కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నేను స్నేహం, ప్రేమ, శ్రద్ధ ఉండడం చూశాను”

“నేను స్నేహం, ప్రేమ, శ్రద్ధ ఉండడం చూశాను”

“నేను స్నేహం, ప్రేమ, శ్రద్ధ ఉండడం చూశాను”

“మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:​35) యేసు చెప్పినట్లుగానే తొలి క్రైస్తవ సహోదరత్వానికి ప్రేమ గుర్తింపు చిహ్నంగా మారింది. క్రీస్తు మరణించాక వందకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత వ్రాస్తూ టెర్టూలియన్‌, ప్రజలు ఇలా అంటున్నారని పేర్కొన్నాడు: ‘వాళ్ళు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో, ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి కూడా ఎలా సిద్ధంగా ఉన్నారో చూడండి.’

అలాంటి ప్రేమ లోకంలో ఇప్పటికీ ఉందా? ఉంది. ఉదాహరణకు బ్రెజిల్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి వచ్చిన ఒక ఉత్తరాన్ని పరిశీలించండి. ఆ ఉత్తరం వ్రాసిన మరీలీయ అనే స్త్రీ ఇలా వ్రాసింది:

“అర్జెంటీనాలోని బీయా మర్సేథేస్‌లో నివసిస్తున్నప్పుడు, యెహోవాసాక్షి అయిన మా అమ్మకు కీళ్ళవ్యాధి వచ్చి నడుము నుండి క్రింది వరకూ పక్షవాతానికి గురైంది. ఆమె అనారోగ్యానికి గురైన తర్వాత మొదటి ఎనిమిది నెలలు బీయా మర్సేథేస్‌లోని యెహోవాసాక్షులే ప్రేమపూర్వకంగా శ్రద్ధగా అమెను చూసుకున్నారు. ఆమె ఉంటున్న ఇంటిని శుభ్రం చేయడం, వంట చేయడం దగ్గర్నుంచి సమస్తం వాళ్ళే చూసుకున్నారు. అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా రాత్రింబగళ్ళు ఎవరో ఒకరు ఆమె దగ్గర ఉండేవారు.

“ఆ తర్వాత అమ్మా, నేను బ్రెజిల్‌కు తిరిగి వచ్చేశాము, అమ్మ అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటుంది. ఇప్పుడు మేము నివసిస్తున్న ప్రాంతంలోని సాక్షులు అమ్మ కోలుకోవడానికి సహాయపడేందుకు తమకు సాధ్యమైనదంతా చేస్తున్నారు.”

మరీలీయ తన ఉత్తరాన్ని ఇలా ముగించింది: “నేను సాక్షిని కాదని ఒప్పుకుంటున్నాను, అయితే సాక్షుల మధ్య నేను స్నేహం, ప్రేమ, శ్రద్ధ ఉండడం చూశాను.”

అవును, నిజమైన క్రైస్తవ ప్రేమతో ప్రవర్తించే ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. అలా చేయడం ద్వారా వాళ్ళు, మన జీవితాలపై యేసు బోధలు చూపించగల ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నారు.