జ్ఞానమందు ఆశానిగ్రహాన్ని అమర్చుకొనండి
జ్ఞానమందు ఆశానిగ్రహాన్ని అమర్చుకొనండి
“జ్ఞానమునందు ఆశానిగ్రహమును . . . అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5-8.
మాదక ద్రవ్యాల దురలవాటు వ్యతిరేక ప్రచారోద్యమంలో భాగంగా, “మాకొద్దు” అని చెప్పండని అమెరికా యువతకు ప్రబోధించబడింది. ప్రతి ఒక్కరు కేవలం మాదక ద్రవ్యాలే కాదు, త్రాగుబోతుతనం, అజ్ఞానయుక్తమైన లేదా లైంగిక దుర్నీతికర జీవన విధానాలు, దగాకోరు వ్యాపార వ్యవహారాలు, ‘శరీరేచ్ఛలు’ మాకొద్దని చెబితే పరిస్థితి ఎంత చక్కగా ఉంటుందో గదా! (రోమీయులు 13:14) అయినప్పటికీ, వద్దు అని చెప్పడం అన్ని సందర్భాల్లో సులభమని ఎవరు చెప్పగలరు?
2 ఆశానిగ్రహం చూపడం అసంపూర్ణ మానవులందరికీ కష్టం కాబట్టి, మనకెదురయ్యే ఏ వ్యక్తిగత పోరాటాన్నైనా ఎలా జయించాలో నేర్చుకోవడానికి మనకు శ్రద్ధవుండాలి. దేవుణ్ణి సేవించడానికి కృషిచేసినా కొన్నిసార్లు వద్దు అని చెప్పడానికి ఇబ్బందిపడ్డ గతకాలపు ప్రజలను గురించి బైబిలు మనకు చెబుతోంది. దావీదును, బత్షెబతో ఆయన వ్యభిచరించిన పాపాన్ని జ్ఞాపకం చేసుకోండి. వ్యభిచార ఫలితంగా వారికి జన్మించిన పిల్లవాడు చనిపోవడానికి, బత్షెబ భర్త మరణించడానికి అది దారితీసింది, వారిద్దరూ నిర్దోషులే. (2 సమూయేలు 11:1-27; 12:15-18) లేదా అపొస్తలుడైన పౌలు గురించి ఆలోచించండి, ఆయన బహిరంగంగా ఇలా ఒప్పుకున్నాడు: “నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.” (రోమీయులు 7:19) మీరు కూడా అప్పుడప్పుడు ఆ విధంగానే భావిస్తారా? పౌలు ఇంకనూ ఇట్లన్నాడు: “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” (రోమీయులు 7:19-24) మరింత బలమైన ఆశానిగ్రహాన్ని సంపాదించుకోవడానికి మనం చేస్తున్న పోరాటంలో సదా కొనసాగాలనే మన తీర్మానాన్ని బైబిలు ఉదాహరణలు బలపరచాలి.
ఆశానిగ్రహం, నేర్చుకోవలసిన ఓ పాఠం
3 ఆశానిగ్రహం, అంటే వద్దు అనిచెప్పగల సామర్థ్యం. 2 పేతురు 1:5-7లో విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, సహనం, భక్తి, సహోదర ప్రేమ, దయవంటి వాటితోపాటు అది ప్రస్తావించబడింది. వీటిలో ఏ లక్షణం కూడా పూర్తిగా జన్మతః కలిగేవికావు. వీటిని పెంపొందించుకోవాలి. వాటిని చెప్పుకోదగిన మోతాదులో కనబరచడానికి కృతనిశ్చయం, కృషి అవసరం. కాబట్టి ఆశానిగ్రహాన్ని పెంపొందించుకోవడం సులభంగా ఉంటుందని మనం ఎదురుచూడాలా?
4 నిజమే, తమకు ఆశానిగ్రహం సమస్యే లేదని లక్షలాదిమంది ప్రజలు భావించవచ్చు. వారు తమ అసంపూర్ణ శరీరేచ్ఛలకు తగ్గట్టు ఆడుతూ తమకు, ఇతరులకు కలిగే పర్యవసానాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తెలిసోతెలియకో జీవితంలో తమకిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుండవచ్చు. (యూదా 10) వద్దు అని చెప్పలేని అసమర్థత, అలా చెప్పాలన్న ఇష్టం లేకపోవడం ముందటికంటే ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతోంది. ఇది ‘అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులుగా ధనాపేక్షులుగా బింకములాడువారిగా అహంకారులుగా దూషకులుగా అజితేంద్రియులుగా’ ఉంటారని పౌలు ప్రవచించిన “అంత్యదినములలో” మనం నిజంగా జీవిస్తున్నామని సూచిస్తోంది.—2 తిమోతి 3:1-3.
5 ఆశానిగ్రహాన్ని కనబరచడంలో ఎదురయ్యే సవాలేమిటో యెహోవాసాక్షులకు బాగా తెలుసు. పౌలు వలెనే, దేవుని నియమాల ప్రకారం జీవించడం ద్వారా ఆయనను సంతోషపరచాలనే కోరికకు, తమ అసంపూర్ణ శరీరం తాము అవలంబించాలని బలవంతపెట్టే విధానానికి మధ్యవున్న ఫిలిప్పీయులు 4:8ని మనస్సులో ఉంచుకోవాలని సూచించింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఇవ్వబడిన ఆ వచనంలోని దైవోపదేశం నేడుకూడా విలువైనదిగానే ఉంది. అయితే దానిని అనుసరించడం అది వ్రాయబడిన కాలంలో అంటే, 1916లో కంటే ఇప్పుడు బహుశా మరింత కష్టంకావచ్చు. అయినప్పటికీ, లోకాశలను నిరాకరించడానికి క్రైస్తవులు తీవ్రంగా కృషిచేస్తారు అలా నిరాకరించడం ద్వారా తాము తమ సృష్టికర్త పక్షాన ఉన్నామని కూడా వారికి తెలుసు.
పోరాటమేమిటో వారికి తెలుసు. అందుకనే, ఈ సమరంలో గెలవడమెలాగో తెలుసుకోవాలని వారెంతో కాలంగా ఆసక్తిగా ఉన్నారు. గతంలో 1916 నందు మీరిప్పుడు చదువుతున్న పత్రిక తొలిసంచిక ఒకటి “మనల్ని, మన తలంపుల్ని, మన మాటల్ని, మన ప్రవర్తనను ఆధీనంలో ఉంచుకొనే సరైన విధానాన్ని” గురించి మాట్లాడింది. అది6 ఆశానిగ్రహం, గలతీయులు 5:22లో ‘పరిశుద్ధాత్మ ఫలంలో’ భాగంగా పేర్కొనబడింది. “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము”లతోపాటు మనమీ లక్షణాన్ని కనబరిస్తే ఎంతో ప్రయోజనం పొందుతాము. అలాచేయడం పేతురు వివరించినట్లుగా, దేవునికి చేసే సేవలో “సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ” మనల్ని అడ్డుకుంటుంది. (2 పేతురు 1:8) అయితే మనం కోరుకున్నంత వడిగా, సంపూర్ణంగా ఈ లక్షణాలను మనం కనబరచలేకపోతే మనం ఆశలువదులుకోకూడదు లేదా మనల్ని మనం నిందించుకోకూడదు. పాఠశాలలో ఒక విద్యార్థికంటే మరొక విద్యార్థి త్వరగా నేర్చుకోవడం బహుశా మీరు గమనించేవుంటారు. లేదా పనిలో ఓ కొత్త కార్యాన్ని ఒకరు తమ తోటిపనివారికంటే మరింత శీఘ్రంగా నేర్చుకుంటారు. అదేప్రకారం, క్రైస్తవ లక్షణాలను కొందరు ఇతరులకంటే మరింత వేగంగా కనబరచడం నేర్చుకుంటారు. అయితే మనకు చేతనైనంతగా దైవిక లక్షణాలను పెంపొందించుకుంటూ ఉండడం ప్రాముఖ్యం. యెహోవా తన వాక్యం ద్వారా, సంఘం ద్వారా దయచేస్తున్న సహాయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం దీనిని చేయగలం. లక్ష్యసాధనా వేగం, ఎడతెగక అభివృద్ధి సాధించాలనే మన తీర్మానపూర్వక ప్రయత్నాలంత ప్రాముఖ్యమైనది కాదు.
7 ఆత్మసంబంధ లక్షణాల్లో చివర పేర్కొనబడినా ఆశానిగ్రహం ఇతర లక్షణాలకంటే ఏ మాత్రం తక్కువ ప్రాముఖ్యమైనది కాదు. బదులుగా అది చాలా ప్రాముఖ్యమైన లక్షణం. మనకు పరిపూర్ణ ఆశానిగ్రహంవుంటే సమస్త ‘శరీరకార్యాలను’ మనం విసర్జించగలమని మనం మనస్సులో ఉంచుకోవాలి. ఏదేమైనా, అసంపూర్ణ మానవులు ఏదో ఒక విధమైన ‘శరీరకార్యాలైన జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, విమతములు’ వంటివాటికి లొంగిపోయే అవకాశం ఉంది. (గలతీయులు 5:19-20) అందువల్ల, ఇటు మనస్సులోనుండి అటు హృదయంలోనుండి హానికర ఉద్దేశాలను సమూలంగా పెరికివేయాలని తీర్మానించుకున్న వారిగా మనం నిర్విరామంగా పోరాడుతూనే ఉండాలి.
కొందరికి మరింత తీవ్రమైన పోరాటముంది
8 ఆశానిగ్రహం పాటించడం కొంతమంది క్రైస్తవులకు ఇతరులకంటే మరింత కష్టంగా ఉంటుంది. ఎందుకు? తలిదండ్రుల శిక్షణ లేదా గత అనుభవాలు ఆ పరిస్థితికి ఆజ్యంపోస్తుండవచ్చు. ఆశానిగ్రహం పెంపొందించుకొని ప్రదర్శించడం మనకు సమస్యగా ఉన్నట్లుగా అనిపించకపోతే, అది మనం ఆనందించడానికి తగిన హేతువే. అయితే దానిని పాటించడంలో మరింత ఇబ్బందిపడుతున్న వారితో వ్యవహరించేటప్పుడు వారిలో ఆశానిగ్రహం లేకపోవడం మనకు కొంతవరకు వ్యక్తిగతంగా సమస్యగావున్నా, మనం నిశ్చయంగా సానుభూతి చూపేవారిగా, అర్థంచేసుకునే వారిగా ఉండాలి. మన సొంత అపరిపూర్ణత దృష్ట్యా, స్వనీతి దృక్పథం చూపే అవకాశం మనలో ఎవరికి ఉంది?—రోమీయులు 3:23; ఎఫెసీయులు 4:2.
9 దీనినిలా దృష్టాంతపరచవచ్చు: పొగాకు లేదా ఉత్ప్రేరక మాదక ద్రవ్యాలు ఉపయోగించడం మానేసిన కొంతమంది తోటి క్రైస్తవులకు కొన్నిసార్లు వాటికొరకు ఇంకా బలమైన కోరికవుంటుందని మనకు తెలిసి ఉండవచ్చు. లేదా మద్యపానం, ఆహారం విషయంలో మితం పాటించడం కొందరికి సవాలుగా ఉండవచ్చు. మరికొందరికి నోరు అదుపు చేసుకోవడం కష్టంగా ఉన్నందువల్ల వారు తరచు తమ మాటలతో అభ్యంతరం కలిగిస్తుండవచ్చు. అలాంటి లోపాలతో వ్యవహరించడానికి ఆశానిగ్రహం పెంపొందించుకోవడంలో గట్టి కృషి అవసరం. ఎందుకు? వాస్తవిక పరిస్థితిని యాకోబు 3:2 ఇలా చెబుతోంది: “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.” మరి కొందరికి జూదం విషయంలో తీవ్రవాంఛ ఉండవచ్చు. లేదా కోపం అదుపులో ఉంచుకోవడం వారికి కష్టంగా ఉండవచ్చు. అలాంటి సమస్యలను లేదా బలహీనతలను జయప్రదంగా ఎలా తాళుకోవాలో నేర్చుకోవడానికి సమయం పట్టవచ్చు. మనం ఇప్పుడు గుర్తించదగిన పురోగతి సాధించగలిగినా, మనం పరిపూర్ణతకు చేరుకున్నప్పుడు మాత్రమే తప్పుడు కోరికలు శాశ్వతంగా నిర్మూలమౌతాయి. ఈలోగా, ఆశానిగ్రహం చూపడానికి కృషిచేయడం పాపభరిత జీవన విధానంలో తిరిగి పడిపోకుండా తప్పించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఈ సంఘర్షణ కొనసాగుతుండగా, పట్టువిడువకుండా ఉండేందుకు మనం పరస్పరం సహాయం చేసుకుందాం.—అపొస్తలుల కార్యములు 14:21, 22.
10 ఆశానిగ్రహం పాటించడం కొందరికి కష్టంగా ఉండే మరో రంగం లైంగికత. మానవ లైంగికత, దానిమట్టుకు అది యెహోవా దేవుడు మనల్ని కలుగచేసిన విధానంలో ఓ అంతర్భాగం. అయినప్పటికీ, దేవుని కట్టడలకు అనుగుణంగా లైంగిక సంబంధాలను వాటి స్థానంలో పెట్టడం కొందరికి ప్రత్యేకంగా చాలా కష్టంగావుంటుంది. అసాధారణరీతిలో తీవ్ర లైంగిక వాంఛ ఉన్నందున వారి ఇబ్బంది మరింత జటిలంకావచ్చు. మోహపు జ్వాలల్ని అనేకరీతుల్లో రగిలించే స్వభావంగల లైంగిక ఉన్మాద లోకంలో మనం జీవిస్తున్నాం. వివాహ పరధ్యానం లేకుండా దేవుని సేవచేసేందుకు కనీసం కొంతకాలంపాటు అవివాహితులుగా ఉండాలని కోరుకునే క్రైస్తవులకు ఇది పెద్ద సమస్యనే సృష్టించవచ్చు. (1 కొరింథీయులు 7:32, 33, 37, 38) అయితే, “కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు” అనే లేఖన ఉత్తర్వుకు అనుగుణంగా వారు వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకోవచ్చు, ఇది నిశ్చయంగా గౌరవప్రదమైన పని. అదే సమయంలో, వారు లేఖన ఉపదేశం ప్రకారం ‘ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికోవాలని’ తీర్మానించుకుంటారు. (1 కొరింథీయులు 7:9, 39) తన నీతియుక్త సూత్రాలను సమర్థించడంలో వారికున్న ఆసక్తినిబట్టి యెహోవా సంతోషిస్తాడని మనం నిశ్చయతతో ఉండవచ్చు. అలాంటి ఉన్నత నైతిక కట్టడలు, యథార్థతగల సత్యారాధకులతో సహవసించేందుకు వారి తోటి క్రైస్తవులు సంతోషిస్తారు.
11 సరైన భాగస్వామి లభించకపోతే అప్పుడేమిటి? కీర్తన 39:1) మనమధ్య అవివాహిత స్థితిలో పవిత్రంగా నిలబడుతున్నవారు మన అత్యంత ఆప్యాయతకు, మెప్పుకు పాత్రులుగా ఉన్నారు. నిరుత్సాహపు మాటలకు బదులు, మనం ప్రోత్సహించే వారిగా ఉండేందుకు కృషిచేద్దాం. ఉదాహరణకు, పరిణతి చెందిన కొంతమంది భోజనానికో లేదా ఆరోగ్యదాయకమైన క్రైస్తవ సహవాసానికో కూడినప్పుడు అవివాహితులను కూడా చేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు.
పెండ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా అలా చేసుకోలేకపోతున్న వ్యక్తికికలిగే ఆశాభంగం ఒక్కసారి ఊహించండి! సరైన భాగస్వామి కొరకు తనింకా ప్రయత్నిస్తుండగానే, తన స్నేహితులు పెళ్లి చేసుకొని హాయిగా ఉండడం ఆయన చూడవచ్చు. అలాంటి పరిస్థితిలో కొందరికి అశుద్ధ అలవాటైన హస్తప్రయోగం ఒక విడువని సమస్యగా తయారుకావచ్చు. ఏదేమైనా, పవిత్రంగా నిలబడడానికి పోరాడే వేరొకరిని పొరపాటున అధైర్యపరచాలని ఏ క్రైస్తవుడు కోరుకోడు. మనం అనాలోచితంగా, “ఎప్పుడు పెళ్లిచేసుకుంటావ్?” అని అడిగితే మనం అనుకోకుండానే నిరుత్సాహం కలిగించిన వారమౌతాము. అలా అడగడంలో ఎలాంటి దురుద్దేశం లేకపోయినా, మన నోరు కాపాడుకోవడంలో ఆశానిగ్రహం ప్రదర్శించడం ఎంత మేలో గదా! (వివాహంలో ఆశానిగ్రహం
12 వివాహం దానంతటదే లైంగిక విషయాల్లో ఆశానిగ్రహపు అవసరతను తొలగించదు. ఉదాహరణకు, భార్యాభర్తల లైంగిక అవసరాలు చాలా విభిన్నంగా ఉండవచ్చు. లేదా దంపతుల్లో ఒకరి శారీరక పరిస్థితి కొన్నిసార్లు సాధారణ లైంగిక సంబంధాలను కష్టభరితం లేదా అసాధ్యం చేయవచ్చు. బహుశా గత అనుభవాల కారణంగా, దంపతుల్లో ఒకరికి “భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను” అనే ఉత్తర్వుకు లోబడడం సవాలుగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో, జతలోని మరొకరు ఆశానిగ్రహం మరింత ఎక్కువగా చూపాల్సిన అవసరం ఉండవచ్చు. వివాహిత క్రైస్తవులకు పౌలు ప్రేమతో ఇచ్చిన ఈ సలహాను వారిరువురూ మనస్సులో ఉంచుకోవచ్చు: “ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.”—1 కొరింథీయులు 7:3, 5.
13 ఈ అత్యంత సన్నిహిత సంబంధంలో సరైన ఆశానిగ్రహం చూపడం నేర్చుకుంటే వివాహిత దంపతులు ఎంత ఆహ్లాదకరంగా జీవించవచ్చో గదా! అదే సమయంలో, ఈ మేరకు ఆశానిగ్రహం కనబరచడానికి ఇంకా పోరాడుతున్న తోటి ఆరాధకులను అర్థంచేసుకోవాలి. ఆశానిగ్రహం కనబరచడానికి, అయుక్త కోరికలను అధిగమించడానికి చర్యలు తీసుకోవడానికి అవిశ్రాంతంగా పోరాడేందుకు మన ఆధ్యాత్మిక సహోదరులకు అంతర్దృష్టిని, ధైర్యాన్ని, కృతనిశ్చయాన్ని దయచేయుమని యెహోవాకు ప్రార్థించడం మనమెన్నటికీ మరచిపోకూడదు.—పరస్పరం ఎడతెగక సహాయం చేసుకోండి
14 కొన్నిసార్లు, మనకు ఇబ్బంది కలిగించని రంగంలో ఆశానిగ్రహం చూపడానికి పోరాడుతున్న తోటి క్రైస్తవులను అర్థంచేసుకోవడం మనకు కష్టంగా ఉండవచ్చు. అయితే ప్రజలు సహజ ప్రవృత్తిలో విభిన్నంగా ఉంటారు. కొందరు సులభంగా భావావేశానికి లోనవుతారు, మరికొందరు అలా ఉండరు. ఇతరులతో పోలిస్తే, కొందరికి తమను అదుపుచేసుకోవడం సులభంగా ఉండవచ్చు, ఆశానిగ్రహం పెద్ద సమస్యకాకపోవచ్చు. ఇతరులకు అది మరింత కష్టంకావచ్చు. అయినప్పటికీ, పోరాడేవ్యక్తి చెడ్డవాడు కాదని గుర్తుంచుకోండి. తోటి క్రైస్తవులను మనం అర్థంచేసుకోవాలి, కనికరం చూపాలి. ఆశానిగ్రహాన్ని ప్రదర్శించడం వృద్ధిచేసుకోవడానికి ఇంకా పోరాడుతున్న వారిపట్ల మనం ఎడతెగక కనికరం చూపడం మనకు సంతోషం కలిగిస్తుంది. మత్తయి 5:7లో వ్రాయబడిన యేసు మాటలనుండి దానిని మనం చూడగలం.
15 ఏదైనా ఒక సందర్భంలో తోటి క్రైస్తవుడు క్రైస్తవ వ్యక్తిత్వం ప్రదర్శించడంలో విఫలమైతే తప్పుగా అంచనా వేయాలని మనమెన్నటికీ కోరుకోకూడదు. దీనికితోడు, మనం ఒకసారి తప్పిపోవడాన్ని కాదుగాని అనేకమార్లు తప్పిపోకుండడాన్ని—ఈ విషయాన్ని తోటి క్రైస్తవులు గమనించకపోయినా—యెహోవా చూస్తాడని తెలుసుకోవడం ఎంతో ప్రోత్సాహకరం. కీర్తన 130:3లోని ఈ మాటలను మనస్సులో ఉంచుకోవడం అత్యంత ఓదార్పుకరంగా ఉంటుంది: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?”
16 యెహోవాను సంతోషింపజేయడానికి, మనలో ప్రతి ఒక్కరం ఆశానిగ్రహాన్ని పెంపొందించుకోవాలి, అయితే మన క్రైస్తవ సహోదరుల అండదండలు ఉంటాయని కూడా మనం నిశ్చయంగా నమ్మవచ్చు. ప్రతి ఒక్కరు ఎవరి భారం వారే మోసుకోవాల్సివున్నా, పరస్పర బలహీనతల్ని తాళుకునేందుకు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని మనం ఉద్బోధించబడ్డాము. (గలతీయులు 6:2, 5) మనం వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లకుండా, చూడకూడనివి చూడకుండా లేదా చేయకూడనివి చేయకుండా అడ్డుకునే తల్లిదండ్రులను, భాగస్వామిని లేదా స్నేహితులను మనం అపురూపమైనవారిగా పరిగణించవచ్చు. మనం ఆశానిగ్రహాన్ని ప్రదర్శించేందుకు అంటే వద్దు అనిచెప్పి దానికి కట్టుబడివుండేందుకు వారు మనకు సహాయం చేస్తున్నారు.
17 ఆశానిగ్రహం గురించి మనం ఇప్పటివరకు పరిశీలించిన వాటితో అనేకమంది క్రైస్తవులు ఏకీభవిస్తుండవచ్చు, అయితే తాము పురోగతి సాధించేందుకు ఇంకా చాలావుందని బహుశా వారు భావిస్తుండవచ్చు. అపరిపూర్ణ మానవులనుండి ఇంతమేరకు సముచితంగా ఆశించదగినదని తాము నమ్మేంత హెచ్చుగా వారు ఆశానిగ్రహం కనబరచాలని కోరుకోవచ్చు. మీరలా భావిస్తున్నారా? అట్లయితే, దేవుని ఆత్మఫలంలోని ఈ లక్షణాన్ని పెంపొందించుకోవడానికి మీరేమి చేయవచ్చు? అలా చేయడం, క్రైస్తవునిగా మీ దీర్ఘకాల లక్ష్యాలను చేరుకోవడానికి మీకెలా సహాయం చేయవచ్చు? వీటిని మనం దీని తర్వాతి ఆర్టికల్లో పరిశీలిద్దాం.
మీరు జ్ఞాపకం తెచ్చుకోగలరా?
ఆశానిగ్రహం . . .
• పెంపొందించుకోవడం క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యం?
• కొందరికి ఎందుకు ప్రత్యేకంగా సవాలుగా ఉంటుంది?
• వివాహంలో ఎందుకు అవసరం?
• పెంపొందించుకోవడంలో పరస్పరం సహాయంచేసుకోగల ఒక లక్షణముగా ఎందుకుంది?
[అధ్యయన ప్రశ్నలు]
1. అనేక మానవ సమస్యలు ఏ అసమర్థతకు ఫలితాలు?
2. (ఎ) వద్దు అని చెప్పడం కష్టమనేది కొత్త విషయం కాదని ఏ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) ఈ ఉదాహరణలు మనమేమి చేయడానికి మనల్ని ప్రోత్సహించాలి?
3. ఆశానిగ్రహాన్ని కనబరచడం సులభంగా ఉంటుందని మనం ఎందుకు ఎదురుచూడలేమో వివరించండి.
4. చాలామంది తమకు ఆశానిగ్రహం సమస్యలేదని ఎందుకు భావిస్తారు, అయితే ఇది దేనికి సూచనగా ఉంది?
5. ఆశానిగ్రహం అనే విషయంలో యెహోవాసాక్షులకు ఎందుకు ఆసక్తివుంది, ఏ సలహా ఇప్పటికీ విలువైనదిగా ఉంది?
6. ఆశానిగ్రహాన్ని పెంపొందించుకునే సమయంలో మనమెందుకు ఆశలువదులుకోకూడదు?
7. ఆశానిగ్రహం ప్రాముఖ్యమని ఏది చూపిస్తోంది?
8. ఏ కారకాలు ఆశానిగ్రహం పాటించడం కొందరికి ప్రత్యేకంగా కష్టమయ్యేలా చేస్తాయి?
9. కొందరికి ఏ బలహీనతలున్నాయి, ఈ బలహీనతలు ఎప్పుడు పూర్తిగా అధిగమించబడతాయి?
10. (ఎ) లైంగిక విషయాల్లో ఆశానిగ్రహాన్ని పాటించడం కొందరికి ప్రత్యేకంగా ఎందుకు సవాలుగా ఉంటుంది? (బి) ఒక సహోదరుడు ఎలాంటి పెద్ద మార్పుచేసుకున్నాడు? (16వ పేజీలోని బాక్సు చూడండి.)
11. పెళ్లి చేసుకోవడానికి ఆసక్తివున్నా అలా చేసుకోలేకపోతున్న సహోదరునికో, సహోదరికో మనమెలా సహాయకరంగా ఉండవచ్చు?
12. వివాహితులు సహితం ఎందుకు కొంతమేరకు ఆశానిగ్రహం చూపించాలి?
13. ఆశానిగ్రహం పాటించేందుకు పోరాడుతున్నవారి పక్షాన మనమేమి చేయవచ్చు?
14. తోటి క్రైస్తవులతో మనమెందుకు కనికరంతో, అర్థంచేసుకునే వారిగా వ్యవహరించాలి?
15. ఆశానిగ్రహం విషయంలో కీర్తన 130:3లోని మాటలు ఎందుకు ఓదార్పుకరం?
16, 17. (ఎ) ఆశానిగ్రహం విషయంలో గలతీయులు 6:2, 5 వచనాలను మనమెలా అన్వయించుకోవచ్చు? (బి) ఆశానిగ్రహం గురించి దీని తర్వాతి ఆర్టికల్లో మనమేమి పరిశీలిస్తాం?
[16వ పేజీలోని బాక్సు/చిత్రం]
వద్దని చెప్పడం ఆయన నేర్చుకున్నాడు
జర్మనీలో నివసించే యెహోవాసాక్షి ఒకాయన టెక్నికల్ కమ్యూనికేషన్స్ గుమస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన పనిలో దాదాపు 30 విభిన్న టెలివిజన్, రేడియో కార్యక్రమాలను పర్యవేక్షించడం కూడా ఒక భాగం. అంతరాయం కలిగినప్పుడు, సమస్యను గుర్తించడానికి ఆయన జరుగుతున్న కార్యక్రమానికి అవధానమివ్వాలి. ఆయనిలా అంటున్నాడు: “ఎప్పుడు జరుగకూడదో అప్పుడే అంటే హింస లేదా లైంగిక దృశ్యాలు వస్తున్నప్పుడే ప్రసారపు అంతరాయాలు ఏర్పడుతున్నట్టుగా ఉండేది. నా మనస్సులో ముద్రవేయబడినట్లుగా, ఆ చెడ్డ దృశ్యాలు రోజులపాటు కొన్నిసార్లు వారాలపాటుగా నా బుర్రలోనే ఉన్నట్లుగా అన్పించేది.” ఇది తన ఆధ్యాత్మికతపై ప్రతికూల ప్రభావం చూపినట్టు ఆయన అంగీకరిస్తూ ఇలా అంటున్నాడు: “కోపంతో చిరాకుపడే వానిగా ఉండడానికే మొగ్గుచూపేవాడిని, నేను ఆశానిగ్రహం చూపించడాన్ని హింసాత్మక దృశ్యాలు నాకు కష్టభరితం చేశాయి. లైంగిక దృశ్యాలు నాకు నా భార్యకు మధ్య ఉద్రేక పరిస్థితులకు కారణమయ్యాయి. నాకు ప్రతి రోజూ పోరాటమే. ఆ పోరాటంలో అపజయం పొందకుండా ఉండేందుకు, తక్కువ జీతమైనాసరే నేను వేరొక ఉద్యోగం వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాను. కొద్దిరోజుల్లోనే నాకు వేరొక ఉద్యోగం దొరకడంతో, నా అభీష్టం నెరవేరింది.”
[15వ పేజీలోని చిత్రాలు]
బైబిలు అధ్యయనం ద్వారా సంపాదించుకున్న పరిజ్ఞానం మనం ఆశానిగ్రహాన్ని పాటించేందుకు సహాయం చేస్తుంది