు మనం హృదయం విప్పి ప్రార్థించినప్పుడు, మన అవసరాలయెడల ఆయనకు శ్రద్ధవుందని మనలను ఆయన వాత్సల్యపూరితంగా చూడాలనుకుంటున్నాడనే భావం కలుగదా? మనపై దేవుని వ్యక్తిగత ప్రేమను మనం అనుభవపూర్వకంగా చూస్తాము. తన సేవకులు తమ పరలోక తండ్రిగా తనకు చేసే ప్రతి ఒక్క ప్రార్థన వినే బాధ్యతను యెహోవా వేరెవ్వరికీ ఇవ్వలేదు. (కీర్తన 66:19, 20; లూకా 11:2) ‘ఆయన మనలను గురించి చింతిస్తున్నాడు గనుక మన చింత యావత్తు ఆయనమీద వేయమని’ ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు.—1 పేతురు 5:6, 7.
అపొస్తలుల కార్యములు 4:23-31) “అపవాది తంత్రముల[కు]” వ్యతిరేకంగా కూడా ప్రార్థన మనలను కాపాడగలదు. (ఎఫెసీయులు 6:11, 17, 18) దైనందిన పరీక్షలను తాళుకునేందుకు మనం పోరాడుతున్నప్పుడు, బలపరచమని మనం ఎడతెగక దేవుణ్ణి అడగవచ్చు. యేసు మాదిరి ప్రార్థనలో అపవాదియు, సాతానగు “దుష్టునినుండి మమ్మును తప్పించుము” అని యెహోవాను వేడుకోవడం కూడా అందులో ఒక భాగమే.—మత్తయి 6:13.
13 బహిరంగ పరిచర్యలో మరింత ఆసక్తి చూపడానికి, అలాగే ఉదాసీనత లేదా వ్యతిరేకత ఎదురైనప్పుడు విడిచిపెట్టాలనే భావం మనలో కలిగినప్పుడు కూడా ప్రార్థన మనలను బలపరచగలదు. (14 మన పాపభరిత భావాల నియంత్రణలో సహాయం కొరకు మనం ఎడతెగక ప్రార్థించడం కొనసాగిస్తే, మనం యెహోవా అభయహస్త ప్రమేయాన్ని చవిచూస్తాం. మనకు ఈ హామీవుంది: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” (1 కొరింథీయులు 10:13) అపొస్తలుడైన పౌలు స్వయంగా విభిన్న పరిస్థితుల్లో యెహోవా తనను ఆదుకుని బలపరచడాన్ని అనుభవపూర్వకంగా చూశాడు. “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని ఆయన అన్నాడు.—ఫిలిప్పీయులు 4:13; 2 కొరింథీయులు 11:23-29.
తప్పులు జరిగినా ప్రార్థనయందు పట్టుదలతో ఉండండి
15 మన ప్రార్థనలు అంగీకరింపబడాలంటే, దేవునివాక్య ఉపదేశాన్ని మనం తిరస్కరించకూడదు. “మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 3:22) అయితే, మన ప్రవర్తన దేవుని ప్రమాణాలకు తగ్గట్టులేకపోతే ఏమి జరుగుతుంది? ఏదెను వనంలో పాపం చేసినప్పుడు ఆదాముహవ్వలు దాక్కున్నారు. మనం కూడా “యెహోవా ఎదుటికి రాకుండ” దాక్కోవాలనే భావానికి మొగ్గుచూపుతూ ప్రార్థించడం మానుకోవచ్చు. (ఆదికాండము 3:8) “యెహోవా నుండి ఆయన సంస్థనుండి నెమ్మదిగా కొట్టుకొనిపోయేవారు సాధారణంగా చేసే మొదటి అవివేకమైన పని ప్రార్థన మానుకోవడంగా నేను గమనించానని” అనుభవజ్ఞుడైన ప్రయాణ పైవిచారణకర్త క్లాస్ తెలియజేస్తున్నాడు. (హెబ్రీయులు 2:1) హోసే ఆన్‌కేల్ విషయంలో అదే జరిగింది. ఆయనిలా చెబుతున్నాడు: “దాదాపు ఎనిమిది సంవత్సరాలపాటు నేను ఎప్పుడోగానీ యెహోవాకు ప్రార్థించలేదు. ఆయనను ఇంకా నా పరలోక తండ్రిగా పరిగణించినా ఆయనతో మాట్లాడడానికి నాకు అర్హతలేదని భావించాను.”
16 ఆధ్యాత్మిక బలహీనత లేదా అపరాధంలో పడిపోవడం కారణంగా మనలో కొందరు ప్రార్థించడానికి తమకు అర్హతలేదని భావించవచ్చు. అయితే ప్రార్థనా ఏర్పాటునుండి మనం అత్యధిక ప్రయోజనం పొందవలసింది ఖచ్చితంగా అప్పుడే. యోనా తన నియామకం నుండి దూరంగా పారిపోయాడు. కాని ‘యోనా ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన ప్రత్యుత్తరమిచ్చాడు; పాతాళగర్భములోనుండి యోనా కేకలు వేయగా యెహోవా అతని ప్రార్థననంగీకరించాడు.’ (యోనా 2:2) యోనా ప్రార్థించగా యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చాడు, దానితో యోనా ఆధ్యాత్మికంగా బలం పుంజుకున్నాడు.
17 హోసే ఆన్‌కేల్ కూడా సహాయం కోసం పట్టుదలగా ప్రార్థించాడు. ఆయనిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నా హృదయం విప్పి క్షమాపణ కొరకు దేవుణ్ణి యాచించాను. ఆయన నాకు నిజంగా సహాయం చేశాడు. ప్రార్థనా సహాయం లేకుండా నేను సత్యానికి తిరిగివచ్చే వాడినని నేను అనుకోవడంలేదు. నేనిప్పుడు ప్రతిరోజు క్రమంగా ప్రార్థిస్తున్నాను, ఈ సమయాల కోసం నేను ఎదురుచూస్తాను.” మనమన్ని సమయాల్లో అరమరికలు లేకుండా మన తప్పిదాలను దేవునికి తెలియజేస్తూ, వినయంతో ఆయన క్షమాపణ వేడుకోవాలి. దావీదు రాజు తన అపరాధాలు ఒప్పుకున్నప్పుడు, కీర్తన 32:3-5) యెహోవా మనలను ఖండించాలని కాదుగాని మనకు సహాయం చేయాలనే కోరుకుంటున్నాడు. (1 యోహాను 3:19, 20) సంఘ పెద్దల ప్రార్థనలు కూడా మనకు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాయి, ఎందుకంటే వారి విజ్ఞాపనలు “బహు బలముగల[వై]” ఉంటాయి.—యాకోబు 5:13-16.
యెహోవా ఆయన పాపాలు క్షమించాడు. (18 పొరపాటు చేసిన తర్వాత సహాయ సలహాల కోసం వినయంగా తండ్రి దగ్గరకువచ్చిన కుమారుణ్ణి ఏ తండ్రి త్రోసిపుచ్చుతాడు? మనమెంత దూరంగా వెళ్లిపోయినా, మన పరలోక తండ్రి దగ్గరకు తిరిగివస్తే ఆయన సంతోషిస్తాడని తప్పిపోయిన కుమారుని ఉపమానం చూపిస్తోంది. (లూకా 15:21, 22, 32) “ఆయన బహుగా క్షమించును” గనుక తప్పిదస్థులందరు తనను ప్రార్థించాలని యెహోవా ఉద్బోధిస్తున్నాడు. (యెషయా 55:6, 7) దావీదు గంభీరమైన పాపాలు చాలా చేసినా, “దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము” అని యెహోవాకు ప్రార్థించాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన [యెహోవా] నా ప్రార్థన నాలకించును.” (కీర్తన 55:1, 17) అదెంత ఓదార్పుకరమో గదా!
19 మన విజ్ఞాపనకు సత్వరమే జవాబు లభించకపోతే అప్పుడేమిటి? అప్పుడు మనం మన విన్నపం యెహోవా చిత్తానికి అనుగుణంగా యేసు నామమున చేయబడేలా చూసుకోవాలి. (యోహాను 16:23; 1 యోహాను 5:14) ‘దురుద్దేశముతో అడిగిన’ కారణంగా తమ ప్రార్థనలకు జవాబులు దొరకని కొందరు క్రైస్తవులను గురించి శిష్యుడైన యాకోబు చెప్పాడు. (యాకోబు 4:3) మరోవైపున, ప్రార్థనలకు జవాబు దొరకలేదని అనిపించినప్పుడు వెంటనే, అన్ని సమయాల్లో అది దేవుని అసమ్మతికి రుజువనే తీర్మానానికి మనం రాకూడదు. తన జవాబు స్పష్టం కావడానికి ముందు ఆ విషయమై విశ్వసనీయ ఆరాధకులు ఎడతెగక ప్రార్థించడానికి యెహోవా అనుమతిస్తాడు. “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును,” అని యేసు అన్నాడు. (మత్తయి 7:7) కాబట్టి, మనం “ప్రార్థనయందు పట్టుదల కలిగి”యుండాలి.—రోమీయులు 12:12.
క్రమంగా ప్రార్థించండి
20 ‘అపాయకరమైన కాలాలుగా’ గుర్తించబడిన ఈ “అంత్యదినములలో” ఒత్తిళ్లు, సమస్యలు అంతకంతకు ఎక్కువౌతున్నాయి. (2 తిమోతి 3:1) పరీక్షలు సులభంగా మన మనస్సులను అవిశ్రాంతంగా చేస్తాయి. అయితే, వదలని సమస్యలున్నా, శోధనలున్నా, నిరుత్సాహం కలిగినా మన ఎడతెగని ప్రార్థనలు ఆధ్యాత్మిక పంథాలోనే జీవించేందుకు మనకు సహాయం చేస్తాయి. యెహోవాకు మనంచేసే దైనందిన ప్రార్థనలు మనకవశ్యమైన మద్దతును ఇవ్వగలవు.
21 “ప్రార్థన ఆలకించు” యెహోవా మన ప్రార్థనలు వినడానికి తీరికలేని వానిగా ఎన్నడూ ఉండడు. (కీర్తన 65:2) ఆయనతో మాట్లాడడానికి తీరికలేని వారిగా మనమెన్నటికీ ఉండకుందుము గాక. మన అమూల్య సంపద దేవునితో మనకున్న స్నేహమే. మనమెన్నటికీ దీనిని తేలికగా తీసుకోకుండా ఉందాం. “మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.”—హెబ్రీయులు 4:16.
మీరెలా జవాబిస్తారు?
• ప్రార్థనా విలువను గురించి దానియేలు ప్రవక్తనుండి మనమేమి నేర్చుకుంటాము?
• యెహోవాతో మన స్నేహబంధాన్ని మనమెలా బలపరచుకోవచ్చు?
• మనం ఎడతెగక ఎందుకు ప్రార్థించాలి?
• అనర్హతా భావాలు మనం యెహోవాకు ప్రార్థించకుండా ఎందుకు అడ్డుపడకూడదు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. ప్రార్థనాధిక్యతను తాను ఉన్నతంగా ఎంచాడని దానియేలు ఎలా చూపించాడు, అది దేవునితో ఆయనకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేసింది?
3. ఒక మిషనరీ అనుభవం చూపినట్లుగా, మన యథార్థతను కాపాడుకునేందుకు ప్రార్థన మనకెలా సహాయం చేయగలదు?
4. ఈ ఆర్టికల్‌లో ప్రార్థన గురించి మనమే ప్రశ్నలు పరిశీలిస్తాము?
5. మనం ఎటువంటి ఉత్కృష్టమైన స్నేహాన్ని ఆనందించేలా ప్రార్థన మనకు సహాయం చేస్తుంది?
6. విడువక ‘ప్రార్థనచేయవలసిన’ అవసరతను గురించి యేసు మాదిరి మనకు ఏమి బోధిస్తోంది?
7. మనం ప్రతిదినం మన పరలోక తండ్రితో మాట్లాడడానికి ఏ పరిస్థితులు మనల్ని పురికొల్పాలి?
8. నెహెమ్యా, యేసు, హన్నా మాదిరులనుండి మన వ్యక్తిగత ప్రార్థనల వ్యవధి గురించి మనమేమి నేర్చుకుంటాము?
9. మన ప్రార్థనల్లో, యెహోవా మనకొరకు చేసే సమస్తాన్ని గురించిన స్తుతిని, కృతజ్ఞతను ఎందుకు చేర్చాలి?
10. మన విశ్వాసాన్ని బలపరచడంలో ప్రార్థన ఏ పాత్ర వహిస్తుంది?
11. సమస్యలతో వ్యవహరించేందుకు ప్రార్థనలు మనకెలా సహాయం చేయగలవు?
12. యెహోవాకు మనపైవున్న వ్యక్తిగత శ్రద్ధను ప్రార్థన ఎలా ఉదహరిస్తోంది?
13, 14. ఎడతెగక ప్రార్థించడానికి ఏ కారణాలు మనకున్నాయి?
15. దేవుని ప్రమాణాలకు తగ్గట్టు మన ప్రవర్తన లేనప్పుడు ఏమి జరుగవచ్చు?
16, 17. ఆధ్యాత్మిక బలహీనతను అధిగమించేందుకు క్రమమైన ప్రార్థనెలా సహాయం చేయగలదో ఉదాహరణలు చెప్పండి.
18. ఎంత దూరం వెళ్లిపోయినా దేవుని సేవకులు ఏ నమ్మకంతో ఉండవచ్చు?
19. ప్రార్థనలకు జవాబు దొరకలేదని అనిపించినప్పుడు అది దేవుని అసమ్మతికి రుజువనే తీర్మానానికి మనం ఎందుకు రాకూడదు?
20, 21. (ఎ) ఈ “అంత్యదినములలో” మనమెందుకు ఎడతెగక ప్రార్థించాలి? (బి) మనం ప్రతిదినం ధైర్యముగా యెహోవా కృపాసనమునొద్దకు వచ్చినప్పుడు మనమేమి పొందుతాము?
[16వ పేజీలోని చిత్రం]
రాజుతో మాట్లాడడానికి ముందు నెహెమ్యా క్లుప్తంగా మౌన ప్రార్థన చేశాడు
[17వ పేజీలోని చిత్రం]
హన్నా చాలాసేపు ‘యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది’
[18వ పేజీలోని చిత్రాలు]
యేసు తన 12 మంది అపొస్తలులను నియమించడానికి ముందు రాత్రంతా ప్రార్థన చేశాడు
[20వ పేజీలోని చిత్రాలు]
రోజంతటిలో ప్రార్థనచేసే అవకాశాలు వాటికవే మనకు లభిస్తాయి