కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘విజ్జోడుగా ఉండకండి’

‘విజ్జోడుగా ఉండకండి’

‘విజ్జోడుగా ఉండకండి’

ఇక్కడ ఇవ్వబడిన బొమ్మ చూడండి, కలిసి పొలం దున్నుతున్న ఆ ఒంటె, ఎద్దు చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నాయి కదూ. ఆ రెండు జంతువులను కలుపుతున్న కాడి, అంటే ఒకే ప్రమాణంలోవుండి ఒకే విధమైన బలంగల రెండు జంతువుల కోసం ఉద్దేశించబడిన ఆ కాడి, రెంటికీ బాధ కలిగిస్తోంది. బరువులు మోసే ఇలాంటి జంతువుల సంక్షేమంపై శ్రద్ధగల దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.” (ద్వితీయోపదేశకాండము 22:​10) ఎద్దును, ఒంటెను జతచేయడానికి కూడా అదే సూత్రం అన్వయిస్తుంది.

సాధారణంగా ఒక రైతు తన జంతువులను ఇలా కష్టపెట్టడు. కాని అతని వద్ద రెండు ఎడ్లు లేకపోతే, అతను తన దగ్గరున్న రెండు పశువులను జతచేసే అవకాశం ఉంది. బొమ్మలో కనిపించే 19వ శతాబ్దపు రైతు అలా చేయడానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ జంతువుల పరిమాణంలోను, బరువులోను తేడా ఉండడంవల్ల గమన వేగాన్ని సమానంగా ఉంచడానికి బలహీన జంతువు శ్రమపడవలసి వస్తుంది, బలమైన జంతువు ఎక్కువ బరువు మోయవలసి వస్తుంది.

అపొస్తలుడైన పౌలు మనకు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పించేందుకు విజ్జోడుగా ఉండడానికి సంబంధించిన ఉపమానం ఉపయోగించాడు. “మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు?” అని ఆయన వ్రాశాడు. (2 కొరింథీయులు 6:​14, పరిశుద్ధ గ్రంథము-రెఫరెన్సులు గలది) ఒక క్రైస్తవుడు ఏమి చేయడంవల్ల విజ్జోడుగా ఉన్నట్లవుతుంది?

ఒక విషయమేమిటంటే, ఒక క్రైస్తవుడు తన నమ్మకాలను పంచుకోని వివాహ జతను ఎంపిక చేసుకోవడం. అలా వివాహం చేసుకున్న వారిద్దరు ప్రాథమిక అంశాల్లో ఏకీభవించరు కాబట్టి వారి వివాహం ఇద్దరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది.

యెహోవా వివాహాన్ని ప్రారంభించినప్పుడు, భార్యకు “సాటియైన సహాయము”గా ఉండే పాత్రను ఇచ్చాడు. (ఆదికాండము 2:​18) అదేవిధంగా, మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు భార్యను “తోటిది” అని పేర్కొన్నాడు. (మలాకీ 2:​14) వివాహిత దంపతులు ఒకే ఆధ్యాత్మిక దిశవైపుకు ప్రయాణించాలని, కష్టసుఖాలను సమానంగా పంచుకోవాలని మన సృష్టికర్త కోరుకుంటున్నాడు.

“ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవడం ద్వారా ఒక క్రైస్తవుడు మన పరలోక తండ్రి ఇచ్చిన ఉపదేశాన్ని గౌరవిస్తాడు. (1 కొరింథీయులు 7:​39) ఇది ఒక ఐక్య వివాహానికి పునాది వేస్తుంది, వివాహిత దంపతులిద్దరు ఒక ప్రత్యేకమైన భావంలో ‘నిజమైన సహకారులుగా’ దేవునికి సేవచేస్తుండగా ఆ ఐక్య వివాహం దేవునికి కీర్తిని ఘనతను తీసుకువస్తుంది.​—⁠ఫిలిప్పీయులు 4:⁠3.

[32వ పేజీలోని చిత్రం]

ఒంటె మరియు ఎద్దు: From the book La Tierra Santa, Volume 1, 1830