కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు “మునికోలలకు ఎదురు తన్ను”తున్నారా?

మీరు “మునికోలలకు ఎదురు తన్ను”తున్నారా?

మీరు “మునికోలలకు ఎదురు తన్ను”తున్నారా?

బై బిలు కాలాల్లో మునికోలను అంటే, పొడవైన కర్రకు ఒక చివర మొనతేలిన లోహపు ముక్కను బిగించిన ముల్లుకర్రను, బరువులులాగే జంతువులను తోలడానికి ఉపయోగించేవారు. ముల్లుకర్రతో పొడిచినప్పుడు ఆ జంతువు మొండిగా ప్రతిఘటిస్తూ ఎదురు తన్నితే ఏమవుతుంది? నొప్పి తప్పించుకోవడానికి బదులు అది ఇంకా ఎక్కువ చేసుకుంటుంది.

పునరుత్థానుడైన యేసుక్రీస్తు, తన శిష్యులను కొంతమందిని బంధించడానికి వెళ్తున్న సౌలు అనే ఒక వ్యక్తితో మునికోలల గురించి మాట్లాడాడు. కళ్ళు చెదిరే వెలుగు మధ్య నుండి, యేసు పలికిన ఈ మాటలు సౌలుకు వినబడ్డాయి: “సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము.” క్రైస్తవులను బాధించడం ద్వారా, సౌలు నిజానికి దేవునికి విరుద్ధంగా పోరాడుతున్నాడు, అలాగే కొనసాగడం స్వయంగా అతనికే హానికరం కాగలదు.​—⁠అపొస్తలుల కార్యములు 26:​14.

మనం కూడా ఉద్దేశరహితంగా ‘మునికోలలకు ఎదురు తన్నే’ అవకాశముందా? “జ్ఞానులు చెప్పు మాటలు,” మనల్ని సరైన మార్గంలో ముందుకు నడిపించడానికి ప్రోత్సహించే ముల్లుకర్రల వంటివని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 12:​11) దేవుని వాక్యంలోని ప్రేరేపిత హితబోధను మనం స్వీకరిస్తే అది మనల్ని పురికొల్పగలదు, సరైన మార్గంలో నడిపించగలదు. (2 తిమోతి 3:​16) అదిచ్చే ప్రోత్సాహాలను నిరోధించడం మనకే హానికరం కాగలదు.

యేసు మాటలను సౌలు గంభీరంగా తీసుకొని, తన జీవనవిధానాన్ని మార్చుకున్నాడు, అలా చివరకు ఆయన ప్రియమైన క్రైస్తవ అపొస్తలుడైన పౌలుగా మారాడు. అదేవిధంగా మనం కూడా దైవిక హితబోధను గంభీరంగా తీసుకుంటే శాశ్వతమైన ఆశీర్వాదాలు కలుగుతాయి.​—⁠సామెతలు 3:​1-6.

[32వ పేజీలోని చిత్రం]

L. Chapons/Illustrirte Familien-Bibel nach der deutschen Uebersetzung Dr. Martin Luthers