కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఇది దివ్యజ్ఞానం”

“ఇది దివ్యజ్ఞానం”

రాజ్యప్రచారకుల నివేదిక

“ఇది దివ్యజ్ఞానం”

డొరోటా పోలండ్‌లో యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకురాలు, 14 ఏండ్ల తన కుమారుడ్ని క్రమంగా చేయించే వైద్య పరీక్ష కోసం పాఠశాల క్లినిక్‌కి తీసుకువెళ్ళింది. పరీక్ష చేసేటప్పుడు డాక్టర్‌ యానీన, * ఆమె కుమారుడు ఇంట్లో ఏమేమి పనులు చేస్తాడని డొరోటాను అడిగింది.

“నేను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా కొడుకు మా కుటుంబంలోని ఆరుగురికి భోజనం తయారు చేస్తాడు” అని డొరోటా జవాబిచ్చింది. “వాడు ఇల్లు శుభ్రం చేస్తాడు ఇంట్లో మరమ్మతు అవసరమైన పనుల్లో సహాయంగా ఉంటాడు. వాడికి చదవడమంటే ఇష్టం. వాడు మంచి విద్యార్థి.”

“చాలా ఆశ్చర్యకరంగా ఉంది, నేనిక్కడ 12 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను, కానీ ఇంతవరకు ఇలాంటి అబ్బాయిని ఎప్పుడూ చూడలేదు” అని యానీన అన్నది.

సాక్ష్యమివ్వడానికి మంచి అవకాశమని గ్రహించిన డొరోటా ఇలా వివరించింది: “నేడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన శిక్షణనివ్వడంలో విఫలమవుతున్నారు. అందుకే వారి పిల్లల్లో తరచూ ఆత్మ గౌరవమనేది అసలు కనబడకుండాపోతోంది.”

“అనేకమంది తల్లిదండ్రులకు ఈ విషయాల గురించి తెలియవు, మీకు ఇవన్నీ ఎలా తెలుసు?” అని యానీన అడిగింది.

“అలాంటి సమాచారానికి బైబిలు అమూల్యమైన ఆధారం” అని డొరొటా జవాబిచ్చింది. “ఉదాహరణకు, ద్వితీయోపదేశకాండము 6:​6-9 ప్రకారం మన పిల్లలకు నేర్పించడమనేది మొదట మనం నేర్చుకోవడంతో ప్రారంభమవుతుంది. మన పిల్లలకు అభ్యసింపజేయాలనుకుంటున్న విషయాలను ముందు మనం మన హృదయాల్లో, మనసుల్లో ముద్రించుకోవద్దా?”

“ఇది నమ్మశక్యంగాలేదు, నిజంగా ఇది ఆశ్చర్యకరం!” అని యానీన వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఆమె డొరోటాను తన పిల్లలను పెంచడానికి, వారికి బోధించడానికి బైబిలెలా సహాయపడిందని అడిగింది.

“మేము ప్రతివారం మా పిల్లలతో బైబిలు చదువుతాం, మేము యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) * అనే పుస్తకాన్ని ఉపయోగిస్తాం” అని చెబుతూ ఆమె ఇంకా ఆ పుస్తకం గురించి వర్ణిస్తూ దానిలోని కొన్ని విషయాలను ప్రస్తావించింది.

“ఇది దివ్యజ్ఞానం!” అని సంతోషంగా అంటూ, “నేనా పుస్తకాన్ని ఒకసారి చూడవచ్చా?” అని యానీన అడిగింది.

ఒక గంట తర్వాత, డొరోటా ఆ పుస్తకంతో తిరిగివచ్చింది.

యానీన ఆ పుస్తకాన్ని తిరగేస్తూ “మీది ఏ మతం?” అని అడిగింది.

“నేనొక యెహోవాసాక్షిని.”

“వేరే విశ్వాసం ఉన్నవారితో యెహోవాసాక్షులు ఎలా వ్యవహరిస్తారు?”

“నేను మీతో వ్యవహరించినట్లే అంటే గౌరవంగా” అని డొరోటా జవాబిచ్చి, ఇంకా ఇలా అంది: “అంతేకాదు వారు బైబిలు సత్యం తెలుసుకోవాలని మేము కోరుకుంటాం.”

“నాకిప్పటికే చాలా బాగా అనిపిస్తోంది” అని యానీన అంగీకరించింది.

డొరోటా తన సందర్శన ముగింపులో, బైబిలు చదవమని యానీనను ప్రోత్సహించింది. “అది మీ జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది, మీ పనిలో కూడా సహాయపడుతుంది.”

“బైబిలు చదివేందుకు మీరు నన్ను నిజంగా ప్రేరేపించారు” అని యానీన ఒప్పుకుంది.

క్రమంగా డాక్టరును సందర్శించే సమయాన్ని డొరోటా నేర్పుగా, కృతనిశ్చయంతో మంచి సాక్ష్యమిచ్చే సమయంగా మార్చుకుంది.​—⁠1 పేతురు 3:​15.

[అధస్సూచీలు]

^ పేరా 3 ఆమె సొంత పేరు కాదు.

^ పేరా 10 యెహోవాసాక్షులు ప్రచురించినది.