కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాగ్దానాలు తప్పక నెరవేరే సమయం

వాగ్దానాలు తప్పక నెరవేరే సమయం

వాగ్దానాలు తప్పక నెరవేరే సమయం

చరిత్రంతటా వమ్ముచేసిన వాగ్దానాలే. దురాక్రమణ చేయబోమని రూఢిగా సంతకాలు చేసిన ఒడంబడికలను పాటించడంలో దేశప్రభుత్వాలు తరచూ విఫలమయ్యాయి, ఆ కారణంగా అవి తమ ప్రజలను భీకరమైన యుద్ధాలకు నడిపించాయి. నెపోలియన్‌ ఒకసారి ఇలా వ్యాఖ్యానించాడు: “ప్రభుత్వాలు తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చమనే ఒత్తిడికి గురైనప్పుడు లేదా అలా నెరవేర్చడం తమకు ప్రయోజనం చేకూరుస్తుందన్నప్పుడు మాత్రమే తమ వాగ్దానాలను నెరవేరుస్తాయి.”

వ్యక్తులు చేసిన వాగ్దానాల విషయమేమిటి? ఒక వ్యక్తి తానిచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోవడం ఎంత నిరాశకలిగిస్తుందో కదా! ప్రత్యేకించి ఆ వ్యక్తి మీకు బాగా తెలిసిన, మీరు నమ్మిన వ్యక్తి అయితే చాలా బాధ కలుగుతుంది. ప్రజలు తమ వాగ్దానాలను నెరవేర్చకపోవడానికి కారణం, వారికి ఆ సామర్థ్యం లేకపోవడం లేదా తమ వాగ్దానాలను నెరవేర్చడం ఇష్టం లేకపోవడం కావచ్చు.

మానవుల వాగ్దానాలకు దేవుని వాగ్దానాలకు ఎంత బేధమో కదా! దేవుని వాగ్దానాలు పూర్తిగా ఆధారపడదగినవి, నమ్మదగినవి. యెహోవా దేవుడు చేసిన ఏ వాగ్దానమైనా తప్పకుండా నెరవేరుతుంది. దానిలో సందేహం ఉండదు. నిశ్చితమైన దేవుని వాక్యం గురించి యెషయా 55:⁠10, 11 ఇలా చెబుతోంది: “ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.”

అలాంటప్పుడు బైబిల్లో గ్రంథస్తం చేయబడిన దేవుని వాగ్దానాలను మనమెలా దృష్టించాలి? మనం వాటిని నిస్సందేహంగా నమ్మవచ్చు. ఉదాహరణకు అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు. దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.” (ప్రకటన 21:​3, 4) మీరు యేసు చెప్పిన ఈ మాటలకు అనుగుణంగా ప్రవర్తిస్తే అలాంటి ఆశీర్వాదాలను అనుభవించగలుగుతారు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”​—⁠యోహాను 17:⁠3.